మొక్కలు నాటడం విన్నాం, శవాలు నాటడం! ఆ ప్రేతానికి రెండువేల సంవత్సరాలు గడిచినా, క్రిందటి ఏడాదే అనుకుంటున్నాడు. పోయిన ఏడాది నీ పెరట్లో శవాన్ని నాటావు కదా? అది మొలిచిందా? అని అడుగుతున్నాడు! అసలు వాళ్ళు ప్రేతాలేనా? ప్రేతప్రాయులైన ప్రాణులా? అతడు మాట్లాడుతున్నది, ప్యూనిక్ యుద్ధం గురించేనా, లేక గత ఏడాది జరిగిన ప్రపంచయుద్ధమా?

సెంట్రల్ అమెరికా దేశాలు ప్రపంచంలోకెల్లా అతి తక్కువమంది యాత్రికులు తిరుగాడేవి. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్రబిందువులుగా అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది.

తెల్లగా వెలిగేవి, పచ్చగా వెలిగేవి, మినుక్కు మినుక్కుమంటూ వెలిగేవి, అటూ ఇటూ ఊగుతూ వెలిగేవి – ఎన్నెన్ని రకాల దీపాలో! వాటిని చూడొద్దూ! పెద్దవాళ్ళకి ఈ తేడాల దీపాల వెలుగులు కనపడవు కాబోలు! దేవుడి దగ్గర దీపపుసెమ్మలో దీపం వేరు. చెట్టులా ఉన్న దీపాలగుత్తిలో ఉన్న దీపాలు వేరు!

ఎడారి మధ్యలో ఉండటంతో అన్ని కనిపిస్తున్నాయి. అసలు ఇన్ని ఉన్నాయని చూస్తే తప్ప, సిటీల్లో ఆకాశాన్ని చూసినప్పుడు తట్టనే తట్టదు! ఎక్కడో చదివాను. యాభై అడుగుల పొడవూ, యాభై అడుగుల వెడల్పూ ఉన్న తెల్ల కాగితం మీద ఎక్కడైనా బాల్ పెన్‌తో ఒక్క చుక్క పెడితే, అంత ఉంటుందిట మన భూమి ఈ విశాల విశ్వంలో! అన్ని వేల గోళాల మధ్య – మనం. ఓహ్! అద్భుతం. పైగా, చల్లటి గాలి. ఎడారిమీద ప్రేమ పుట్టుకొస్తోంది.

విశ్వసాహిత్యంలో నల్లజాతి మహిళల నవలా రచన ఎప్పుడు ప్రారంభమైంది? అన్న విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూ, తొలి నవలను తేల్చలేకపోతున్నారు. ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన 19వ శతాబ్దిలోని ఇద్దరు నల్లజాతి మహిళల నవలలు వేర్వేరు కారణాలవల్ల ప్రాచుర్యం పొందలేదు.

అమ్మాయిలు ఉద్యానవనంలో పూలు కోస్తున్నారు. కోస్తూ అల్లరి చేస్తున్నారు. చేస్తూ సల్లాపాలాడుతున్నారు. పండిన పళ్ళని వీరు ఆరగిస్తే, పాపం అక్కడి చిలుకలకు ఏం మిగులుతుంది కనుక? అంచేత చిలుక వీరిపై పగబట్టి, వీరి అధరాలపై పడుతుందట, తిందామని. వాతెర అంటే అధరము. స్త్రీ క్రిందిపెదవిని దొండపండుతో పోల్చుతారు. వీరి పెదవులను దొండపళ్ళనుకొని, అవి మిగిలాయి కను వాటిని తినడానికి వస్తుందట చిలుక! వీరి చెక్కిళ్ళపై సాంకవరుచి అట.

నాణేల గురించి మరిచిపోయిన ముప్పై సంవత్సరాల తరువాత, మొక్కలకి నీళ్ళు పడుతున్న నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా మనవడు, “తాతా! ఈ కాయిన్ ఆ చెక్కపెట్టెలో దొరికింది. చూడు దీనిపైన తెలుగు అక్షరాలు ఎంత పెద్దగా ఉన్నాయో!” అంటూ. వాడు ఏడో తరగతిలో చేరి వారం రోజులైందేమో.

బాలమురళి చిన్నగా తనకి ఊరితో సంబంధం, సంగమేశ్వర శాస్త్రిగారి గురించి, నేదునూరి గురించి, కవిగారి గురించి మాట్లాడి వాళ్ళందరికి తన నమస్కృతులు చెప్పి, పక్క వాద్యాలకి సూచన ఇచ్చి హంసధ్వనిలో వాతాపి గణపతిం ఎత్తుకున్నాడు. వయొలిన్ మోగింది. బాలమురళి గొంతు గాడిలో పడింది. శాస్తుర్లు అవసరార్థం మృదంగంతో తాళం వేసేడు. తర్వాత బాలమురళి తన స్వంత కృతి పాడేడు. తాళం మారింది.

హోటల్‌కి వెళ్ళి టీ తాగాను. ఆకలి వేయలేదు.కడుపులో మంటగా అనిపించింది. రోజూ భోజనం పంపమని హోటల్లో ఉన్న వ్యక్తి‌తో చెప్పాను. నా చిరునామా విని “పగలైతే పర్లేదు గానీ రాత్రి పూట హోటల్ కుర్రాళ్ళు అటు రావడానికి భయపడతారండీ. ఒకమ్మాయి ఆ ఇంటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది తెల్సా? ఆమె అక్కడే తిరుగుతుంది అంటారు మరి. మీకు దెయ్యాలంటే భయం లేదా సార్?” అన్నాడు.

ఉద్యోగం ఊరు మారినప్పుడల్లా
అన్ని సామాన్లతో పాటు
అల్లుకున్న అనుబంధాలను
అట్టపెట్టెల్లో సర్దుకొని
అయ్యగారి ఆఫీసుకో
పెద్దోడి ప్రైవేటుకో
చిన్నోడి కాన్వెంటుకో

కాస్త మబ్బు పట్టినా చాలు
సిరా చుక్కలు చినుకులవుతాయి
నీరెండ మెరుపు తాకినా
వేళ్ళ కొసల్లో పూలు పూస్తాయి.
చీకటి ఊయలలో
రాతిరి బిడ్డ నిద్దరోతున్నపుడు కూడా

బంగారు గంగాళమేం కాదు
చిన్న మట్టి కుండ.
సంవత్సరాలు కుళ్ళబెట్టిన
ఖరీదైన మందూ కాదు
బాటిల్లో దాచితెచ్చిన
హిమాలయాల నీరూ కాదు.
మున్సిపాలిటీ కుళాయి నీరు.

అసలు ఏ రచన గొప్ప రచన? ఏ కథ గొప్ప కథ? ఏది సామాన్యమైన కథ? అలా చెప్పడానికి దానికి తూనికరాళ్ళేమిటి? ఏ కథైతే మన అనుభవ పరిధిలోకి వచ్చిన మన అనుభవాన్ని ఆసరా చేసుకుని మళ్ళా మళ్ళా మరోసారి మరోసారి అందులోని ఒక మాటో, ఒక వాక్యమో, కొన్ని వాక్యాలో జ్ఞాపకం వస్తూ ఉంటాయో ఆ కథ గొప్ప కథ.

ఈమాట సర్వర్‌ ఉన్న హోస్ట్‌‌గేటర్‌లో సమస్యల వల్ల సరైన సమాధానాలతో పంపినవారి ఈమెయిళ్ళు అన్నీ మాకు చేరలేదు. క్రితం సంచికలోని గడినుడి-78కి మొదటి ఇరవై రోజుల్లో మాకు అందిన సరైన సమాధానాలు పదమూడు మంది నుంచి వచ్చాయి. సరైన సమాధానాలు రాసినా పేర్లు ప్రకటించని వారికి మా క్షమాపణలు. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-78 సమాధానాలు.

విప్లవం అనేమాట తెలుగుపాఠకులకి ఒకరకంగానే అర్థం అవుతుంది. ఆ అర్థం నాకు పట్టదు అనీ, ఒకరకమైన సాహిత్యం ఇంకొకరకమైన సాహిత్యంగా మారినప్పుడు రచనాసూత్రాలు మారతాయనీ, ఇలా మారినప్పుడు విప్లవం అనేమాట వాడవచ్చనీ నేను ఎన్నిసార్లు చెప్పినా నా పాఠకులు పట్టించుకోలేదు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: