పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. ఒక శతాబ్దకాలంలో భూపరిణామక్రమం: భూచక్రం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    07/01/2014 11:13 am

    “మనం జీవిస్తున్న భూమి ఒకప్పుడు లక్షల విత్తనాలను తనలో మొలిపించిన ఘనమైన తల్లి అయి ఉంటుంది. లక్షలాది జీవ రేణువులను పాలించిన ఆది అవ్వ అయి ఉంటుంది. సుఖ సంతోషాలను, దుఃఖాలను, సంఘర్షణలను చూసిన మూగ సాక్ష్యం అయి ఉంటుంది. ఎన్నో జీవించిన క్షణాలను మోస్తున్న కాలగర్భ అయి ఉంటుంది”.

    “ఒకప్పుడు ఉపయోగ విలువను మాత్రమే కలిగి ఉన్న సహజ వస్తువు భూమి, ఇప్పుడు పక్కా వినియోగ వస్తువుగా మారి ఆక్రమణలకూ, అధికార దాహానికీ గురౌతున్న క్రమాన్ని; భూమిపై యాజమాన్యం దాని మీద శ్రమించి అనుబంధం పెంచుకొన్న వారి కంటే, ఇతరులకు ఎలా హక్కుభుక్తం అవుతూ వచ్చిందో సోదాహరణంగా వివరించిందీ మధురాంతకం నరేంద్రగారి భూచక్రం నవల. మనిషి భూదాహానికి బలై పోయిన వేప చెట్టు ఇచ్చిన చివరి వీడ్కోలు హృదయాన్ని పిండి వేస్తుంది.”

    మధురాంతకం నరేంద్రగారి భూచక్రం నవలపై పదునైన సమీక్ష రాసిన రమాసుందరి గారికి మనఃపూర్వక అభినందనలు.

  2. సమస్త సిద్ధాంతం అవసరమా? గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/01/2014 10:47 am

    వాసుదేవరావు గారూ:
    మీ ఆక్షేపణ అర్థం అయిందనే అనుకుని మీరు “కోట్‌” చేసిన వాక్యంలో “గణితం” అనడానికి బదులు “శాస్త్రం” అనే మాట ప్రతిక్షేపిస్తున్నాను. నేను “గణితం” అనే మాటని గణిత శాస్తాన్ని కాని గణిత శాస్త్రవేత్తలని కాని ఎగతాళి చేసే ఉద్దేశంతో రాయలేదు. ఏ రంగంలో అయినా సరే మనం వాడే సమీకరణాలు, భిన్నాలు, నిష్పత్తులు వగైరా భావాలని వ్యక్తం చెయ్యడానికి మనం అంతా సామాన్యంగా వాడే “లెక్కలు” అనే భావనే. నేను వాడిన “మోసం,” “కిట్టింపు” వగైరా మాటలు దురుద్దేశంతో వాడినవి కావు. రిచ్ఛర్డ్‌ ఫైన్‌మన్‌ వాడిన “షెల్‌ గేమ్‌” కి నేను చేసిన తెలుగు సేత. “రెగ్యులరైజేషన్‌” వంటి మాటల వెనక ఉన్న భావాన్ని తేలిక తెలుగులో చెప్పేటప్పుడు అందరిని మెప్పించడం సాధ్యం కాదు. – వేమూరి.

  3. ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/01/2014 10:31 am

    ఈ వ్యాసం మొదటి నాలుగు వరసలూ చదవగానే ఉండబట్టలేక రాస్తున్నాను. నేను బందరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియేట్‌ చదువుతూన్న రోజులలో మా ఇంగ్లీషు మేష్టారు, జి. వి. జొగారావు గారు, బోర్డు మీద ఈ దిగువ వాక్యం రాసి, దానికి “పంక్త్యువేషన్‌ మార్కులు” పెట్టి అర్థవంతంగా చెయ్యమని అడిగేరు.

    Johnson where John had had had had had had had had had had had better effect.

    కాలక్షేపం చెయ్యటానికి ఇటువంటి క్రీడలు బాగుంటాయి. – వేమూరి.

  4. సమస్త సిద్ధాంతం అవసరమా? గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    07/01/2014 9:41 am

    “లెక్కలలో కాని, భౌతిక శాస్త్రంలో కాని ఎంత పెద్ద సంఖ్యనయినా భరించగలం కాని ‘అనంతం’ వస్తే భరించలేము. అప్పుడు ఆ లెక్క ‘చేసేవాడి ముఖం మీద పేలిపోయింది’ అంటాం.”
    “ఇటువంటి పరిస్థితి నుండి తప్పించుకోటానికి గణితంలో రకరకాల చిటకాలు వాడతారు. మౌలికంగా ఈ చిటకాలు అన్నీ చేసే పని ఒకటే, కళ్లు కప్పి మోసం చెయ్యటం! కాని మోసం అన్నా, కనికట్టు అన్నా మర్యాదగా ఉండదని వాటికి రకరకాల పేర్లు పెట్టి సమర్ధించుకుంటారు. ఈ పేర్లలో తరచుగా వినబడేవి నార్మలైజేషన్, రెగ్యులరైజేషన్ అనే మాటలు.”

    శ్రీ వేమూరి: మాథమాటికల్ ఫిజిక్స్ కీ గణిత శాస్త్రానికీ (Pure Mathematics) మౌలికంగా పొంతన లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే – తార్కికమైన నిజానిజాలతో తప్ప భౌతికమైన నిజానిజాలతో గణిత శాస్త్రం ప్రమేయం పెట్టుకోదన్న విషయం మీకు తెలియనిది కాదు. పైగా,’లెక్కల’ ఇన్ఫినిటికీ ‘ఫిజిక్స్’ ఇన్ఫినిటికీ భేదాలు ఉన్నాయనిపింపజేసే సందర్భాలు ఉన్నాయి. ఒక మంచి వ్యాసంలో ఈ పైవాక్యాలలో ‘లెక్కలు’, ‘గణితము’ అన్న మాటలు సామాన్యపాఠకులలో ‘లెక్కల’ మీద ఎటువంటి అభిప్రాయాలను కలగచేయటానికి అవకాశం ఉన్నదో అన్న విషయాన్ని గురించి మీరు మరొక సారి ఆలోచిస్తారనుకుంటాను.

    నమస్కారాలతో – వాసుదేవ రావు.

  5. పసుపుకాంతి గురించి avinEni bhAskar/అవినేని భాస్కర్ అభిప్రాయం:

    07/01/2014 9:03 am

    చిక్కటి తత్వాన్ని అద్భుతంగా రాశారు కవిగారూ. అభినందనలు.

  6. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మోహన అభిప్రాయం:

    06/30/2014 5:33 pm

    మిగిలిన విషయాలు నాకు తెలియవు కాని జయప్రభగారికి కొత్త ఛందస్సులో మాత్రమే కాదు, ప్రాఛీన ఛందస్సులో కూడ ఆసక్తి, ప్రావీణ్యము, గరిమ ఉన్నాయి. ఆమె భావకవిత్వములో స్త్రీపైన మాత్రమే కాదు, అన్నమాచార్యుల రచనలపైన కూడ ప్రచురించియున్నారు. పద్యాలను జ్ఞాపకము చేసికొని అనర్గళముగా గంగాప్రవాహములా వల్లించగలిగే ధారణాశక్తి గలవారు. నా ఉద్దేశములో PhD అనేది ఒక శిక్షణ మాత్రమే. ఆ పట్టా విద్యకు అంతము కాదు, ఒక పునాది మాత్రమే. ఆ పట్టాను పుచ్చుకొన్న తరువాత ఏమి చేస్తారన్నదే ముఖ్యమైన విషయము. ఆ PhD పట్టా లేకుండా కూడ పరిశోధనలను ఇంతకు ముందు చేసారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇకపైన కూడ చేస్తారు. PhD degree లేక ఎన్నో విద్యార్థులకు PhD పట్టంకోసం guide చేసిన వారు కూడ ఉన్నారు (ఉదా. రామన్, బోస్). విధేయుడు – మోహన

  7. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    06/29/2014 2:41 pm

    తెలుగు సాహిత్య పరిశోధకులకి ఉండవలసిన అర్హతల గురించి జయప్రభ లేవనెత్తిన ప్రశ్న ఆలోచించదగిందే. అలాగే, ఆ అర్హతల గురించి ప్రశ్నించే వారికుండవలసిన అర్హతల గురించి, వారిని ప్రశ్నించే వారికుండాల్సిన అర్హతల గురించి – ఇలా అందరి అర్హతల్నీ ప్రశ్నించొచ్చు. ఇదో కోణం.

    ఇకపోతే పెద్దపెద్ద డిగ్రీలున్నవాళ్లని చూద్దాం. ఎందాకో ఎందుకు ఎదురుగ్గా వున్న జయప్రభనే తీసుకుందాం. ఆవిడకి తెలుగులో Ph.D. డిగ్రీ ఉన్నట్టు విన్న గుర్తు. మరి అంత డిగ్రీని పెట్టుకుని ఆవిడ చేస్తున్న హాస్యాస్పదాలు, అర్థరహితాలు, నిర్హేతుకాలు, ఉద్రేకపూరితాలైన కుతర్కాలు చూసినవారెవరైనా తెలుగులోPh.D. ఉండటం సాహిత్యవిమర్శకి పూర్తిగా పనికిరాని అర్హత అని భావించే అవకాశం ఉంది. మరి దేన్లో ఏ డిగ్రీ ఎక్కడి నుంచి వుంటే వాళ్లు తెలుగు సాహిత్య విమర్శకి అర్హమైనవాళ్లో నిర్ణయించేందుకు ఇంకెవరైనా మరో పనికిమాలిన Ph.D. చెయ్యాలేమో తెలీదు.

    పట్టుమని ఒక తెలుగు పద్యానికి – పూర్వ ఛందస్సులో వున్నా కొత్త ఛందస్సులో వున్నా – అర్థం వివరించగలిగే సత్తాలేని చచ్చు తెలుగు పి. ఎచ్. డి. లు ఎందరో తెలుసు నాకు. జయప్రభ అలాటి కోవలోదో కాదో నాకు తెలీదు గాని తనకి అన్నీ తెలుసునని, మరెవరికీ ఏదీ తెలీదనీ, ఊహాలోకాల్లో విహరించే వాళ్లలో మాత్రం ఆవిడ ఉన్నారని ఇన్నాళ్ల ఆవిడ రాతల్ని చూస్తే ఇట్టే అర్థమై పోతుంది.

    రాసిన విషయాన్ని గురించి మాట్లాడితే అర్థం వుంటుంది. దాన్లో సరుకుని బట్టి రాసినవారి అర్హతలేవో అవే తెలుస్తాయి. అంతేగాని వాళ్ల అర్హతలేవిటి, వాళ్లు ఏ ఉద్దేశంతో రాశారు, ఎవరిని పైకి లేపుతున్నారు, ఎవరిని కిందికి నెడుతున్నారు – ఇలాటి ప్రశ్నలకి అంతర్జాతీయ స్థాయిలో స్థానం లేదు. రాసింది సహేతుకమా కాదా, తెలిసి మాట్టాడుతున్నారా తెలీకుండా డబాయిస్తున్నారా అనే విషయాలు విజ్ఞులైన పాఠకులకి ఇట్టే తెలిసిపోతాయ్.

  8. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి santhosh అభిప్రాయం:

    06/28/2014 9:22 am

    కానీ పరుచూరి శ్రీనివాస్ గారి సంపత్తి తెలుగు సాహిత్యంలోనూ తెలుగు విమర్శలోనూ ఏపాటిదో తెలియడం కష్టం. ఆయన తెలుగు సాహిత్య రంగానికి సంబంధించిన వారు కాదు. అందువలన వారి వ్యాఖ్యానాలు అవి ఏవైనా సరే సాహిత్యానికి సంబంధించి “అధికారికంగా” నేను భావించను. ఆసక్తి సాహిత్యం మీద ఎవరికైనా ఉండవచ్చు. కానీ ఏకంగా సాహిత్య రంగంలోకి జొరబడి ఏ అధికారంతో ఆయన నారాయణ రావు గారితో కలిసి ఇన్ని మాటల్ని మాట్లాడేస్తున్నదీ ఎవరైనా వింత పడవలసిన విషయమే!

    … అన్న మాటలు ఏ మాత్రం సాహిత్యంపై అవగాహన ఉన్నవారికైనా వింతగా అనిపిస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా సాహిత్యపరిశోధన వృత్తిగా తీసుకోగలిగిన అవకాశం తగ్గిపొతొంది. నిజమైన ఆసక్తిపరులు, అధ్యయనపరులు జయప్రభ గారు ఒప్పుకునే అధికారిక పదవికి దగ్గరలొ కూడా ఉండరు. మరి ఇక తెలుగు సాహిత్య పరిశీలనలు గాలికి వదిలెద్దామా? ఇదే కాక తెలుగు సాహిత్యంలోని పలువురు విఖ్యాత పరిశోధకులు, విమర్శకులు వృత్తిరీత్యా వేర్వేరు రంగాల వారే. తెలుగు వారిలో ప్రసిద్ధ చరిత్రకారుడైన మల్లంపల్లి నిజానికి ఆంగ్లేయవిద్యలొ పట్టాలేమీ లేనివారు. ఆయన దాదాపుగా 50 సంవత్సరాలు పరిపాలించిన కీలకమైన రాజవంశాన్ని వెలుగులొకి తీసుకువచ్చారు. పరుచూరి శ్రీనివాస్ గురించి అని కాదు మొత్తంగా ఈ అధికార ముద్రలు చెల్లవు.

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి ravinder అభిప్రాయం:

    06/27/2014 2:03 pm

    తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ఒక బ్లాగులో జ్యోతిష్యం గురించి వెలుబుచ్చిన అభిప్రాయం ప్రకారం..

    సమస్య జ్యోతిష్యంతో కాదు. దానికి మూఢవిశ్వాసమని పేరుపెట్టి దాన్ని గ్రుడ్డిగా త్రోసిపుచ్చేవాళ్ళ గ్రుడ్డి-చెవిటి మనస్తత్వంతో ! దానికలా పేరుపెట్టి ఎప్పుడైతే కళ్ళు మూసేసుకున్నారో అప్పుడు దానిమీద ఇలా బురద జల్లుతూ శతాబ్దాల తరబడి వ్యాసాలూ బ్లాగులూ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం అబద్ధమని కొన్నివేల సంవత్సరాలుగా చాలామంది మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా జ్యోతిష్యం చనిపోలేదు. దాని లెక్కలూ విశ్లేషణా జనానికి తమ వ్యక్తిగత జీవితాల్లో ఫలితాలు చూపిస్తున్నంతకాలం అది చనిపోదు. ఇతరుల అనుభవాల్ని త్రోసిపుచ్చినంత తేలిగ్గా ఎవరూ తమ వ్యక్తిగత అనుభవాల్ని త్రోసిపుచ్చలేరు.

    సైన్సు చదువుతున్నవాళ్ళంతా అందులోనివన్నీ సత్యాలని అర్థమయ్యాక ఆ కోర్సుల్లో చేరారా ? లేక చేరాక అవి సత్యాలని తెలుసుకున్నారా ? మొదటిది నిజమైతే వాళ్ళు చేరాల్సిన అవసరం లేదు. రెండోది నిజమైతే సైన్సు సత్యమనే ప్రచారం వల్ల చేరారని చెప్పాల్సి ఉంటుంది. మఱి సైన్సు విషయంలో positive bias లేదని ఎలా అంటారు ? మఱి జ్యోతిష్యం దగ్గరికొచ్చేసరికి negative bias సృష్టించడానికి మీవంటివారు ఇతోధికంగా కృషి చేస్తున్నారు కదా ! ఇదేనా scientific method అంటే ?

    [మీరు దయచేసి మీ అభిప్రాయాలు వెల్లడించండి. లేదా తాడేపల్లి వారి బ్లాగులో వ్యాసానికి లింక్ ఇవ్వండి – సం.]

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి ravinder అభిప్రాయం:

    06/27/2014 1:57 pm

    తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ఒక బ్లాగులో వెలుబుచ్చిన అభిప్రాయం ప్రకారం
    జ్యోతిష్యం అనేది…..
    ఎవరు చెప్పినదీ ఎవరూ నమ్మాల్సిన పని లేదు. మీరు జ్యోతిష్యాన్ని ఖండించే ముందు దాన్ని నేర్చుకుని ఫలితాలు సరిచూచుకుని ఖండించండి. జ్యోతిష్కులమని చెప్పుకునేవాళ్ళ వ్యక్తిగత లోపాలకు ఒక శాస్త్రాన్ని నిందించకండి. అలా నిందించాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లోపతీ చికిత్స తీసుకుని మఱీ చనిపోతున్న కోట్లాదిమంది శవాల సాక్షిగా అల్లోపతీ వైద్యవిధానాన్ని కూడా నిందించాల్సి వస్తుంది. వాతావరణ శాస్త్రజ్ఞుల weather forecasts ని కూడా నిందించాల్సి వస్తుంది. ఏ శాస్త్రంలో నైనా సిద్ధాంతభాగం ఉన్నంత ఖచ్చితంగా ఫలితభాగం ఉండదు.

    ఇహపోతే, రాహుకేతువుల సంగతి. భూమి orbit చంద్రుడి orbit తో సమద్విఖండన చేసే బిందువుల మధ్య కుడియెడమల దూరాలకు మన పూర్వీకులు రాహుకేతువులని పేరుపెట్టారు. వాటి వల్ల భవిష్యత్ ఫలితాల్లో తేడా వస్తున్నట్లు గ్రహించడం వల్ల వాటిని కూడా గ్రహాలన్నారు. గ్రహాలంటే planets అనుకోకండి. జ్యోతిశ్శాస్త్రం చెప్పే గ్రహాలు planets గుఱించి మాత్రమే కాదు, జాతకం మీద ప్రభావం కలిగించే యావత్తు జ్యోతిస్సుల (Luminary bodies) గుఱించి. మీరు జ్యోతిశ్శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే ఇలాంటివన్నీ బోధపడతాయి. ఇలా కూర్చుంటే ఏమీ తెలియదు.

    ప్రస్తుతం scientific పేరుతో చెలామణీ అవుతున్నది ఒక గూభ్యాలోచన విధానం. ఈ విధానంలో ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది. వాస్తవానికి ప్రకృతి ఆ విధంగా నిర్మించబడలేదు. ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి. మనకు తెలియనంత కాలం ఏమీ లేదనుకుంటాము. ఇప్పుడు scientific అని భావించబడుతున్న అనేక విషయాల గుఱించి గతంలో అలాగే అనుకున్నాం. అయితే జ్యోతిష్యం మన పూర్వులు మనకంటే ముందే ఆలోచించినది కావడం వల్ల దాని క్లెయిములు, అన్నీ తెలుసుననుకుంటున్న మన అహంకారానికి గొడ్డలిపెట్టులా ఉన్నాయి. ఒకటి ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకోవాల్సి వస్తుందనే భయంతో అన్నిటినీ ఊచమట్టుగా త్రోసిపుచ్చడానికి ఆధునిక మానవుడు అలవాటు పడ్డాడు. కాని నిజం నిప్పులాంటిది. ఒకప్పుడు మానవ నాగరికతలో జ్యోతిష్యం లేదు. తరువాత కొన్ని వందల సంవత్సరాల పరిశోధనా పరిశీలనా ఫలితంగా ఆ శాస్త్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు “కాదు” అంటే తాత్కాలికంగా విజయం మీదే. కాని మానవ కుతూహలం “కాదు, కూడదు”ల దగ్గర ఆగిపోదు. కుతూహలాన్ని ఎవరూ నిషేధించలేరు. అది మళ్ళీ ఆవిర్భవిస్తుంది. మీరు ఆకాశాని కెత్తుతున్న so-called scientific people నుంచే పునర్జన్మ ఎత్తుతుంది.

    “నాకు తెలియదు” అని ఒప్పుకోవడం ఒకప్పటి మర్యాద. “నేను నమ్మను” అనడం ఈనాటి ఫ్యాషన్. మన:స్థితి మాత్రం ఒకటే.

    “అది వాడి రక్తంలోనే ఉందిరా !” అని వెనకటి తరం వాళ్ళు అంటే, మొన్నమొన్నటి దాకా నవ్వారు-రక్తంలోనే అన్నీ ఉంటాయా ? అంటూ ! ఇప్పుడు ప్రతిదానికీ జీన్సుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎవరు గెలిచారు ?

    అందుచేత, మన పూర్వీకుల్ని వఠ్ఠి వెధవాయిలుగా శుంఠలుగా త్రోసిపుచ్చకండి. మీరు అనుకుంటున్నట్లు కాదు. మీకు సంస్కృతం రాకపోవడం, ప్రాచీన గ్రంథాలు చదవకపోవడం-ఇలాంటి పొఱపాటు అభిప్రాయాలకు కారణం. ప్రతి వృద్ధుడూ ఒకప్పుడు మనలాంటి యువకుడేనని అర్థం చేసుకోండి.