వ్యాసం బాగుందండి. చాలా విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. వ్యాసానికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ, నాది ఒక ప్రశ్న:
“బ్రౌన్ అమలు పెట్టిన పాశ్చాత్య పద్ధతులు తెలుగు పుస్తకాల పరిష్కరణకి పనికిరావన్న ఊహ ఇప్పటికీ మన పండితులకి అవగాహనకి రాలేదు.”
– ఈ అంశం గురించి ఈ వ్యాసంలో అంత స్పష్టంగా రాయలేదేమో అనిపిస్తోంది (లేకపొతే నాకే అర్థం కాలేదేమో!). బండి-ర, అరసున్నాలు తొలగించడం కాకుండా బ్రౌన్ పరిష్కరణ పద్ధతిలో ముఖ్యాంశాలు ఏమిటో నిజానికి నాకింకా సరిగా అర్థం కాలేదు వ్యాసం పూర్తిగా చదివాక కూడా. అలాగే, అసలు ఎందుకు ఈ పద్ధతులు తెలుగు పుస్తకాల పరిష్కరణకు పనికిరావో, అసలు తేడాలు ఏమిటో కూడా అర్థం కాలేదు. మీరీ వ్యాఖ్య చూస్తే, వీలైతే ఈ విషయమై సమాధానం కానీ, సమాధానం తెలుసుకోగల రిఫరెన్స్ కానీ తెలుపగలరు.
ముందు మాటలొ మొదటి రెండు వాక్యాలూ చూద్దాం. “సాహిత్యంలో రాజనీతిని గురించిన చర్చ ఆముక్తమాల్యదతో ప్రారంభం కాలేదు. సంస్కృతంలో కౌటిల్యుని అర్థశాస్త్రం నుండి తమిళంలోని తిరుక్కుఱళ్ వరకు రాజ్యధర్మాన్ని, రాజనీతిని విశ్లేషించడం అనాది కాలం నుండీ వస్తున్న సంప్రదాయమే.”
“అర్థశాస్త్రం” సాహిత్యంగా పరిగణింపబడుతుందా? Artha-shastra, (Sanskrit: “The Science of Material Gain”) also spelled Artha-śāstra, singularly important Indian manual on the art of politics, attributed to Kautilya (also known as Chanakya) — బ్రిటానికానుంచి.
ఈ వ్యాసంలో నుంచి మొదట భట్రాజు అనే మాటను ఉపసంహరించండి. భట్రాజులు ప్రస్తుతం అంధ్ర ప్రదేశ్ లో బిసీలు. వారిని కించ పరిచేలా మాట్లాడడం సరి కాదు. మాయాబజార్ లో శర్మా శాస్త్రీలు వుంటారు. కవచమిది కవచమిది అని వుత్తర కుమారుణ్ణి తెగ పొగుడుతుంటారు. పక్కన సారథి (అంజి గాడు) కూడా పొగుడుతుంటాడు. ఇద్దరూ చేస్తున్న పని ఒకటే. కాని శర్మా శాస్త్రీలు బ్రాహ్మణులవుతారు. సారథి భట్రాజు అవుతాడు. brahmanism అంటే అదే.
రాజులనూ ప్రభువులనూ జమిందారులనూ నవాబులనూ పొగిడీ వాళ్ళ మీద కావ్యాలు రాసి అంకితం ఇచ్చీ తాము రాసి వారి పేరు పెట్టి శ్రమ తెలియకపొవడం వల్ల జీవితాంతం ఒకరిని పొగిడీ (ఆశీర్వదించి) అదే ఒక జీవన విధానం చేసుకున్న వారు బ్రాహ్మణులు. కాని నాలుగు మెతుకుల కోసం మారాజ ఓ రాజ అన్న పేదలు – భట్రాజులు.
నారాయణ శర్మగారితో జరిపిన ఇంటర్వ్యూ చాలాబావుంది.కొత్తపల్లికి చిన్నచిన్న నీతికధలు పంపడంతప్ప ఇంత వివరాలు తెలీలేదు. కొత్తపల్లి టీం సేవలు అమోఘం. నాకధలూ చాలానే శర్మాజీ ప్రచురించారు.అవన్నీనీ ఇ బుక్ గా కినిగె లో పబ్లిష్ అయ్యాయి.’పిల్లలప్రీతికధలు ‘ అనే టైటిల్ తో. కొత్తపల్లికి ధన్యవాదాలు.
ఈ మాట తెలుగుతనం గురించి: జనవరి సంచికలో మరిచిపోకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే ఈమాటను ఉగాది శుభాకాంక్షలు చెప్పవేమని అడిగితే నన్ను గట్టిగానే కోప్పడటం నేను మరిచిపోలేదు. (ఈ విషయం మోహన గారికీ, యేకారణం వల్లనో ఈ మధ్య కనపడటం మానేసిన రమా భరద్వాజ్ గారికీ గుర్తుండే ఉంటుంది.)
ప్రసాద్ గారూ, నేను కూడా తరంగ లో విన్నాను. వానరాయుడి పాట కూడా విన్నారా? విన్న తర్వాత నాగమణి గారితో మాట్లాడి విముక్తం కథ గురించి కూడా మెన్షన్ చేసిన ప్రసాద్ గారు మీరేనా?
ఎప్పుడైనా ఎక్కడైనా ఆ జాతి లో అనుసరింపబడే ఒక సంప్రదాయం ఉంటుంది. తెలుగు జాతిలో తమ పేరుని చెప్పుకునే సంప్రదాయం తప్పనిసరిగా ప్రసాద్ గారు చెప్పిన విధానము లోనే కనబడుతుంది. ప్రసాద్ అందుకనే “తెలుగు ప్రేమికునిగా” అన్న ఒక మాట వాడేరు. అంటే తెలుగు వారి సంప్రదాయానుసారముగా అన్నమాటే! అలాంటప్పుడు మనం దానికి వేమూరి వారిచ్చినట్టుగా ఔత్తరాహుల సంప్రదాయాన్నో మరొక సంప్రదాయాన్నో ఉదాహరణ ఇవ్వకూడదు. తెలుగు వారి సంప్రదాయం ప్రకారం ఇంటిపేరు ముందుగానూ వ్యక్తి నామము తరవాతనూ రావాలి. మరో విధానము మనకి లేదు. అమెరికా లేదా ఇతర దేశాలు తరలి వెళ్ళిన వారు ఆ దేశ నియమానుసారమూ వారి వారి పేర్లని రాసే పధ్ధతిని మార్చుకొని ఉండవచ్చును గాక! తప్పనిసరి కావడం వలన. దానిని కనీసం ఈ తెలుగు పత్రిక లోనన్నా వదిలి వేయరాదా? పాటించకుండా ఉండరాదా? అన్న ఒక “భక్తి” తో కూడిన విన్నపాన్ని ప్రసాద్ చేస్తున్నారు. ఇక్కడ “జన్మహక్కూ” గట్రా పేద్ద విషయాలంటూ ఏమీ లేవు. సంప్రదాయాలనే మార్చుకుంటాం అని అలా రాసేవారు, వారిని ఔననే వారూ అనుకోవచ్చును. కానీ వేరే భాషల వాళ్ళు భారత దేశంలో వారి వారి ప్రాచీన సంప్రదాయలని కొన్నిటిలోనైనా ఖచ్చితంగా తమదైన ముద్రని నిలుపుకుంటున్నారే? ఈ తెలుగులకేమి నిలుపుకొనలేకపోవడానికి? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే వీలుంటుంది. అప్పుడు తెలుగువారికి తమ భాషా సంస్కృతుల విషయంలో అంత పట్టింపులు ఏమీ ఉండవని బాహాటంగా వారికి వారు చెప్పుకున్నట్టూ అవుతుంది. అందుకనే తెలుగువారికి సాటి తెలుగు వాడైన ప్రసాద్ గారు సున్నితంగా విన్నపం చేయవలసి వచ్చింది. అలా చేయకపోవడాన్ని చూడటం “చెప్పులో రాయిలా గుచ్చుకుంటోంది” సుమా! అని ఒక అనుభవాన్ని కూడా జోడించి మరీ గుర్తు చేసి.
భారత దేశములో, ముఖ్యముగా ఉత్తర భాగములో, అక్కడక్కడ కర్ణాటకములో వ్యక్తి పేరు, ఇంటి పేరు లేక కులము పేరు ఆ క్రమములో మనకు కనబడుతాయి. కాని మిగిలిన చోట్లలో ఇంటి పేరు (సామాన్యముగా ఊరి పేరు) ముందు, తఱువాత స్వంత పేరు మనకు గోచరమవుతుంది. నెల్లూరు మోహన రావు అంటే అతడు కాని, అతని పూర్వులు కాని నెల్లూరికి చెందినవారో లేక నెల్లూరిలో పుట్టిన వారో అయి ఉంటారు. కాని మోహన రావు నెల్లూరు అంటే అన్వయము సరిగా నుండదు. కొన్ని నామములలో ఇది కొద్దిగా వేడుకగా కూడ ఉంటుంది. రాయవరపు రామనాథమును రామనాథం రాయవరపు అంటే ఏదో ఒక విధముగా ఉంటుంది. సంస్కృత వాక్యములలో సామాన్యముగా పదముల వరుస అంత ముఖ్యము కాదు. కాని ద్రావిడ భాషలలో ఇది చాల ముఖ్యము.
చివరి మాట – ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తికి చెందినది. అతడు / ఆమే దానిని ఏ విధముగానైనను అమర్చుకోవచ్చును, అది ఆ వ్యక్తి జన్మ హక్కు, స్వాతంత్ర్యము. కొన్ని సమయాలలో అది తమాషాగా ఉంటే ఉండనీ గాక! నా రెండు తామ్ర శతకములు 🙂
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తః తః అభిప్రాయం:
05/25/2014 9:57 pm
ఈమాటా! ఈమాటా!
పాఠకులాభిప్రాయాలకు
చోటీయకు! చోటీయకు!
తః తః
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Sowmya అభిప్రాయం:
05/25/2014 7:40 pm
శ్రీనివాస్ గారికి, నారాయణరావు గారికి:
వ్యాసం బాగుందండి. చాలా విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. వ్యాసానికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ, నాది ఒక ప్రశ్న:
“బ్రౌన్ అమలు పెట్టిన పాశ్చాత్య పద్ధతులు తెలుగు పుస్తకాల పరిష్కరణకి పనికిరావన్న ఊహ ఇప్పటికీ మన పండితులకి అవగాహనకి రాలేదు.”
– ఈ అంశం గురించి ఈ వ్యాసంలో అంత స్పష్టంగా రాయలేదేమో అనిపిస్తోంది (లేకపొతే నాకే అర్థం కాలేదేమో!). బండి-ర, అరసున్నాలు తొలగించడం కాకుండా బ్రౌన్ పరిష్కరణ పద్ధతిలో ముఖ్యాంశాలు ఏమిటో నిజానికి నాకింకా సరిగా అర్థం కాలేదు వ్యాసం పూర్తిగా చదివాక కూడా. అలాగే, అసలు ఎందుకు ఈ పద్ధతులు తెలుగు పుస్తకాల పరిష్కరణకు పనికిరావో, అసలు తేడాలు ఏమిటో కూడా అర్థం కాలేదు. మీరీ వ్యాఖ్య చూస్తే, వీలైతే ఈ విషయమై సమాధానం కానీ, సమాధానం తెలుసుకోగల రిఫరెన్స్ కానీ తెలుపగలరు.
ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి గురించి తః తః అభిప్రాయం:
05/24/2014 5:25 pm
శ్రీ కొలిచాల:
ముందు మాటలొ మొదటి రెండు వాక్యాలూ చూద్దాం. “సాహిత్యంలో రాజనీతిని గురించిన చర్చ ఆముక్తమాల్యదతో ప్రారంభం కాలేదు. సంస్కృతంలో కౌటిల్యుని అర్థశాస్త్రం నుండి తమిళంలోని తిరుక్కుఱళ్ వరకు రాజ్యధర్మాన్ని, రాజనీతిని విశ్లేషించడం అనాది కాలం నుండీ వస్తున్న సంప్రదాయమే.”
“అర్థశాస్త్రం” సాహిత్యంగా పరిగణింపబడుతుందా? Artha-shastra, (Sanskrit: “The Science of Material Gain”) also spelled Artha-śāstra, singularly important Indian manual on the art of politics, attributed to Kautilya (also known as Chanakya) — బ్రిటానికానుంచి.
తః తః
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి katha murali అభిప్రాయం:
05/24/2014 9:59 am
సర్:
ఈ వ్యాసంలో నుంచి మొదట భట్రాజు అనే మాటను ఉపసంహరించండి. భట్రాజులు ప్రస్తుతం అంధ్ర ప్రదేశ్ లో బిసీలు. వారిని కించ పరిచేలా మాట్లాడడం సరి కాదు. మాయాబజార్ లో శర్మా శాస్త్రీలు వుంటారు. కవచమిది కవచమిది అని వుత్తర కుమారుణ్ణి తెగ పొగుడుతుంటారు. పక్కన సారథి (అంజి గాడు) కూడా పొగుడుతుంటాడు. ఇద్దరూ చేస్తున్న పని ఒకటే. కాని శర్మా శాస్త్రీలు బ్రాహ్మణులవుతారు. సారథి భట్రాజు అవుతాడు. brahmanism అంటే అదే.
రాజులనూ ప్రభువులనూ జమిందారులనూ నవాబులనూ పొగిడీ వాళ్ళ మీద కావ్యాలు రాసి అంకితం ఇచ్చీ తాము రాసి వారి పేరు పెట్టి శ్రమ తెలియకపొవడం వల్ల జీవితాంతం ఒకరిని పొగిడీ (ఆశీర్వదించి) అదే ఒక జీవన విధానం చేసుకున్న వారు బ్రాహ్మణులు. కాని నాలుగు మెతుకుల కోసం మారాజ ఓ రాజ అన్న పేదలు – భట్రాజులు.
ఈ భావజాలం నుంచి యెప్పుడు బయట పడతారు.
నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి suresh kumar అభిప్రాయం:
05/24/2014 6:52 am
చాలా చాలా బాగుంది.
కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి గురించి Hymavathy.Aduri. అభిప్రాయం:
05/22/2014 10:36 am
నారాయణ శర్మగారితో జరిపిన ఇంటర్వ్యూ చాలాబావుంది.కొత్తపల్లికి చిన్నచిన్న నీతికధలు పంపడంతప్ప ఇంత వివరాలు తెలీలేదు. కొత్తపల్లి టీం సేవలు అమోఘం. నాకధలూ చాలానే శర్మాజీ ప్రచురించారు.అవన్నీనీ ఇ బుక్ గా కినిగె లో పబ్లిష్ అయ్యాయి.’పిల్లలప్రీతికధలు ‘ అనే టైటిల్ తో. కొత్తపల్లికి ధన్యవాదాలు.
ఆదూరి.హైమవతి.
చికాగో.
యు.ఎస్.ఏ.
ఈమాట గురించి గురించి తఃతః అభిప్రాయం:
05/22/2014 9:30 am
ఈ మాట తెలుగుతనం గురించి: జనవరి సంచికలో మరిచిపోకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే ఈమాటను ఉగాది శుభాకాంక్షలు చెప్పవేమని అడిగితే నన్ను గట్టిగానే కోప్పడటం నేను మరిచిపోలేదు. (ఈ విషయం మోహన గారికీ, యేకారణం వల్లనో ఈ మధ్య కనపడటం మానేసిన రమా భరద్వాజ్ గారికీ గుర్తుండే ఉంటుంది.)
తఃతః
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/22/2014 3:34 am
ప్రసాద్ గారూ, నేను కూడా తరంగ లో విన్నాను. వానరాయుడి పాట కూడా విన్నారా? విన్న తర్వాత నాగమణి గారితో మాట్లాడి విముక్తం కథ గురించి కూడా మెన్షన్ చేసిన ప్రసాద్ గారు మీరేనా?
ఈమాట గురించి గురించి jayaprabha అభిప్రాయం:
05/21/2014 11:55 pm
ఎప్పుడైనా ఎక్కడైనా ఆ జాతి లో అనుసరింపబడే ఒక సంప్రదాయం ఉంటుంది. తెలుగు జాతిలో తమ పేరుని చెప్పుకునే సంప్రదాయం తప్పనిసరిగా ప్రసాద్ గారు చెప్పిన విధానము లోనే కనబడుతుంది. ప్రసాద్ అందుకనే “తెలుగు ప్రేమికునిగా” అన్న ఒక మాట వాడేరు. అంటే తెలుగు వారి సంప్రదాయానుసారముగా అన్నమాటే! అలాంటప్పుడు మనం దానికి వేమూరి వారిచ్చినట్టుగా ఔత్తరాహుల సంప్రదాయాన్నో మరొక సంప్రదాయాన్నో ఉదాహరణ ఇవ్వకూడదు. తెలుగు వారి సంప్రదాయం ప్రకారం ఇంటిపేరు ముందుగానూ వ్యక్తి నామము తరవాతనూ రావాలి. మరో విధానము మనకి లేదు. అమెరికా లేదా ఇతర దేశాలు తరలి వెళ్ళిన వారు ఆ దేశ నియమానుసారమూ వారి వారి పేర్లని రాసే పధ్ధతిని మార్చుకొని ఉండవచ్చును గాక! తప్పనిసరి కావడం వలన. దానిని కనీసం ఈ తెలుగు పత్రిక లోనన్నా వదిలి వేయరాదా? పాటించకుండా ఉండరాదా? అన్న ఒక “భక్తి” తో కూడిన విన్నపాన్ని ప్రసాద్ చేస్తున్నారు. ఇక్కడ “జన్మహక్కూ” గట్రా పేద్ద విషయాలంటూ ఏమీ లేవు. సంప్రదాయాలనే మార్చుకుంటాం అని అలా రాసేవారు, వారిని ఔననే వారూ అనుకోవచ్చును. కానీ వేరే భాషల వాళ్ళు భారత దేశంలో వారి వారి ప్రాచీన సంప్రదాయలని కొన్నిటిలోనైనా ఖచ్చితంగా తమదైన ముద్రని నిలుపుకుంటున్నారే? ఈ తెలుగులకేమి నిలుపుకొనలేకపోవడానికి? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే వీలుంటుంది. అప్పుడు తెలుగువారికి తమ భాషా సంస్కృతుల విషయంలో అంత పట్టింపులు ఏమీ ఉండవని బాహాటంగా వారికి వారు చెప్పుకున్నట్టూ అవుతుంది. అందుకనే తెలుగువారికి సాటి తెలుగు వాడైన ప్రసాద్ గారు సున్నితంగా విన్నపం చేయవలసి వచ్చింది. అలా చేయకపోవడాన్ని చూడటం “చెప్పులో రాయిలా గుచ్చుకుంటోంది” సుమా! అని ఒక అనుభవాన్ని కూడా జోడించి మరీ గుర్తు చేసి.
ఈమాట గురించి గురించి మోహన అభిప్రాయం:
05/21/2014 3:06 pm
భారత దేశములో, ముఖ్యముగా ఉత్తర భాగములో, అక్కడక్కడ కర్ణాటకములో వ్యక్తి పేరు, ఇంటి పేరు లేక కులము పేరు ఆ క్రమములో మనకు కనబడుతాయి. కాని మిగిలిన చోట్లలో ఇంటి పేరు (సామాన్యముగా ఊరి పేరు) ముందు, తఱువాత స్వంత పేరు మనకు గోచరమవుతుంది. నెల్లూరు మోహన రావు అంటే అతడు కాని, అతని పూర్వులు కాని నెల్లూరికి చెందినవారో లేక నెల్లూరిలో పుట్టిన వారో అయి ఉంటారు. కాని మోహన రావు నెల్లూరు అంటే అన్వయము సరిగా నుండదు. కొన్ని నామములలో ఇది కొద్దిగా వేడుకగా కూడ ఉంటుంది. రాయవరపు రామనాథమును రామనాథం రాయవరపు అంటే ఏదో ఒక విధముగా ఉంటుంది. సంస్కృత వాక్యములలో సామాన్యముగా పదముల వరుస అంత ముఖ్యము కాదు. కాని ద్రావిడ భాషలలో ఇది చాల ముఖ్యము.
చివరి మాట – ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తికి చెందినది. అతడు / ఆమే దానిని ఏ విధముగానైనను అమర్చుకోవచ్చును, అది ఆ వ్యక్తి జన్మ హక్కు, స్వాతంత్ర్యము. కొన్ని సమయాలలో అది తమాషాగా ఉంటే ఉండనీ గాక! నా రెండు తామ్ర శతకములు 🙂
విధేయుడు – మోహన