పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తః తః అభిప్రాయం:

    06/16/2014 6:54 pm

    శ్రీ మోహన: డిగ్రీల గురించి, మీకు తెలియదని గాదు గానీ, ఈ వికి ముక్క చూడండి.

    George Green (14 July 1793 – 31 May 1841) was a British mathematical physicist who wrote An Essay on the Application of Mathematical Analysis to the Theories of Electricity and Magnetism (Green, 1828).[1][2] The essay introduced several important concepts, among them a theorem similar to the modern Green’s theorem, the idea of potential functions as currently used in physics, and the concept of what are now called Green’s functions. Green was the first person to create a mathematical theory of electricity and magnetism and his theory formed the foundation for the work of other scientists such as James Clerk Maxwell, William Thomson, and others. His work on potential theory ran parallel to that of Carl Friedrich Gauss.

    Green’s life story is remarkable in that he was almost entirely self-taught. He received only about one year of formal schooling as a child, between the ages of 8 and 9.

    నమస్కారాలతో -తఃతః

    (మరిన్ని వివరాలు కావలిసినవారికి: ‘ఫిజిక్స్ టుడే’ డిసెంబర్, 2003 పే 41-46.)

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    06/16/2014 6:50 pm

    పరమ్ గారూ: మీరు సూచించిన కీర్తన ప్రక్షిప్తం అవ్వడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. నా దగ్గరున్న కీర్తన (కొంతవరకూ సాధికారకమే) జాబితాలో “నీ బలమా నామ బలమా” అన్నది లేదు.

    త్యాగరాజు కీర్తనల్లో అను-పల్లవి, చరణాల చివరి పదం పల్లవి మొదటి పదంతో వృత్త అనుబంధంలా సాగుతుంది. కొన్ని సందర్భల్లో చరణానికి ఈ సూత్రం వర్తించకపోయినా, అనుపల్లవికి మాత్రం ఖచ్చితంగా వుంది. ఉదాహరణకి:

    పల్లవి: నగు మోము గల వాని నా మనో-హరుని
    జగమేలు శూరుని జానకీ వరుని

    చరణం: దేవాది దేవుని దివ్య సుందరుని
    శ్రీ వాసుదేవుని సీతా రాఘవుని (నగు)

    మీరు చెప్పిన కీర్తన తీసుకుంటే అనుపల్లవిలోనే అది చెడింది.

    పల్లవి: నీ బలమా నామ బలమా నిజముగ బల్కవే ఓ రామ
    అనుపల్లవి: శ్రీ భుజ మా తల్లి బలమా షీలాత్ముతౌ సౌ-భక్త బలమా

    బలమా, నీ బలమా అన్నది సాహిత్య పరంగా వినడానికి, పాడుకోడానిక్కూడా ఎబ్బెట్టుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కీర్తన త్యాగరాజు పేరు క్రింద ఎవరో తోసేసారు. ఇంకో విషయం, త్యాగరాజు ముద్ర ఉన్నంత మాత్రాన అది త్యాగరాజ కీర్తన అవనవసరం లేదు. తిరువారూరు దైవం త్యాగరాజు పేరున చాలామంది కీర్తనలు కట్టారు.

    -సాయి బ్రహ్మానందం

  3. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:

    06/16/2014 3:45 pm

    ఈ మాట సంపాదకులకి:

    జయప్రభ రాసిన ఉత్తరం సభ్యసమాజపు పరిమితులు దాటిన ఉత్తరం. సంపాదకుల సామర్థ్యాన్ని, వారి నిర్ణయాన్ని అగౌరవపరిచే ఉత్తరం. తనకి విద్యావంతుల మధ్య మర్యాదగా ఎలా ప్రవర్తించాలో తెలియదని తెలియజేసే ఉత్తరం. ప్రచురించబడిన వ్యాసంలో ఉన్న విషయాన్ని చర్చించడం మానేసి, వ్యక్తుల సామర్థ్యాలని ప్రశ్నించే ధోరణిని నాగరక సమాజం హర్షించదు. జయప్రభ శ్రీనివాస్‌కీ ఈమాట సంపాదకులకీ క్షమాపణలు చెప్పాలి.

    నారా

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Param Kompella అభిప్రాయం:

    06/16/2014 3:33 pm

    సాయి బ్రహ్మానందం గారు,
    చాల మంచి విషయాలు చెప్పారు, ఇప్పుడే చదవడం వల్ల చాల ఆలస్యం గా నా అభిప్రాయం తెలుపుతున్నా. ఆనంద భైరవి లో “నీ బలమా నామ బలమా” అనే ఇంకొక కీర్తన కూడ ఉన్నట్లు గుర్తు. బాల మురళి గారి రికార్డింగ్. ప్రక్షిప్తము ఏమో తెలియదు. ఈ లింక్ చూడండి సాహిత్యానికి.

    ధన్యవాదములు

  5. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మోహన అభిప్రాయం:

    06/16/2014 3:11 pm

    తెలుగులో డిగ్రీలు లేనంత మాత్రాన, తెలుగు శాఖలో ఆచార్యత్వము లేనంత మాత్రాన, తెలుగు భాషలో ఉన్న ఆసక్తితో, వారివారి ఇష్టాయిష్టాల ననుసరించి, వారు ఎన్నుకొన్న విభాగాలలో ఏళ్ల తరబడి నిరంతరము లోతుగా అధ్యయనము చేసి, ఆలోచించి, పరిశోధనలు చేస్తున్న వారు లేరని అనుకొనడము అంతగా సమంజసము కాదేమో? విధేయుడు – మోహన

  6. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి venkat.b.rao అభిప్రాయం:

    06/16/2014 12:20 pm

    జయప్రభ గారూ!

    పరుచూరి శ్రీనివాస్ గారి గురించి నాకు ఇంతకు ముందు తెలియదండీ! నారాయణరావు గారితో కలిసి ఇంత పెద్ద వ్యాసం వ్రాయడంలో భాగస్వామి అయ్యారు కనుక అలా అనుకున్నాను. అది కొంత ఇబ్బందిని కలగజేసేదని ఇప్పుడు అర్ధమయింది. ఇలాంటి విషయాలు రాసేటప్పుడు ఎంత జాగర్తగా ఉండాలో కూడా అర్ధమయింది.

    ఇప్పుడు నా వ్యాఖ్యలోని ఆ వాక్యాన్ని (విషయాన్ని నాకు తెలిసినంతవరకే పరిమితం చేసుకుంటూ) ఇలా సరిచేస్తున్నాను…”తెలుగు సాహిత్య సంబంధ విషయాల్లో, నాకు తెలిసున్నంతలో, ఈ వ్యాసకర్తలిరువురిలో నారాయణరావుగారు పెద్దల్లో పెద్దలు. దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నవారు…”

    ధన్యవాదాలు!

  7. మైదానానికి చెలియలి కట్ట గురించి VSTSayee అభిప్రాయం:

    06/16/2014 12:53 am

    lyla yerneni అభిప్రాయం:

    ప్రస్తుతం చదువుతున్న నవలలో, ఈ వాక్యం తెలుసుకోటం మీద నా మనసు లగ్నమై ఉన్నది. “అశిక్షితపటుత్వ మమానుషీషు సందృశతే కిముతయా ప్రతిబోధవత్య” -ఎవరికి తెలిసినా చెప్పరూ. మార్గణము అన్న మాటకు అర్ధం కూడా.

    స్త్రీణా మశిక్షిత పటుత్వ మమానుషీషు
    సందృశ్యతే, కిముత యాః ప్రతిబోధవత్యః
    ప్రాగన్తరిక్షగమనా త్స్వ మపత్యజాత
    మన్యై ర్ద్విజైః పరభృతాః ఖలు పోషయన్తి.
    (కాళిదాస అభిజ్ఞానశాకున్తలమ్‌ 5.22)

    స్త్రీణాం = స్త్రీలకు
    అశిక్షితపటుత్వమ్‌ = నేర్పఁబడని (కార్యసాధన) పటిమ – సహజమైన జాణతనము అనుట
    అమానుషీషు = మనుష్యేతర – పశుపక్ష్యాది – జాతులందు
    సందృశ్యతే = చూడఁబడుచున్నది
    యాః = ఎవరు
    ప్రతిబోధవత్యః = మంచిబోధన గలిగినవారో (తాః = వారు)
    కిముత = చెప్పవలయునా!
    పరభృతాః = ఆడుకోయిలలు
    స్వం అపత్యజతం = తమ బిడ్డల సమూహమును
    అన్తరిక్ష గమనాత్‌ ప్రాక్‌ = ఆకసమున పోవుట -ఎగురుట-కు ముందు
    అన్యైః ద్విజైః = వేఱు పక్షుల-నల్లకాకుల-చేత
    పోషయన్తి ఖలు = పెనిపించునుగదా.
    (శ్రీ నేలటూరు రామదాసయ్యంగారి వ్యాఖ్యనుంచి)

    నిఘంటువులలో: మార్గణము

    Regards,
    VSTSayee.

  8. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి jayaprabha అభిప్రాయం:

    06/15/2014 11:31 pm

    వెంకటరావు గారూ! మీరన్న ఒక మాట నన్నే కాదు చాలా మంది సాహిత్య రంగం లోని వారిని సందేహంలో పడేసే మాట. అదేమంటె… “ఈ వ్యాస కర్తలురువురూ పెద్దల్లో పెద్దలు, దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నవాళ్ళు.” మీ మాట నారాయణ రావు గారి వరకూ అంగీకరించడంలో ఎవరికీ ఇబ్బందిలేదు. ఆయన చేసిన కృషి తెలుగు విమర్శలోనూ తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయడం లోనూ మన ముందు ఉంది గనక. కానీ పరుచూరి శ్రీనివాస్ గారి సంపత్తి తెలుగు సాహిత్యంలోనూ తెలుగు విమర్శలోనూ ఏపాటిదో తెలియడం కష్టం. ఆయన తెలుగు సాహిత్య రంగానికి సంబంధించిన వారు కాదు. అందువలన వారి వ్యాఖ్యానాలు అవి ఏవైనా సరే సాహిత్యానికి సంబంధించి “అధికారికంగా” నేను భావించను. ఆసక్తి సాహిత్యం మీద ఎవరికైనా ఉండవచ్చు. కానీ ఏకంగా సాహిత్య రంగంలోకి జొరబడి ఏ అధికారంతో ఆయన నారాయణ రావు గారితో కలిసి ఇన్ని మాటల్ని మాట్లాడేస్తున్నదీ ఎవరైనా వింత పడవలసిన విషయమే! ఆయన మాటలు సాహిత్య రంగానికి సంబంధించి “ఈమాట” లో కాక ఇంక ఎక్కదైనా ప్రచురితమైనవా? మీకేమన్నా తెలుసా? నాకు తెలీదు. ఆయన తెలుగు సాహిత్యంలో గణనీయమైన కృషి చెసి పుస్తకాలని ప్రకటించేరా? ఒక్కటీ ఇంతవరకూ నా దృష్టికి రాలేదు. అందువలన తెలుగు సాహిత్యం మీద ఆయన ఏమి మాట్లాడినా నేను వాటిని ఈమాట స్పేస్ ని వాడుకుని మాట్లాడుతున్న మాటలుగా భావిస్తానే గాని అంత కన్నా ఎక్కువ సీరియస్ గా తీసుకోను. నారాయణ రావు రాసిన విషయాలని సీరియస్ గా తీసుకున్నాను గనకే స్పందించాను. ఈ వ్యాసకర్తలు ఇద్దరిలో లో నా ప్రతిస్పందన ఒక్కరికి మాత్రమే! ఇంక మిగిలిన మీ అభిప్రాయంతో నాకు సంపూర్తిగా ఏకీభావం ఉంది.

    [సాహిత్యంలో ఇతరుల అధికారాలని ప్రశ్నించేముందు కొంత ఆత్మవిమర్శ అవసరమేమో జయప్రభ గారూ! – సం.]

  9. మైదానానికి చెలియలి కట్ట గురించి lyla yerneni అభిప్రాయం:

    06/15/2014 5:57 pm

    ఈ వ్యాసం, ‘మార్గము-మార్గణము’ అన్న పుస్తకంలో కూడా ఉన్నది. (సాహిత్య వ్యాసాలు. -రచయిత. జయప్రభ.) ఆ పుస్తకం లో ‘భాగవత క్రిష్ణుడు’ వ్యాసం మోతగా ఉంది. జయప్రభ సాహిత్య వ్యాసాలు బాగా రాశారు. She is an engaging writer. She is an entertaining writer. మైదానం, చెలియలి కట్ట నవలలు – రెండూ మళ్లీ చదువుతున్నాను.

    చాలా ఏళ్ల క్రితం, కొందరు జ్యూయిష్ పంతుళ్లు నాకు ఇలా చెప్పారు. మా Jews లో రెండు తెగలు. 1. యూదులంటే పడని జనాలను ద్వేషించే వారు. 2. తాము యూదులై ఉండటాన్ని, తామే ద్వేషించే వాళ్లు. రచయిత చలం, కి, తన బ్రాహ్మణత్వం సుతరామూ ఇష్టం లేదనిపిస్తుంది.
    విశ్వనాథ రచనలలో బాగా నవ్వించగలరు. కొన్ని చోట్ల, దాదాపు ప్రతి వాక్యానికీ నవ్వొస్తోంది. ఆయన వాదన, పటిష్ఠంగా ఉంటుంది. రచయిత లిద్దరికీ నిజంగా వాదం, స్త్రీని గురించి కాదు.

    చలం -బాపన కుంకలకు జీవితం ఎలా అనుభవించాలో తెలియదు, జీవితంలో ఆనందం ఉంది. చూడు! -అంటాడు. విశ్వనాథ ఒక గద తీసుకుని వెంటబడి, -ఎక్కడ ఉందిరా డింభకా! ఏదీ ఈ కాంబినేషన్ లో ఉందా? ఈ కాంబినేషన్ లో ఉందా? ఆనంద మెక్కడ ఉంది, చూపించు. -అని స్తంభాలు పగల గొడుతున్నాడు. నాకు నవ్వాగదు. వీరిద్దరూ టీచర్లే గద! ఈ మధ్యే రాయబడిన, ‘విముక్తం’ కధ రచయిత టీచరే. అయితే ఏంటి? ఇక్కడ రాస్తున్న వాళ్లు చాలా మంది టీచర్లే, So what? అంటే, ఆ సంగతి తరవాత. ప్రస్తుతం చదువుతున్న నవలలో, ఈ వాక్యం తెలుసుకోటం మీద నా మనసు లగ్నమై ఉన్నది.

    “అశిక్షితపటుత్వ మమానుషీషు సందృశతే కిముతయా ప్రతిబోధవత్య” -ఎవరికి తెలిసినా చెప్పరూ. మార్గణము అన్న మాటకు అర్ధం కూడా.

    (పై సంస్కృత వాక్యములో విసర్గలను ఉంచటం నాకు చేతకాలేదు.)

    లైలా.

  10. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మోహన అభిప్రాయం:

    06/15/2014 5:29 pm

    సాధు శకట రేఫములను గుఱించి చర్చ జోరుగా జరుగుతున్నది. ఈ సందర్భముగా ఈ శకటరేఫమునుగుఱించి నన్నెచోడుని వ్యాసములో ఇక్కడ (తొమ్మిదవ అంశము) క్లుప్తముగా చర్చించియున్నాను. కొన్ని సందిగ్ధ సమయములలో (ఒకే ఉచ్చరణ, వేఱు అర్థములు, ఉదా. వేఱు – భిన్నము, వేరు – వృక్షమూలము) ఈ శకటరేఫమును వ్రాతలో ఉపయోగించుట నా ఉద్దేశములో సమంజసమే. ఏ పదములకు సాధు రేఫమో, ఏ పదములకు శకట రేఫమో అను విషయములో నిఘంటువులు (ఉదా. ఆంధ్రభారతి) ఉపయోగకరము. ఈ విషయము అరసున్న వాడుకకు కూడ చెల్లుతుంది. విధేయుడు – మోహన