ఛందస్సు “బంధనభ్రష్టో గృహకపోతః” వంటిదండి. ఆ కపోతం పండితులకు సంబంధించినదే, అయితే ఆ శ్రీశ్రీని గురించిన వినోదవిహారవ్యవహారచోద్యమంతా చూస్తూ ఉంటే – అది పోయిన కాలంలో కానివ్వుడు, ఈ కాలంలో కానివ్వుడు, రాబోయే కాలంలో కానివ్వుడు – ఆ కపోతమును ఎవరింట్లో బంధించి ఉంచాలనుదాని మీద గొడవలెక్కువగా ఉన్నట్లుగా నాకు అనిపించుచున్నది.
పోయిన ఆ శ్రీశ్రీ – కాపీ అయితేనేమిరా మరి కాఫీనైతేనేమిరానంటూ, నానారకాల కాపీలతో, విపరీత ప్రయోగాలతో ఛందస్సు లేదు దిక్కుమాలిన సంతా లేదు, నా వర్డ్ పవరే పెద్ద వింతా సంతా అంటూ పండితులను అలరించడానికి కాకుండగా పామరుల కోసమూ, సామాన్యుల కోసమును రాసి, తన మింతకకు వారిని చుట్టుకొని పోయినాడు.
ఆయనను, ఆయన రాతలను మోసుకు తిరిగినది, జనాల యందు పరుగులెత్తించినది ఆ పామరులేనన్నది జగమెరిగిన సంగతి సత్యము. పామరులు పరుగులెత్తించగా, బంధించగల శక్తిగల మాకేం తక్కువని ఇక ఆ భూతవర్తమానభవిష్యత్ కాలాల్లో ఛంద: పండిత బిరుదాంకితులు గృహాలొదిలి “బ్బొబ్బొబ్బో” అని ఆ కపోతము కోసము పోతరాజుల్లా బజారులో పడినదీ సత్యమే.
ఛంద: పరిఙానం వున్నా లేకున్నా ఆయా పండితులకు ఆలంబనమోతగా ఒక సమూహ చమూచరులు కొంతమంది కరతాళధ్వనులు చేస్తూ ఉండటమందు ప్రసిద్ధులు. ఈ చమూచరులను సోషలు మీడియానందు, బ్లాగులనందు, అండపిండ అంతర్జాలమునందు చక్కగా చూడవచ్చును. వారి వలయమందు చిక్కుకొని అసలు ప్రశ్నలు వదిలి వేసి, సరియైన సమాధానము చెప్పక తప్పించుకొను పండితులూ ఉండినారు, ఉన్నారు, ఉంటారు.
మొత్తానికి లైలా గారు మంచి ప్రశ్నలతో దుమ్ము దుమారం లేపినారు. వారు పండితులు కాదన్న సంగతి తెలిసినప్పుడు, పండితులు కాని వారి ప్రశ్నల్లోని జోరు అట్లాగే ఉంటుందన్న సంగతి తెలిసీ తెలియక, అద్దానిని సహించలేకో, సమాధానములు తెలియకనో వారు ఎగతాళిగా మాట్లాడినారు అన్న ముద్ర వేసుటకు ప్రయత్నించినారని అనిపింపు.
సమాధానము ఒక మెట్టు దిగి చెప్పే ప్రయత్నము చేయకుండగా ఆ దుమ్మును మరింత ఎగదోయుటకు ప్రయత్నములు మటుకు జరిగినవి. ఇక్కడ లైలా గారు నాకు తెలియదు. మోహనరావు గారు నాకు తెలియదు. మధ్యలో కామేశ్వరరావు గారనువారు వచ్చి, (ఈయనా నాకు తెలియదు) ఆవిడ ప్రశ్నలలోని సమాచారములో తనకు కావలసినదాన్ని, తనకు తెలిసినదానిని పట్టుకొని ఆ భాగమును మరింత ఆసక్తికరమైన రంభము దిశగా మరల్చినారు.
అంతా అయోమయముగానున్నది. అయము (ఇనుప) తెర చేదించటం చాలా కష్టము కావున, “తదో గణ్డస్స ఉవరి పిణ్డిఆ సంవుత్” కావున – స్వస్తి వాక్యము పలకవలెను. ఇపుడు నీకేమి అర్థమయినదో నీవు చెప్పు, వీలైతే నీవే సమాధానము చెప్పుమని, నీవునూ అపరిచితాపరిపక్వుడివని, నీవంటి పామరునకు సమాధానమేమియని రచయిత, ఇతరులు అనవచ్చును. దానికి నా సమాధానము ఒకటే. ఆవిడ వేసిన ప్రశ్నలు నిజసత్యసమంజసమైనవి. వాటికి జవాబు వెతకటము, ఇవ్వటము దాదాపు అసాధ్యం. ఆ సత్యాన్ని ఎవరికి వారు తెలుసుకొనవలసినదే!
ఆవిడ ప్రశ్నలు నాకు నచ్చినవి కావున, ఆవిడకు జోహారులు పలుకుతూ ఇంకొక వ్యాసము చదువుకొనెదను. మీకు నచ్చలేదు కావున మీ పని మీరు చేయుడు.
“దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” లో కన్నా నాకు “సింహాలకు zoo లుండును ” అన్న అచ్చ తెలుగు మాటల్లో కవిత్వం కనపడుతుంది. . “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” కన్నా”ఏ తీరున నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా! ” చాలా మేలనిపిస్తుంది.
తః తః
ఛందస్సులో నా పరిజ్ఞానం దాదాపు శూన్యమైనా, ఛందస్సుపై మీ వ్యాసాల వెనుక మీ కృషి, పట్టుదల, అవగాహన ఈ వ్యాసాలు చదివిన ఎంతో మంది విజ్ఞులైన పాఠకులకు తెలుసు అని నేను అనుకొంటాను.
ఒక చిన్న మనవి!
మీ వ్యాసాలపై వచ్చే స్పందనలన్నీ ఒకే స్థాయిలో లేవు అన్న విషయం చదువరులకు తెలుస్తూనే ఉంది. కొన్ని స్పందనలకి మీరు సంజాయిషీ రూపంలో సమాధానం ఇవ్వనవసరం లేదని నాకు చాలా సార్లు అనిపించింది. కావాలని కవ్వించి, రెచ్చగొట్టే రీతిలో ఉన్నఅభిప్రాయాలని వాటి మానాన వాటిని వొదిలెయ్యమని నా మనవి. మీ అమూల్యమైన కాలం, మరొకందుకు వినియోగిస్తే అందువలన ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని నాకు తోస్తోంది!
శ్రీరాముడిని సేవించిన త్యాగరాజు తన దేవుడిలో ఉన్న గుణాలనెన్నింటినో గుర్తించి పాడారు. అందులో సాహిత్యం నచ్చినవారూ ఉన్నారు. భక్తి నచ్చినవారూ ఉన్నారు. ఏదీ నచ్చనివారూ ఉంటారు. తన సన్నిధిలో సుఖముంటుంది అని రాముడు గుర్తించో/గుర్తించకో చెప్పలేదు. కానీ త్యాగయ్య చెప్పాడు నిధి కన్నా రాముని సన్నిధిలో సుఖముందని తన తపస్సులో గుర్తించారు, చెప్పుకున్నారు. నచ్చినవారు అందులో ఆనందం పొందారు.
(ఇప్పుడీ వ్యాసం చదివినవెంటనే అందులో ఏమున్నదీ, ఏమిలేనిదీ అభిప్రాయంగా చదువరులు కూడా వ్రాస్తున్నారు కదా!)
ఈ వ్యాసకర్త ఛందశ్శాస్త్రాధ్యయనాన్ని తపస్సుగా చేస్తున్నారని అనిపిస్తుంది వారి వ్యాసాలు చూస్తుంటే. అటువంటప్పుడు నెలల తరబడి అధ్యయనాన్ని తపస్సుగా చేస్తూ అందులో వారు గమనించిన విషయాలను సోదాహరణంగా వివరించడం వల్ల నచ్చినవారు ఈ అధ్యయనం ఆలంబనగా ఇంకా నేర్చుకోవచ్చు. ముందుకు సాగవచ్చు. ఈ ఛందశ్శాస్త్రాధ్యయనం రాబోయే రోజులలో మరింత ఎక్కువ జరిగితే ఈ పరిశోధనా పత్రాలు తప్పక ఆ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయి.
ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక ఛందస్సులు. వైదిక ఛందస్సులోని శ్లోకాలను పఠించేటప్పుడు ఊనిక, అనగా stress లేక accent అవసరము. అందుకే అవి శ్రుతులు అయ్యాయి. సామాన్యముగా వైదిక ఛందస్సు కనీసము half octave పరిమితిలో ఉదాత్త, అనుదాత్త, స్వరితములతో సాగుతుంది. గురువు (మనిషి) దగ్గర వీటిని నేర్చుకోవాలి. తరువాత లౌకిక ఛందస్సులో ఈ ఊనికకు బదులు గురు లఘువులు పుట్టాయి. ఈ గురులఘువులే ఇంద్రవజ్ర కాని శార్దూలవిక్రీడితము కాని, ఇతర వృత్తములకు కాని ఇవి ఇటుకరాళ్ల వంటివి. సంస్కృత కావ్యములన్నియు ఇట్టి వృత్తములతో వ్రాయబడినవి. నాటకయుగము వచ్చిన తరువాత నాటకములో జనరంజకత్వానికి గీతములు, గీతములవంటి పద్యములు పుట్టాయి. ఇవి మాత్రాఛందస్సుపైన ఆధారపడినవి. గాథా లేక ఆర్యా, వైతాళీయములు ఇట్టి కోవకు చెందినవి. అంతే కాక తోటకము, దోధకము, స్రగ్విణి, ఇంద్రవజ్రము లాటి తాళ వృత్తములను వీటిలో వాడారు. ఇవన్నీ పాడ దగినవి. గురువు రెండు మాత్రలకు లేక కళలకు సమానము, లఘువు ఒక మాత్ర. ఇవి ఉచ్చరణకు కావలసిన సమయము. కావున మాత్రను syllabic instant అని పిలుస్తారు. లౌకిక ఛందస్సులో accent or stress స్థానమును ఈ గురులఘువులు ఆక్రమించాయి. పాటలలో తాళవృత్తములలో ఊనికకు బదులు pitch or frequency ముఖ్యము. భారతీయులు ఆంగ్లమును మాటలాడు నప్పుడు కూడ ఒకే గొంతుతో మాటలో హెచ్చు తగ్గులు లేకుండ మాట్లాడుతారు. అందుకే పశ్చిమ దేశాలవారికి మన ఆంగ్లమును అర్థము చేసికొనడము కొద్దిగా కష్టమే. ఆంగ్లములో కవిత్వము ఈ ఊనికపైన ఆధారపడినది. భారతీయ భాషలలోని ఛందస్సు అక్షరముల కాల పరిమితి (హ్రస్వ దీర్ఘములు) పైన ఆధార పడి ఉంటుంది. సంగీతములో కూడ ఈ పరిస్థితియే. Decibels తేడా ఎక్కువ ఉండదు. Swinburne’s “A Match” లో మొదటి రెండు పంక్తులు –
If love were what the rose is, (7 syllables)
And I were like the leaf, (6 syllables)
పద్యమంతా ఈ 7, 6 syllables తో మాత్రమే అల్లబడినది. ఈ syllable గురువైనా, లఘువైనా కావచ్చు. ఈ పంక్తులను చదివేటప్పుడు మార్చి మార్చి ఊనిక ఇవ్వబడుతుంది. దీనిని శ్రీశ్రీ ఆనందార్ణవ ఛందస్సుతో పోల్చరాదు. అక్కడ పాదానికి 14 మాత్రలు, పాద మధ్యములో, పాదాంతములో విరామము ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష అందము, అంతే!
నేను ఈమాట పత్రికలో వ్రాసిన రెండవ వ్యాసము శంకరాచార్యుల స్తోత్రములలోని ఛందస్సుపైన, అందులో ఉపయోగించబడిన వృత్తములకు ఉదాహరణములను ఇస్తూ, వాటిని అర్థము చేసికొనుటకై నేను తర్జుమా చేసాను, అంతే. అది కవిత్వమని నేను చెప్పుకోలేదు, అందువలన అందులో కవిత్వము లేదని చెప్పడము చచ్చిన గుఱ్ఱాన్ని లాఠీతో కొట్టడమే!
శ్రీశ్రీ పాడుకోడానికి అనువుగా ఉండడానికే గేయ రూపములో నియమితమైన మాత్రల సంఖ్యతో వ్రాసినాడు. లైలాగారు అన్నారు – “Sri Sri is not thinking of 6-4-4.” On the other hand, SriSri IS THINKING of 6-4-4!
ఇది నాకు అర్థము కాలేదు, ఒక వేళ వేళాకోళమా? అనుబంధములోని నా ఉదాహరణములను గురించియా? శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఉండే వసంతతిలక వృత్తములు, తోటక వృత్తములు ఇవి పాడుకొన దగినవే. శ్రీశ్రీ చతుర్మాత్రా ఛందస్సులో తోటక వృత్తపు ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి.
BTW – “If you were queen of pleasure” అనే వాక్యాన్ని ఇంగ్లీషులోని “stress” తో సంబంధం లేకుండా, కేవలం syllables బట్టి తెలుగులో రాస్తే, “ఇఫ్ యూ వర్ క్వీనాఫ్ ప్లేషర్” అవుతుంది. ఇందులో గురులఘువులు గుర్తిస్తే, అది సరిగ్గా “U U U UU UU” అంటే, 6-4-4 అనే మాత్రాగణాల ఛందస్సులో ఉంది!
“In terms of metrics, I feel Sri Sri is thinking more along lines of stressed syllables and end rhymes, of English poetry. ఆనందం అర్ణవ మై తే has Four stresses. So does అనురాగం అంబర మై తే. ‘A match.’ Looks like an Iambic tetrameter to me.”
Interesting! “end rhymes” I understand, but not “stress”.
“ఆనందం అర్ణవమైతే” – ఇందులో ఉన్నవి four stresses ఎలానో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి “Stress” అన్నది అచ్చుపైనుండే ఊనిక. ఇంగ్లీషులో ఒక పదంలో సాధారణంగా రెండు syllables కన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి ఒక పదంలో సాధారణంగా ఒకటే stress ఉంటుంది. కాని తెలుగు పదంలో ప్రతి అక్షరమూ ఒక syllable. “ఆనందం” అనే పదంలో మూడు syllables ఉన్నాయి. ఇందులో దేనిపై stress ఉన్నట్టు? నాకు తెలిసి తెలుగులో ఆ పదం పలికినప్పుడు మూడింటిపైనా సమానమైన ఊనికే ఉంటుంది. అందుకే తెలుగు భాష ఇంగ్లీషులా Stressed language కాదు. “ఆనందం అర్ణవ మై తే” అన్నదానిలో ఉన్నవి నాలుగు “stops” లేదా “breaks”. అంచేత దాన్ని నాలుగు “మాత్రాగణాల” వాక్యంగా పరిగణించవచ్చు. ఒకో గణమూ కొన్ని మాత్రల సమాహారం. 6-4-2-2 అనే గణాలు. ఇది 6-4-4 అని కూడా అనుకోవచ్చు. ఆ కవితలో తక్కిన పాదాలకి కూడా ఇదే అన్వయం. అదే మోహనగారు చెప్పింది కూడా.
తెలుగు భాషకి “stress”ని ఎలా అన్వయించవచ్చునో లైలాగారు వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
“If you were queen of pleasure
And I were king of pain”
నాకున్న కొద్దిపాటి ఇంగ్లీషు పరిజ్ఞానంతో నాకు తోచినదేవిటంటే, యిందులోని రెండో వాక్యం Iambic tetrameter. మొదటిది మాత్రం – x / x / x / x” – tailless iambic pentameter? అనిపిస్తోంది. A Match కవితలో ఈ రెండు రకాల నడకలూ కనిపిస్తాయి. అయితే వాటికి కచ్చితమైన order అంటూ ఏదీ లేదు. శ్రీశ్రీ గేయంలో మాత్రం 99% పాదాలన్నింటా 6-4-4 నడక కనిపిస్తోంది. అలాగే మోహనగారు చూపించిన ఇతర కవితల ఉదాహరణల్లోనూ ఇదే ఛందస్సు ఉంది. మాత్రాఛందస్సు విషయంలో ఇంగ్లీషులో “stress” లాగా పెద్దగా ambiguity లేదు.
అంచేత “Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count.” అని ఎందుకన్నారో లైలాగారు వివరించాలి (లైలాగారి వ్యాఖ్యలో ఆ వివరణ ఉందేమో, నా బుఱ్ఱకి మాత్రం అర్థమవ్వలేదు!)
కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావం నుంచి తప్పించుకొని గురజాడ మార్గంలో కవిత్వం వ్రాయడం మొదలుపెట్టానని శ్రీశ్రీ చాలాచోట్ల గర్వంగా చెప్పుకొన్నాడు. అలాగే “గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుండి మాత్రాబద్ధ ఛందస్సుల ప్రజాస్వామ్య యుగానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర గమనాన్ని పరివర్తన చేసినవాడు గురజాడ” అని, గురజాడ ప్రత్యేకతను కూడా స్పష్టంగా చెప్పాడు. అంచేత శ్రీశ్రీ గురజాడ ప్రభావంతో తన కవిత్వానికి మాత్రాఛందస్సు స్వీకరించాడనుకోడంలో సందేహం అక్కరలేదు.
శ్రీశ్రీ పైన పాశ్చాత్యకవిత్వ ప్రభావం చాలానే ఉంది కాని, ఛందస్సు విషయంలో కూడా అది ఉంది అన్న లైలాగారి అభిప్రాయాన్ని ఒప్పుకోవాలంటే, దానికి మరింత విశ్లేషణ వివరణ అవసరం. ఆ దిశలో ఇప్పటికే ఎవరైనా విమర్శ చేసారేమో నాకు తెలీదు. చేసుంటే కనక, అది తెలిసున్నవాళ్ళెవరైనా ఇక్కడ పంచుకొనమని నా వేడుకోలు. లేదంటే, లైలాగారే ఆ పని చేపడితే బహుబాగుంటుంది!
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి sundara ramaiah varanasi అభిప్రాయం:
12/10/2015 2:55 pm
నీళ్ళకు నిర్రితొళ్ళకును నేతికరళ్ళకు దర్భముళ్ళకున్
…….పప్పుకూరపచ్చళ్ళకనిశమును మళ్ళకు —–
……దొడ్దయుత్తరెన్వెళ్ళకు …..రాగిబిళ్ళలకు….
……………..సంతసమందుదురాంధ్రవైదికుల్
పైచాటువుని ఎప్పుడొ చదివాను కాని యిప్పుడు గుర్తురావడం లేదు
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:
12/09/2015 10:21 pm
ఛందస్సు “బంధనభ్రష్టో గృహకపోతః” వంటిదండి. ఆ కపోతం పండితులకు సంబంధించినదే, అయితే ఆ శ్రీశ్రీని గురించిన వినోదవిహారవ్యవహారచోద్యమంతా చూస్తూ ఉంటే – అది పోయిన కాలంలో కానివ్వుడు, ఈ కాలంలో కానివ్వుడు, రాబోయే కాలంలో కానివ్వుడు – ఆ కపోతమును ఎవరింట్లో బంధించి ఉంచాలనుదాని మీద గొడవలెక్కువగా ఉన్నట్లుగా నాకు అనిపించుచున్నది.
పోయిన ఆ శ్రీశ్రీ – కాపీ అయితేనేమిరా మరి కాఫీనైతేనేమిరానంటూ, నానారకాల కాపీలతో, విపరీత ప్రయోగాలతో ఛందస్సు లేదు దిక్కుమాలిన సంతా లేదు, నా వర్డ్ పవరే పెద్ద వింతా సంతా అంటూ పండితులను అలరించడానికి కాకుండగా పామరుల కోసమూ, సామాన్యుల కోసమును రాసి, తన మింతకకు వారిని చుట్టుకొని పోయినాడు.
ఆయనను, ఆయన రాతలను మోసుకు తిరిగినది, జనాల యందు పరుగులెత్తించినది ఆ పామరులేనన్నది జగమెరిగిన సంగతి సత్యము. పామరులు పరుగులెత్తించగా, బంధించగల శక్తిగల మాకేం తక్కువని ఇక ఆ భూతవర్తమానభవిష్యత్ కాలాల్లో ఛంద: పండిత బిరుదాంకితులు గృహాలొదిలి “బ్బొబ్బొబ్బో” అని ఆ కపోతము కోసము పోతరాజుల్లా బజారులో పడినదీ సత్యమే.
ఛంద: పరిఙానం వున్నా లేకున్నా ఆయా పండితులకు ఆలంబనమోతగా ఒక సమూహ చమూచరులు కొంతమంది కరతాళధ్వనులు చేస్తూ ఉండటమందు ప్రసిద్ధులు. ఈ చమూచరులను సోషలు మీడియానందు, బ్లాగులనందు, అండపిండ అంతర్జాలమునందు చక్కగా చూడవచ్చును. వారి వలయమందు చిక్కుకొని అసలు ప్రశ్నలు వదిలి వేసి, సరియైన సమాధానము చెప్పక తప్పించుకొను పండితులూ ఉండినారు, ఉన్నారు, ఉంటారు.
మొత్తానికి లైలా గారు మంచి ప్రశ్నలతో దుమ్ము దుమారం లేపినారు. వారు పండితులు కాదన్న సంగతి తెలిసినప్పుడు, పండితులు కాని వారి ప్రశ్నల్లోని జోరు అట్లాగే ఉంటుందన్న సంగతి తెలిసీ తెలియక, అద్దానిని సహించలేకో, సమాధానములు తెలియకనో వారు ఎగతాళిగా మాట్లాడినారు అన్న ముద్ర వేసుటకు ప్రయత్నించినారని అనిపింపు.
సమాధానము ఒక మెట్టు దిగి చెప్పే ప్రయత్నము చేయకుండగా ఆ దుమ్మును మరింత ఎగదోయుటకు ప్రయత్నములు మటుకు జరిగినవి. ఇక్కడ లైలా గారు నాకు తెలియదు. మోహనరావు గారు నాకు తెలియదు. మధ్యలో కామేశ్వరరావు గారనువారు వచ్చి, (ఈయనా నాకు తెలియదు) ఆవిడ ప్రశ్నలలోని సమాచారములో తనకు కావలసినదాన్ని, తనకు తెలిసినదానిని పట్టుకొని ఆ భాగమును మరింత ఆసక్తికరమైన రంభము దిశగా మరల్చినారు.
అంతా అయోమయముగానున్నది. అయము (ఇనుప) తెర చేదించటం చాలా కష్టము కావున, “తదో గణ్డస్స ఉవరి పిణ్డిఆ సంవుత్” కావున – స్వస్తి వాక్యము పలకవలెను. ఇపుడు నీకేమి అర్థమయినదో నీవు చెప్పు, వీలైతే నీవే సమాధానము చెప్పుమని, నీవునూ అపరిచితాపరిపక్వుడివని, నీవంటి పామరునకు సమాధానమేమియని రచయిత, ఇతరులు అనవచ్చును. దానికి నా సమాధానము ఒకటే. ఆవిడ వేసిన ప్రశ్నలు నిజసత్యసమంజసమైనవి. వాటికి జవాబు వెతకటము, ఇవ్వటము దాదాపు అసాధ్యం. ఆ సత్యాన్ని ఎవరికి వారు తెలుసుకొనవలసినదే!
ఆవిడ ప్రశ్నలు నాకు నచ్చినవి కావున, ఆవిడకు జోహారులు పలుకుతూ ఇంకొక వ్యాసము చదువుకొనెదను. మీకు నచ్చలేదు కావున మీ పని మీరు చేయుడు.
అశ్మాచం.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తః తః అభిప్రాయం:
12/08/2015 3:45 pm
“దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” లో కన్నా నాకు “సింహాలకు zoo లుండును ” అన్న అచ్చ తెలుగు మాటల్లో కవిత్వం కనపడుతుంది. . “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” కన్నా”ఏ తీరున నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా! ” చాలా మేలనిపిస్తుంది.
తః తః
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
12/08/2015 1:25 pm
గౌరవ మిత్రులు మోహనరావు గారికి:
ఛందస్సులో నా పరిజ్ఞానం దాదాపు శూన్యమైనా, ఛందస్సుపై మీ వ్యాసాల వెనుక మీ కృషి, పట్టుదల, అవగాహన ఈ వ్యాసాలు చదివిన ఎంతో మంది విజ్ఞులైన పాఠకులకు తెలుసు అని నేను అనుకొంటాను.
ఒక చిన్న మనవి!
మీ వ్యాసాలపై వచ్చే స్పందనలన్నీ ఒకే స్థాయిలో లేవు అన్న విషయం చదువరులకు తెలుస్తూనే ఉంది. కొన్ని స్పందనలకి మీరు సంజాయిషీ రూపంలో సమాధానం ఇవ్వనవసరం లేదని నాకు చాలా సార్లు అనిపించింది. కావాలని కవ్వించి, రెచ్చగొట్టే రీతిలో ఉన్నఅభిప్రాయాలని వాటి మానాన వాటిని వొదిలెయ్యమని నా మనవి. మీ అమూల్యమైన కాలం, మరొకందుకు వినియోగిస్తే అందువలన ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని నాకు తోస్తోంది!
మీ మిత్రుడు,
విష్ణుభొట్ల లక్ష్మన్న
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
12/08/2015 7:40 am
శ్రీరాముడిని సేవించిన త్యాగరాజు తన దేవుడిలో ఉన్న గుణాలనెన్నింటినో గుర్తించి పాడారు. అందులో సాహిత్యం నచ్చినవారూ ఉన్నారు. భక్తి నచ్చినవారూ ఉన్నారు. ఏదీ నచ్చనివారూ ఉంటారు. తన సన్నిధిలో సుఖముంటుంది అని రాముడు గుర్తించో/గుర్తించకో చెప్పలేదు. కానీ త్యాగయ్య చెప్పాడు నిధి కన్నా రాముని సన్నిధిలో సుఖముందని తన తపస్సులో గుర్తించారు, చెప్పుకున్నారు. నచ్చినవారు అందులో ఆనందం పొందారు.
(ఇప్పుడీ వ్యాసం చదివినవెంటనే అందులో ఏమున్నదీ, ఏమిలేనిదీ అభిప్రాయంగా చదువరులు కూడా వ్రాస్తున్నారు కదా!)
ఈ వ్యాసకర్త ఛందశ్శాస్త్రాధ్యయనాన్ని తపస్సుగా చేస్తున్నారని అనిపిస్తుంది వారి వ్యాసాలు చూస్తుంటే. అటువంటప్పుడు నెలల తరబడి అధ్యయనాన్ని తపస్సుగా చేస్తూ అందులో వారు గమనించిన విషయాలను సోదాహరణంగా వివరించడం వల్ల నచ్చినవారు ఈ అధ్యయనం ఆలంబనగా ఇంకా నేర్చుకోవచ్చు. ముందుకు సాగవచ్చు. ఈ ఛందశ్శాస్త్రాధ్యయనం రాబోయే రోజులలో మరింత ఎక్కువ జరిగితే ఈ పరిశోధనా పత్రాలు తప్పక ఆ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయి.
వ్యాసకర్తకు అభినందనలు.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
12/07/2015 8:56 pm
ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక ఛందస్సులు. వైదిక ఛందస్సులోని శ్లోకాలను పఠించేటప్పుడు ఊనిక, అనగా stress లేక accent అవసరము. అందుకే అవి శ్రుతులు అయ్యాయి. సామాన్యముగా వైదిక ఛందస్సు కనీసము half octave పరిమితిలో ఉదాత్త, అనుదాత్త, స్వరితములతో సాగుతుంది. గురువు (మనిషి) దగ్గర వీటిని నేర్చుకోవాలి. తరువాత లౌకిక ఛందస్సులో ఈ ఊనికకు బదులు గురు లఘువులు పుట్టాయి. ఈ గురులఘువులే ఇంద్రవజ్ర కాని శార్దూలవిక్రీడితము కాని, ఇతర వృత్తములకు కాని ఇవి ఇటుకరాళ్ల వంటివి. సంస్కృత కావ్యములన్నియు ఇట్టి వృత్తములతో వ్రాయబడినవి. నాటకయుగము వచ్చిన తరువాత నాటకములో జనరంజకత్వానికి గీతములు, గీతములవంటి పద్యములు పుట్టాయి. ఇవి మాత్రాఛందస్సుపైన ఆధారపడినవి. గాథా లేక ఆర్యా, వైతాళీయములు ఇట్టి కోవకు చెందినవి. అంతే కాక తోటకము, దోధకము, స్రగ్విణి, ఇంద్రవజ్రము లాటి తాళ వృత్తములను వీటిలో వాడారు. ఇవన్నీ పాడ దగినవి. గురువు రెండు మాత్రలకు లేక కళలకు సమానము, లఘువు ఒక మాత్ర. ఇవి ఉచ్చరణకు కావలసిన సమయము. కావున మాత్రను syllabic instant అని పిలుస్తారు. లౌకిక ఛందస్సులో accent or stress స్థానమును ఈ గురులఘువులు ఆక్రమించాయి. పాటలలో తాళవృత్తములలో ఊనికకు బదులు pitch or frequency ముఖ్యము. భారతీయులు ఆంగ్లమును మాటలాడు నప్పుడు కూడ ఒకే గొంతుతో మాటలో హెచ్చు తగ్గులు లేకుండ మాట్లాడుతారు. అందుకే పశ్చిమ దేశాలవారికి మన ఆంగ్లమును అర్థము చేసికొనడము కొద్దిగా కష్టమే. ఆంగ్లములో కవిత్వము ఈ ఊనికపైన ఆధారపడినది. భారతీయ భాషలలోని ఛందస్సు అక్షరముల కాల పరిమితి (హ్రస్వ దీర్ఘములు) పైన ఆధార పడి ఉంటుంది. సంగీతములో కూడ ఈ పరిస్థితియే. Decibels తేడా ఎక్కువ ఉండదు. Swinburne’s “A Match” లో మొదటి రెండు పంక్తులు –
If love were what the rose is, (7 syllables)
And I were like the leaf, (6 syllables)
పద్యమంతా ఈ 7, 6 syllables తో మాత్రమే అల్లబడినది. ఈ syllable గురువైనా, లఘువైనా కావచ్చు. ఈ పంక్తులను చదివేటప్పుడు మార్చి మార్చి ఊనిక ఇవ్వబడుతుంది. దీనిని శ్రీశ్రీ ఆనందార్ణవ ఛందస్సుతో పోల్చరాదు. అక్కడ పాదానికి 14 మాత్రలు, పాద మధ్యములో, పాదాంతములో విరామము ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష అందము, అంతే!
నేను ఈమాట పత్రికలో వ్రాసిన రెండవ వ్యాసము శంకరాచార్యుల స్తోత్రములలోని ఛందస్సుపైన, అందులో ఉపయోగించబడిన వృత్తములకు ఉదాహరణములను ఇస్తూ, వాటిని అర్థము చేసికొనుటకై నేను తర్జుమా చేసాను, అంతే. అది కవిత్వమని నేను చెప్పుకోలేదు, అందువలన అందులో కవిత్వము లేదని చెప్పడము చచ్చిన గుఱ్ఱాన్ని లాఠీతో కొట్టడమే!
శ్రీశ్రీ పాడుకోడానికి అనువుగా ఉండడానికే గేయ రూపములో నియమితమైన మాత్రల సంఖ్యతో వ్రాసినాడు. లైలాగారు అన్నారు – “Sri Sri is not thinking of 6-4-4.” On the other hand, SriSri IS THINKING of 6-4-4!
ఇది నాకు అర్థము కాలేదు, ఒక వేళ వేళాకోళమా? అనుబంధములోని నా ఉదాహరణములను గురించియా? శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఉండే వసంతతిలక వృత్తములు, తోటక వృత్తములు ఇవి పాడుకొన దగినవే. శ్రీశ్రీ చతుర్మాత్రా ఛందస్సులో తోటక వృత్తపు ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి.
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
12/07/2015 2:36 pm
BTW – “If you were queen of pleasure” అనే వాక్యాన్ని ఇంగ్లీషులోని “stress” తో సంబంధం లేకుండా, కేవలం syllables బట్టి తెలుగులో రాస్తే, “ఇఫ్ యూ వర్ క్వీనాఫ్ ప్లేషర్” అవుతుంది. ఇందులో గురులఘువులు గుర్తిస్తే, అది సరిగ్గా “U U U UU UU” అంటే, 6-4-4 అనే మాత్రాగణాల ఛందస్సులో ఉంది!
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
12/07/2015 2:23 pm
Interesting! “end rhymes” I understand, but not “stress”.
“ఆనందం అర్ణవమైతే” – ఇందులో ఉన్నవి four stresses ఎలానో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి “Stress” అన్నది అచ్చుపైనుండే ఊనిక. ఇంగ్లీషులో ఒక పదంలో సాధారణంగా రెండు syllables కన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి ఒక పదంలో సాధారణంగా ఒకటే stress ఉంటుంది. కాని తెలుగు పదంలో ప్రతి అక్షరమూ ఒక syllable. “ఆనందం” అనే పదంలో మూడు syllables ఉన్నాయి. ఇందులో దేనిపై stress ఉన్నట్టు? నాకు తెలిసి తెలుగులో ఆ పదం పలికినప్పుడు మూడింటిపైనా సమానమైన ఊనికే ఉంటుంది. అందుకే తెలుగు భాష ఇంగ్లీషులా Stressed language కాదు. “ఆనందం అర్ణవ మై తే” అన్నదానిలో ఉన్నవి నాలుగు “stops” లేదా “breaks”. అంచేత దాన్ని నాలుగు “మాత్రాగణాల” వాక్యంగా పరిగణించవచ్చు. ఒకో గణమూ కొన్ని మాత్రల సమాహారం. 6-4-2-2 అనే గణాలు. ఇది 6-4-4 అని కూడా అనుకోవచ్చు. ఆ కవితలో తక్కిన పాదాలకి కూడా ఇదే అన్వయం. అదే మోహనగారు చెప్పింది కూడా.
తెలుగు భాషకి “stress”ని ఎలా అన్వయించవచ్చునో లైలాగారు వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
“If you were queen of pleasure
And I were king of pain”
నాకున్న కొద్దిపాటి ఇంగ్లీషు పరిజ్ఞానంతో నాకు తోచినదేవిటంటే, యిందులోని రెండో వాక్యం Iambic tetrameter. మొదటిది మాత్రం – x / x / x / x” – tailless iambic pentameter? అనిపిస్తోంది. A Match కవితలో ఈ రెండు రకాల నడకలూ కనిపిస్తాయి. అయితే వాటికి కచ్చితమైన order అంటూ ఏదీ లేదు. శ్రీశ్రీ గేయంలో మాత్రం 99% పాదాలన్నింటా 6-4-4 నడక కనిపిస్తోంది. అలాగే మోహనగారు చూపించిన ఇతర కవితల ఉదాహరణల్లోనూ ఇదే ఛందస్సు ఉంది. మాత్రాఛందస్సు విషయంలో ఇంగ్లీషులో “stress” లాగా పెద్దగా ambiguity లేదు.
అంచేత “Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count.” అని ఎందుకన్నారో లైలాగారు వివరించాలి (లైలాగారి వ్యాఖ్యలో ఆ వివరణ ఉందేమో, నా బుఱ్ఱకి మాత్రం అర్థమవ్వలేదు!)
కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావం నుంచి తప్పించుకొని గురజాడ మార్గంలో కవిత్వం వ్రాయడం మొదలుపెట్టానని శ్రీశ్రీ చాలాచోట్ల గర్వంగా చెప్పుకొన్నాడు. అలాగే “గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుండి మాత్రాబద్ధ ఛందస్సుల ప్రజాస్వామ్య యుగానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర గమనాన్ని పరివర్తన చేసినవాడు గురజాడ” అని, గురజాడ ప్రత్యేకతను కూడా స్పష్టంగా చెప్పాడు. అంచేత శ్రీశ్రీ గురజాడ ప్రభావంతో తన కవిత్వానికి మాత్రాఛందస్సు స్వీకరించాడనుకోడంలో సందేహం అక్కరలేదు.
శ్రీశ్రీ పైన పాశ్చాత్యకవిత్వ ప్రభావం చాలానే ఉంది కాని, ఛందస్సు విషయంలో కూడా అది ఉంది అన్న లైలాగారి అభిప్రాయాన్ని ఒప్పుకోవాలంటే, దానికి మరింత విశ్లేషణ వివరణ అవసరం. ఆ దిశలో ఇప్పటికే ఎవరైనా విమర్శ చేసారేమో నాకు తెలీదు. చేసుంటే కనక, అది తెలిసున్నవాళ్ళెవరైనా ఇక్కడ పంచుకొనమని నా వేడుకోలు. లేదంటే, లైలాగారే ఆ పని చేపడితే బహుబాగుంటుంది!
భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం గురించి అశ్మాచం అభిప్రాయం:
12/07/2015 12:59 pm
ఆహ్! ఆహా! ఆహాహా!
తెల్గుసాహిత్యాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించన
ఏల్చూరి సమో సూరి
న భూతో న భవిష్యతి
యన్న విధముగానున్నదండి.
ఈ పత్రిక ఏదో పుణ్యము చేసికొని యున్నవిధము తెలిసిపోవుచున్నది. మీ వ్యాసంగము న భూతో న భవిష్యతి.
అశ్మాచం
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:
12/07/2015 12:54 pm
శ్రీ శ్రీ, స్విన్ బర్న్ ల కవిత్వం , సంగీతం మీద నడుస్తున్న చర్చలో భాగంగా
రెండు ప్రసంగ వ్యాసాలు :
శ్రీ శ్రీ మహా ప్రస్థానం: కథనం,కదనం
మహాప్రస్థానం -సాహిత్యంలో శ్రీ శ్రీ స్థానం
పుటలు : 18 -24
తమ్మినేని యదుకులభూషణ్