ఒక చక్కని చాటువు! మరుగున పడి, తెలుగు వాళ్ళు మరిచిపోయిన ఇద్దరు భీముళ్ళకి చాలా చక్కని “చాటింపు.” కామేశ్వరరావు గారికి అభివాదం!
ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు, ఆచార్య దావీదు షూల్మనుగారూ, తెలుగు,సంస్కృతం, తమిళభాషలనుంచీ కాసిని చాటువులు, అనువదించి A Poem at the Right Moment (University of California Press, 1998) అన్న పేరుతో ప్రచురించారు. అందులో వేములవాడ భీమకవి గురించి ముందుమాటలో ప్రస్తావించారు. ఆ పుస్తకం ఇదివరలో అంతర్జాలంలో పరిచయం చెయ్యబడింది. వాళ్ళు రాసిన 65 – పేజీల నిడివి ఉన్న వెనుక మాటలో చాటువుల గురించి విపులంగా విశదీకరించారు. తెలుగు చాటువులపై తెలుగు మేథావుల శీతకన్నుకి కారణాలు చక్కగా చర్చించారు. ముందుమాటలో మీరు చెప్పిన మాటలే మరికొంచెం గట్టిగా చెప్పారు:
“A poem, at least a good poem, exists in the memory or on the tongue of living connoisseurs. Its life consists in its oral recitation in some particular context, usually linked to a range of other contexts. … Most poems have a story that goes with them, and each is invariably memorable, a perfectly worked-out expression of skilled composition, though often disarmingly simple. These cāṭus have appealed to, and shaped, the taste of generations of people.”
ఆ అభిరుచి అడుగంటి పోతున్నదని మీరు బాధ వ్యక్తం చేశారు. మీతో ఏకీభవించనివారు ఉండరని అనుకుంటాను.
చాటువుల పరంగా నాకు కొన్ని ప్రశ్నలున్నాయి.
మొదటి ప్రశ్న: వేములవాడ భీమకవి మీద నన్నయభట్టు గారు చెప్పిన చాటువు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వారి చాటుపద్యమణిమంజరిలో కూర్చిపెట్టారు. అది మీకు తెలిసే వుండాలి. ‘మతిభ్రమ నీగి పేర్మి సిరి మానిత ప్రెగ్గడ భీమునిన్.’ అని. అంటే, భీమకవి ఆదికవికన్నా ముందువాడనేనా?
హంసపాదు (1): ఎవరుముందు, ఎవరు వెనుక అని పరిశోధన చెయ్యాలని నేను అడగటల్లేదు. అలా అంటే, అది శుద్ధ అనవసర పరిశోధన అని నన్ను దులిపేస్తారని తెలుసు. తెలుసుకుందామనుకునే కుతూహలం ఉండటం తప్పు కాదనుకుంటాను.
రెండవ ప్రశ్న: బొమ్మకంటి శ్రీనివాసచార్యులు గారు ప్రచురించిన “తెలుగు చాటువు పుట్టుపూర్వోత్తరాలు(1983)” లో, మైలమ భీమన చనిపోయినపుడు 12, 13 పద్యాలలో వేములవాడ భీమకవి రచించిన ‘విలాప గీతం’ (elegy) తెలుగు సాహిత్యంలో అట్టి గీతాలలో మొట్టమొదటిదే కాదు; సాటిలేనిది కూడా. ఆ గీతంలోని ఒక రసగుళిక అని ఈ కింది పద్యం అని రాశారు.
(ఆఖరి పాదం నాచన సోముని ఉత్తర హరివంశంలో నిది. చాటు కవితా రసికులు చేర్చిన ప్రక్షిప్తం కావచ్చని అంటారు.)
హంసపాదు (2): elegy అంటే ‘విలాపగీతం’ అని వేలూరి తెలివితక్కువగా అనువదించాడని తహతహపడి తప్పు పట్టడానికి దూకకండి. కీ.శే. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు చేసిన అనువాదం అది. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉన్నది.
మూడవ ప్రశ్న: వేములవాడ భీమకవి ఒకసారి గుడిమెట్టకి వెళ్ళాడట. సాగి పోతురాజు ఆయన గుర్రాన్ని పట్టుకొని విడవకపోతే, వాడిమీద కోపించి చెప్పిన (శాప) పద్యం:
పూర్తి పద్యం చెప్పచ్చుగాని, నా ప్రశ్నకి అది అనవసరం. మొదటి పాదంలో ఆరవ అక్షరం ‘త’. ఈ పద్యం చెప్పిన ఏడు రోజులకి భీమకవి శపించినట్టుగా పోతురాజు మరణించాడనీ ప్రచారంలో ఉన్న కథ. అయితే, వేములవాడ భీమకవి తరువాత పద్యాలు రాసిన కవులెవరైనా, ఆరవ అక్షరం గా ‘త’ వాడారా? లేదా? ఈ ప్రశ్నకి సమాధానం — మీరో, జెజ్జాల కృష్ణమోహనరావుగారో, యేల్చూరి మురళీధరరావుగారో — మాత్రమే చెప్పగలరని నేను అనుకుంటున్నాను. (ఈ ముగ్గురేనా? ఇంకెవరూ లేరా? అని తహతహపడి తప్పుపట్టి నన్ను #mentors, commentors#, తిట్టచ్చు. తిట్లు తినడానికి నేనూ సిద్ధం)
హంసపాదు(3): ఇది తప్పకుండా చేయదగ్గ పరిశోధనే! కాదని ఎవరన్నా అంటే, వాళ్ళని నల్ల గండుచీమ తప్పకుండా కరుస్తుంది. అంతే కాదు. Side Barకి హంసపాదు అని అనటం నాకు ఇష్టం. తథాస్తు.
ప్రసాద్ గారూ, బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో పక్కపక్కనే కూర్చుని ప్రయాణాలు చేసే కాలం ఇది. క్లాస్ రూమ్స్ లో ఒకే బెంచీ మీద కూర్చుని చదువుకునే కాలం ఇది. ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్ట్ లు ప్రాజెక్ట్ పని మీదో, ఉద్యోగాలు చేసుకుంటూనో ఒకే కప్పు కింద నివసిస్తున్న కాలం కూడా ఇది. మా నాయనమ్మ చూస్తే అవ్వ! అని బుగ్గలు నొక్కుకుంటూ వాళ్లని _____ కింద జమ కట్టేస్తుంది. మా అమ్మ ఆ పిల్లల తల్లిదండ్రులని, సమాజాన్ని తిట్టుకుంటుంది. నేను పైకి ఏమీ అనను కాని లోపల ఏదో ఆలోచిస్తాను. నా పిల్లలకి అసలు అలాంటి ఆలోచనలే కలగవు. అయితే వీళ్ళు కూడా భర్త/భార్యల విషయం లో ఈగో, ఈర్షాసూయలతో నిత్యమూ ఘర్షణ పడుతుంటారు. పిల్లలని మధ్యలో నలిపేస్తుంటారు. పైగా ఆ పిల్లలు వినకూడదని పక్క గదిలోకి పంపించి మరీ వాదించుకుంటుంటారు. ఆ పిల్లల సర్వేంద్రియాలూ గోడలని దాటి వచ్చి వింటాయని, వారి చిన్ని హృదయాలు భయంతో వణికిపోతూ ఉంటాయని గ్రహించుకోరు. అయితే ఇదంతా కథకి సంబధించినది కాదు కాని (మీరన్న విషయం కూడా) కథలో అంతర్లీనంగా ఉన్న విషయం కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పాను.
ఈ కథ చదివి డాక్టర్ మహేంద్ర కుమార్ అంటారు “మేడమ్ అభినందనలు. చాలా సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా fabricate చేసి అల్లారు. నిజానికి ఈ అంశం contemporary అని నాకు అనిపిస్తుంది. నేను విన్నాను, చూశాను, చూస్తున్నాను పిల్లలు కొంచెం పెద్దయ్యాక అభిరుచుల పట్ల interest పెరగడం, ఒక్కోసారి opposite genderలో ఆ అభిరుచుల వాసనలు ఉంటే వారి పట్ల స్నేహభావం పెరగడం, ఆ ఇద్దరూ వారి వారి ప్రాధమిక, కుటుంబ బాధ్యతలు, ప్రేమల పట్ల నిజాయితీగా ఉంటూనే ఒక emotional bonding కోసం, ఒక soulmate లాంటి బంధం కోసం ఏ వికృతమైన ఆలోచన లేకుండా ఉన్నారనిపిస్తుంది. మీరు answer చేసినట్లు మార్పు రావాలి. అందుకు ప్రయత్నించాలి. opposite gender స్నేహాలని నిజంగా శారీరక సంబంధంతోనే ముడిపడి ఉండవు – ఇది సమాజం తెలుసుకుంటే ముఖ్యంగా feminine genderకి విలువనిచ్చినట్లవుతుంది కూడా. చాలా bold subject ఎన్నుకున్నారు. దీని పట్ల విస్తృతమైన అభిప్రాయం రావొచ్చు”
“దాపట” అనేది మరీ మరుగుపడిన పదమేం కాదు. కాడెద్దుల్లో ఎడమవైపు ఎద్దును యిప్పటికీ “దాపటెద్దు” అనే అంటాం. కాకపోతే ఇప్పుడు ఎద్దులే లేవు.
“కూడు” నుంచి “కుడు” వచ్చిందో, “కుడు” నుండీ “కూడు” వచ్చిందో గానీ మా దగ్గర తమిళ-కేరళ సరిహద్దుల నుండి వచ్చిన ఓ తెలుగు కుటూంబం ఇప్పటికీ రెండు పదాలనూ వాదుతున్నారు.
మనం మరిచి పోయిన ప్రాచీన తెలుగు పదాలు జాగ్రత్తగా వింటే వాళ్ళ తెలుగులో వున్నాయి.
రాధ గారు, నిజమే కుడి ఎడమయ్యింది. మైథిలి అనబోయి రాధిక అన్నాను. క్షమించండి.
లోకం ఎంత మారినా మనిషి మొదట జంతువే కదా? విచక్షణ, తర్కము మనిషి మనిషికీ మారుతుంటాయి. కేవలం తాళి కట్టడమే ఇద్దరూ జీవితాంతమూ సహజీవనం చేయడానికి సరిపోదనే కాలమిది.
వ్యాసము చదివినాక చట్టుబండలు పగిలినవి. బాగున్నదనే చెప్పవచ్చును. వాజ్ముఖము ప్రశస్తముగా లేదని అనిపించిన మాట వాస్తవమే అయినా ఆయింతగా చదివిన మీదట అన్వయము కుదుర్చుకోవటము జడ్డు కాలేదు. బ్రౌను పనుల గురించిన వివరణ, చీల్చుట, చెండాడుట తూలనాత్మకముగానైనా, తులనాత్మకముగానైనా వ్యాసము చేసేసినది కాబట్టి, దాని సుద్దికి పోక కామెంటులు చదవగా, ఒక కామెంటు వళావళిగా ఉన్నదనిపించినది. దాని మీద ఒక రెండు ముక్కమాటలు. నారాయణరావుతో, ఆ కామెంటరు జయప్రభతో నాకు ఏ మాలిమి లేదు కనక చెప్పవలసినది తత్తర లేకుండగా చెప్పవచ్చుననే అనుకోలు.
ఎసలిక చిక్కిన సొరిది కామెంటును తేరిగా చదివి, ఆపై అటుంచి, తాటిస్తే, దీనిలాటి వ్యాసము ఇంకొకరు వ్రాసినప్పుడే మనకి పోలిక సాధ్యమవుతుందని, ఇందులోని, అనగా ఈ వ్యాసములోని మంచి చెడులు నిర్ణయం చేయడమూ సాధ్యమవుతుందని తెలియవలసిన సొజ్జెము ఉన్నది. అందాకా బ్రౌను చేసినది ఒకటే, ఈ వ్యాసము చేసినదీ ఒకటే, జయప్రభ కామెంటు చేసినదీ ఒకటే. ఎవరో వస్తారని కాకుండగా జయప్రభే ఆ పనికి పూనుకుంటే మరింత ఉవ్వాయి.
నారాయణరావు, పూర్వ ప్రాత ప్రస్తుత వస్తుతః, ఆయా పండితులు చేసిన పనులను బట్టి మిగిలిన పండితులను భావదాస్యము నుండి బయటపడమనే కదా ఈ వ్యాసములో చెపుతూంటా. ఆయా భావదాస్యము లేనివారిని గాటను కట్టినా, రాటను కట్టినా గానుగెద్దుకు తోడొకరుండిన అదే భాగ్యము తీరగును. దాని వలన గానుగెద్దుకు వొంటరితనము పోవును, మాటలు వచ్చును, ఆపైన నూనె ఎక్కువగా వచ్చును. లాభమే.
వ్యాసములోని సంగతి మీద కాక వ్యాసకర్త నారాయణరావు మీద కచ్చతో రాసినట్టున్న ఒకానొక భాగము చదివి, హయ్యారే, ఇహ ఆ పోయిన బ్రౌను ఊష్మించినా, బతికున్న కామెంటరులు ఊష్మించినా బయటికొచ్చేది “ఉత్త” గాలే కానీ మరొకటి కాదని తెలసినది. అయితే ఆ గాలి ఇతరులు పీల్చే గాలిని కలుషించకూడదన్న సంగతి మీద పోయిన బ్రౌనుకు మాట్లాడే అవకాశము లేదు కాబట్టి బతికున్న కామెంటరులు తెలసి మాట్లాడవలె.
కొద్దిగానో గొప్పగానో పూటము దించిన ఈ వివరణాత్మకవ్యాసావళికి అన్ని రిఫరెన్సులిచ్చిన నారాయణరావు తివురుపడితే, ఏ రిఫరెన్సులూ ఇవ్వని మనము తివురుపడనక్కరలేదు. మనకు తివురు లేనప్పుడు ఈ వ్యాసాన్ని, రిఫరెన్సులను నమిలి ఎక్కడ తొడుసులు ఉన్నాయో వాదాడితే బాగుండును. అది లేకుండగా, చేయక, విషయము తెలియవలసిన వారు “బహుశా” అన్న బూమెరాంగు ఏష్యము విసరకూడదన్న సంగతి తెలియకపోవడము ఆశ్చర్యమే.
ఏదేమైనా ఈ “ఈమాట” పత్రిక చాలా విచిత్రముగా వున్నది. కొన్నిచోట్ల వ్యాసములు గొప్పగా వున్నవి. కామెంటులు గొప్పగా వున్నవి. వ్యాసములు గొప్పగా ఉన్న చోట కామెంటులు అతిదౌర్బల్యముగా వున్నవి. కామెంటులు విశేషముగా ఉన్నచోట వ్యాసములు, అందులోని సంగతులు తేలిపోయినవి. చివరిగా వినోద విహారే “ఈమాట” వాహ్యాళే అన్న మాట ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవై వలె పరమసత్యం అన్నదానిని ఉదహరించి స్వస్తివాక్యం.
అశ్మాచం
(asm chamdra)
PS: ఇంతవరకు చదివిన కామెంట్లలో సంపాదకులు కొన్నిటిని “ఎడిట్” చేసినారని చూశినాను. ఒకవేళ ఈ నా కామెంటును “ఎడిట్” చేయవలసివచ్చితే, అసలు ప్రచురించనే వద్దన్న మనవితో.
[సంపాదకులు ఇటువంటి ‘మనవి’లు గమనించరండీ. అభిప్రాయం ఎడిట్ కాకూడదు అంటే అలా అయ్యేలా రాయకూడదు. ఒకసారి కామెంట్ పెట్టినాక వారు ఏం చేయాలో అదే చేస్తారు. “ఈమాట నియమాలకు కట్టుబడి ఉంటానని” హామీ ఇచ్చి అభిప్రాయం రాసిన తరువాత కూడా ‘ఇలా అయితేనే ప్రచురించండి’ అంటూ వాళ్ళకే షరతులు పెడితే ఎలా? – సం.]
ఎలా తిట్టి కొట్టి ఈసడించినా నీళ్ళొచ్చినందుకు ఆయన మహామహుడా? అనడం అసలు విశయాన్ని భూతద్దంలో చూపించడమే!
ఈ వ్యాసం చర్చించినట్లు బ్రౌన్ తెలుగు పండితుడు అయివుండకపోవచ్చు. అసలు పండితులని నామ మాత్రపు రుసుముతో వాడుకొని వుండవచ్చు. అయితే చరిత్రలో ఏది చూసినా అలాగేగా వుంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకోసమే రైల్వే లైన్లు వేసినా అది అఖండ భారతాన్ని ఒకటిగా చేయడానికి ఉపయోగపడింది. కాటన్ దొర ఎక్కువ పన్ను రాబడికోసం ఆనకట్టలు కట్టినా అది కోస్తా అన్నపూర్ణ కావడానికి తోడ్పడింది. మరి మన రాజులు వాళ్ళ బొక్కెసం నింపుకోవడానికి కాక కేవలం ప్రజలకు తిండి పెట్టడానికే చెరువులు తవ్వించారా? ఆ కట్టినవాడు నల్లవాడే కావాలా విగ్రహం పెట్టడానికీ, కృతజ్ఞత చూపడానికీ?
పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి Sivalenka అభిప్రాయం:
05/06/2014 11:00 am
చాలా బాగుంది. మంచి విషయాలు తెలిశాయి.
ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద గురించి dr pulipati guruswamy అభిప్రాయం:
05/06/2014 9:11 am
ఎంత చెప్పను… ఎంత చెప్పినా చెప్పిందంతా చెప్పాల్సింది కానిదే. అయితె, చెప్పనివ్వనిదెదో ఓ మూల ఊరుకోదు. చూద్దాం ప్లాట్ఫాం మీదికి వచ్చినప్పుడు…
నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
05/06/2014 8:59 am
ఒక చక్కని చాటువు! మరుగున పడి, తెలుగు వాళ్ళు మరిచిపోయిన ఇద్దరు భీముళ్ళకి చాలా చక్కని “చాటింపు.” కామేశ్వరరావు గారికి అభివాదం!
ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు, ఆచార్య దావీదు షూల్మనుగారూ, తెలుగు,సంస్కృతం, తమిళభాషలనుంచీ కాసిని చాటువులు, అనువదించి A Poem at the Right Moment (University of California Press, 1998) అన్న పేరుతో ప్రచురించారు. అందులో వేములవాడ భీమకవి గురించి ముందుమాటలో ప్రస్తావించారు. ఆ పుస్తకం ఇదివరలో అంతర్జాలంలో పరిచయం చెయ్యబడింది. వాళ్ళు రాసిన 65 – పేజీల నిడివి ఉన్న వెనుక మాటలో చాటువుల గురించి విపులంగా విశదీకరించారు. తెలుగు చాటువులపై తెలుగు మేథావుల శీతకన్నుకి కారణాలు చక్కగా చర్చించారు. ముందుమాటలో మీరు చెప్పిన మాటలే మరికొంచెం గట్టిగా చెప్పారు:
“A poem, at least a good poem, exists in the memory or on the tongue of living connoisseurs. Its life consists in its oral recitation in some particular context, usually linked to a range of other contexts. … Most poems have a story that goes with them, and each is invariably memorable, a perfectly worked-out expression of skilled composition, though often disarmingly simple. These cāṭus have appealed to, and shaped, the taste of generations of people.”
ఆ అభిరుచి అడుగంటి పోతున్నదని మీరు బాధ వ్యక్తం చేశారు. మీతో ఏకీభవించనివారు ఉండరని అనుకుంటాను.
చాటువుల పరంగా నాకు కొన్ని ప్రశ్నలున్నాయి.
మొదటి ప్రశ్న: వేములవాడ భీమకవి మీద నన్నయభట్టు గారు చెప్పిన చాటువు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వారి చాటుపద్యమణిమంజరిలో కూర్చిపెట్టారు. అది మీకు తెలిసే వుండాలి. ‘మతిభ్రమ నీగి పేర్మి సిరి మానిత ప్రెగ్గడ భీమునిన్.’ అని. అంటే, భీమకవి ఆదికవికన్నా ముందువాడనేనా?
హంసపాదు (1): ఎవరుముందు, ఎవరు వెనుక అని పరిశోధన చెయ్యాలని నేను అడగటల్లేదు. అలా అంటే, అది శుద్ధ అనవసర పరిశోధన అని నన్ను దులిపేస్తారని తెలుసు. తెలుసుకుందామనుకునే కుతూహలం ఉండటం తప్పు కాదనుకుంటాను.
రెండవ ప్రశ్న: బొమ్మకంటి శ్రీనివాసచార్యులు గారు ప్రచురించిన “తెలుగు చాటువు పుట్టుపూర్వోత్తరాలు(1983)” లో, మైలమ భీమన చనిపోయినపుడు 12, 13 పద్యాలలో వేములవాడ భీమకవి రచించిన ‘విలాప గీతం’ (elegy) తెలుగు సాహిత్యంలో అట్టి గీతాలలో మొట్టమొదటిదే కాదు; సాటిలేనిది కూడా. ఆ గీతంలోని ఒక రసగుళిక అని ఈ కింది పద్యం అని రాశారు.
యాచక ఖేచరుండు సుగుణాంబుధి మైలమ భీము డీల్గినన్
చూచి వరించె రంభ; ఎడజొచ్చె తిలోత్తమ ; దారి నిద్దరన్
త్రోచె ఘృతాచి ; ముగ్గురకు దొద్దడి కయ్యము పుట్టె; అంతలో
నాచుకు పోయె ముక్తి సతి; నవ్విరి అద్దశ జూచి నిర్జరుల్!
నోచిన వారి సొమ్ము లవి నోమని వారికి వచ్చునే ధరన్?
(ఆఖరి పాదం నాచన సోముని ఉత్తర హరివంశంలో నిది. చాటు కవితా రసికులు చేర్చిన ప్రక్షిప్తం కావచ్చని అంటారు.)
హంసపాదు (2): elegy అంటే ‘విలాపగీతం’ అని వేలూరి తెలివితక్కువగా అనువదించాడని తహతహపడి తప్పు పట్టడానికి దూకకండి. కీ.శే. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు చేసిన అనువాదం అది. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉన్నది.
మూడవ ప్రశ్న: వేములవాడ భీమకవి ఒకసారి గుడిమెట్టకి వెళ్ళాడట. సాగి పోతురాజు ఆయన గుర్రాన్ని పట్టుకొని విడవకపోతే, వాడిమీద కోపించి చెప్పిన (శాప) పద్యం:
‘హయమది సీత, పోతవసుధాధిపుడారయ రావణుండు,..
… ..నా
జయమును, పోతరక్కసుని చావును ఏడవనాడూ చూడుడీ!’
పూర్తి పద్యం చెప్పచ్చుగాని, నా ప్రశ్నకి అది అనవసరం. మొదటి పాదంలో ఆరవ అక్షరం ‘త’. ఈ పద్యం చెప్పిన ఏడు రోజులకి భీమకవి శపించినట్టుగా పోతురాజు మరణించాడనీ ప్రచారంలో ఉన్న కథ. అయితే, వేములవాడ భీమకవి తరువాత పద్యాలు రాసిన కవులెవరైనా, ఆరవ అక్షరం గా ‘త’ వాడారా? లేదా? ఈ ప్రశ్నకి సమాధానం — మీరో, జెజ్జాల కృష్ణమోహనరావుగారో, యేల్చూరి మురళీధరరావుగారో — మాత్రమే చెప్పగలరని నేను అనుకుంటున్నాను. (ఈ ముగ్గురేనా? ఇంకెవరూ లేరా? అని తహతహపడి తప్పుపట్టి నన్ను #mentors, commentors#, తిట్టచ్చు. తిట్లు తినడానికి నేనూ సిద్ధం)
హంసపాదు(3): ఇది తప్పకుండా చేయదగ్గ పరిశోధనే! కాదని ఎవరన్నా అంటే, వాళ్ళని నల్ల గండుచీమ తప్పకుండా కరుస్తుంది. అంతే కాదు. Side Barకి హంసపాదు అని అనటం నాకు ఇష్టం. తథాస్తు.
విధేయుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి తః తః అభిప్రాయం:
05/06/2014 7:19 am
“ఎండిన బీళ్లు ఇగుళ్లు వేసే” మాటల్లో, “యలపట దాపట యడ్ల దోలుకో” మన్నాడు కొసరాజు – తఃతః
ఇది మరీ బావుంది గురించి satish kumar kuchipudi అభిప్రాయం:
05/06/2014 6:19 am
అద్బుతం. తెలుగు కవితా సాహిత్య పునర్జీవనానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి నా హృదయ పూర్వక నమస్కారాలు.
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/06/2014 1:51 am
ప్రసాద్ గారూ, బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో పక్కపక్కనే కూర్చుని ప్రయాణాలు చేసే కాలం ఇది. క్లాస్ రూమ్స్ లో ఒకే బెంచీ మీద కూర్చుని చదువుకునే కాలం ఇది. ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్ట్ లు ప్రాజెక్ట్ పని మీదో, ఉద్యోగాలు చేసుకుంటూనో ఒకే కప్పు కింద నివసిస్తున్న కాలం కూడా ఇది. మా నాయనమ్మ చూస్తే అవ్వ! అని బుగ్గలు నొక్కుకుంటూ వాళ్లని _____ కింద జమ కట్టేస్తుంది. మా అమ్మ ఆ పిల్లల తల్లిదండ్రులని, సమాజాన్ని తిట్టుకుంటుంది. నేను పైకి ఏమీ అనను కాని లోపల ఏదో ఆలోచిస్తాను. నా పిల్లలకి అసలు అలాంటి ఆలోచనలే కలగవు. అయితే వీళ్ళు కూడా భర్త/భార్యల విషయం లో ఈగో, ఈర్షాసూయలతో నిత్యమూ ఘర్షణ పడుతుంటారు. పిల్లలని మధ్యలో నలిపేస్తుంటారు. పైగా ఆ పిల్లలు వినకూడదని పక్క గదిలోకి పంపించి మరీ వాదించుకుంటుంటారు. ఆ పిల్లల సర్వేంద్రియాలూ గోడలని దాటి వచ్చి వింటాయని, వారి చిన్ని హృదయాలు భయంతో వణికిపోతూ ఉంటాయని గ్రహించుకోరు. అయితే ఇదంతా కథకి సంబధించినది కాదు కాని (మీరన్న విషయం కూడా) కథలో అంతర్లీనంగా ఉన్న విషయం కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పాను.
ఈ కథ చదివి డాక్టర్ మహేంద్ర కుమార్ అంటారు “మేడమ్ అభినందనలు. చాలా సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా fabricate చేసి అల్లారు. నిజానికి ఈ అంశం contemporary అని నాకు అనిపిస్తుంది. నేను విన్నాను, చూశాను, చూస్తున్నాను పిల్లలు కొంచెం పెద్దయ్యాక అభిరుచుల పట్ల interest పెరగడం, ఒక్కోసారి opposite genderలో ఆ అభిరుచుల వాసనలు ఉంటే వారి పట్ల స్నేహభావం పెరగడం, ఆ ఇద్దరూ వారి వారి ప్రాధమిక, కుటుంబ బాధ్యతలు, ప్రేమల పట్ల నిజాయితీగా ఉంటూనే ఒక emotional bonding కోసం, ఒక soulmate లాంటి బంధం కోసం ఏ వికృతమైన ఆలోచన లేకుండా ఉన్నారనిపిస్తుంది. మీరు answer చేసినట్లు మార్పు రావాలి. అందుకు ప్రయత్నించాలి. opposite gender స్నేహాలని నిజంగా శారీరక సంబంధంతోనే ముడిపడి ఉండవు – ఇది సమాజం తెలుసుకుంటే ముఖ్యంగా feminine genderకి విలువనిచ్చినట్లవుతుంది కూడా. చాలా bold subject ఎన్నుకున్నారు. దీని పట్ల విస్తృతమైన అభిప్రాయం రావొచ్చు”
పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి ప్రసాద్ అభిప్రాయం:
05/05/2014 4:49 pm
ఎప్పట్లాగే మంచి విషయాలు తెలుసుకున్నా.
“దాపట” అనేది మరీ మరుగుపడిన పదమేం కాదు. కాడెద్దుల్లో ఎడమవైపు ఎద్దును యిప్పటికీ “దాపటెద్దు” అనే అంటాం. కాకపోతే ఇప్పుడు ఎద్దులే లేవు.
“కూడు” నుంచి “కుడు” వచ్చిందో, “కుడు” నుండీ “కూడు” వచ్చిందో గానీ మా దగ్గర తమిళ-కేరళ సరిహద్దుల నుండి వచ్చిన ఓ తెలుగు కుటూంబం ఇప్పటికీ రెండు పదాలనూ వాదుతున్నారు.
మనం మరిచి పోయిన ప్రాచీన తెలుగు పదాలు జాగ్రత్తగా వింటే వాళ్ళ తెలుగులో వున్నాయి.
విముక్తం గురించి ప్రసాద్ అభిప్రాయం:
05/05/2014 2:25 pm
రాధ గారు, నిజమే కుడి ఎడమయ్యింది. మైథిలి అనబోయి రాధిక అన్నాను. క్షమించండి.
లోకం ఎంత మారినా మనిషి మొదట జంతువే కదా? విచక్షణ, తర్కము మనిషి మనిషికీ మారుతుంటాయి. కేవలం తాళి కట్టడమే ఇద్దరూ జీవితాంతమూ సహజీవనం చేయడానికి సరిపోదనే కాలమిది.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి అశ్మాచం అభిప్రాయం:
05/05/2014 2:08 pm
వ్యాసము చదివినాక చట్టుబండలు పగిలినవి. బాగున్నదనే చెప్పవచ్చును. వాజ్ముఖము ప్రశస్తముగా లేదని అనిపించిన మాట వాస్తవమే అయినా ఆయింతగా చదివిన మీదట అన్వయము కుదుర్చుకోవటము జడ్డు కాలేదు. బ్రౌను పనుల గురించిన వివరణ, చీల్చుట, చెండాడుట తూలనాత్మకముగానైనా, తులనాత్మకముగానైనా వ్యాసము చేసేసినది కాబట్టి, దాని సుద్దికి పోక కామెంటులు చదవగా, ఒక కామెంటు వళావళిగా ఉన్నదనిపించినది. దాని మీద ఒక రెండు ముక్కమాటలు. నారాయణరావుతో, ఆ కామెంటరు జయప్రభతో నాకు ఏ మాలిమి లేదు కనక చెప్పవలసినది తత్తర లేకుండగా చెప్పవచ్చుననే అనుకోలు.
ఎసలిక చిక్కిన సొరిది కామెంటును తేరిగా చదివి, ఆపై అటుంచి, తాటిస్తే, దీనిలాటి వ్యాసము ఇంకొకరు వ్రాసినప్పుడే మనకి పోలిక సాధ్యమవుతుందని, ఇందులోని, అనగా ఈ వ్యాసములోని మంచి చెడులు నిర్ణయం చేయడమూ సాధ్యమవుతుందని తెలియవలసిన సొజ్జెము ఉన్నది. అందాకా బ్రౌను చేసినది ఒకటే, ఈ వ్యాసము చేసినదీ ఒకటే, జయప్రభ కామెంటు చేసినదీ ఒకటే. ఎవరో వస్తారని కాకుండగా జయప్రభే ఆ పనికి పూనుకుంటే మరింత ఉవ్వాయి.
నారాయణరావు, పూర్వ ప్రాత ప్రస్తుత వస్తుతః, ఆయా పండితులు చేసిన పనులను బట్టి మిగిలిన పండితులను భావదాస్యము నుండి బయటపడమనే కదా ఈ వ్యాసములో చెపుతూంటా. ఆయా భావదాస్యము లేనివారిని గాటను కట్టినా, రాటను కట్టినా గానుగెద్దుకు తోడొకరుండిన అదే భాగ్యము తీరగును. దాని వలన గానుగెద్దుకు వొంటరితనము పోవును, మాటలు వచ్చును, ఆపైన నూనె ఎక్కువగా వచ్చును. లాభమే.
వ్యాసములోని సంగతి మీద కాక వ్యాసకర్త నారాయణరావు మీద కచ్చతో రాసినట్టున్న ఒకానొక భాగము చదివి, హయ్యారే, ఇహ ఆ పోయిన బ్రౌను ఊష్మించినా, బతికున్న కామెంటరులు ఊష్మించినా బయటికొచ్చేది “ఉత్త” గాలే కానీ మరొకటి కాదని తెలసినది. అయితే ఆ గాలి ఇతరులు పీల్చే గాలిని కలుషించకూడదన్న సంగతి మీద పోయిన బ్రౌనుకు మాట్లాడే అవకాశము లేదు కాబట్టి బతికున్న కామెంటరులు తెలసి మాట్లాడవలె.
కొద్దిగానో గొప్పగానో పూటము దించిన ఈ వివరణాత్మకవ్యాసావళికి అన్ని రిఫరెన్సులిచ్చిన నారాయణరావు తివురుపడితే, ఏ రిఫరెన్సులూ ఇవ్వని మనము తివురుపడనక్కరలేదు. మనకు తివురు లేనప్పుడు ఈ వ్యాసాన్ని, రిఫరెన్సులను నమిలి ఎక్కడ తొడుసులు ఉన్నాయో వాదాడితే బాగుండును. అది లేకుండగా, చేయక, విషయము తెలియవలసిన వారు “బహుశా” అన్న బూమెరాంగు ఏష్యము విసరకూడదన్న సంగతి తెలియకపోవడము ఆశ్చర్యమే.
ఏదేమైనా ఈ “ఈమాట” పత్రిక చాలా విచిత్రముగా వున్నది. కొన్నిచోట్ల వ్యాసములు గొప్పగా వున్నవి. కామెంటులు గొప్పగా వున్నవి. వ్యాసములు గొప్పగా ఉన్న చోట కామెంటులు అతిదౌర్బల్యముగా వున్నవి. కామెంటులు విశేషముగా ఉన్నచోట వ్యాసములు, అందులోని సంగతులు తేలిపోయినవి. చివరిగా వినోద విహారే “ఈమాట” వాహ్యాళే అన్న మాట ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవై వలె పరమసత్యం అన్నదానిని ఉదహరించి స్వస్తివాక్యం.
అశ్మాచం
(asm chamdra)
PS: ఇంతవరకు చదివిన కామెంట్లలో సంపాదకులు కొన్నిటిని “ఎడిట్” చేసినారని చూశినాను. ఒకవేళ ఈ నా కామెంటును “ఎడిట్” చేయవలసివచ్చితే, అసలు ప్రచురించనే వద్దన్న మనవితో.
[సంపాదకులు ఇటువంటి ‘మనవి’లు గమనించరండీ. అభిప్రాయం ఎడిట్ కాకూడదు అంటే అలా అయ్యేలా రాయకూడదు. ఒకసారి కామెంట్ పెట్టినాక వారు ఏం చేయాలో అదే చేస్తారు. “ఈమాట నియమాలకు కట్టుబడి ఉంటానని” హామీ ఇచ్చి అభిప్రాయం రాసిన తరువాత కూడా ‘ఇలా అయితేనే ప్రచురించండి’ అంటూ వాళ్ళకే షరతులు పెడితే ఎలా? – సం.]
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి ప్రసాద్ అభిప్రాయం:
05/05/2014 1:45 pm