పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Rao Vemuri అభిప్రాయం:

    03/03/2014 6:16 pm

    సురేశ్‌ చాల శ్రమ పడి, పరిశోధన చేసి ఈ వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసం చదివిన తరువాత నాకు చిన్న అనుమానం వస్తోంది. వెండీ డానిగర్‌ హిందువు కాదు కనుక ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయా మనవాళ్లకి? ఒక క్రైస్తవేతరుడు ఇదే రకం పుస్తకం క్రైస్తవమతం మీద కాని, ఇస్లాం మతానికి చెందని వ్యక్తి ఇదే రకం పుస్తకాన్ని ఇస్లాం మీద కాని రాస్తే ఆయా మతాల వారి ప్రతిస్పందన ఎలాగుంటుందో? మన పిల్లలని మనం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం కాని అదే పని పరాయి వాళ్లు చేస్తే చాంతాడంత కోపం వస్తుంది. – వేమూరి.

  2. పాఠకులకు సూచనలు గురించి Narasimha అభిప్రాయం:

    03/03/2014 5:28 pm

    I read some stories from this website frequently. Please let everyone know if there is a possibility of downloading the the complete edition, so that we can read anytime we want to.

    Thanks

    [We do not have a complete pdf of each issue for downloading yet. Inconvenience is regretted – Ed.]

  3. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు అభిప్రాయం:

    03/03/2014 3:04 pm

    సురేశ్ గారు,

    ప్రజ్ఞ పుంలింగం కానప్పుడు స్త్రీలింగం కూడా కాకూడదు. నపుంసకం అసలే కానోపదు (ఇది హాస్యానికే సుమండి!)

    మేదినీ కోశం ప్రకారం ప్రజ్ఞః అన్నది త్రిలింగ పదము అంటే పురుష, స్త్రీ, నపుంసకాల్లో వాడొచ్చు.

    “ప్రజ్ఞస్తు పండితే వాచ్యలింగో” అన్న వ్యాఖ్యానం మేరకు ప్రజ్ఞను పండితుడు అన్న అర్థంలో వాడినప్పుడు పుంలింగంగాను, “బుద్ధౌ చ యోషితి” మేరకు బుద్ధి అన్న అర్థంలో వాడినప్పుడు స్త్రీలింగంగాను పరిగణించాలని మేదినీకరుని ఉవాచ.

    మధ్వాచార్యులు “ప్రజ్ఞస్తు పండితః” అన్న పుంలింగానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజ్ఞ+అవాద = ప్రజ్ఞావాద అని వ్యాఖ్యానించారు. అర్జునుడు పుం కాబట్టి ప్రజ్ఞ అన్నది కూడా పుం గానే వాడారు. ఆవిధంగా ’ప్రజ్ఞా’గా కాకుండా ప్రజ్ఞ అని హ్రస్వాంతం చేస్తే సవర్ణదీర్ఘసంధి సూత్రం సక్రమంగానే కుదురడమే గాక గీతాచార్యుని ఆంతర్యం కూడా అవగతమవుతుందని మధ్వోవాచ!

    మీరన్నట్టు స్త్రీలింగార్థంలో వాడితే ప్రజ్ఞావాదాన్ని బుద్ధివాదంగా పరిగణించాలి. అప్పుడు ప్రకర్షేణ జానాతి ఇతి ప్రజ్ఞాః అన్న అర్థం కుదరదు. ఎందుకంటే మానవ బుద్ధికి తోచినదల్లా శాస్త్రసమ్మతం కాబోదు. ఈ విషయాన్ని (స్త్రీలింగ ప్రజ్ఞను)కూడా ప్రస్తావిస్తూ మధ్వాచార్యులు “అర్జునా! బుద్ధి (కి తోచిన)వాదాన్ని చేస్తున్నావు (భాషసే) కానీ అది పండితుడు చేయవలసినది కాదు (నాను శోచంతి పండితాః)” అని కృష్ణుడు ఉపదేశించాడని వ్యాఖ్యానించారు.

    ఇక ప్రజ్ఞా ప్రతిష్ఠితా గురించి – సంస్కృత మూలంలో ఈ రెండు పదాల్ని కలపకుండా విడివిడిగా వ్రాయడం వల్ల “ప్రజ్ఞావాద”లా కలపడానికి, సంధి చేయడానికి అవకాశం లేదు. మీరు కూడా రెండింటిని విడిగానే వ్రాశారు! ఇక్కడ మళ్ళీ మేదినీకోశార్థాన్ని వాడుతూ ’ప్రజ్ఞ’ను పుంలింగంగాను ’ప్రతిష్ఠితా’ను విశేషణంగాను వాడితే రెండవ పదం ముందరి పదానికి బలం చేకూరుస్తుంది. ఆ విధంగా ప్రజ్ఞ, ప్రతిష్ఠితా అన్నవి రెండు వేరు వేరు పదాలుగా వాడబడడం వల్ల ఎటువంటి సంధి, విసంధులకి అవకాశం లేదు.

  4. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి జయప్రభ అభిప్రాయం:

    03/03/2014 2:14 pm

    కొలిచాలా! మీ వాక్యాన్ని మరోసారి చదివి చూసుకోండి. గుక్కతిప్పుకోకుండా రాయాలన్న ప్రయత్నంలో ఒకటే తత్తర పడ్డట్టు లేదూ :)? ఏదైతేనే మీ జవాబు నాలో ఏ కాస్త ఆసక్తినీ కలిగించలేదు.

    జయప్రభ.

  5. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/03/2014 1:54 pm

    తాడిగడప శ్యామలరావుగారు: మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. “త్రైగుణ్యవిషయా వేదా” అన్నప్పుడు వేద శబ్దానికి చతుర్వేదాలను అరోపించటం సబబు కాకపోవచ్చన్నారు. మరైతే, చతుర్వేదాలను పేర్లతో సహా ప్రస్తావించి వాటిని అపరా విద్యలుగా వర్ణించిన ముందకోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తులలో శ్లోకాల గురించి మీ అభిప్రాయం చెప్పగలరా?

    రఘూత్తమరావు గారు: ప్రజ్ఞ అన్నది ఇక్కడ పుంలింగం కాదన్నది సుస్పష్టం. ఇదే అధ్యాయంలో తరువాత వచ్చే ఈ కింది శ్లోకాల్లో ప్రజ్ఞాప్రతిష్ఠితా = ప్రజ్ఞ + అప్రతిష్ఠితా కావడానికి వీల్లేదు కదా!

    యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్।
    నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 2-57 ॥

    యదా సంహరతే చాయం కూర్మోऽఙ్గానీవ సర్వశః ।
    ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥ 2-58 ॥

    తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।
    వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥2-61 ॥

  6. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు అభిప్రాయం:

    03/03/2014 12:49 pm

    +రఘూత్తమరావు గారు:మధ్వాచార్యుల వారు భగవద్గీత వేదాలను విమర్శించలేదని చెప్పడానికి ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో మీకే అర్థమవుతుంది. దీని గురించి విపులంగా వీలు చూసుకొని రాస్తాను.

    సురేశ్ గారు,

    మల్లాగుల్లాల గురించి – మధ్వాచార్యుల్లో గానీ ఇతర ప్రాచీనాచార్యుల్లోగానీ తప్పుల్ని ఎంచగలిగే తెలివి నాకు లేదండి. అందువల్ల సదరు మల్లాగుల్లాలన్నీ నా తెలుగు అనువాదం వల్లనేనని మనవి చేసుకొంటున్నాను. కాదు అవన్నీ మధ్వాచార్యుల వారి మల్లాగుల్లాలే అని మీరు నిశ్చయించివుంటే మీరు వ్రాయబోయే వ్యాసాన్ని తప్పక చదవాల్సిందే. ఆ వెలుగులో మధ్వ భాష్యాన్ని మరోమారు చదువుకొంటాను.

    ఇక ప్రజ్ఞావాదం గురించి వారి మాటల్లోనే “प्रकर्षॆण जानन्ति इति प्रज्ञाः । तदावाद प्रज्ञावादः प्रज्ञमतविरुद्धवदं वदसि । कथम्? – गतासून् ।”. గతాసూన్ అన్న పదాన్ని ఎలా గత+అసూన్ అని విడదీసి చదువుతామో (గత సున్ అని చదవమో) అలానే ప్రజ్ఞ+అవాద గా చదవి చూడమని చెప్పారు. ప్రజ్ఞ అన్నది పుంలింగం గనుక ప్రజ్ఞ+అవాద = ప్రజ్ఞావాద అన్నది దుష్టసంధి కాదని నా అభిప్రాయం. లేదూ ప్రజ్ఞా అన్న స్త్రీలింగంతోనే ప్రయత్నిస్తే ప్రజ్ఞా సంబంధిత అవాదః అని సమాసం చేసి దాన్నుండి ప్రజ్ఞావాద అన్న సంధిని చేయవచ్చు అని నా బుద్ధికి తోస్తోంది. అని ఐతే ప్రజ్ఞావాద పదాన్ని “చక్కటి వాదం” అన్న అర్థంలో కాక విరుద్ధార్థంలోనే ఎందుకు చదవాలన్నదే అసలు విషయం.

    అర్జునుడు పోయినవాళ్ళ గురించి, ఉన్నవాళ్ళ గురించి బాధపడుతూ శాస్త్రవిరుద్ధమైన మాటల్ని మాట్లాడాడు కనుక అర్జునుడిది అశాస్త్రీయమైన వాదమని గీతాచార్యుని భావమని మధ్వ వ్యాఖ్యానం. దీనికి పూరకమేది? అని అంటే “కార్పణ్యదోషోపహతస్వభావః ప్రుచ్హామిత్వాం ధర్మసమ్మూఢచేతాః” అన్న అర్జునుని మాటలే. ధర్మసమ్మూఢుడైనాడు గనుకనే అధార్మికమైన “ప్రజ్ఞావాద”నను చేశాడు అర్జునుడు.

  7. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/03/2014 12:01 pm

    నిస్సందేహంగా ఇది ఒక మంచి వ్యాసం.

    అలాగే కొందరు కొన్ని మంచి సందేహాలనూ లేవనెత్తారు.

    భగవద్గీత ప్రస్తావనకు వచ్చింది. భగవద్గీతకు ఇప్పటికే లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. అలా వస్తూనే ఉంటాయి రానున్నకాలంలో‌ కూడా.

    నేను ‘త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున’ అన్న దాన్ని వ్యాఖ్యానించగల పాండిత్యం‌కలవాడిని కాను. కాని గీతలో ఇక్కడ ‘వేదా’ అని చెప్పబడినది లౌకికమైన విషయజ్ఞానం గురించి. అది త్రిగుణాత్మకమైన సృష్టిని ఎరుకపరచేది మాత్రమే అనీ, నిస్త్రైగుణ్యుడవు కమ్మని భగవానువాచలోని అంతరార్థం బహుశః త్రిగుణాత్మకమైన ప్రకృతికి అతీతమైన స్థితినిని సంపాదించమనీ చెప్పటం అనీ అనుకుంటున్నాను. నామరూపాత్మకమైనది ప్రకృతి. నామరూపాలు లేకపోతే సృష్టి లేనే లేదు. నామరూపాలచేత తెలియబడే ప్రతిదానికి దాని అభావం కూడా అలాగే తెలియబడటం చేత సమస్తద్వంద్వాలూ ఎరుకలోనికి వస్తున్నాయి. ప్రకృతిని అధిగమించినప్పుడు నామరూపాలూ అధిగమించబడి సమస్తద్వంద్వాలకూ ఉనికి ఉండని ఆ స్థితిలో శుధ్ధసత్త్వం‌ మాత్రమే ఉంటుంది. అందుచేత త్రిగుణాత్మకమైన ప్రకృతినీ దానివలన కలిగే ద్వంద్వాలనీ (వాటిలో సుఖదుఃఖాదులూ ఉన్నాయి) అధిగమించి కేవలం ఆత్మగా సుప్రతిష్ఠితుడవు కమ్మని భగవానుడి అభిప్రాయం. ఇది నా అవగాహన. దీనితో‌ పండితులు ఏకీభవిస్తారో లేదో‌ తెలియదు కాని ముఖ్యంగా ఈ‌లాంటి శ్లోకాలలో వేద శబ్దం రాగానే చతుర్వేదాలకు ఆ శబ్దాన్ని అరోపించటం అన్నిసందర్భాలలోనూ సబబు కాకపోవచ్చునని చెప్పటమే నా వ్యాఖ్య ఉద్దేశం.

    మన ప్రాచీన గ్రంధాల్లో శృంగారం గురించి వ్యాసకర్త అభిప్రాయం సమర్థనీయమే. మాటవరసకు జయదేవుడి అష్టపదులకు ఈ రోజున తెలుగుచేస్తే అవి బూతులే అనిపించుకొనే అవకాశం మెండు. అదేదో గుడిలో నగ్నపార్వతి శిల్పం ఉన్నదొక ఆలయస్తంభం పైన.

    మరొక అభిప్రాయం వ్యాసకర్తది కూడా సమర్థనీయమే. ఈ‌నాడు మన మతగ్రంథాల గురించి ఇతరులు వ్రాస్తే ఆమోదాక్షేపణాదులు చెప్పటం అటుంచి వాటిపైన సాధికారంగా సమ్యక్దృక్పధంతో వ్యాఖ్యానించగల వారెందరు?

  8. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/03/2014 11:10 am

    +రామారావు కన్నెగంటి: మీ సూచనలకు కృతజ్ఞతలు. ఆ వాక్యం సరిచేశాను.

    +రఘూత్తమరావు గారు: మధ్వాచార్యుల వారు భగవద్గీత వేదాలను విమర్శించలేదని చెప్పడానికి ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో మీకే అర్థమవుతుంది. దీని గురించి విపులంగా వీలు చూసుకొని రాస్తాను.

    ప్రజ్ఞావాదం అన్నది ప్రజ్ఞ+అవాదం అన్న సంధితో వచ్చింది కాదు. ప్రజ్ఞా అన్నది స్త్రీ లింగం కాబట్టి దీర్ఘాంతంగానే రాయాలి. ఒకవేళ ప్రజ్ఞా+అవాదం అన్న సంధి చేయవలసి వస్తే ప్రజ్ఞాఽవాదమని రాస్తారండి. ప్రజ్ఞాఽవాదాంశ్చ అని అవగ్రహతో (ఽ) ఆ శ్లోకాన్ని నేనెక్కడా చూడలేదు.

    +జయప్రభ గారు: నేనన్నది Foucault చెప్పిన జ్ఞానం-అధికారం గురించి. విశ్వవిద్యాలయాల మేధో ప్రపంచంలో (Academic World) గౌరవాన్ని పొందగలిగే భారతీయ మేధావులను తయారు చేసుకోగలిగినప్పుడే మనం మన భారతీయతను, భారతదేశ ఘన సంప్రదాయాలను కాపాడుకున్నట్లు అవుతుందని చెప్పడమే నా చాదస్తం.

  9. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:

    03/03/2014 10:54 am

    దురదృష్టవశాత్తు శన్కరులను, రామానుజులను అధ్యయనం చేసినట్లు మధ్వాచార్యులను చాల మన్ది అధ్యయనం చేయలేదు. వాస్తవిక ఆస్తికత కేవలం బ్రహ్మమ్ లో ఎలా సమస్త వాంగ్మయమ్ సమన్వయం ఔతుందో తెలుసుకున్నపుడే జిగ్సా పజిల్ సొల్వ్ చెసినట్లు ఆహా ఫీలిన్గ్ కలుగుతున్ది. రఘు గార్కి ధన్యవాదాలు.

    అసలు త్రిమతాచార్యులు చెప్పిన్ది ఏమిటొ తెలియదు కాని మిడి మిడి జ్ఞానంతో వేద వాంగ్మయాన్ని చిత్తమ్ వచ్చినట్లు వ్యాఖ్యానిన్చడమ్ మూర్ఖత్వమ్ కాక మరొకటి కాదు.

  10. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి వివేక్ అభిప్రాయం:

    03/03/2014 10:29 am

    మన సనాతన ధర్మము నిజంగా సనాతనమైనదనీ, గొప్ప ఋషులు మనకు జ్ణానాన్ని పంచారనీ, వేదాలపైనా, వేద వాజ్మయము పైనా మనకు ఇక్కడే చాలినంత సమాచారమూ, భాష్యములూ, ఇతర విశ్లేషణలూ ఉన్నాయనీ ప్రపంచపు మొత్తానికి తెలుసు. కారణాంతరాల వల్ల మన గొప్ప సంస్కృతి కొంత దెబ్బతిన్నంత మాత్రాన, ఎవరో వచ్చి మన వేదాల గురించీ, మన మతము గురించీ ప్రత్యేకముగా చెప్పనక్కర లేదు. విదేశీయులకు చెప్పాలనుకుంటే అది ఆయా దేశాల ఇష్టము. ఒకవేళ అలాగ ఇక్కడ చెప్పాలనుకుంటే మొదట హిందువుగా మారి, అందులోని అసలైన తత్త్వమును అర్థం చేసుకుని, మొదట తాను అనుభవించి చెప్పితే అది వేరే విషయము. యాభై యేళ్ళు కాదు కదా, జీవితకాలమూ శ్రమించినా వేదాలను అర్థం చేసుకోవడము అంత సులభము కాదు అని మనకు వేదం లోనే ఎన్నో చోట్ల కనిపిస్తుంది. ఇంకొక మతం పై అంత ఆసక్తి ఎందుకో గానీ, నిజంగా మంచి ఆసక్తి ఉంటే ఇటువంటి రాతలు రావు. వారి మాటలు, పదాలు తియ్యగా ఉండొచ్చు. అంతమాత్రాన అవి భావమును కప్పలేవు.

    ఆ పుస్తకాన్ని చదివితే గానీ సరైన దీటైన జవాబు ఇవ్వలేను.