ఒక క్షణమైనా

ఎన్నాళ్ళుగానో చూస్తున్నా
ఆ మొక్కను
అక్కడక్కడ
నాలుగు ఆకులతో
నిస్తేజంగా

శిశిరంలో ఉలకదు
వసంతమొచ్చినా పలకదు

వానొచ్చి
తనువంతా తడిపినా
మౌనంగా చూస్తూ

ఎంతో బ్రతిమాలితే
ఒకే ఒక పువ్వును ప్రసవించి
రంగుల తెరలై నవ్వింది
పరిమళాలు పోయింది
మనసంతా ఆక్రమించింది

కొన్నాళ్ళకు మోడువారి
తలవాల్చేసింది
వీడ్కోలైనా పలకకుండా
మట్టిని కౌగిలించింది

ఉన్నట్టుండి
నాకనిపించింది కదా
ఒక క్షణమైనా
ఆ మొక్కలా
ప్రపంచానికి
పరిమళాన్నైపోతానా?