తెలుగు భాష వేదాల కన్నా పాతదని, మనిషి పుట్టుకకు పూర్వమే పుట్టిందని వికారమైన వాదాలు మొదలయ్యాయి. “శ్రీకృష్ణుడు తెలుగువాడే,” అన్నవాదం నుంచి “అస్సిరియా నుండి ఆస్ట్రేలియా దాకా తెలుగే మాట్లాడేవారట” అనేటంత వెర్రి వాదాలు కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి.

కవిత్వం గురించి చెబుతూ ఎజ్రా పౌండ్ “భావ ప్రకటనకి పనికిరాని ఒక్క పదాన్నైనా సహించకూడదన్నారు.”. ఆ లక్షణాన్ని పవన్ బహు చక్కగా పుణికిపుచ్చుకున్నారు.

పాఠకుల విమర్శలు రచయితలకీ సంపాదకులకీ ఎంతో అవసరం. సహృదయంతో చేసిన విమర్శలు సూటిగా నిష్కర్షగా ఉండచ్చు. అందులో తప్పేమీ లేదు.

నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు –
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.

ఒచ్చిన కొత్తల్లో తను కూడా అలాగే అనుకొనేది. అన్నం వేష్ట్ చెయ్యకూడదు, కూర వేష్ట్ చెయ్యకూడదు అని. ఇప్పుడు అదంతా సిల్లీగా ఉంటుంది. చెత్త కుండీల దగ్గర ఇంకా రంగైనా పోని సోఫాలు, మంచి టీవీలూ టేబిళ్ళూ పడీసుంటాయి. బట్టలు చెప్పులు తనకెన్నున్నాయో తనకే గుర్తుండదు. పిల్లలూ ఒక నాలుగు సార్లు తొడుక్కుని చెప్పులూ బట్టలూ ‘Yuk!’ అని పడెస్తారు.

కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము.

అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చింది.

తెలుగు సాహిత్యం నిలిచివుండాలంటే దాన్ని ఆంగ్లంలోకి అనువదించటమే ఇప్పుడున్న ఏకైక సాధనం. ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఈ కృషిని కొనసాగిస్తున్న నారాయణరావు, షుల్మన్ గార్లను మనం ప్రత్యేకించి అభినందించాలి.

అనువాదం అనువదించబడే భాషలో సాహిత్య స్థానాన్ని సంపాదించ లేక పోతే అది ఎంత విధేయంగా వున్నా అది సాహిత్యానువాదం కాదు. అంచేత సాహిత్యానువాదకుల పని ప్రధానంగా తాము అనువదించిన భాషలో తమ అనువాదానికి సాహిత్యస్థానాన్ని సంపాదించుకోవటమే.

“దిస్సీజ్ మై వొయిఫ్ …. అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!” అన్నాడు. అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి “నమస్తే ఆంటీ!” అని, అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా “బాబు పేరేంటంకుల్ ?” అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ “మేక్ పీస్ ” అనే అన్నాడు మళ్ళీ.