రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మార్చ్ 2017

తెలుగు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో ప్రామాణికత లేమిని ఎత్తి చూపిస్తూ, “జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.” అంటూ వెల్చేరు నారాయణ రావు 1988లో తెలుగు పరిశోధన అనే పత్రికలో చేసిన చర్చ నేటికీ తన సంగతత్వాన్ని ఎంతమాత్రమూ కోల్పోలేదు. ఆ చర్చ పరిష్కృత పాఠం; బాలకథారచయితగా సుప్రసిద్ధుడైన డాక్టర్ ౙాయిస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కథల స్ఫూర్తితో లలిత టి.ఎస్. చెప్పిన అంకెల కథ; ఒక కాలానికి చెందిన వ్యక్తిని, లేదా సంఘటనని, లేదా సామాజిక దృశ్యాన్ని కాలాతీతం చేసే మార్మిక శక్తి కావ్యానికి మాత్రమే ఉన్నదని, చరిత్ర చేయలేని పని కావ్యం చేస్తుందని చెప్తున్నారు భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం ద్వారా; విశ్వనాథ – వేయిపడగలు, మార్గరెట్ మిచల్ – గాన్ విత్ ద విండ్ నవలల లోని పోలికలూ తేడాలూ చూపిస్తూ కల్లూరి భాస్కరం ఇకనుండీ ఈమాటలో కొనసాగించబోయే విశ్లేషణ; ఇంకా ఎన్నో రచనలతో కలిసి ఈ సంచికలో మీకోసం.

🔸 ఇప్పటికీ చాలామంది ఈమాట రచయితల పరిచయాలు ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. దయచేసి తమ వివరాలు పంపమని, అలానే కాలదోషం పట్టిన వివరాలు సరిదిద్దడంలో మాకు సహాయపడమని రచయితలకు మా మనవి. రచయితల గురించి పాఠకులకు తెలియడానికి ఈ పరిచయాలు ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి తోడ్పడమని విజ్ఞప్తి.

ఒకటి నుంచి పదిల దాకా…

రచన: లలిత టి. ఎస్.
ఈ ఈ నొక్కి చదవండి...

థియొడోర్ గెయ్‌సెల్ (Theodore Geisel) ప్రపంచప్రసిద్ధి గాంచిన కార్టూనిస్ట్, ఆనిమేటర్, ఆర్టిస్ట్. కానీ ఆయన ఎవరికీ తెలియదు. అదే డాక్టర్ సూస్ అనండి, ఆయన తెలియనివారూ ఉండరు! పిల్లలకోసం కలకాలం నిలిచిపోయే ప్రపంచాన్ని సృష్టించిన సాహిత్య మేరునగం డాక్టర్ ౙాయిస్ (Dr. Seuss) జన్మదిన ( మార్చ్ 02, 1904) సందర్భంగా ఒక తెలుగు గేయం, ఆడియోతో సహా.

22

నాకు నచ్చిన పద్యం: రాజు – కవి – కావ్యం

రచన: భైరవభట్ల కామేశ్వరరావు

ఆగమెమ్నాన్ గ్రీకు పురాణాలలో ప్రముఖుడైన రాజు. ట్రోజన్ యుద్ధంలో గ్రీకు సైన్యాలని ఒకటి చేసిన వీరుడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, హోమర్ చెప్పడం వల్లనే ఆతని పేరు ఇంత కాలం నిలిచున్నదని, ఆగమెమ్నాన్ ముందు ఎంతమంది వీరులు కావ్యానికి ఎక్కకపోవడం వలన కాలగర్భంలో కలిసిపోయారో! అని అంటున్నాడు హోరెస్. హోమర్‌ని సేక్రెడ్ బార్డ్‌గా పేర్కొన్నాడు హోరెస్. సరిగ్గా మన పద్యంలో ఉన్న వాల్మీకి కూడా అదే కదా!

2

తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్‌వ్యూ

రచన: ఎన్. గోపి, చేరా
ఈ ఈ నొక్కి చదవండి...

కాని, ఈ దేశపు విద్యను ఆధునికీకరించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏమిటీ అనే విషయం మనం ఇప్పటికీ చర్చించలేదు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా – మనకున్న పాత సంప్రదాయమంతా గొప్పదే, అంచేత గురుకులాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని నేను కోరడం లేదు. మన విద్యల్ని ఆధునికీకరించడానికి మనకు నప్పే పద్ధతుల్ని అన్వేషించాలి. గుడ్డిగా అనుకరించనూ కూడదు. మనదంతా గొప్పదని పిచ్చిగా నమ్మనూ కూడదు. చివరిగా ఓ మాట చెప్పనివ్వండి – జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 3

ఒకనాటి యువ కథ: అమ్మ

రచన: రంగనాయకమ్మ

రావునేదో అర్థంకాని అసహ్యభావం ముంచేసింది. శరీరం యావత్తూ ఏవగింపుతో జలదరించింది. తననీ, తన సంతానాన్నీ చూసుకుంటూ కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు! అమ్మకి నలభై ఐదేళ్ళు దాటాయి. నాన్నకి యాభై ఏడో ఎనిమిదో ఉంటాయి. ఇద్దరూ వృద్ధాప్యంలో అడుగుపెట్టారు. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, రెండు వేపులా మనవలూ! అమ్మమ్మకీ తాతకీ ఇప్పుడు పిల్లలా? ఇప్పుడు పసిబిడ్డ! ఒక్కసారిగా ఆ ఇద్దరి మీదా రావుకి చీదర ముంచుకొచ్చింది. అసలు ఈ వయస్సులో బిడ్డల్ని కనవచ్చునా?

పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో 2

తెరచాటు-వులు: 2. రాజువయ్యా! మహరాజువయ్యా!

రచన: శ్రీనివాస్ కంచిభొట్ల
ఈ ఈ నొక్కి చదవండి...

ఆ మధ్య టైటిల్సు ఆఖర్లో కొత్త కార్డ్ ఒకటి ప్రత్యక్షం అవడం మొదలు పెట్టింది – దర్శకత్వపు పర్యవేక్షణ అని. ఒక లఘు డైరెక్టరుగారి చేతిలో ప్రతిష్టాత్మక చిత్రం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక గురు డైరెక్టరుగారు అధ్యక్ష పీఠం అధిష్టించి ఈ సత్తరకాయ గారిని సరిదిద్దుతూ ఉంటారు. దర్శకత్వమే అంటేనే పర్యవేక్షించి తప్పొప్పులు ఎత్తి చూపే పని ఐతే, మళ్ళీ ఈ తోక ఎందుకో, ‘ఆడ లేడీస్’ అన్నట్టు.

0

ఒక ప్రయాణం

రచన: తాడికొండ కె. శివకుమార శర్మ

రివరీ లోంచి బయటపడి వాచ్ వైపు చూస్తే ఇప్పుడందులో ముళ్ళే లేవు. ఇంతలోకే ఎక్కడికి పోయాయి అని ఆశ్చర్యపడ్డాడు. దీన్ని రిపేర్ షాపువాడికి చూపించి ముళ్ళు మాయమయ్యాయంటే వాడు నమ్ముతాడా అసలు? అనుకుంటూ ముందు విడియో మానిటర్ని చూశాడు. ఇంకా సేఫ్టీ విడియో వస్తూనే వుంది. రివైండ్ అండ్ ప్లే లాగా అందులోని వ్యక్తి సీట్ బెల్ట్ పెడుతూ, తీస్తూ, పెడుతూ, తీస్తూనే వున్నాడు. డ్రింక్ కార్ట్ కోసమని వెనక్కు చూస్తే కొన్ని పసుపు పచ్చని ఆక్సిజన్ మాస్కులు వేళ్ళాడుతూ కనిపించాయి.

1

ఇద్దరు కథకులు – రెండు చెదిరిన బ్రతుకుల కథలు

రచన: ల.లి.త.
ఈ ఈ నొక్కి చదవండి...

బండ నెత్తిమీద పడినంత వేగంతో నడుస్తుంది ‘బండపాటు’లో కథనం. చావు తరువాతి సంఘటనలన్నీ జోరుగా జరిగిపోతాయి. ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతూ లాభం పొందటానికి చేసే ప్రయత్నాలను చాసో తీవ్రంగా ఉద్విగ్నంగా అన్నిటినీమించి వ్యంగ్యంగా ధ్వనింపజేస్తారు. మనిషితనం నశించినవాళ్ళ ప్రవర్తన ఎంత హీనంగా ఉండగలదో మనం ఊహించలేనంత పదునైన వ్యంగ్యంతో వర్ణిస్తూ బాధాకరంగా నెమ్మదిగా ‘కఫన్‌’ను నడిపిస్తారు ప్రేమ్‌చంద్.

0

త్వమ్ తత్ అసి

రచన: విజయ్ కోగంటి

నీ వునికి నాలో
నిరంతరం ప్రవహించినా
కనుచూపుమేరా అదృశ్యంగా
నన్ను స్పృశిస్తూనే వున్నా
నేను నీ అగుపించని రూపుకై
తపిస్తూనే వుంటాను

0

వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు

రచన: కల్లూరి భాస్కరం
ఈ ఈ నొక్కి చదవండి...

విశ్వనాథవారి వేయిపడగలు నవలను, మార్గరెట్ మిచల్ నవల గాన్ విత్ ద విండ్‌ రెండూ ఇంచుమించు ఏక కాలంలో వెలువడినవే కాని, రెండింటి భౌగోళిక తాత్విక నేపథ్యాలు వేరు. ఒకదానిది భారతీయ నేపథ్యం, ఇంకోదానిది అమెరికన్ నేపథ్యం. అలాంటిది, వాటి మధ్య పోలికలు ఒక ఆశ్చర్యమైతే, ఆ పోలికలలో కొన్ని తేడాలూ అంతే ఆశ్చర్యం.

3

అయిదో కుర్చీ

రచన: అవినేని భాస్కర్
మూలం: ఎ. ముత్తులింగం

పెళ్ళయిన కొత్తల్లో ఆమె కాళ్ళ పట్టీలు రెండూ ఒకదానికొకటి చిక్కుకోవడం తరచూ జరుగుతూ ఉండేది. నడిజాములో ఆమె కాళ్ళు చిక్కుకుని అవస్త పడుతుంటే ఆ పరిస్థితి చూసి నవ్వుతూ ఉడికించేవాడు. ఆమె బేలగా అయ్యో పట్టీలు చిక్కుకున్నాయి విడిపించండి అని బతిమలాడేది. ఆమె ఆరాటాన్నలా కొనసాగించి చూసి ఆనందపడేవాడు. ఆమె పాదాలను సుతిమెత్తగా తడుముతూ పట్టీల చిక్కు విడిపించేవాడు. ఎంత ఆలస్యం చేస్తే అంతసేపు ఆమె పాదాలతో ఆడుకోవచ్చు అన్నట్టు నెమ్మదిగా చిక్కు విడిపించేవాడు.

4

ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

గడచిన నెల వ్రాసిన వ్యాసములో ఉదాహరణముల ఉత్పత్తిని, వాటి నియమములను, విభక్తులను గుఱించిన విశేషములను, రగడల లక్షణములను చర్చించినాను. ప్రతి విభక్తికి నిదర్శనముగా కొన్ని ప్రసిద్ధమైన ఉదాహరణ కావ్యములనుండి వృత్తములను, కళికోత్కళికలను నిదర్శనములుగా చూపినాను. ఇప్పుడు నేను వ్రాసిన శారదోదాహరణతారావళి అనబడు ఒక ఉదాహరణకావ్యమును మీకు సమర్పిస్తున్నాను.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 2

అతిథి

రచన: ఆర్. శర్మ దంతుర్తి

తను అమెరికా వెళ్ళకముందు ఎప్పుడో కాలేజ్‌ డేస్‌లో ఉండగా లోకల్ ట్రెయిన్ ఎక్కిన అనుభవం గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది కల్పనకి. మామూలు కంపార్ట్‌మెంట్‌లో అయితే మనిషిని నలిపేయడం గారంటీ. ఫస్ట్ క్లాస్‌లో అయితే కాస్త డీసెంట్‌గా ఒకళ్ళనొకళ్ళు ఆనుకుంటూనో, లేకపోతే వేళ్ళాడుతూనో నిలబడొచ్చు. అక్కడికీ తన చేతిలో పర్స్ పోకుండా దాచుకోగలిగితే అదృష్టమే. అయినా బాంబేకి ఇలాంటి వర్షం మామూలే కదా అనుకుంటూండగానే మళ్ళీ తండ్రి కంఠం వినిపించింది ఫోనులో, “విన్నావా? కారు బయటకి తీయవద్దు!”

7

శబ్దాన్ని జయించి రా!

రచన: చంద్ర మోహన్
మూలం: వైరముత్తు

“పక్షుల కలరవాలను విన్నాను
రాలినపడిన పండుటాకులపై మృగాల
సయ్యాటలు విన్నాను
మూగవైన గట్లతో నది ఆపక సలిపే
మధుర సంభాషణలు విన్నాను
పూల తపస్సును భంగపరుస్తున్న
తుమ్మెదల ఝంకారాన్ని విన్నాను
గజరాజును వెదుకుతున్న
కరిణి ఘీంకారాన్ని విన్నాను”

1

వలస పక్షి

రచన: పి. రామకృష్ణ

దారి-
గరికపూల అంచులున్న
మెరిసే ఎండచీర.

నీడపింఛం విప్పి
గాలికి కాస్త
తలూపే చెట్టు.

0

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 3

రచన: శ్రీశ్రీ
ఈ ఈ నొక్కి చదవండి...

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం.

3

పుస్తక పరిచయం: స్వప్నసాకారం

రచన: కొల్లూరి సోమ శంకర్
ఈ ఈ నొక్కి చదవండి...

శ్రీమతి వాలి ఉమాదేవి, వాలి హిరణ్మయీదేవి అనే పేరుతో 80వ దశకంలో విరివిగా కథలు వ్రాశారు. మంచి కథల రచయిత్రిగా పత్రికా పాఠకులకు చిరపరిచితులు. హిరణ్మయీదేవి గారు ఎప్పటినుంచో రాస్తున్నా, ఇటీవలి కాలంలో రాసిన 22 కథలతో స్వప్నసాకారం అనే వారి మొదటి సంపుటం లోని కథలకు ఒక సంక్షిప్త పరిచయం.

1

గడి నుడి – 5

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
ఈ ఈ నొక్కి చదవండి...

గడి నుడి-4కి చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చాయి. ఐతే తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. దాదాపు ఇరవైమంది పరిష్కారాలు పంపినా అన్ని సమాధానాలూ సరిగా పంపింది ఇద్దరే: 1. శ్రీవల్లీరాధిక, 2. కె. వి. గిరిధరరావు. ఇద్దరికీ అభినందనలు!

గడి నుడి – 4 సమాధానాలు, వివరణ.

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.