రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కాలుష్యాష్టకం

రచన: తాడిగడప శ్యామల రావు
అక్టోబర్ 2024
కం.
కలుషితము మెసవు మెతుకులు
కలుషితములు త్రావు నీళ్ళు గరళసదృశముల్
కలుషితము పీల్చు గాలియు
కలుషిత మనరాని దేది కలికాలమునన్
కం.
కలుషితములు మనబుద్ధులు
కలుషితములు మనముచేయు ఘనకార్యంబుల్
కలుషితములు మనరూకలు
కలుషితములు జీవితములు కలికాలమునన్
కం.
కలుషితములు శాస్త్రంబులు
కలుషితములు బడులు గుడులు ఘనపీఠంబుల్
కలుషితములు గురుబోధలు
కలుషితములు కాని వేవి కలికాలమునన్
కం.
కలుషితములు చుట్టరికం
బులు నెల్లరి సంప్రదాయములు కలుషితముల్
కలుషితములు స్నేహంబులు
కలుషితములు కాని వేవి కలికాలమునన్
కం.
కలుషితములు రాగంబులు
కలుషితములు నృత్యగానకవితారీతుల్
కలుషితములు కావ్యంబులు
కలుషితములు సకలకళలు కలికాలమునన్
కం.
మనవాక్కులు కలుషితములు
మనచూడ్కులు కలుషితములు మాటికి రేగే
మన కోర్కెలు కలుషితములు
మన బ్రతుకులె కలుషితములు మహి నీకలిలో
కం.
కలుషితములు మన శ్రద్ధలు
కలుషితములు మనము చేయ గడగెడు పూజల్
కలుషితములు మన మ్రొక్కులు
కలుషితములె సకలదైవకార్యములు కలిన్
కం.
కలుషితమైనది కాలము
కలుషమతులు పెచ్చుమీఱ కలికాలమునన్
కలుషరహితమగు దైవమె
కలుషంబుల బాపి జనుల గాపాడవలెన్
    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    శర్మ దంతుర్తి October 3, 2024 1:11 pm

    * ఏ. తె. కలుషితము తిరుపతి లడ్డూ
    కలుషితములు గోవులు, తిను దధిగ్రాసంబులున్
    కలుషితము కలుపు నేయి
    కలుషితములు ఏడుకొండలును మహి నీకలిలో

    * ఏ. తె. మనయాత్రలు కలుషితములు
    కలుషితమగు మనచేతలతో దేవుడి చేతులు
    గట్టిగ కట్టిన విడిపించుకుని
    వెంకన్న దైవమె జనుల గాపాడవలెన్

    *ఏ. తె – “ఏమో తెలియదు” అనే వృత్తం. ఆయన అష్టకం కలుషితం చేసి దశకం చేసినందుకు శ్యామలరావుగారికి క్షమాపణలతో. 🙂

  2. 2
    తాడిగడప శ్యామల రావు October 8, 2024 1:19 am

    కం. ఏమో తెలియదు వృత్తం
    బేమో నేనెరుగ గాని యేమేమో యీ
    యేమో తెలియని ఛందము
    లోమాన్యులు శర్మగారు రూపించిరిగా

    కం. ఎడనెడ కందపు ధోరణి
    కడు చక్కగ నమరుచుంట గని సంతసమున్
    మిక్కిలి యైనది వారిక
    నిక్కపు కందముల నల్ల నేర్చుట యొప్పున్

  3. 3
    sarma November 2, 2024 12:21 am

    కాలుష్యం,కల్తీ నిత్యం.తల్లిపాలు కూడా కల్తి.కాలం కాదు సార్! కాలానికేం అంటదు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చౌరాష్టకం – ఆంధ్రానువాదం
  • కాలుష్యాష్టకం

ఇటువంటివే…

  1. అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం

అక్టోబర్ 2024 సంచికలో ...

  • Tree Toons
  • అక్టోబర్ 2024
  • అజ్ఞాతవాసి
  • అతని రాక
  • అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం
  • అలనాటి యువ కథ: స్వామీజీ
  • ఆల్బమ్
  • ఎందరిని…
  • కథకుడి అంతర్మథనం
  • కాలుష్యాష్టకం
  • దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8
  • నా అనే నేను లేక
  • పంచేంద్రియాలు: 1. వాసన
  • పాత్రదానం
  • పెద్దమ్మ మాటలు
  • మాతృకాంక్ష
  • యూట్యూబ్‍లో ఈమాట: సెప్టెంబరు 2024
  • సంగ్రహము
  • సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’
  • సంపాదకునికి ఉత్తరం
  • సాక…
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

సంపాదకునికి ఉత్తరం
ఆల్బమ్

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.