పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి venkat.b.rao అభిప్రాయం:

    06/15/2014 2:57 pm

    అన్ని రకాల (సంప్రదాయ, ఆధునిక) తెలుగు సాహిత్యంతో కాస్త పరిచయం ఉంది. అయినా, రిసర్చి, పరిశోధనా పధ్ధతులు, వాటిలో మంచి చెడులు…ఇట్లాంటివి ఇప్పటికీ పెద్దవాళ్ళకు సంబంధించిన సంగతులే, నా మటుకు నాకు. ఆ కారణంగా ఇందులో తల దూర్చడం అంత మంచిది కాదని ఊరుకున్నాను. అయితే, ఇక్కడ జరుగుతున్న ఇంత చర్చ చూశాక, మరీ నిశ్శబ్దంగా ఉండడం కూడా సరయింది కాదేమో అనిపించి ఇది –

    బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సంబంధించి బాగా పని చేసింది 1830-70 మధ్య కాలంలో. అంటే ఒకటిన్నర శతాబ్దాల క్రిత్రం పైమాటే! ఆపై ఇన్ని సంవత్సరాలుగా మనలోనే ఎంతో మంది పెద్దలు, తెలుగు సాహిత్యంలో పండితులైన ఎందరెందరో ఆయన సేవను చాలా మెచ్చుకుని ఆయన్ను తెలుగుసాహిత్య ఉద్ధరణ కార్యక్రమంలో ఒక icon ని, దాదాపు ఒక demi-god ని చేసి నిలబెట్టి చూపెడుతూ వచ్చారు. పెద్దవాళ్ళు చెప్పారు గనుక చిన్నవాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు రెండు శతాబ్దాలుగా బ్రౌను ను అలాగే గౌరవిస్తూ వచ్చారు, వస్తున్నారు. మరిప్పుడు ఇన్నేళ్ళ తరువాత ఆయన్ను ఆ స్థానం నుంచి కిందకు దించేసే ఈ ప్రయత్నంలో ఏమిటి మనం సాధించ దలుచుకున్నది అనేది నాకు ఒక పట్టాన అర్ధం గాకుండా ఉంది.

    బ్రౌన్ ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ ఆయన చేసిన పని మిగిలే వుంది. మాట వరసకి ఒక్క క్షణం బ్రౌన్ అనుసరించిన పరిష్కరణ పధ్ధతులు సరయినవి కాదని అనుకున్నా, ఆయన ప్రారంభకుడు అనే దాన్లో అనంగీకారం లేదు కదా! డబ్బు ఖర్చుపెట్టి ఊరూరా పండితులను పంపి తాళపత్ర సేకరణలు, ఉద్యోగులనుగా నియమించుకుని పరిష్కరింపజేసి ప్రచురింపజేయడం, వ్యాఖ్యానాలు వ్రాయించడం, నిఘంటు నిర్మాణం – ఈ అంతా ఒక్క మనిషి ఆధ్వర్యంలో!

    బ్రౌను చేసిన పని రెండున్నర శతాబ్దాలుగా తెలుగునాట ఉంది. ఆయన నిఘంటువును ఇన్నాళ్ళుగా సంప్రదించుకుంటూ అర్ధనిర్ణయం చేసుకుంటూ సామాన్య పాఠకులనుంచి పండితుల దాకా కూడా ఇన్నేళ్ళుగా తెలుగు సంప్రదాయ సాహిత్య పఠనం చేస్తూ వస్తున్నాం. ఇందువలన ఇన్నేళ్ళుగా తెలుగు సాహిత్యానికి జరిగిన కీడు ఏమిటి? బ్రౌన్ చేసిన సేవను అనుసరించి పఠనం చేసి ఏం పోగొట్టుకున్నాం మనం? ఒకవేళ ఆ పోగొట్టుకున్నది ఏ కొంచేమైనా ఉంటే అది ఈనాడు ఇంతగా బాధ పడాల్సినంత relevant ఏనా? అని.

    సంపాదకులు ముందుమాటలో ‘దాస్యప్రవృత్తి’ అని ఒక మాట వాడారు. తెనుగేతరుడైన ఒక వ్యక్తి, తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడి monumental proportions లో చేసిన కృషికి, అందుకు పడిన కష్టానికి నచ్చి అనో, కృతజ్ఞతగానో ఆయన్ను పొగడడం, ఆయన్ను గౌరవించడం ‘దాస్యప్రవృత్తి ‘ ఎలాగవుతుంది సార్! ఈ పనే ఒక తెలుగువ్యక్తి చేసి ఉన్నట్లయితే ఆయన్ను గౌరవించమా?

    సంపాదకులదే ఇంకొక మాట… “గత కొన్నేళ్ళుగా విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన సాహిత్య, చారిత్రక ఆధారాలను పరిశీలించి….” తెలుగు సాహిత్యంమీద మక్కువతో మామూలు పాఠకుణ్ణి నేను (తెలుగు సాహిత్య పఠనం విషయంలో నాలాంటి వాళ్ళే ఇంకా ఎంతో మంది)… ఇన్ని ఏళ్ళ తరువాత, ఇన్ని ఏళ్ళపాటు విస్తృత పర్యటనలు చేసి పరిశీలించితే గాని దొరకని తప్పులతో ఇప్పుడు నాకు నిమిత్తం లేదు. ఆయన సేవను ఇప్పటికీ నేను గౌరవించకుండా ఉండలేను. ఎందుకంటే, తెలుగు సాహిత్య చరిత్రలో బ్రౌన్ ఉన్న కాలంలో ఆయన పనిని (ఆ స్థాయిలో ఆయన పనిని) మినహాయించుకుంటే, లేదనుకుంటే… తీసేస్తే, తెలుగు సాహిత్యంలో మనకు ఇప్పుడు ఎన్ని పాత గ్రంథాలు దొరికేవో పోయేవో నేనిప్పుడు ఊహించుకోలేను! ‘బంగోరె’ ఒక మాట అన్నాడు (బ్రౌన్ లేఖలులో) “ప్రాచీన తెలుగు వాఙ్మయంలో కాలగర్భంలో కలిసి పోయినవి పోగా మనకు లభ్యమైనవి సగం మాత్రమే. ఆ సగభాగంలో ఇంచుమించు సగం కంటే ఎక్కువభాగాన్ని సేకరించి, ఉధ్ధరించి, భద్రంచేసిన వాఙ్మయోధ్ధారకుడు బ్రౌన్”… దీనితోనే నాకు నిమిత్తం, ఎప్పటికైనా! ఇందుకే బ్రౌన్ ని నేను గౌరవిస్తాను, అది ‘దాస్యప్రవృత్తి’ అయినా సరే!

    ఇప్పుడు ‘దూకుడు’ అనే మాట ఒకటి కొత్తగా బయటి కొచ్చింది. ఈ మాట కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది (నాలాంటి వాళ్ళు మాట్లాడడానికి). తెలుగు సాహిత్య సంబంధ విషయాల్లో ఈ వ్యాసకర్తలు ఇరువురూ పెద్దల్లో పెద్దలు. దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నవారు. బ్రౌన్ కు చెందిన ఈ కోణం తెలుగు సాహిత్యానికి సంబంధించి మామూలు సంగతి కాదు. ఈ కోణం ఉన్నట్లయితే, ఇది ఇప్పటికే చూచాయగా నయినా గత దశాబ్దాల కాలంలో ప్రస్తావించబడి ఉండాలిసింది. ఉnnaట్లుండి ఇలాంటి వ్యాసం నన్ను సందిగ్ధంలో పడేస్తుంది. సంశయానికి గురిచేస్తుంది. తెలుగు సాహిత్యసంబంధ విషయాలలో నేను సరిగా inform చేయబడ్డానా లేదా అనీ, ఇలాంటి ఉపద్రవాలు ఇంకా ముందు ముందు ఎన్నెన్ని ఉన్నాయా అనీ, అసలు దీనిని ఇప్పుడు నేను సీరియస్ గా తీసుకోవాలా లేదా అనీ, బ్రౌన్ కు సంబంధించి ఈ error of judgementకీ, ఈ confusionకీ కారణం ఏమిటి అనీ, లోపం ఎక్కడుంది? ఇన్నేళ్ళ పండితలోకం judgement లోనా లేక ఈ వ్యాసకర్తలిరువురి, వారికి వత్తాసుపలికిన సంపాదకవర్గం judgement లోనా? అనీ! ప్రస్తుతానికి నాకు ఇవతలివాళ్ళలోనే ఉంది అనుకోవడంలోనే సౌకర్యం వుంది. ఎందుకంటే వీరు నలుగురైదుగురే. అవతల ఆరుధ్ర, బంగోరె లాంటి పెద్దవాళ్ళు ఎందరెందరో!

  2. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి jayaprabha అభిప్రాయం:

    06/15/2014 12:34 am

    సాహిత్యంలో విషయాలే ఉంటాయి. దూకుడులుండవ్! రేఫ ర కారం మీద పెద తిరుమలయ్య ప్రత్యేకంగా ఒక పుస్తకం రాసింది నిజం కాదా? ఆ తరువాత తన రచనలలో వాటిని పాటించకపోవడం నిజం కాదా? బ్రౌన్ కాలం కన్నా పెదతిరుమలయ్య ఎంత ముందటివాడూ? అంటే దేశీయ పండితులలోనే ఈ విషయం మీద ఒక లెఖ్ఖ లేనప్పుడు బ్రౌన్ కి ఎందుకుంటుందీ? అన్నది నా ప్రశ్న ఇందులో “దూకుడు” ఏమిటబ్బా? వీళ్లని కాసేపు పక్కన పెడదాం ఇవాళ మనలో అసలు ఎంత మందికి తెలుసును గనకా? మాములు ర అన్నది ఎక్కడ రాయాలో బండి ర అన్న దానిని ఎక్కడ రాయాలో? ఆ పదాల పట్టికని వేసి ఇచ్చిన పాత రచయితల పుస్తకాలు అందుబాటులోకి మనం ఎందుకని తెచ్చుకుని పాటించలేదూ? మనకే నిజంగా లెఖ్ఖ లేదు గనకే కద. అలాగే నిండు సున్న అరసున్న విషయం లోనూ ఎన్ని సూత్రాలు వల్లె వేసినా మనం వాటిని నిజంగా ఎప్పుడూ పాటించలేదే? అఖ్ఖరలేని బరువులని వదిలేయమని ఒక పక్క పాఠ్య పుస్తకాలలో సూచనలు ఇవాళ్టికీ ఇస్తూనే ఉన్నామే! ఇవాళ ఎన్నో మార్పులు వచ్చాయి పదాలని రాయడంలో [వ్రాయడం] అని కదా ఉండాలి 🙂 ఈ క్రొత్త ప్రాత వ్రాత ఇవన్నీ పోలేదా? ఇవన్నీ ఎలా పోయేయీ? బ్రౌన్ వచ్చి మార్చేడా? బ్రౌన్ రేఫ రకార బేధాన్ని పరిష్కరణలో పాటించలేదని దాన్ని ఒక దోషమని ప్రకటన చెసేముందు అది అసలు ఎంత పాటి దోషమో దాని వలన తెలుగు సాహిత్యానికి ఏమి నష్టం జరిగిందో మీరు ఏమి చెప్పారూ? ఇంక బ్రౌన్ కి ముందు మనకున్న “పరిష్కరణ” విధానాలు [అసలంటు ఉన్నాయా?] ఎటువంటివో చెబితే కదా? ఆపై బ్రౌన్ ఏమి కొత్త మార్పులు తెచ్చి మన ప్రాచీన సాహిత్యాన్ని బ్రస్టు పట్టించాడో మనకి తెలిసేది? దబాయింపులు చేసి సాహిత్యంలో ఎవరిని మభ్యపెడతారూ? ఇప్పుడు చెప్పండి “దూకుడు” ఎవరిదో?

    [Edited. Personal references removed – Ed.]

  3. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తః తః అభిప్రాయం:

    06/14/2014 1:03 pm

    ఇద్దరు రచయితలలొ ఒకరు అప్పికట్లలోనూ, మరొకరు అంతరిక్షంలొనూ ఉన్నా ఇబ్బంది లేని రొజులివి. నేను ప్రస్తావించిన విషయం గురించి భవిష్యత్ రచనలను దృష్టిలో ఉంచుకుని సంపాదకులు ఆలోచన చేస్తారనుకుంటాను. ఈ వ్యాస రచయితలు నేనన్న అసలు విషయాన్ని ముచ్చటగా దాటేసి, ‘పాఠకుల అభిరుచికి వదిలేసిన’ తీరు “మక్కల్ తీర్పు మహేశ్వరన్ తీర్పు” అనే తమిళ రాజకీయాన్ని గుర్తుతెచ్చింది. వారికి జొహార్లు – తః తః

  4. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అభిప్రాయం:

    06/14/2014 11:44 am

    ఈ మాట సంపాదకులకి:

    బ్రౌన్ గురించి మేం రాసిన వ్యాసం మీద ఈమధ్య ఆఖరుగా వొచ్చిన ఉత్తరాలు చూస్తే –- అందులో ముఖ్యంగా ఏల్చూరి మురళీధరరావు గారి ఉత్తరం చూస్తే — వివరాలు పక్కన పెట్టి ఒక ముఖ్యమైన విషయం మరొక సారి ప్రస్తావించవలసి వొస్తోంది. మురళీధరరావు గారి ఉత్తరంలో ముఖ్యమైన వాక్యం ఇది:

    “బ్రౌన్ పరిష్కరణ సంవిధానం మీరే ఉదాహరించిన ఆంగ్లవాక్యాలను బట్టి, అది సార్థకమై, అంతర్జాతీయప్రమాణాలకు సైతం అనుగుణంగా ఉన్నట్లే నాకనిపించింది. ప్రతులను సేకరించటం, పాఠాంతరాలను గుర్తించటం, కవికి అత్యంతసమీపకాలంలో వెలసిన పాఠాన్ని గుర్తించటం, భావప్రతీతికి దోహదంచేసే మేలైన పాఠాన్ని స్వీకరించటం అన్న ఆయన ‘విధానం’ మీరన్నట్లు ఈనాటికీ మనము అనుసరిస్తున్నదే. అందులో లోపాలుంటే, అవి పరిష్కర్త వైదుష్యలుప్తికి, పరిణతప్రజ్ఞ లేమికి, కావ్యానుభవరాహిత్యానికి మాత్రమే నిదర్శనలు. విధానంలో లోపాలు కావు.”

    మాకూ మురళీధరరావుగారికీ వున్న అభిప్రాయ భేదం ఈ వాక్యంలో “విధానంలో లోపాలు కావు” అన్న ఆలోచన దగ్గిరే వుంది. గ్రంథ పరిష్కరణలో అంతర్జాతీయ విధానాలు వుండవు. ఫ్రతి సాహిత్య సంప్రదాయమూ, సాహిత్య ప్రపంచమూ వేరువేరుగా వుంటాయి. ఆ సాహిత్య ప్రపంచానికి అనువైన గ్రంథ పరిష్కరణవిధానాలు ఆ సాహిత్యం అనుసరిస్తుంది. కాని, తెలుగు సాహిత్య ప్రపంచ స్వరూపం ఏమిటి, అది తనకు తెలిసిన లాటిన్, గ్రీక్ సాహిత్య ప్రపంచం కన్న ఎలా భిన్నమైనది అని ఒక ప్రశ్న వేసుకుని తెలుగు సాహిత్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే ఆలోచన కాని, అవసరం కాని బ్రౌన్ కి లేకపోయాయని మేం మా వ్యాసంలో చెప్పాం. బ్రౌన్ ఏర్పరిచిన పరిష్కరణ విధానాలనే తెలుగు పండితులందరూ ఒప్పేసుకుని పనిచేస్తున్నారని మురళీధరరావుగారూ అంటున్నారు. ఈ విషయం అందరికీ గుర్తింపుకి వొచ్చి, అయితే మన సాహిత్య ప్రపంచం ఎటువంటిది, పాశ్చాత్య సాహిత్య ప్రపంచం కన్న ఏ రకంగా భిన్నమయినది అనే ఆలోచన వస్తేనే, బ్రౌన్ మార్గం వల్ల మనం చాలా నష్టపోయామేమో అనే ఒక స్ఫురణ కలుగుతుంది. అప్పుడు చెయ్యవలసిన పని చాలా వుందని ఒక ఉహకి జాగా దొరుకుతుంది. అప్పుడు మనం వేసుకోవలసిన కొత్త ప్రశ్నలు ఏమిటో వెతుక్కుంటాం.

    మిగిలిన ఇద్దరి ఉత్తరాలలోని దూకుడు మాకు చాలా ముచ్చట కలిగించింది. ఎంత తక్కువ తెలిస్తే అంత ఉత్సాహంగా రాస్తారని మా అనుభవం. అయితే ఆ సంగతి ఇక్కడ నిజం కాకపోవచ్చు. అందుకని ఆ విషయం పాఠకుల అభిరుచికి వదిలేస్తున్నాం.

    — శ్రీనివాస్, నారా

  5. గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని గురించి తః తః అభిప్రాయం:

    06/14/2014 8:48 am

    శ్రీ ఏల్చూరి:

    “Why should you think that beauty, which is the most precious thing in the world, lies like a stone on the beach for the careless passer-by to pick up idly? Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist…” — Somerset Maugham in ‘The Moon and Six Pence.’

    తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యమైనా, గణపవరపు వేంకట కవి పద్యాలైనా ఆ ఎడ్వెంచర్ మీరు చేసి మాకు – మీ పాఠకులకు- తొనలు తొనలుగా ఆనందాన్ని పంచారు. సంస్కృత భాషలొ ఉన్న ఒక అక్షరానికి వేయి అర్థాల సౌకర్యాన్ని వాడుకోవటం అన్న దాన్నికాస్త పక్కన పెడితే వేంకట కవి సాధించినది చిన్న విషయము కాదు. వేంకట కవి చేసిన మేధొ విన్యాసం నా అభిప్రాయంలొ మన ‘native genius’. కారణాలేమైనా ఈ native geniusని మనం నిలుపుకోలేక పోయాం.

    శ్రీ నరసింహ మూర్తి గారి అభిప్రాయంతో గొంతు కలుపుతూ -ఒక చిన్న సందేహం: మీ వ్యాస శీర్షిక ‘శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని’ అని కాదు గదా. మీరు కవిని పరిచయం చేయలేదేమి? ఇంత గొప్ప కవి గురించి రెండు మాటలు గూడా చెప్పలేదు. ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము’ ఎప్పటిదో తెలియరావటం లేదు, ఫ్రెంచ్ వారి కాలం లొనో ఆ తరువాతనో వ్రాయబడినది అని తప్ప.

    నమస్కారాలతో – తః తః

  6. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి Ashok అభిప్రాయం:

    06/13/2014 6:15 pm

    This substantial survey draws a good locus of the trajectory of Telugu poetry but at many instances seems to have been lost its argument to the perils of categorization. It is quite problematic to consider the erstwhile Literature of Telugu as “the cobwebs of Indian orthodoxy and antiquated thought processes” which is evidently overrating the impact of the European currents. The Colonial grooves of learning, to which most of the structure of the essay finds itself in ignores the omnipresent Cognitive Imperialism which is still very much an effective reality.

    The colonial rewriting of knowledge structures now looks at the entire literary and cultural history through the definitive aspects of a Western lens. This cruelly ignores the specificity and nativity of the literary or expressive traditions of the region which are apparent from the inadequacy of the very important topics of Subaltern and Feminist writings. I surely agree that the European influence did play a role but what I find appalling is the insufficient analysis on the local forms and systems of expression. Telugu poetry is about all of these. I think therefore, though it is true that western influence shaped thinkings, it is also true that we need to search those fundamentally defining aspects in literature or poetry, without which the cultural life will be pushed to oblivion. They will not be found in the established definitions.
    Thank You

  7. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తఃతః అభిప్రాయం:

    06/13/2014 8:15 am

    “తాళపత్రగ్రంథాలకు దూరంగా ఒకరం జర్మనీలోను, మరొకరం అమెరికాలోను కూర్చుని ఇంతకన్నా నిర్ధారకంగా చెప్పలేకపోయినందుకు విచారిస్తున్నాం.”

    ఒక విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఆధారాలను తృప్తిగా పరిశీలించే అవకాశాలు లేని కారణం చేత వాటిని క్షుణ్ణంగా పరిశీలించక లేకపోయినా, ఒక సిద్దాంతం చేసి, ఆ సిద్ధాంతాన్ని ఒక వ్యాసంగా ప్రకటిస్తూ, ఆ వ్యాసంలో నైనా తాము ప్రధాన ఆధారాలను పూర్తిగా చూడలేకపోయామని చెప్పక, ఆ వ్యాసం చదివిన విజ్ఞుల సందేహాలకు సమాధానంగా వ్యాస రాచయితలు వారి లోటును వివరించబూనటం ఎంత వరకూ సమంజసమో యోచించవలసినదని సంపాదకులను కోరుతున్నాను. నేటి విజ్ణాన శాస్త్ర సంప్రదాయాలను అనుసరించినట్లయితే ఇటువంటి రచనలను రచయితలూ గానీ, సంపాదకులుగానీ, వెనక్కు (retract) తీసుకోవాలి.

    తఃతః

  8. దేహాత్మ గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    06/13/2014 6:27 am

    ఆలోచింపచేసే కవిత.
    ఆత్మ లేని శరీరాన్ని ఊహించలేము. శరీరం లేని ఆత్మను నిరూపించుకోలేము!
    ఇంతకీ రసయోగ సిద్ధాంతం అంటే ఏమిటి, ఇదీ మతస్థాయికి దిగిందా? తెలిసినవారు తెలుపగలరు.
    ఎవరిదో ఈ రచన!

  9. జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి kanakaraju tunga అభిప్రాయం:

    06/12/2014 11:21 am

    ధన్యవాదాలు. చాల శ్రావ్యమైన అపురూపమైన పాటలందించినందులకు రాజేశ్వరరావు గారికి మరియు పాటలు వ్రాసిన సాహిత్య కారులకి కృతజ్ఞతలు.

  10. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి jayaprabha అభిప్రాయం:

    06/12/2014 2:42 am

    తహతహా! మీలాగానే “నేను కూడా లేనని” చెప్పడమే నా వుద్దేశ్యమూను. “అనవసరమైన తొందర” అన్న పదం నేను నా మొదటి అభిప్రాయంలో వాడినప్పుడు అది పై వ్యాసం విషయంలో అక్షరాలా సత్యమనే భావించి రాశాను. బ్రౌన్ కారణంగా మన ప్రాచీన తెలుగు సాహిత్యానికి జరిగిన నష్టం గనక నిజంగా ఏమన్నా ఉంటే ఆ దిశగా గనక పై వ్యాసం నిరూపితమై ఉండి ఉంటే అప్పుడు మాత్రమే బ్రౌన్ పరిష్కరణ అన్నది ఒక చర్చనీయాంశమౌతుంది. కానీ బ్రౌన్ చేసిన పనివలన తెలుగు సాహిత్యానికి జరిగిన నష్టం ఎలాంటిదో ఈ వ్యాసకర్తలు వివరించలేకపోవడం శోచనీయం. బండిర అన్నదానిని బ్రౌన్ వాడకపోవడం ఒక దోషంగా అనుకోలేము. సాహిత్య పరిష్కరణలో బండిర అంత అయోమయమైన విషయం మరొకటి కనిపించదు. రేఫ మీద ఏకంగా ఒక పుస్తకమే రాసిన పెదతిరుమలయ్య దానిని తన రచనలలోనే పాటించలేదు. ఇంక ఇటువంటి వాటిమీద బ్రౌన్ కి ఆసక్తి కలగకపోతే అందులో ఆశ్చర్యం ఏమిటో!