ఒక అద్దం, ఒక లక్ష్యం: ఒరే మాధవా! మనిషన్నాక ఒక లక్ష్యం ఉండాల్రా. జీవితంలో తనకేం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలిసుండాల్రా. ఏం చేయదల్చుకున్నావని ఎప్పుడడిగినా అలా మాట దాటేస్తావేంట్రా! చుట్టూ చూడరా ఒకసారి. నీ స్నేహితుల్ని, మిగతావాళ్ళని చూడు. అందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, సీఈఓలు కావాలని. కష్టపడాల్రా, లేకుంటే ఏమీ సాధించలేవు ఈ జన్మలో.
జూన్ 2019
ఈనాడే పుట్టిందీ కాదు, ఈ ఏటితోనే పోయేదీ కాదు. ఎవరు మహాకవి? ఎవరు ఎందుకు కాదు? అన్న చర్చలు సమయసందర్భాలతో నిమిత్తం లేకుండా తెలుగు సాహిత్య సమూహాలలో ఉండుండీ అలజడి రేపడానికి కారణం లేకపోలేదు. మనకు కవిత్వాన్ని (ఆ మాటకొస్తే ఏ సాహిత్య ప్రక్రియనైనా) చదివి అర్థం చేసుకోవడం కన్నా ముందే, అది రాసిన కవిని, ఆ కవిత్వాన్ని ఒక వాద-భావ-వర్గ ప్రాతిపదికలపై ఒక మూసలో పడేయడం మీద మోజు ఎక్కువ. కవిత్వం పలికించిన స్వరం కన్నా, దాన్ని వినిపించిన శరీరం పట్ల ఆసక్తి ఎక్కువ. మనముందున్న నాలుగు పంక్తులు ఏం చెబుతున్నాయన్న స్పృహ కన్నా, కవిని పట్టి కుదిపివేసిన ఏ అనుభవం ఎలా మూర్తిమంతమై పదాలలోకి ఒదిగింది అన్న వివేచన కన్నా, ఆ పంక్తుల వెనుక ఉన్న మనుష్యులు, వారితో ముడిపడ్డ రాజకీయాలూ మనకు ముఖ్యం. ఇక్కడ కవిత్వాన్ని కవిని విడదీసి చూడలేం, కవిత్వాన్ని రాజకీయాన్ని విడదీసి మాట్లాడలేం, కులమతాలకు అతీతంగా కవిని గౌరవించలేం.
కవిత్వం తమ స్వార్థం కోసం సామాజిక రాజకీయ వైషమ్యాలను రేకెత్తించి పబ్బం గడుపుకోవాలనుకునే అవకాశవాదుల చేతిలో ఒదగాల్సిన ఆయుధం కాదు. మన ప్రస్తుత అవసరాల కోసం పనికి రావాల్సిన పనిముట్టు అసలే కాదు. సృజన ఉద్దేశము వేరు. దాని ప్రయోజనమూ లక్ష్యమూ వేరు. కవిత్వానికి రంగూ రుచీ వాసనా ఉండాలన్న మాటలు నిజమైన కవిత్వ ప్రేమికులకు చెప్పే రహస్యం ఒకటైతే, కవిత్వం కూడా రాజకీయంగా మారిపోయిన నేటి తెలుగు సాహిత్య వాతావరణంలో, ఈ మాటలు స్ఫురింపజేసే అర్థం మరొకటి. విశ్వనాథ ఏ కాలం వాడో జాషువా అదే కాలం వాడు. జీవిత నేపథ్యం, జీవన విధానం, అవి ఇరువురిలో కలుగజేసిన స్పందనలు పోల్చలేనివి. ఆ భిన్నత్వమే భిన్న దృక్పథాలను సమానంగా పోషిస్తూ, సాహిత్యానికి జీవలక్షణాన్ని ఆపాదిస్తుంది. అందరి కవిత్వమూ మనకు నచ్చక్కర్లేదు. కాని, ఎవరి కవిత్వం పట్ల సహానుభూతి ఉన్నదో వారిని మెచ్చుకోవడం కన్నా ఎవరి పట్ల వ్యతిరేకత ఉన్నదో వారిని చులకన చేయడం ప్రస్తుతం మనం అలవర్చుకున్న ఏకైక సాహిత్యావసరం. మహాకవి, యుగకవి వంటి డొల్ల పదాల మీద ఉన్న ఆసక్తి, వాటిని తమకు నచ్చిన పేర్లకు అతికించడంలో ఉన్న శ్రద్ధ, స్వయంసంపూర్ణమూ సర్వస్వతంత్రమూ అయిన కవిత్వం మీద ఉండి ఉంటే, బహుశా ఈ చర్చలెంత హానికరమో, అనవసరమో కొంతయినా అర్థమయ్యేదేమో. మనుష్యులుగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, బలహీనతలు, నమ్మకాలు వారికుండటంలో అనౌచిత్యం ఏమీ లేదు కానీ, సాహిత్యపు ముసుగులో కొందరు ఎక్కడికక్కడ స్వయంలబ్ధి సమూహాలుగా విడివడి నిర్లజ్జగా తమ రాజకీయాలను, ద్వేష ప్రకటనలనూ సాహిత్యంగా, సాహిత్యావసరంగా అమ్మజూడటమే ప్రస్తుత తెలుగు సాహిత్య వాతావరణం లోని విషాదం. గొంతు ఎవరిది పెద్దదయితే వారిదే అధికారం అనుకొనే ధోరణిలోనే ప్రపంచమంతా ఉన్నది. కాని సాహిత్యసృజనని కూడా అదే తీరున విమర్శించలేం నియంత్రించలేం అన్న వివేకం కొరవడిన స్థితిలో ఉన్నాం. చివరకు, కవి రాసిన కవిత్వం గురించి మాట్లాడగలమే కాని, రాయని కవిత్వం గురించి ఎందుకు రాయలేదని కవిని ప్రశ్నించలేం, నిందించలేం అన్న కనీస సాహిత్య సంస్కారం కూడా మనకు అలవడని అధమస్థాయిలో ఉన్నాం మనం. ఈ పుట్టకురుపు ఉన్నది, ఇంతగా ప్రబలిందీ కేవలం తెలుగు సాహిత్యావరణంలోనేనా!
ఒకావిడ, ముఖం గుర్తు లేదు, వయసులో చిన్నదే, కానీ అందరమూ బహుశా ఆమె కోసమే ఎదురు చూస్తున్నంత ప్రాధాన్యత గల మనిషి, వడిగా అడుగులేస్తూ లోపలికి వస్తోంది. మాలో మేము ఏదో మాట్లాడుకుంటున్న మా దృష్టి ఆమెవైపు మళ్ళింది. చిత్రంగా, ఆమెతోపాటు వెంట వస్తున్న నలుగురైదుగురిలో బాల్‌రెడ్డి ఉన్నాడు. ఇతనిది మా ఊరే. నాకు చిన్నప్పటినుంచీ పరిచయం. ఇద్దరమూ మనసారా కళ్ళతో పలకరించుకున్నాం.
నువ్వు కొంచెం ఆలోచించి ఉంటే నీకు తెలిసేది నువ్వు ముమ్తాజ్‌ని, ఒక ముస్లిమ్‌ని, ఒక స్నేహితుణ్ణి కాదు చంపివేసింది, నువ్వు చంపివేసింది ఒక మనిషిని, అని. వాడొక దగుల్బాజీ అయినా సరే. నువ్వు చంపింది నీకు నచ్చని వాడి దగుల్బాజీతనాన్ని కాదు, వాడినే. వాడు ఒక ముసల్మాన్ అయితే నువ్వు వాడిలోని ముసల్మానీని చెరిపివేయలేదు. వాడి జీవితాన్నే చెరిపివేశావు.
పగటిరూపాల సాయంసంధ్యలో
సూర్యాస్తమయాన్ని కనబడనీకుండా
చీకటి తీరాల కావల నుంచి
కిటికీ దగ్గర చేరి
సంధ్యారూపాల పగటి నీడలను చూస్తూ
ఆ కొద్దిపాటి ప్రేమ రాకను తెలుసుకోనివ్వండి.
ఈడంత గంజి వార్సినట్టయితాందని
ఊరకుక్కలు ఓరసూపు జూత్తయి.
పలుకు మీదున్నప్పటి పదునే పదునని
పదిమంది గుడిసె సుట్టే కాపల గాత్తాంటరు.
గంజిలబడ్డ ఈగకు గాశారమా పాడా?
అని మొఖం జూసుకుంటనే గొణుగుతాంటరు.
మళ్ళీ కలగంటాను.
మనోహరమైన మరీచికలను,
మరులుగొలిపే మధుమాసాలను.
మళ్ళీ మళ్ళీ కలగంటాను.
మధురాధర మందహాసాలను,
మత్తిల్లజేసే మలయానిలాలను.
పద్యాల మీద
గుట్టలు గుట్టలుగా
పుట్టలు పుట్టలుగా
తుట్టెలు తుట్టెలుగా
పేరుకు పోయిన జ్ఞాపకాలు
జ్ఞాపకాలు పద్యాల్ని కొరుకుతూ
భారతీయ భక్తి సాహిత్యంలో శివుణ్ణి, విష్ణువుని స్తుతిస్తోనో, ప్రేమిస్తోనో కవిత్వం చెప్పడం మొదలైన ఎంతో కాలానికిగాని శక్తిని ఆరాధిస్తూ చెప్పే కవిత్వం రాలేదు. వేదాల్లోని వాగ్దేవి సూక్తం, ఉపనిషత్తుల్లోని ఉమా హైమవతి, ఇతిహాస, పురాణాల్లోని దేవి, బౌద్దుల తార, తాంత్రిక దశమహావిద్యల్లో కాళి ఒక ఉపాస్య దేవీమూర్తిగా భక్తికవుల హృదయాల్ని కొల్లగొట్టుకోడానికి పద్దెనిమిదో శతాబ్దిదాకా ఆగవలసి వచ్చింది.
మనుషుల్లో జ్ఞాని, పండితుడు, అమాయకుడు, దొంగ, వెధవ, మోసగొండి, పోకిరి, మహాత్మ, మంచివాడు, చెడ్డవాడు, చాదస్తుడు, ఛాందసుడు అని రకరకాలు ఉన్నట్టే పిల్లుల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. రౌడీ పిల్లి, పండిత పిల్లి, శాంత పిల్లి, దొంగ పిల్లి, మంచి పిల్లి, అమాయక పిల్లి, కాలాంతక పిల్లి, మోసగొండి పిల్లి, హంతక పిల్లి అని పలు రకాలున్నాయి. స్నీకీ ఒరిజినల్ ప్రియుడు రౌడీ పిల్లి. చింటూ ఏమో ఇంటలెక్చువల్ టైప్.
నారాయణరావుగారి దృష్టిలో పాశ్చాత్య విజ్ఞానార్జన విధానాల్ని, కేవలం భౌతిక పరిశోధనలే విద్యాన్వేషణ మార్గాలనే భావనల్లోని లోపాల్ని సున్నితంగా ఎత్తిచూపేవి; భారతీయులకీ పాశ్చాత్యులకీ ఆలోచనా ధోరణుల్లో, సంస్కృతీ సంప్రదాయాల్లో వున్న భేదాలు చాలా మౌలికమైనవి; వాటిని స్పష్టంగా గుర్తించినప్పుడే రెంటినీ అనుసంధించటం సాధ్యమని చాటేవి, ఈ పుస్తకంలో వున్న రెండు రచనలూ.
క్రితం సంచికలోని గడినుడి-31కి మొదటి ఇరవై రోజుల్లో ఎనమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. ఈ సారి గడినుడి నింపడంలో కలిగిన సాంకేతిక అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇకపై అటువంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్త పడతాం. పోయిన నెల గడినుడికి అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, అగడి ప్రతిభ, బండారు పద్మ, వైదేహి అక్కిపెద్ది, సుభద్ర వేదుల, భమిడిపాటి సూర్యలక్ష్మి, ముకుందుల బాలసుబ్రమణ్యం, ఆళ్ళ రామారావు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-31 సమాధానాలు, వివరణ.
నవంబర్ 2015 సంచికలో బాలానంద బృందం 78rpm రికార్డులపైన, రేడియోలోను పాడిన కొన్ని పాటలు, రేడియోలో సమర్పించిన కొన్ని కార్యక్రమాలు విన్నాం. ఈ సంచికలో మరికొన్ని పాటలు, కథలు విందాం.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.