పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి నాగ మురళీధర్ నామాల అభిప్రాయం:

    11/04/2013 2:08 pm

    జయహో గురూజీ

  2. అల బేల మరుల స్వామి గురించి Wahed అభిప్రాయం:

    11/04/2013 1:03 pm

    ఒక గొప్ప హిందూస్తానీ గీతాన్ని తెలుగులో అందించారు. కనకప్రసాద్ గారి సాహిత్యం, నచికేత్ యక్కుండి గారి గాత్రం చాలా కాంబినేషన్ చక్కగా కుదిరింది.చక్కిని పాట అందించినందుకు కృతజ్ఙతలు.
    వాహెద్

  3. అల బేల మరుల స్వామి గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    11/04/2013 12:13 pm

    పాట వీనుల విందుగా ఉన్నది.

    కనక ప్రసాద్ గారికి,నచికేత్ గారికి ధన్యవాదాలు.

    ఇంద్రాణి.

  4. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    11/04/2013 12:04 pm

    సాధారణమైన అంశాన్ని కూడా అసాధారణంగా చెప్పడం మీకే చెల్లింది.

  5. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి praveen guttula అభిప్రాయం:

    11/04/2013 11:44 am

    the post is as good as ever…

    బొటన వేలితో చిల్లు చేసి నెయ్యి నింపిన అరడజను బూరెలు….

    i guess you are referring to గారెలు here… 😀

  6. పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి jayaprabha అభిప్రాయం:

    11/04/2013 9:32 am

    ఈసారి ఎందుకో కొలిచాల కొంచెం సమర్ధించుకోవడం మీదనే శ్రధ్ధ పెట్టారు. నా జవాబుకి ఇది నిజంగా ఆయన జవాబు కాలేదు. అన్నమయ్య మీద మీరు రాసిన వాక్యాన్ని మరోసారి చూసుకుని నా ప్రశ్న ని పరిశీలించండి. పెద తిరుమలయ్య రేఫ మీద ఖచ్చితమైన నియమాలని పాటించాలని చెబుతూ ఒక పుస్తకమే రాశారు. కానీ ఆయన రచనలలోనే “ర” ఉండల్సిన చోట ” ఱ” ఇంకా అటుదిటూ ఉండటాన్ని పండితులు చూపించారు. అలా ఎందుకు జరుగుతుందీ? నియమాలు పాటించిన పెద తిరుమలయ్యంగారికి అది తెలియకనా? 🙂 ఇవాళ మనం మన అక్షరాలని పెన్నుతో రాసినట్టుగానో.. టైపు చేసినట్టుగానో మనకి మనం రాసే విషయాల మీద ఉన్న అదుపు లాంటిది ఆ కాలంలో ఆశువుగా వాగ్గేయాలన ఆలపించిన కవులకో లేదా లేఖకులకి ఆశువుగా పద్యాలని ప్రబంధాలు గా అల్లి చెప్పిన ఇతర కావ్య కవులకో ఉందా? అందుకూ ఒక విషయం చెప్పే ముందు రవ్వంత సందేహం అవసరం! ” ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల” ప్రస్తావన మరి ఊరికే చేశారా పెద్దన గారు? మనకి పాత లేఖన పధ్ధతుల చరిత్ర తెలుసేమో గానీ పుస్తకాలని రాసిన లేఖకుల చరిత్ర తెలియదు. వారి ” ఊహ” వారి ” పాండిత్యం ” తెలియవు. ఆ కాలంలో వాళ్లకున్న డిమాండు ఇంకా వారి ప్రతిభ వ్యుత్పత్తుల వివరాలూ వగైరాలేవీ తెలియవు. అందువలన ఇవాళ రాగి రేకుల లో ఉన్న ప్రతీ శబ్దాన్నీ వ్యాకరణ దోషాలనీ తప్పుల్నీ తిన్నగా తీసుకుని వెళ్ళి కవికి అంటగట్టడం అంత వీలు కాదు. ఇది నా దృక్పధం. అన్నమయ్య తనకాలం నాటి వ్యవహార భాషని వాడాడని మాత్రం చెప్పగలం. ఎక్కువగా దేశి పద ప్రయోగానికి ఇస్టం చూపించాడని ఆయన వాడిన తెనుగు ఆధారం గా మాట్లాడగలం! కాని ఆయన భాషలో ఆయనకి ఇవి తెలుసుననీ ఇవి తెలియవనీ మాత్రం చెప్పలేం! అలాగే ఆయన రాగిరేకుల లిపి లోంచి అవన్నీ అన్నమయ్య భాషే అని కూడా ఖచ్చితంగా తీర్మానించలేం! మిగిలిన వాటిమీద నా భావనలు ఇంకా పై అభిప్రాయం లోనివే, కొలిచాలా!

    జయప్రభ.

  7. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి Nagaraju Pappu అభిప్రాయం:

    11/04/2013 8:42 am

    వ్యాసం చాలా బావుంది. మీ వచనశైలి అద్భుతం. వ్యాసంలోని ముఖ్యమైన ప్రతిపాదననంతా ఒక్క పేరాలో క్లుప్తంగా చెప్పి ఈ వ్యాసానికి ఒక abstract రాశారు, ఆవిడ వ్యాఖ్యతో జయప్రభగారు. ఆ వ్యాఖ్య చదివాక, వ్యాసం చదివితే సులువుగా అర్థం అయింది.

    సంపాదకులకో మనవి – ఇటువంటి వ్యాసాలలో ఉదాహరించిన పద్యాలకి తాత్పర్యమో, వీలుంటే ప్రతిపదార్థమో అనుబంధంగానైనా ఉంచితే మాబోటి జానపదులు మీకెంతో ఋణపడి ఉంటారు 🙂

    I have a basic question about the methodology used – తెలియకే, సందేహ నివృత్తికోసమై అడుగుతున్నా..

    కవితని, అందులోనూ, ఒకటో/రెండో పద్యాలని తీసుకుని – వాటి రూపం, భావం, ప్రయోగంలో పరిణితి ఆధారంగా, అవి ఏ కవి రాసినవో, ఏ కాలానివో, వాటి బట్టి కర్రృత్వాన్ని నిర్ణయించడానికి కుదురుతుందా? అందులోనూ, ఈ పద్యాలు కథావస్తువుకి సంబంధంలేని వర్ణనలు.

    నా ఉద్ధేశం, ఫిలలాజికల్ అనాలిసిస్, హిస్టారికల్ లింగ్విస్టిక్స్ అవసరంలేకుండా, ఒక రచనతాలూకూ ఎన్నో రాత ప్రతులు, అవి ఎవరివి, ఏ ప్రాంతం నుంచీ వచ్చాయి మొదలైనవి పరిశీలించకుండా, కర్తృత్వ-కాల నిర్ణయాలు చెయ్యడానికి కుదురుతుందా? భాషలో వచ్చిన మార్పులు, భాషా ప్రయోగంలో వచ్చిన మార్పులు చారిత్రకంగా విశ్లేషించి, క్రోడికరించిన నిఘంటువులు తెలుగుకి ఉన్నాయా? అవిలేనిపక్షంలో ఇటువంటి పరిష్కరణలు చెయ్యడానికి కుదురుతుందా?

    ఈ వ్యాసంలో ప్రధానంగా ప్రస్తావించినవి కొన్ని కవిత్వ వర్ణనలు. ఏ కాలంలోనైనా, ఏ సంస్కృతిలోనైనా కొన్ని కవితాత్మకమైన ఊహలు ఏ ఒక్క కవికీ చెందినవి కావు, అవి మొత్తం కవికులానికి చెందినవి. ఠాగోర్ ఈ భావననే “స్ట్రే బర్డ్స్” అంటాడు. ఒకే ఊహ ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా ప్రయోగిస్తూఉంటారు – అది స్వతంత్రంగా గానీ, ఒక వర్ణనని చదివి, దాని ప్రేరణతో చేసినవి గానీ అయ్యుండవచ్చు. అది సర్వసాధారణమే కదా?

    ఒక అరవై, వంద పద్యాలు మూకమ్ముడిగా ఇద్దరు కవుల రచనలలో కనిపిస్తే అప్పుడు ఎవరు, ఎవరినుంచీ కాపీ కొట్టారో చెప్పగలగేమో. ఒకటి రెండు పద్యాల ఆధారంగా ఇటువంటి నిర్ణయాలు చెయ్యగలమా?

    ప్రాచీనమైన, సంప్రదాయమైన, మౌఖిక సంస్కృతులలోంచి వచ్చిన రచనలలో ఎన్నో స్తరాలు ఉంటాయని ఇప్పటి పరిశోధకులు అంటున్నారు కదా? సురేశ్ కొలిచాలగారు ఈ మధ్య భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఒక స్తరానికి చెందినవని ఒక పేపరు రాసారు. ఆయనేమంటారు?

    అదీగాకా, తెనాలి రామకృష్ణకవి పద్యమే మరో కవి కాపీకొట్టాడనుకుందాం – కాపీ కొట్టినవాడు ఆ పద్యాన్ని మరింత మెరుగులు పెడతాడు, అంతేకానీ ఒరిజినల్ లో లేని లోపాలు కావాలని ఎందుకు ప్రవేశపెడతాడు?

    కర్తృత్వానికి సంబంధించిన వాదన పక్కనపెడితే, మిగిలిన వ్యాసం అద్భుతంగా ఉంది – శృంగారతిలకంపై మీ వివరణలు భలే ఉన్నాయి.

  8. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి Rallapalli Sundaram అభిప్రాయం:

    11/04/2013 5:57 am

    మాన్యులైన ఏల్చూరి వారికి నమస్కారాలు.
    నన్నెచోడుని గురించిన మీ వ్యాసంలో మీ పరిశోధన లోతుల్ని మెచ్చుకొని తీరాల్సిందే. కాని అది నన్నెచోడుని కాలనిర్ణయానికి ఏ మాత్రం ఉపకరించదని చెప్పడానికి చింతిస్తున్నాను. నన్నెచోడుని అనుకరించి తెనాలి కవి రాశాడని మానవల్లి వారు చెప్తే తెనాలినే అనుకరించి చెత్త పద్యాన్ని కుమారసంభవ రచయిత తయారుచేశాడని మీరు, కొర్లపాటి వారు అంటున్నారు. మానవల్లి వారే ఒక చెత్త పద్యం రాసి, దాన్నే విమర్శించుకొని, రామకృష్ణుడు దాన్నే అనుకరించాడని నాటకం ఆడారని అర్థం వచ్చేట్లు రాయటంలో అంతరార్థం స్పష్టమవుతూనేఉంది. మానవల్లి వారిని పాత తాటాకుల దొంగగా నిరూపించటానికి కొన్ని వందల పుటలు వ్యర్థం చేసిన వారిని ఏమని ప్రతివిమర్శ చెయ్యాలి? ఒక్క పద్యం పట్టుకొని నన్నెచోడుని కవితాసామర్థ్యాన్ని విశ్లేషించటం చాలా బాగుంది. తంజావూరి ప్రతిని గురించి తిరుమల రామచంద్ర గారు రాసిన విలువైన మాటలన్నీ గాలికి పోయాయి. కుమారసంభవం లోని ప్రతి పద్యాన్ని, పదాన్ని చదివి మాకు పాఠం చెప్పిన దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారు నన్నెచోడుని అర్థం చేసుకోలేదనుకోవాలి. ఎవరు ఎవరిని అనుకరించారు, అనుసరించారు అనేందుకు ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి.కూట శాసనాలను నిర్ణయించేటప్పుడు లిపి పరిణామాన్ని ఆధారం చేసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ణయిస్తారు. కవుల కాలాదులు నిశ్చయంగా తెలిసినప్పుడు పరస్పర ప్రభావాలను నిర్ణయించాలి. ఒకటి రెండు ఉదాహరణలు: అరుద్ర గారు కందం తెలుగు వారి సృష్టి అని రాసినందుకు వారికి కన్నడంతో గాని, ప్రాకృతంతో గాని పరిచయం లేని విషయాన్ని సూచించి రాళ్ళపల్లి వారు పీఠికలో చురక వేశారు. అలాగే నక్షత్రకుణ్ణి తెలుగు వారే సృష్టించారని ఆరుద్ర రాశారు, కాని అంతకంటే ముందే రాఘవాంకుడు కన్నడంలో ఆ పాత్రను ప్రవేశపెట్టాడు. కాని ఈ రెండింటికి మూలం 10వ శతాబ్దికి చెందిన చండకౌశికమనే నాటకంలో ఉందని మరో పండితుడు వెలికి తీశాడు. కుమారసంభవం విషయంలో చాలాసార్లు కొర్లపాటి వారు నాతో చర్చించారు. 12వ శతాబ్దికి తర్వాతి విషయం (భాషాశాస్త్రానికి, వృక్షశాస్త్రానికి,అలంకారశాస్త్రానికి సంబంధించినవి) మానవల్లి వారు గమనించక పొందుపరిచారని నిర్ద్వందంగా నిరూపించగలిగితే మీ వాదం నిలుస్తుందని చెప్పేవాణ్ణి. నన్నెచోడుడు వాడిన ప్రతి పదాన్నీ గమనించి అది 12వ శతాబ్దానిదే అని తేల్చిన ఎల్. బి.శంకరరావు గారి సిద్ధాంత గ్రంథం,మహనీయులు నేలటూరివారు నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని నమ్మిన అభిప్రాయం పూర్తిగా నిరాధారాలని నేననుకోను. పంప (10వ శ.) ప్రబంధం రాశాడని తెలియక నన్నెచోడుని తెలుగు ప్రబంధ కవులకు దగ్గరగా తీసుకు వచ్చిన వేదం వారి వాదాన్ని అంగీకరించడం కుదరదు.

    ఒక అభిప్రాయాన్ని ముందే ఏర్పరుచుకొని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు అందరికీ నచ్చవు. కాలం విషయం వదిలేస్తే వ్యాసంలో చాలా విషయాలను సేకరించడం జరిగిందని ఒప్పుకోవచ్చు.
    రాళ్ళపల్లి సుందరం

  9. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి Rajkumar అభిప్రాయం:

    11/04/2013 5:50 am

    ఎప్పటి లాగే కేకో కేక గురువు గారో…

    సూపర్..

  10. పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    11/04/2013 5:24 am

    జయప్రభ గారు,

    ప్రతి భాషకు తనదైన వర్ణనిర్మాణం ఉంటుంది. పామరజనం పలికే ధ్వనులలోనూ ఒక రకమైన శాస్త్రనిబద్ధత కనిపిస్తుంది. ఎంత చదువురాని వాడైనా, తెలుగుదేశంలో వ-కారాన్ని బ-కారంగా పలకరు, వంగ దేశస్థులు రవి- అన్న పేరును రబి అని పలికినట్టుగా. యూరప్ దేశస్థులు ఎంత చదువుకున్న వారైనా /త/-కారానికి /ట/-కారానికి తేడా చెప్పలేరు. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ త-కార, ట-కారాలకు తేడా తెలుసు. ఉత్తర భారతదేశంలో ఎ-కార, ఒ-కారాలలో హ్రస్వ, దీర్ఘ వర్ణాలకు తేడా లేదు. తెలుగుదేశంలో ఎంత చదువురాని వారికైనా కొన- కోన- అన్న పదాలలో తేడా ఇట్టే పసిగడతారు. నిజానికి ర-వర్ణానికి, ఱ-వర్ణానికి తేడా సంస్కృతం నేర్చుకొన్న పండితులకంటే, చదువురాని పామరులే చక్కగా పాటిస్తారు. ఇప్పటికీ అరకులోయలోని కొండ భాష మాట్లాడే వారు ఱ- వర్ణాన్ని మూలద్రావిడంలో ఉన్నట్టుగా శాస్త్రీయులు ఊహించే దంతమూలీయ స్పర్శంగా పలుకుతారని మీకు తెలియంది కాదు. అమెరికాలో, యూరప్ దేశాల్లో ఎంత చదువు రానివాడైనా ఇట్టే పసిగట్టగలిగే /v/- /w/ వర్ణాల మధ్య తేడా, భారతదేశంలో ఎంత పండితుడైనా సరిగా గుర్తించలేడు.

    ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్నది శ-, ష-, స- అన్నవి మూడు విభిన్నమైన వర్ణాలుగా ఏ భారతీయ దేశ భాషల వర్ణనిర్మాణంలో స్థిరపడలేదన్న విషయం.

    ఇక అన్నమయ్య /ష/-కార, /శ/-కారాలను /స/-కారంగా పరిగణించాడా లేదా అన్న విషయంలో ఆయన రాగిరేకులల్లోనే మనకు కొన్ని బలమైన ఆధారాలు దొరుకుతాయి. ఆయన ష-కారం ఉన్న దోషము అన్న పదాన్ని ప్రాసాక్షరంగా వాడిన 11వ సంపుటిలోని 456వ కీర్తనను చూడండి:
    (Copper Sheet No. 376)

    దోసము దోసము దొర నే మనినా
    యీసు లేని విభుఁ డిచ్చకుఁ డతఁడూ

    ఇక్కడ కనిపించే దోసము వ్రాయసకాండ్ర దోసమేనా?

    అలాగే, “దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ” అన్న పాటలో ఈ చరణం చూడండి.

    ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు
    వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు
    వేసట యెక్కడ నుండు వీత రాగ మాడనుండు
    యీసుల నీ లంకె వాప నెవ్వరికిఁ దరము ॥ దైవమే ॥

    ఇక్కడ ఆస “ఆశ” అన్న పదాన్ని వాసులు, వేసట, ఈసులు అన్న పదాలతో ప్రాస కలపడం అన్నమయ్య కల్పన కాదంటారా?