ఈ కవిత అర్థమవడానికి “వర్షుకాభ్రములు” అన్న పదంకోసం నిఘంటువులు తిరగెయ్యనక్కరలేదు. మహా ప్రవాహంలా హోరెత్తించే ఆ కవిత్వ వేగం సామాన్య పాఠకుణ్ణి సైతం మున్ముందుకి తోసుకుపోతుంది.
Category Archive: వ్యాసాలు
శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యంగా సీరియస్ వ్యవహారం. అయనా అందులో కూడా కొన్ని జోకులూ, ఛలోక్తులూ ఉంటూనే ఉంటాయ. వాటిలో చిరునవ్వు తెప్పించేవి కొన్నిటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.
మనకి గతశతాబ్దంలో మహాకవులు ఇద్దరే: విశ్వనాథ, శ్రీశ్రీ.
డిట్రాయిట్ నగరంలో, జులై 1,2,3 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 15వ సమావేశం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, […]
ప్రాచీన సాహిత్యాన్ని పరమ పవిత్రమని నెత్తిన పెట్టుకోవడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారేయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి కోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.
సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది.
గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని — అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి, యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల
ప్రజలని వేలి ముద్రలతో ఎలా పోల్చుకో వచ్చో అలాగే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని “నాలుక ముద్రలు” తో పోల్చుకో వచ్చేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వేలి ముద్రలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కాని, “నాలుక ముద్రలు” జీవితంలో క్రమేపీ మారుతూ ఉంటాయి.
నామిని బడిపిల్లల కోసం ఒక పుస్తకం రాశారు. ఇందులో రచయిత సదుద్దేశాన్ని అపార్థం చేసుకోకూడదు. పిల్లలకి ఎన్నో మంచి విషయాలు చెప్పాలనే రచయిత తాపత్రయం. […]
శాస్త్రీయ రాగాలతో ఘంటసాలకు ఉండిన గాఢమైన పరిచయం, వాటిని సాహిత్యానికి ఎలా ప్రతిభావంతంగా వాడుకోవాలో తెలియడం, కొత్త రాగాలను ప్రవేశపెట్టి అవసరమైనప్పుడు వాటిచేత (శ్రీశ్రీ చెప్పినట్టు) “అందంగా చాకిరీ చేయించుకోవడం” ఆయనకు బాగా తెలుసు.
జరిగిన విషయం తిరిగి చెప్పినచోట్లు చాలా ఉన్నాయి, భారతంలో. ఒక ఉదాహరణకి, శకుంతలోపాఖ్యానం చూడండి. అయితే మక్కీకి మక్కీ గా అప్ప చెప్పలేదు. ఏది ఏమయితేనేం? నాకు తెలిసినంతలో, భారతంలో ఇల్లా మక్కీకి మక్కీ రిపీట్ అయిన పద్యం లేదనే అనుకుంటున్నా. ఇది పరిశోధించవలసిన విషయమే.
1920లో జన్మించిన సంగీతరావు గారు మూర్తీభవించిన సంగీతమే. అభినయంలో చినసత్యం సాధించిన విజయాలకు సంగీతరావుగారి స్వరరచన ఎంతగానో తోడ్పడినందువల్లనే ఆ నాటకాలు నేటికీ ప్రపంచమంతటా ప్రజాదరణ పొందుతున్నాయి.
కవిత్వానికున్న అనేక ప్రేరణల్లో ఇతర కళల ద్వారా కలిగే ప్రేరణ కూడా ఒకటి. ఒక కచేరీ విన్నప్పుడో, చిత్రం, చలన చిత్రం లేదా శిల్పాన్ని […]
బస్సు నెమ్మదిగా కదిలింది .. భద్రాచలం వైపు. రోడ్డు ఎంత నున్నగా ఉంది ! పైన సూర్య తాపం కూడా అంతగా లేదు. అబ్బ! ముందు కూర్చున్నాయన ఒకటే కదులుతున్నాడు. ఆ తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటే మా చెడ్డ చిరాగ్గా ఉంది – అనుకున్నాడు శివం. ఇటు పక్కనాయన పేపర్లో మునిగాడు. శివానికి బస్సు లో అవతలి వైపు కనిపించడం లేదు. దానితో చేసేదేం లేక మళ్ళీ కిటికీ ని ఆశ్రయించాడు శివం. ప్రకృతి ఆరాధన మొదలు మళ్ళీ.
“కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై […]
1 అమెరికా రావాలన్న ఊహ నా బుర్రలో ఎప్పుడు ప్రవేశించిందో తిథి, వార నక్షత్రాలతో చెప్పలేను. కాని నేను చదువుకునే రోజులలో నాకు అమెరికా […]
1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్ […]
పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!
1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి.
కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వా రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే? శిబి ప్రముఖులున్ ప్రీతిన్ […]