లోకంలో జరిగే సంఘటనలకు కార్యకారణసంబంధాలు ఎంతగా ఉంటాయో కాకతాళీయాలు సైతం అంతగానూ వుంటాయి. అదే ప్రతిపాదించదలిచి నా. బా “అంత రోడ్డు ఆవలిస్తే ముగ్గురు […]
మే 2002
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
ఈ సంచికలో ఒక ముఖ్య విశేషం ఇందులోని రచనల్న్నీ PDF రూపంలో ఉండటం. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో తెలుగు అక్షరాలు సక్రమంగా రావటం లేదన్న మీ అభిప్రాయానికి ప్రతిస్పందన ఈ ప్రయత్నం. మీకు నచ్చుతుందనే ఆశిస్తాం.
ఒక ముఖ్య గమనిక – ఎక్రొబాట్ రీడర్ ఒక్కోసారి వెంటనే ఫాంట్స్ లోడ్ చెయ్యకపోవచ్చు. ముఖ్యంగా పెద్ద ఫైళ్ళ విషయంలో ఇది జరుగుతుంది. అలాటప్పుడు కర్సర్‌ని కుడిపక్కనున్న స్క్రోల్‌బార్ మీద కిందికి జరిపితే ఫాంట్స్ లోడ్ అవుతాయి.
ఇక ఇందులోని రచనల విషయానికి వస్తే, ఎన్నో విశేషాలున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవలసింది – అభ్యుదయ కవితోద్యమారంభంలో అందులో ముఖ్య పాత్ర వహించిన వారందరితోనూ చాలా సన్నిహిత సంబంధాలున్న డాక్టర్ ఆవంత్స సోమసుందర్ గారు “ఈమాట” కోసం ప్రత్యేకించి రాసి పంపిన ఒక వ్యాఖ్యా వ్యాసం. శ్రీరంగం నారాయణ బాబు “మౌనశంకం” కవిత గురించిన ఎన్నో కొత్త విషయాల్ని, ఆ కవిత పుట్టుక చుట్టూ ఉన్న అనేక సంఘటనల్ని ప్రత్యక్ష సాక్షిగా వివరించారు వారు. ఎంతో శ్రమ చేసి ఇంతటి ఉన్నత రచనని పంపిన శ్రీ సోమసుందర్ గారికి మా కృతజ్ఞతలు. ఇందుకు కారకులైన శ్రీ వెల్చేరు నారాయణ రావు గారికి అభివందనాలు. కవిత్వంలో ఆసక్తి ఉన్న వారందరూ చదవవలసింది ఈ వ్యాసం.
ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు గారు ఇప్పటి తెలుగు సాహిత్య రంగపు పరిస్థితిని, దానికి దారితీసిన చారిత్రాత్మక సంఘటనల్ని, శక్తుల్ని, తమదైన ప్రత్యేక విశ్లేషణాత్మక దృష్టితో వివరించిన వ్యాసం పాఠకులందరూ చదివి తీరవలసింది.
మన మధ్య ఉంటూ, “ఈమాట”కు క్రమం తప్పకుండా కవితల్ని అందిస్తున్న విన్నకోట రవిశంకర్ కవితాసంకలనం “కుండీలో మర్రిచెట్టు” పూర్తిపాఠం, “ఈమాట”కు అనుబంధంగా అందిస్తున్నాం. అలాగే 15 శతాబ్దపు వింత కవి వినుకొండ వల్లభరాయని విశేషరూపకం “క్రీడాభిరామం” మూలాన్ని కూడా పూర్తిగా ఇస్తున్నాం. 20వ శతాబ్దంలో చాలా కాలం పాటు చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అద్భుత రూపకాన్ని చదివి అందులోని ఎన్నో రసవత్తర విశేషాల్ని ఆస్వాదించమని ఆహ్వానం.
వీటికి తోడు మామూలుగానే మీకు నచ్చే ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలతో సర్వాంగ సుందరంగా మీ ముందుకు వస్తోందీ సంచిక. రసజ్ఞ పాఠకులకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం.
ఈమధ్య ఒకసారి అఫ్సర్‌తో మాట్లాడుతూ ఇండియా టుడే వాళ్ళు వేసిన సాహిత్య సంచికలో మీ పద్యం చూసానని చెప్పాను. అఫ్సర్ వెంటనే ఆ పద్యం […]
(జనవరి 2002 సంచిక లో వచ్చిన “కవిత్వ మీమాంస” అనే వ్యాసానికి ఇది కొనసాగింపు లాటిది. అక్కడ కవిత్వం గురించిన విశాలమైన చర్చ జరిగింది. […]
జనంతో ఆడిటోరియం ఆవరణ కిటకిటలాడుతోంది. తళతళ లాడే పంచెలు పైకెగగట్టి, ధగ ధగ మెరిసే పట్టు చీరలు కట్టి, హడావిడిగా తిరుగుతున్న కార్యకర్తలతో ఆడిటోరియం […]
భావకవిత్వం తర్వాత తెలుగు సాహిత్య విమర్శాప్రమాణాల గురించి కవులు మాట్లాడటం లేదంటున్నారు వెల్చేరు నారాయణరావు గారు (ఇదే సంచికలో వున్న వెల్చేరు గారి వ్యాసం […]
ఉగాదికి ప్రోగ్రాం పెట్టాలన్నారు తెలుగు ఎసోసియేషన్ వాళ్ళు. ప్రతి శనివారం మీటింగు. మెంబర్లు రావడం, మాట్లాడ్డం, వెళ్ళడం, ఎంతకీ విషయం తేలకపోవడం.. కొంతమంది ఆఫీసులో […]
Ezra Pound From “A Retrospect” (1918) There has been so much scribbling about a new fashion in poetry, […]
ఎవరేమి చెప్పినా వినదలుచుకోలేదు. ఎన్నిసార్లు వాయిదా వేసుకొన్నానో నాకే తెలియదు. ప్రతిసారీ ఇండియా వచ్చినప్పుడల్లా అమర్ నాథ్ చూడాలనిపించడం, చివరికి చూస్తుండగానే రోజులు తరిగిపోవడం, […]
విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లనో, కాలేజీల్లో పండితులనో, మీరుగనక ఈమధ్యకాలంలో పలకరించి ఉంటే తెలుగు భాష ఎవ్వడికీ అక్కరలేనిదయ్యింది, తెలుగు భాషకి తెలుగు దేశంలోనే భవిష్యత్తు లేదు, […]
“ఒరే, ఘోరం రా! వందన ఈ రోజు ఎవరితోనో బైక్ మీద పోతుంది” “దీన్లో ఘోరం ఏముంది నేను మొన్న సినిమా హాల్ లో […]
ముందుగా కల్పనా రెంటాల పుస్తకం “కనిపించే పదం”. ముప్పై ఒక్క కవితలు; అందులో ఎంపిక చేయదగిన చక్కటి కవితలు ఒక నాలుగు (నది సప్తపది, […]
అతను ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు. తను ఐదూ రెండు అర్భకుడు. అతను రెండొందల పౌండ్ల కండలు తిరిగిన వస్తాదు. తను నూట డెబ్భై పౌండ్ల డయబీటిస్ పేషంటు. అతనికి బహుశా ముప్ఫై దగ్గర్లో వుండొచ్చు. తనకి యాభై దాటుతోంది.
దూరమవుతున్న కొద్దీ ఇల్లు గుర్తు కొస్తున్నట్టు రాయని పద్యమేదో పోయినసారిదే కడసారిదైనట్టు రాయలేక పోతున్నదేదో నా రెండవకూతురంటుంది నేను మాత్రం మీకు పద్యం కాలేకపోయానని […]
అక్కడెక్కడో వసంతం అడుగులు వినబడితే చాలు, యిదే అదనని యిక్కడి చెట్లన్నీ అకస్మాత్తుగా యుద్ధం ప్రకటిస్తాయి. నిన్నటిదాకా చడీచప్పుడూ లేకుండా, తెల్ల్లారేసరికల్లా యింటినిచుట్టుముట్టిన సైనికుల్లాగా […]
ఎంత చక్కటి నిదరో
అందులో అంత కమ్మటి కల
హాయిగా నిదరోతున్నట్టు
అరుస్తోంది కొండల్లో
తప్పిపోయింది
మేకపిల్ల
విల్లులా వంపు తిరిగిన యూకలిప్టస్ కొమ్మలలో చిక్కుకుని
గుల్మొహర్ లా పూచిన సాయంత్రాన్ని
నా కాన్వాస్ పై చిత్రించి నీకు కానుకగా ఇవ్వాలని
జర్మన్ మూలం రైనెర్ మారియా రిల్కే రిల్కే (1875-1926) ప్రేగ్ లో జన్మించాడు.బాల్యం కష్టాలతో గడిచింది.ఇష్టం లేని మిలిటరీ స్కూల్ లో విద్యాభ్యాసం.రెండు పదులు […]
శ్రీద ఖ్యాతి నిరాకృతి వైదుష్య సుపుష్య దర్థవైభవ యపరి చ్ఛేదప్రాభవ యాచక ఖేదప్రశమనవిలోల కృష్ణనృపాలా అవధరింపు మవ్విధంబున నలఘువ్రతుండు భువనేశ్వరీమంత్ర జపంబు రెండు సంవత్సరంబులు […]
“1936 జూన్ నెల! సుదీర్ఘ శీతాకాలపు కత్తికోతల విపత్తుల నుంచి కాస్త తెరిపిని పడ్డ సమయం! వేసవి ఒక నెల గడిచింది. లండన్ మహానగరంలో […]