జ్ఞానంపై పాశ్చాత్యుల గుత్తాధిపత్యాన్ని మనం ఎదురుకొనగలిగేంతగా మనం జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడే వారి జ్ఞానాన్నీ, అధికారాన్నీ ప్రతిఘటించగలం”
సురేశ్ కొలిచాలా! ఈ వాక్యం తో మీరు మీ సమకాలం లో ఉన్న ఈ దేశం లోని మేధావులని మొత్తంగా జ్ఞాన శూన్యులుగా చేయడం లేదా? ‘మనం’ అన్న మాటని వాడి మీ నమ్మకాలని మీరు ఇటువంటి వాక్యాల ద్వారా ఇతరులందరి నమ్మకాలుగా ప్రకటించకండి. మీ అభిప్రాయాలలో మీ చాదస్తాన్ని మీరూ ప్రకటించుకున్నట్టే అవుతుంది ఇలా రాస్తే!
ఇతర విషయాల కంటే మీరుదహరించిన భగవద్గీత శ్లోకాలపై వివరణ ఇవ్వదల్చాను.
//భగవద్గీతలోనూ వేదవిద్యలను, కర్మకాండను నిరసిస్తూ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధి చెందిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అన్న శ్లోకానికి ముందున్న నాలుగు శ్లోకాలు, వేదాలలో ఉన్న జ్ఞానం పైపైన ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నా అది త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందిందని, ఆత్మజ్ఞానానికి పనికిరాదని ఖరాఖండిగా చెబుతున్నాయి.//
మీరు చెప్పిందే గనుక కృష్ణుడి ఉద్దేశ్యమైతే ఇక వేదాలకు విలువేమిటి? వేదవేత్తల అస్తిత్వమెక్కడ? వేదాలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞానం అన్నది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కనుక కృష్ణుని పై మాటలకు అసలైన అర్థాలను తెలుసుకోవాలి.
త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్య వ్రాసిన గీతాభాష్యం ఆధారంగా మీరుదహరించిన శ్లోకాలకు యథామతి వివరణనిస్తున్నాను.
//సురేశ్ వ్రాసినదిః పార్థా: అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు (వేద-వాద-రతాః) ఇంతకు మించింది వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.//
మధ్వాచార్య భాష్యంః
“ముక్తిని పొందడమనేది ’ఫల’మైతే స్వర్గాది భోగాలు పువ్వులవంటివి (పుష్పితాం). కేవలం వేద శబ్దాలను (వాచాం) మాత్రమే వల్లించేవారు కర్మలను, వాటి వల్ల లభించే సుఖాలను మాత్రమే తెలుసుకుంటారు. అలాకాక, ఎవరు వేదాలలోని అర్థాలను తెలుసుకొని మాట్లాడుతారో (వేదవాదరతాః) వారు ఫలం (ముక్తి) పట్లనే ఆసక్తి కలిగివుంటారు గాని పువ్వుల (కర్మజన్యువులైన స్వర్గాది సుఖాలు) పట్ల ఆదరం చూపరు.”
కామాత్మానః స్వర్గ-పరా జన్మ-కర్మ-ఫల-ప్రదాం
క్రియా-విశేష-బహులాం భోగైశ్వర్య-గతిం ప్రతి (2.43)
//సురేశ్ వ్రాసినదిః కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.//
మధ్వాచార్య భాష్యం: సుఖం, సంపత్తు (భోగైశ్వర్య) మొదలైన వాటిపైనే మనసు పెట్టిన వారు (కామాత్మానః) వాటిని ప్రసాదించే కర్మలందే ఆసక్తి కలిగినవారవుతారు. తద్వారా మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ చివరకు అనగా మహాప్రళయానంతరం అంధఃతమస్సును (గతిం) పొందుతారు (ప్రతి).
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ (2-44)\
//సురేశ్ వ్రాసినదిః భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు.//
రఘుః పై పేర్కొన్న మధ్వభాష్యంలోనే ఈ శ్లోకాన్ని కూడా చేర్చడమైంది కనుక ప్రత్యేకంగా వ్యాఖ్యానించలేదు.
//సురేశ్ వ్రాసినదిః అంతటా జలం పొంగుతున్నప్పుడు బావి యొక్క ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.//
మధ్వాచార్య భాష్యం: బావి (ఉదప)లోని నీటి యొక్క ఉపయోగం, చుట్టూ విస్తారంగా నిండివున్న నీటి (సంప్లుత+ఉదక) ఉపయోగంతో ఎలా పోల్చవచ్చునో (యావన్ + అర్థ) అదేవిధంగా వేదాలలో (బాహ్యార్థంలో) తెలుపబడ్డ త్రిగుణాత్మకాలైన కర్మల్ని, సుఖాల్ని వేదవిదులు కూడా పొందుతారు. (అంటే వేదవిదులు ఆ సుఖాల కొరకు ప్రత్యేకంగా ప్రయత్నించరు అని అర్థం)
—–
ద్వితీయాధ్యాయారంభంలో కృష్ణుడు “ప్రజ్ఞావాదాంశ్చ భాషసే” అంటాడు. బుద్ధికి తోచినట్టుగా మాట్లాడ్డమే ’ప్రజ్ఞావాదం.’ ఇది నిజానికి ప్రజ్ఞ+అవాదం అన్న సంధితో వచ్చింది. ప్రజ్ఞ అంటే వేదవిహితమైన లేక శాస్త్రవిహితమైన ఆలోచన. దానికి విరుద్ధమైనది (అవైదికమైన/అశాస్త్రీయమైన) అవాద ప్రజ్ఞ.
గీతకు విరుద్ధమైన వ్యాఖ్యానాలను చేస్తే అది కూడా ’ప్రజ్ఞావాద’మే అవుతుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు అభిప్రాయం:
03/03/2014 8:03 am
రాజుగారు, నేను వెండీని ఎద్దేవా చేయలేదండి. ఆవిడ సంస్కృత ప్రయోగాల్ని ప్రశ్నించానంతే. ఎద్దేవా చేయాలంటే అది మరో వెండీ విషవృక్షం కాగలదు ః)
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:
03/03/2014 6:47 am
రఘోత్తమరావుగారు ఈ మధ్యన ఫెస్ బుక్ లో వెన్డీ కి సంస్కృత భాషపై ఉన్న జ్ఞానాన్ని ఎద్దేవా చెస్తూ చక్కని వ్యాసాలు వ్రాశారు. చదువ గలరు
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి జయప్రభ అభిప్రాయం:
03/03/2014 6:18 am
సురేశ్ కొలిచాలా! ఈ వాక్యం తో మీరు మీ సమకాలం లో ఉన్న ఈ దేశం లోని మేధావులని మొత్తంగా జ్ఞాన శూన్యులుగా చేయడం లేదా? ‘మనం’ అన్న మాటని వాడి మీ నమ్మకాలని మీరు ఇటువంటి వాక్యాల ద్వారా ఇతరులందరి నమ్మకాలుగా ప్రకటించకండి. మీ అభిప్రాయాలలో మీ చాదస్తాన్ని మీరూ ప్రకటించుకున్నట్టే అవుతుంది ఇలా రాస్తే!
జయప్రభ.
కృషితో దుర్భిక్షం గురించి బాబురావు అభిప్రాయం:
03/03/2014 5:41 am
వార్తాకమ్ తత్ర వార్తా అన్నారు పెద్దలు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు అభిప్రాయం:
03/03/2014 4:04 am
సురేశ్ గారు,
ఇతర విషయాల కంటే మీరుదహరించిన భగవద్గీత శ్లోకాలపై వివరణ ఇవ్వదల్చాను.
//భగవద్గీతలోనూ వేదవిద్యలను, కర్మకాండను నిరసిస్తూ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధి చెందిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అన్న శ్లోకానికి ముందున్న నాలుగు శ్లోకాలు, వేదాలలో ఉన్న జ్ఞానం పైపైన ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నా అది త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందిందని, ఆత్మజ్ఞానానికి పనికిరాదని ఖరాఖండిగా చెబుతున్నాయి.//
మీరు చెప్పిందే గనుక కృష్ణుడి ఉద్దేశ్యమైతే ఇక వేదాలకు విలువేమిటి? వేదవేత్తల అస్తిత్వమెక్కడ? వేదాలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞానం అన్నది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కనుక కృష్ణుని పై మాటలకు అసలైన అర్థాలను తెలుసుకోవాలి.
త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్య వ్రాసిన గీతాభాష్యం ఆధారంగా మీరుదహరించిన శ్లోకాలకు యథామతి వివరణనిస్తున్నాను.
యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః
వేద-వాద-రతాః పార్థ నాన్యదస్తీతి వాదినః (2.42)
//సురేశ్ వ్రాసినదిః పార్థా: అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు (వేద-వాద-రతాః) ఇంతకు మించింది వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.//
మధ్వాచార్య భాష్యంః
“ముక్తిని పొందడమనేది ’ఫల’మైతే స్వర్గాది భోగాలు పువ్వులవంటివి (పుష్పితాం). కేవలం వేద శబ్దాలను (వాచాం) మాత్రమే వల్లించేవారు కర్మలను, వాటి వల్ల లభించే సుఖాలను మాత్రమే తెలుసుకుంటారు. అలాకాక, ఎవరు వేదాలలోని అర్థాలను తెలుసుకొని మాట్లాడుతారో (వేదవాదరతాః) వారు ఫలం (ముక్తి) పట్లనే ఆసక్తి కలిగివుంటారు గాని పువ్వుల (కర్మజన్యువులైన స్వర్గాది సుఖాలు) పట్ల ఆదరం చూపరు.”
కామాత్మానః స్వర్గ-పరా జన్మ-కర్మ-ఫల-ప్రదాం
క్రియా-విశేష-బహులాం భోగైశ్వర్య-గతిం ప్రతి (2.43)
//సురేశ్ వ్రాసినదిః కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.//
మధ్వాచార్య భాష్యం: సుఖం, సంపత్తు (భోగైశ్వర్య) మొదలైన వాటిపైనే మనసు పెట్టిన వారు (కామాత్మానః) వాటిని ప్రసాదించే కర్మలందే ఆసక్తి కలిగినవారవుతారు. తద్వారా మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ చివరకు అనగా మహాప్రళయానంతరం అంధఃతమస్సును (గతిం) పొందుతారు (ప్రతి).
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ (2-44)\
//సురేశ్ వ్రాసినదిః భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు.//
రఘుః పై పేర్కొన్న మధ్వభాష్యంలోనే ఈ శ్లోకాన్ని కూడా చేర్చడమైంది కనుక ప్రత్యేకంగా వ్యాఖ్యానించలేదు.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)
//సురేశ్ వ్రాసినదిః అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు వాటికి అతీతుడవై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యము శుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను వర్జించి ఆత్మజ్ఞానివి కమ్ము.//
మధ్వాచార్య భాష్యం: త్రిగుణాత్మకమైన (అన్ని) విషయాలను తెలిపేవే వేదాలు. (అంటే వేదాలు త్రిగుణాత్మకాలు కావని, కేవలం సంసారానికి మాత్రమే చెందినవి కావని అర్థం). బాహ్యదృష్టికి వేదాలు త్రిగుణాత్మకమైన కర్మల్ని, సుఖాలను చెబుతున్నట్టు కనిపించినా “పరోక్షవాది వేదానాం” అన్న వాక్కును అనుసరించి బాహ్యమైన వేదార్థాలను మాత్రమే తెలుసుకోకు. ఓ అర్జునా! వేదాలలోని త్రిగుణబాధితాలైన బాహ్యవిషయాలు విషం వంటివి కనుక వాటిని విడిచిపెట్టు (నిస్త్రైగుణ్యో భవ). వేదాలలోని అంతరార్థమైన, త్రైగుణ్యవిషహారిణియైన పరమాత్మతత్వాన్ని (కృష్ణతత్వం) తెలుసుకో. అప్పుడు నువ్వు ఆ పరమాత్మతో అనుసంధానింపబడగలవు, శుద్ధసాత్వికుడవు కాగలవు. విరుద్ధ యోగాల నుండి విముక్తుడవై క్షేమంగా ఉండగలవు. (నిర్ద్వంద్వ – నిత్యసత్వస్థ – నిర్యోగ – క్షేమ),
యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥ (2-46)
//సురేశ్ వ్రాసినదిః అంతటా జలం పొంగుతున్నప్పుడు బావి యొక్క ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.//
మధ్వాచార్య భాష్యం: బావి (ఉదప)లోని నీటి యొక్క ఉపయోగం, చుట్టూ విస్తారంగా నిండివున్న నీటి (సంప్లుత+ఉదక) ఉపయోగంతో ఎలా పోల్చవచ్చునో (యావన్ + అర్థ) అదేవిధంగా వేదాలలో (బాహ్యార్థంలో) తెలుపబడ్డ త్రిగుణాత్మకాలైన కర్మల్ని, సుఖాల్ని వేదవిదులు కూడా పొందుతారు. (అంటే వేదవిదులు ఆ సుఖాల కొరకు ప్రత్యేకంగా ప్రయత్నించరు అని అర్థం)
—–
ద్వితీయాధ్యాయారంభంలో కృష్ణుడు “ప్రజ్ఞావాదాంశ్చ భాషసే” అంటాడు. బుద్ధికి తోచినట్టుగా మాట్లాడ్డమే ’ప్రజ్ఞావాదం.’ ఇది నిజానికి ప్రజ్ఞ+అవాదం అన్న సంధితో వచ్చింది. ప్రజ్ఞ అంటే వేదవిహితమైన లేక శాస్త్రవిహితమైన ఆలోచన. దానికి విరుద్ధమైనది (అవైదికమైన/అశాస్త్రీయమైన) అవాద ప్రజ్ఞ.
గీతకు విరుద్ధమైన వ్యాఖ్యానాలను చేస్తే అది కూడా ’ప్రజ్ఞావాద’మే అవుతుంది.
గౌతమి గురించి వారణాసి నాగలక్ష్మి అభిప్రాయం:
03/03/2014 2:49 am
చాలా హృద్యంగా ఉందండీ రాధ గారూ !కౌమారం లో కొంతమంది ఆడపిల్లల మనస్థితిని ఎంతో బాగా చిత్రించారు. అభినందనలు!
గౌతమి గురించి రాధ మండువ అభిప్రాయం:
03/03/2014 2:04 am
వనజ గారూ, మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్ యు
ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద గురించి రాధ మండువ అభిప్రాయం:
03/03/2014 2:02 am
ప్రతి వాక్యమూ ఒక కథే. త్రిపుర గారి శిల్పం. కామెంట్ చేయాలంటే ఏమీ ఉండదు. జస్ట్ చదవుకోవాలంతే.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రామారావు కన్నెగంటి అభిప్రాయం:
03/03/2014 1:03 am
రెండు సూచనలు –
౧. యూదు ప్రభుత్వం కాదు క్రీస్తుకి సిలువ వేసింది – పిలాతు గారి కోర్టు. అంటే, రోమన్ ప్రభుత్వం అనుకోవాలి (యూదుల మత గ్రూప్ వారు కూడా ఆ కోర్ట్ లో భాగమే).
౨. దక్షిణ అమెరికా కంటే దక్షిణ రాష్త్రాలు అంటే పోతుందేమో!
వ్యాసం బాగుంది — నిన్నటి నుంచీ ఎదురు చూస్తున్నాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Kumar N అభిప్రాయం:
03/03/2014 12:50 am
Thank you. Very educative for me.