Srinivas garu – have you come across any reference of books written by Sri.Korati Srinivasa puram brothers (in Kannada)/Translated to Telugu. Sri SymalaRao garu and my self made reference of the above books through this columns. I shall be thankful if you can give your valuable opinion / any information in this regard.
నారాగారిపై ప్రత్యేక సంచిక నందించిన “ఈమాట”కు జోహారులు!
బ్రహ్మానందం గారు, మీ ఆవేదన నాకు అర్థమయినది. సుమారు ఐదేళ్లుగా పాఠకుడుగా, రచయితగా నా అనుభవాలనుగురించి ఒక రెండు మాటలు – పాఠకులు ఎక్కువగా ఇష్టపడేది లలిత సంగీతముపైన, చిత్ర సంగీతముపైన, ప్రముఖ గాయకులపైన రచనలు. ఇవి పాఠకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. దాని తరువాత కథలు. అటుపైన వచన కవితలు. వీటన్నిటిని శ్రమలేకుండ చదివి, విని ఆనందించవచ్చును. పాఠకులకు వ్యాసాలంటే అంత యిష్టము లేదు, ముఖ్యముగా సాహితీ వ్యాసాలు (ఏ కొందరికో తప్ప) కొరకరాని కొయ్యలే. చిట్టచివర పద్య కవితలు. ఈ పరిస్థితిలో వీటి రచయితలు నిరుత్సాహ పడడములో తప్పు లేదు.
రచనలు ప్రచురించబడిన తరువాత అట్టి రచయితలకు mental depression తప్పని సరియే. అసలు ఎందుకు వ్రాయాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అప్పుడే భగవద్గీత ప్రత్యక్షమవుతుంది, శ్రీ భగవానువాచ – ఓ రచయితా, నీ పని వ్రాయడము మాత్రమే, మెచ్చుకోలు అనే ఫలాన్ని ఎదురుచూడడము సరికాదు, తప్పు పాపము కూడ. ఈ పరిస్థితి ఇప్పటిలో మారదు అనే నా ఉద్దేశము. రాలిపోయే పువ్వులా దొర్లిపోతున్నాయి రోజులు, ఒక నాడు ఈ పువ్వు కూడ రాలిపోతుంది. ఉంటాను.
విధేయుడు – మోహన
నీటి ఊహ
గురించి dr. bandi satyanarayana అభిప్రాయం:
01/17/2013
11:32 am
కవిత్వాన్ని ఆస్వాదించాలంటే మీ లాంటి వారి కవిత్వం చదవాలి. మీకు అభినందనలు.
వెల్చేరు గారి అనువాదాల మీదా, వారి కృషిమీదా ఒక ప్రత్యేక సంచిక తీసుకురావడం ముదావహం. అమెరికాలో తెలుగు సాహిత్య బావుటాని ఒంటి చేత్తో ఎగరేసిన వ్యక్తి వెల్చేరు. అమెరికాలో తెలుగు సాహిత్యమ్మీద పరిశోధనలకి ఒక మార్గం చూపించారు.
కారణాలు ఏమైనా, తెలుగునాట మాత్రం అమెరికాలో ఉన్న రచయితలన్నా, వారి రచనలన్నా ఒక రకమైన చిన్న చూపు. ఒక వేళ వెల్చేరు గారి లాగా ఎవరైనా పనిచేసినా ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఇది కాదని అన్నా, అనుకున్నా జరిగేదీ, జరుగుతున్నదీ ఇదే! అంతెందుకు, మామూలు కథల మీదా, కాలక్షేపం వ్యాసాల మీదా వచ్చినన్ని కామెంట్లలో అయిదో వంతు కూడా రాలేదు. ముచ్చటగా మూడంటే మూడు. అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని భుజాన మోసే పెద్దలందరూ మౌనవ్రతం పాటించినట్లున్నారు. ఏ రచనయినా బాగోలేదని చెప్పడానికి సంకోచించడమ్లో అర్థం వుంది. కనీసం అభినందనలు చెప్పడానిక్కూడా ఒక్కరికీ మాటలు రావడం లేదు. పాఠకులు సంగతి వదిలేద్దాం. కనీసం రచయితలకేమయ్యింది? ఇది చాలా దురదృష్టకరమయిన సాహిత్య వాతావరణం. ఫేసుబుక్కుల్లో లైకులూ, కామెంట్లూ, సాహిత్య గ్రూపుల్లో గొంతు చించుకునే వారెవరికీ ఇలాంటివి ఎందుకు కనిపించవు? ఏ ఒక్కరిమీదా కోపంతో అనడం లేదు. బాధతో రాస్తున్నా.
ఓ మనిషీ – మనిషిగా పుడితే పుట్టావు; రచయితవి మాత్రం కావద్దు. రచయితగా పుడితే పుట్టావు; తెలుగు వాడివి మాత్రం కావద్దు.
రమణ గారు, ఈ అద్భుతము అయిన భాగవత ఘట్టాన్ని అందించినందుకు ధన్యులం. రుక్మిణి దేవి అగ్ని ద్యోతనున్ని ఉద్దేశించి చెప్పిన పద్యం “జలజా శాసను తోడి తెచ్చితి …” పారాయణ చేద్దామనే ఉద్దేశంతో, మీకు సబబు అనిపిస్తే దయచేసి ఆ పద్యాన్ని పోస్ట్ చేయగలరు. – సవినయముతో కుమార్.
I read the article that you wrote in eemaata about the poems written by ‘Karunasree’ and sung by Ghantasala.
It is good article and i certainly enjoyed reading it. Although i do not know even the basics of music, fortunately i developed an ear to appreciate music… i.e. essentially whatever is sonorous and melodious to the ear. thank you for writing and allowing us in to the nuances of music.
I wish Ghanatasala sang more of Karunasree poems. As a matter of fact i wish he sang the entire books of Udayasree. I also think the Ghantasala’s voice was at his best when he sang all these poems and it never had such quality in his later life.
If there are other singers who sang the poems of Papaiah sastry please do introduce them to us thru eemmata
విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Subramanyam.Ravuluri అభిప్రాయం:
01/18/2013 9:35 am
Srinivas garu – have you come across any reference of books written by Sri.Korati Srinivasa puram brothers (in Kannada)/Translated to Telugu. Sri SymalaRao garu and my self made reference of the above books through this columns. I shall be thankful if you can give your valuable opinion / any information in this regard.
Subramanyam.Ravuluri
Hyderabad
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Kasinadhuni Radha అభిప్రాయం:
01/17/2013 5:02 pm
లక్ష్మన్న గారు,
చక్కని వ్యాసం. ఎప్పుడో చదివిన పద్యాలనే కాదు, ఎన్నో ఏళ్ళకిందట నాకు పాపయ్య శాస్త్రి గారితో జరిగిన సంభాషణని కూడా గుర్తు చేసారు. ధన్యవాదాలు.
కాశీనాధుని రాధ
ఈ సంచిక గురించి… గురించి మోహన అభిప్రాయం:
01/17/2013 12:58 pm
నారాగారిపై ప్రత్యేక సంచిక నందించిన “ఈమాట”కు జోహారులు!
బ్రహ్మానందం గారు, మీ ఆవేదన నాకు అర్థమయినది. సుమారు ఐదేళ్లుగా పాఠకుడుగా, రచయితగా నా అనుభవాలనుగురించి ఒక రెండు మాటలు – పాఠకులు ఎక్కువగా ఇష్టపడేది లలిత సంగీతముపైన, చిత్ర సంగీతముపైన, ప్రముఖ గాయకులపైన రచనలు. ఇవి పాఠకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. దాని తరువాత కథలు. అటుపైన వచన కవితలు. వీటన్నిటిని శ్రమలేకుండ చదివి, విని ఆనందించవచ్చును. పాఠకులకు వ్యాసాలంటే అంత యిష్టము లేదు, ముఖ్యముగా సాహితీ వ్యాసాలు (ఏ కొందరికో తప్ప) కొరకరాని కొయ్యలే. చిట్టచివర పద్య కవితలు. ఈ పరిస్థితిలో వీటి రచయితలు నిరుత్సాహ పడడములో తప్పు లేదు.
రచనలు ప్రచురించబడిన తరువాత అట్టి రచయితలకు mental depression తప్పని సరియే. అసలు ఎందుకు వ్రాయాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అప్పుడే భగవద్గీత ప్రత్యక్షమవుతుంది, శ్రీ భగవానువాచ – ఓ రచయితా, నీ పని వ్రాయడము మాత్రమే, మెచ్చుకోలు అనే ఫలాన్ని ఎదురుచూడడము సరికాదు, తప్పు పాపము కూడ. ఈ పరిస్థితి ఇప్పటిలో మారదు అనే నా ఉద్దేశము. రాలిపోయే పువ్వులా దొర్లిపోతున్నాయి రోజులు, ఒక నాడు ఈ పువ్వు కూడ రాలిపోతుంది. ఉంటాను.
విధేయుడు – మోహన
నీటి ఊహ గురించి dr. bandi satyanarayana అభిప్రాయం:
01/17/2013 11:32 am
కవిత్వాన్ని ఆస్వాదించాలంటే మీ లాంటి వారి కవిత్వం చదవాలి. మీకు అభినందనలు.
ఈ సంచిక గురించి… గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
01/16/2013 4:27 pm
వెల్చేరు గారి అనువాదాల మీదా, వారి కృషిమీదా ఒక ప్రత్యేక సంచిక తీసుకురావడం ముదావహం. అమెరికాలో తెలుగు సాహిత్య బావుటాని ఒంటి చేత్తో ఎగరేసిన వ్యక్తి వెల్చేరు. అమెరికాలో తెలుగు సాహిత్యమ్మీద పరిశోధనలకి ఒక మార్గం చూపించారు.
కారణాలు ఏమైనా, తెలుగునాట మాత్రం అమెరికాలో ఉన్న రచయితలన్నా, వారి రచనలన్నా ఒక రకమైన చిన్న చూపు. ఒక వేళ వెల్చేరు గారి లాగా ఎవరైనా పనిచేసినా ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఇది కాదని అన్నా, అనుకున్నా జరిగేదీ, జరుగుతున్నదీ ఇదే! అంతెందుకు, మామూలు కథల మీదా, కాలక్షేపం వ్యాసాల మీదా వచ్చినన్ని కామెంట్లలో అయిదో వంతు కూడా రాలేదు. ముచ్చటగా మూడంటే మూడు. అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని భుజాన మోసే పెద్దలందరూ మౌనవ్రతం పాటించినట్లున్నారు. ఏ రచనయినా బాగోలేదని చెప్పడానికి సంకోచించడమ్లో అర్థం వుంది. కనీసం అభినందనలు చెప్పడానిక్కూడా ఒక్కరికీ మాటలు రావడం లేదు. పాఠకులు సంగతి వదిలేద్దాం. కనీసం రచయితలకేమయ్యింది? ఇది చాలా దురదృష్టకరమయిన సాహిత్య వాతావరణం. ఫేసుబుక్కుల్లో లైకులూ, కామెంట్లూ, సాహిత్య గ్రూపుల్లో గొంతు చించుకునే వారెవరికీ ఇలాంటివి ఎందుకు కనిపించవు? ఏ ఒక్కరిమీదా కోపంతో అనడం లేదు. బాధతో రాస్తున్నా.
ఓ మనిషీ – మనిషిగా పుడితే పుట్టావు; రచయితవి మాత్రం కావద్దు. రచయితగా పుడితే పుట్టావు; తెలుగు వాడివి మాత్రం కావద్దు.
రుక్మిణీ కళ్యాణం గురించి Kumar అభిప్రాయం:
01/15/2013 4:21 pm
రమణ గారు, ఈ అద్భుతము అయిన భాగవత ఘట్టాన్ని అందించినందుకు ధన్యులం. రుక్మిణి దేవి అగ్ని ద్యోతనున్ని ఉద్దేశించి చెప్పిన పద్యం “జలజా శాసను తోడి తెచ్చితి …” పారాయణ చేద్దామనే ఉద్దేశంతో, మీకు సబబు అనిపిస్తే దయచేసి ఆ పద్యాన్ని పోస్ట్ చేయగలరు. – సవినయముతో కుమార్.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి పుట్రేవు రామజోగారావు అభిప్రాయం:
01/15/2013 12:35 pm
చాలా మంచి వ్యాసం అందించారు. కరుణశ్రీ సాహిత్యం ,ఘంటసాల గారి సంగీతం గానం నెమరు వేసుకున్నాం. మీకూ అనేక ధన్యవాదాలు.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Krishna అభిప్రాయం:
01/12/2013 12:27 am
చాలా థాంక్స్. ఇంత మంచి వ్యాసానికి. ఘంటసాల గారు ఇంత అద్భుతముగా పాడి ఈ సాహిత్యానికి ఇంకా వన్నె తెచ్చారు.
నాకు నచ్చిన పద్యం: ఊయలూగే అమ్మాయిలు గురించి Krishna అభిప్రాయం:
01/12/2013 12:22 am
చాలా బాగుంది. ధన్యవాదాలు.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి sukumar kuruganti అభిప్రాయం:
01/11/2013 11:58 pm
Dear Lakshmanna garu,
I read the article that you wrote in eemaata about the poems written by ‘Karunasree’ and sung by Ghantasala.
It is good article and i certainly enjoyed reading it. Although i do not know even the basics of music, fortunately i developed an ear to appreciate music… i.e. essentially whatever is sonorous and melodious to the ear. thank you for writing and allowing us in to the nuances of music.
I wish Ghanatasala sang more of Karunasree poems. As a matter of fact i wish he sang the entire books of Udayasree. I also think the Ghantasala’s voice was at his best when he sang all these poems and it never had such quality in his later life.
If there are other singers who sang the poems of Papaiah sastry please do introduce them to us thru eemmata
with best wishes
sukumar kuruganti