సంస్కృతములో కూడ రెండు యతి (పదచ్ఛేదము) camps ఉన్నాయి. భరతాదులకు యతి పట్టింపు లేదు, పింగళాదులు యతిని పాటిస్తారు. వృత్తాదుల ముద్రణలో కూడ బేసి పాదముల అంతమును ఒక నిలువు గీతతో (|), సరి పాదముల అంతమును రెండు నిలువు గీతలతో (||) సూచిస్తారు. సరి పాదాంతములో యతిని almost విధిగా పాటిస్తారు. బేసి పాదాంతములో కూడ “సామాన్యముగా” (most of the times) పాటిస్తారు.
తమిళములో “సామాన్యముగా”, తెలుగులోకంటే ఎక్కువగా, గణములకు (శీరులు) తగ్గట్లు పదములను ఎన్నుకొంటారు. అదే విధముగా పాదాంత యతి కూడ.
తెలుగు దేశి ఛందస్సులో “సామాన్యముగా” పాదాంతయతి ఉంటుంది. ద్విపదలో, రగడలో ఇది తప్పని సరి (a must). కాని సూర్యేంద్ర గణములకు తగ్గట్లు, మాత్రాగణములకు తగ్గట్లు పదముల విఱుపులు తక్కువ. తాళబద్ధమైన రగడలు ఈ విషయములో కొద్దిగా మేలు. కాని అక్కడ కూడ రెండు మాత్రాగణములను కలిపి వ్రాసిన కవులు ఉన్నారు.
ఏ పద్యమునైనను, వచనమునైనను, తుదకు మాటలను కూడ రాగయుక్తముగా పాడుకొనవచ్చును. కాని అన్నిటిని తాళయుక్తముగా పాడుకోలేము.
అతి స్వేచ్ఛతో వ్రాసే చంపకోత్పలమాలలలో కూడ కొన్ని నియమములను పాటిస్తే వాటిని పాడుకొనడము మాత్రమే కాదు, తాళబద్ధముగా కూడ పాడుకొనవచ్చును. ఈ మాలికా వృత్తములలో 4,5,5 – 4,5,5 మాత్రలతో, 6,4,4 – 6-8 మాత్రలుగా పదముల విఱుపులున్నప్పుడు వాటిని తాళయుక్తముగా పాడుకొనవచ్చును. ఇలాటివి ఇతర వృత్తములకు కూడ సాధ్యము.
చతురస్ర లఘువు + ద్రుతము ఈ రెంటిని ఆఱు మాత్రలుగా తీసికొంటే మొదటి ఆనందం పదము మనకు లభిస్తుంది, అర్ణవ, ఐతే ఈ నాలుగు మాత్రలు తఱువాతి చతురస్ర లఘువులు అవుతాయి. అప్పుడు హాయిగా దీనిని ధ్రువ తాళములో పాడుకొనవచ్చును. అశ్మాచం, లైలాగారు ఏదో మౌఖిక పరీక్షలో పరీక్షించినట్లు నన్ను పరీక్షించినందులకు వందనములు. దురదృష్టవశాత్తు వారి దృష్టిలో నేను fail అయ్యాను. పర్లేదు లెండి. నా ఉద్దేశములో వ్యాసములోని ముఖ్య విషయములను ఎవ్వరూ చర్చించలేదు అన్న విషయము నాకు నిరుత్సాహాన్ని కలిగించింది. ఇక ఈ చర్చలో ఏవైనా క్రొత్త విషయాలుంటే చర్చిస్తాను. లేక పోతే వాళ్లిద్దరు వారి gun powder ను తడి లేకుండ తఱువాతి వ్యాసానికి ఉంచుకొనమని ఒక ఉచిత సలహా. స్వస్తి!
సంస్కృతంలో పాదాంత యతి (విరామం) విషయకమైన శ్రీ మోహనరావు గారి వ్యాఖ్యను చదివి, దానిని గురించి ఈ నాలుగు మాటలు వ్రాయాలనిపించింది:
‘పాదాంత యతి’ అంటే ప్రతిపాదం చివర పదం పూర్తయి, మరొక కొత్తపదంతో మరుసటి పాదం ప్రారంభం కావటం అన్నమాట. ఒక పాదానికి, మరొక పాదానికి నడుమ సంధికార్యం జరిగే వీలుండదని దీని అర్థం. నిజానికిది సంస్కృతంలో బహుళంగా కనుపించే దృగ్విషయమే కాని, “లాక్షణికనియత” మైనట్లు లేదు. పాదాంత యతి భగ్నమైనందుకు వేద వాఙ్మయం నుంచి, లౌకిక సాహిత్యం నుంచి కొన్ని ప్రమాణాలు:
లక్షణశాస్త్ర చారిత్రిక పరిణామక్రమంలో తొలిరోజులలో నిజానికి 2 – 3 పాదాల మధ్య మాత్రమే పాదాంతయతి విధింపబడినదని; 1 – 3, 3 – 4 పాదాల మధ్య పాదాంతయతి లేదని భావింపవచ్చును. అందుకు సామవేదచ్ఛందోవిచితిలో చెప్పబడిన లక్షణం:
పాదాంతయతి పాటింపబడనందుకు ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ ఉదాహరణలున్నాయి.
సంస్కృతంలో 1-2; 3-4 పాదాల మధ్య ఆ పాదాంతయతి తప్పనిసరి కాదు అది కవిప్రయోగాలలో రూఢమై, శ్రావ్యసుభగమైన ఒక సమయగతపాలనమే కాని, శాస్త్రవిహితం కానేరదు.
ఒక పద్యమైనా, గీతమైనా, ప్రబంధ గద్యమైనా, కవి తనకు తెలిసి వ్రాసినా, తెలియక కూర్చినా “ఛందస్సు” అనే అతివిస్తృతమైన కట్టుబాటులోనికి (“ఛన్దోహీనో న శబ్దోఽస్తి, నచ్ఛన్దశ్శబ్దవర్జితమ్”) ఇమిడిన తర్వాత అది గానయోగ్యమే అవుతుంది. పాదాంతయతికి, ఎక్కడికక్కడ పదాల విరుపుకు ఆ గాన”యోగ్యత”తో లాక్షణికాన్వయం ఉండదు.
ఛందస్సులో ఉన్నదంటేనే అది తంత్రీలయసమన్వితమై, “పాఠ్యే గేయే చ మధురం” అవుతుంది. పాదాంతయతి, యతిస్థానం వద్ద పదచ్ఛేదం లేని తెలుగు పద్యాన్ని ప్రసిద్ధమైన గతిలోనే గాక వివిధగతులలో హాయిగా పాడుకోవచ్చును. ఏ భాషలోని పద్యానికైనా, గద్యానికైనా, తాళవృత్తానికైనా, గీతికైనా గానయోగ్యత ఉంటుంది. దానికి “రాగ-తాళనిర్దేశం” అన్నది స్వచ్ఛందమూ, ప్రాసంగికమే కాని, లాక్షణికనియతం కాదు.
అన్నీ చతురశ్రజాతి ధ్రువ తాళమే. 14 అక్షరములు. తాళము క్రమము – చతురశ్ర జాతి లఘువు, ద్రుతము, చతురశ్ర జాతి లఘువు, చతురశ్ర జాతి లఘువు.( 4-2-4-4)
(పాఠకులు ‘కొత్త సంగీత విద్య దర్పణము’ అన్న సంగీతం పుస్తకం చూడండి. ఆ పుస్తకం ముందు పేజీల లో ‘అలంకారముల’ లో నుండి ఆ ప్రాధమిక ఉదాహరణ ఇచ్చాను. ఇంకా క్లిష్టమైన స్వర సముదాయం కల ఘనరాగ గీతముల లోకి వెడితే; “శ్రీ రామచంద్ర శ్రిత పారిజాత, సమస్త కళ్యాణ గుణాభిరామ, సీతా ముఖాంభోరుహ చంచరీక, నిరంతరం మంగళ మాత నోతు.” అనేటి చక్కని సాహిత్యం, చతురశ్రజాతి ధ్రువ తాళము లో స్వరం చూడొచ్చు. ఇందులో సాహిత్యం, ఆవర్తాలు దాటుతుంది. సంగీత రచన లో, స్వర సాహిత్యాలు ఆవర్తాలను అతిక్రమించితే, తాళం తప్పక్కర్లేదు.
In the movie ‘The body guard’ when Whitney Houston sang the line “And I will always love you” she took the single word “I” thru a long string of notes. It is an all-time gorgeous song to listen.
The trained classical and pop singers can do syllabic and melismatic singing and mixes.)
ఇంతకూ, వ్యాస రచయిత – శ్రీశ్రీ పాటను వ్యాసంలో పాడవచ్చని చెప్పిన తాళంలోనే రాసి చూపమని అడిగితే, చేయలేదు. He can’t do it without contradicting himself. It is no big deal. He does not have to do it, if he does not want to.
“”మోహనగారు చెపుతున్నది లయ గురించి, ……..అనిపిస్తోంది”. కామేశ్వర రావు.
కాదు. అర్థవంతంగా పాడుకోవటానికి వీలుగా సంస్క్ర్త త శ్లొకాల పాదాలు పదాలు విరగకుండా ముగుస్తాయి అన్న విషయాన్ని మోహన తన వ్యాసాలలో పదే పదే చెపుతున్నారు. ఈ అభిప్రాయానికి తోడుగా తెలుగు కవులు పాదాంత యతిని పాటించక పోవటాన్ని (కొంత తక్కువ చేసి) కూడా వారు ప్రస్తావిస్తున్నారు. పద్యం పాడుకోవటానికి కాదు, చదువుకోవటానికి అన్న విషయాన్ని నేను పదే పదే నా అభిప్రాయాలలో రక రకాలుగా చేబుతూ వచ్చాను. మోహన ఇక్కడ ఈ వ్యాసం మీద వచ్చిన అభిప్రాయాల పై ఇచ్చిన వివరణలో, “నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే” అని అన్నారు.
“అద్వైతం” గేయాన్ని చతురశ్రజాతి ధ్రువతాళం వేస్తూ పాడవచ్చంటారు, వ్యాస రచయిత.
కర్ణాటక సంగీతం పుస్తకం నుండి చతురశ్ర జాతి ధ్రువతాళం. ఒక ఉదాహరణ : సరిగమ గరి సరిగరి సరిగమ. 14 అక్షరములు. (Unless Telugu prosody has its’ own ‘Taala’ scheme.)
వ్యాసకర్త ( జె. కె. మోహనరావు) ఉద్దేశంలో , గేయాలలో మాటలు మధ్యలో తునగరాదు. ఏ పాదానికి ఆ పాదం అంతమవ్వాలి.
“ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” గేయపు సాహిత్యాన్ని – చతురశ్ర జాతి ధ్రువతాళంలో రాసి చూపండి.
ఎద్దానికైనా తలాతోక లేని సమయమందు తల తగిలించవలెను. అటుల తగిలించిన ఎడల తోక సద్దుకొనును అనునది పాంచరాత్రసూక్తిముక్తావళిలో ముక్తి ప్రసాదించే యాభయ్యారో సూక్తి. ప్రథమంగా దానిననుసరించి మిమ్ములను “తల”చెగానే తోక కాసింత నెమ్మళించి దారిన పడునను సంగతి తెలిసీ, ద్వితీయముగా “కామేశ్వరరావు & కో” అను లయాత్మక, ప్రాసాత్మక, రైమాత్మక పిలుపు వలన “వేంకట్రామ & కో” , “వావిళ్ళ & కో” లాగున ఒక అథారిటేటివు స్టాంపు, ఇక్కడ ఇవియన్నీ చదువువారి మనమున ముద్ర పడునను సంగతి తెలిసీ, తృతీయముగా మీరు పండిత సమర్థులు కాన, గణితాగ్రేసరులు అను నా పాయింటుకాలంబనగా నిలబడుకొన్నారు కాన మంచి ప్రశ్నలను, పిచ్చి ప్రశ్నలను హంసవలె వేఱు చేసి సమాధానము చెప్పగల సమర్థులని తెలిసీ, చతుర్థంగా – పంచమంగా – షష్ఠంగా ఇంకా నానారకముల అర్థంగా మీ పేరు ఆ స్థానమునందు పెట్టితిని.
నా అంచనా వమ్ము చెయ్యక, చక్కని సమాధానములు చెప్పి బండిని గాడియందు పెట్టినారు. ఇక నల్లేరు ఎక్కవలెను. వారి చక్కని ప్రశ్నలకు మీ చిక్కని సమాధానములు వన్నె తెచ్చినవి. అయ్యవి లైలాగారికి నచ్చిననూ, నచ్చకున్ననూ ఇక ఫరవాలేదు. మీరు కలకాలం తలగా వర్థిల్లవలెనన్న కోరిక మెండుగా నిండుచుండగా, మీకు చీకాకు కలిగించినందులకు క్షమాపణలు తెలియచేసుకొనుచున్నాను.
అయినా ఈ సంగతులన్నీ మీరు తొందరపడక మొదటి కమెంటునందు చెప్పి కంట్రోలు తప్పిన మీ “కో”ను కంట్రోలు చేసి ఉండిన బాగుండేది. ఏదైతేనేమి రంభము సద్దుమణిగే దాఖలాలు కనపడినవి. సంతోషము అవధులు మించినది, ఇప్పటికి, ఇంతకాలానికి. మీకు నా ధన్యవాదములు.
____________________________________________
మో.రా గారు
కా.రా గారి సముఖానికి రాసిన నా సమాధానము చదువుడి. మీకు కూడా క్షమాపణలు, ధన్యవాదాలు తెలియచేసుకునుచున్నాను. వ్యాసమును అపహసించాలన్న కోరిక ఉన్న ఎడల ఆ దుమ్ము వేరుగానుండును. అది మీరు అర్థము చేసుకొనవలె. నభూతో నవర్తమాన నభవిష్యతిలా ఇంత చక్కని విషయ పరిజ్ఞానము కలిగిన మీరు మరింత చక్కగా ఈసారి రాయబోయే వ్యాసములో ఇక్కడ జరిగిన వేళాకోలరహిత (సహిత కాదండి, రహిత – రహిత) పాయింటులందు దృష్టి ఉంచి రాయగలరని ఆశించుచుంటిని. స్వంత పేరుతో పని ఏమున్నదండి. అది నేనే, ఇది నేనే, అశ్మాచాన్నీ నేనే, అన్నీ నేనే. అయిననూ ఈవరకు మీకు ఉప్పు అందిపోయి ఉండవలె. అందని ఎడల అందించువారూ తక్కువ లేరు. మీరు సరైన మీట నొక్కటమే తరువాయి! మరొక్కసారి ధన్యవాదాలతో.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
12/28/2015 4:42 pm

విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
12/28/2015 3:44 pm

ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
12/28/2015 1:53 pm
సంస్కృతంలో పాదాంత యతి (విరామం) విషయకమైన శ్రీ మోహనరావు గారి వ్యాఖ్యను చదివి, దానిని గురించి ఈ నాలుగు మాటలు వ్రాయాలనిపించింది:
‘పాదాంత యతి’ అంటే ప్రతిపాదం చివర పదం పూర్తయి, మరొక కొత్తపదంతో మరుసటి పాదం ప్రారంభం కావటం అన్నమాట. ఒక పాదానికి, మరొక పాదానికి నడుమ సంధికార్యం జరిగే వీలుండదని దీని అర్థం. నిజానికిది సంస్కృతంలో బహుళంగా కనుపించే దృగ్విషయమే కాని, “లాక్షణికనియత” మైనట్లు లేదు. పాదాంత యతి భగ్నమైనందుకు వేద వాఙ్మయం నుంచి, లౌకిక సాహిత్యం నుంచి కొన్ని ప్రమాణాలు:
001.02 (a): agníḥ pū́rvebhir ŕ̥ṣibhir (+ +)
1.001.02 (b): ī́ḍiyo nū́tanair utá
1.001.02 (c): sá devā́m̐ éhá vakṣati.
(అగ్నిః పూర్వేభిరృషిభి (+ +)
రీడ్యో నూతనైరుత
స దేవానేహ వక్షతి.) – ఋగ్వేదం 1, 1-2.
*
1.024.11 (a): tát tvā yāmi bráhmaṇā vándamānas (+ +)
1.024.11 (b): tád ā́ śāste yájamāno havírbhiḥ
1.024.11 (c): áheḷamāno varuṇehá Bodhi
1.024.11 (d): úruśaṃsa mā́ na ā́yuḥ prá moṣīḥ.
(తత్ త్వా యామి బ్రహ్మణా వన్దమానస్ (+ +)
తదా శాస్తే యజమానో హవిర్భిః
అహేళమానో వరుణేహ బోధ్యురుశంస మా న ఆయుః ప్రమోషీః.) – ఋగ్వేదం 1, 24-11.
*
ఇది కాళిదాసు రఘువంశం నుంచి –
అనాకృష్టస్య విషయై
ర్విద్యానాం పారదృశ్వనః
తస్య ధర్మరతే రాసీ (+ +)
ద్వృద్ధత్వం జరసా వినా. (1-23)
ఇవి గాక ఇటువంటి ప్రయోగాలను శతశః ఉదాహరింపవచ్చును. (+ +) అని ఉన్నవి పాదాంతయతి లేనందుకు ఉదాహృతులు. నాకు ఇంటిలో వెంటనే యెదుట కనుపించినవి:
“పశ్యామ్యన్య ముదారభోగవిషయే తుల్యం న మే కఞ్చిద (+ +)
ప్యన్యః కోఽహ మివాస్మి భాజన ముమాపత్యాదరస్యాపి చ.”
“మడ్డాఽఽశాకర ఖణ్డనో వివిభునా క్షీరావసా తుల్యమా (+ +)
సాసుం చాలితడిన్నిభాఙ్గవసనోఽవ్యాత్ సేవకం సారవాన్.” – దుర్ఘట కావ్యం.
లక్షణశాస్త్ర చారిత్రిక పరిణామక్రమంలో తొలిరోజులలో నిజానికి 2 – 3 పాదాల మధ్య మాత్రమే పాదాంతయతి విధింపబడినదని; 1 – 3, 3 – 4 పాదాల మధ్య పాదాంతయతి లేదని భావింపవచ్చును. అందుకు సామవేదచ్ఛందోవిచితిలో చెప్పబడిన లక్షణం:
“అథ అవసానాని ఇతి.
ఏకపద – ద్విపదానాం అన్తతో విరామః.
త్రిపదాప్రభృతీనాం ద్వౌ ఉక్త్వా శేషం ఆహ ఆ షట్పదాభ్యః ఇతి.
త్రిపదా – అగ్న ఆయాహి వీతయే (1),
చతుష్పదా – యజ్ఞాయజ్ఞో (2) వో అగ్నయే.” – (సామవేద చ్ఛందోవిచితి)
అని. “అగ్న ఆయాహి వీతయే”, “యజ్ఞాయజ్ఞో” అన్నవి సామవేదంలో పాదాంతయతి లేనందుకు ఋగుదాహరణలు.
పాదాంతయతి పాటింపబడనందుకు ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ ఉదాహరణలున్నాయి.
సంస్కృతంలో 1-2; 3-4 పాదాల మధ్య ఆ పాదాంతయతి తప్పనిసరి కాదు అది కవిప్రయోగాలలో రూఢమై, శ్రావ్యసుభగమైన ఒక సమయగతపాలనమే కాని, శాస్త్రవిహితం కానేరదు.
ఒక పద్యమైనా, గీతమైనా, ప్రబంధ గద్యమైనా, కవి తనకు తెలిసి వ్రాసినా, తెలియక కూర్చినా “ఛందస్సు” అనే అతివిస్తృతమైన కట్టుబాటులోనికి (“ఛన్దోహీనో న శబ్దోఽస్తి, నచ్ఛన్దశ్శబ్దవర్జితమ్”) ఇమిడిన తర్వాత అది గానయోగ్యమే అవుతుంది. పాదాంతయతికి, ఎక్కడికక్కడ పదాల విరుపుకు ఆ గాన”యోగ్యత”తో లాక్షణికాన్వయం ఉండదు.
ఛందస్సులో ఉన్నదంటేనే అది తంత్రీలయసమన్వితమై, “పాఠ్యే గేయే చ మధురం” అవుతుంది. పాదాంతయతి, యతిస్థానం వద్ద పదచ్ఛేదం లేని తెలుగు పద్యాన్ని ప్రసిద్ధమైన గతిలోనే గాక వివిధగతులలో హాయిగా పాడుకోవచ్చును. ఏ భాషలోని పద్యానికైనా, గద్యానికైనా, తాళవృత్తానికైనా, గీతికైనా గానయోగ్యత ఉంటుంది. దానికి “రాగ-తాళనిర్దేశం” అన్నది స్వచ్ఛందమూ, ప్రాసంగికమే కాని, లాక్షణికనియతం కాదు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:
12/27/2015 5:12 pm
In Response to essayist:
Below is closer syllabic writing.
సరిగమ గరి సరిగరి సరిగమ
నుడివెద మరి చదువరి చదువగ
రిగమప మగ రిగమగ రిగమప
అడిగెద నెరి తదుపరి కలియగ
Now, couple of lines of song changed into similar syllabic musical alphabet. (Not of any use to a singer.)
దేవీ మది దీపము నీవై
సారీ గరి సారిగ రీగా
రావా హృది రంజిలు పూవై
రీగా మగ రీగమ గామా
అన్నీ చతురశ్రజాతి ధ్రువ తాళమే. 14 అక్షరములు. తాళము క్రమము – చతురశ్ర జాతి లఘువు, ద్రుతము, చతురశ్ర జాతి లఘువు, చతురశ్ర జాతి లఘువు.( 4-2-4-4)
(పాఠకులు ‘కొత్త సంగీత విద్య దర్పణము’ అన్న సంగీతం పుస్తకం చూడండి. ఆ పుస్తకం ముందు పేజీల లో ‘అలంకారముల’ లో నుండి ఆ ప్రాధమిక ఉదాహరణ ఇచ్చాను. ఇంకా క్లిష్టమైన స్వర సముదాయం కల ఘనరాగ గీతముల లోకి వెడితే; “శ్రీ రామచంద్ర శ్రిత పారిజాత, సమస్త కళ్యాణ గుణాభిరామ, సీతా ముఖాంభోరుహ చంచరీక, నిరంతరం మంగళ మాత నోతు.” అనేటి చక్కని సాహిత్యం, చతురశ్రజాతి ధ్రువ తాళము లో స్వరం చూడొచ్చు. ఇందులో సాహిత్యం, ఆవర్తాలు దాటుతుంది. సంగీత రచన లో, స్వర సాహిత్యాలు ఆవర్తాలను అతిక్రమించితే, తాళం తప్పక్కర్లేదు.
In the movie ‘The body guard’ when Whitney Houston sang the line “And I will always love you” she took the single word “I” thru a long string of notes. It is an all-time gorgeous song to listen.
The trained classical and pop singers can do syllabic and melismatic singing and mixes.)
ఇంతకూ, వ్యాస రచయిత – శ్రీశ్రీ పాటను వ్యాసంలో పాడవచ్చని చెప్పిన తాళంలోనే రాసి చూపమని అడిగితే, చేయలేదు. He can’t do it without contradicting himself. It is no big deal. He does not have to do it, if he does not want to.
Lyla
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:
12/26/2015 2:14 pm
మో.రా గారు – నమస్కారాలు. మీరు మళ్ళీ రెడ్డొచ్చె ఆట మొదలుపెట్టినారు.
వారు అడిగినది ఏమి ?
“ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” గేయపు సాహిత్యాన్ని – చతురశ్ర జాతి ధ్రువతాళంలో రాసి చూపండి.”
మీరు రాసినది ఏమి ?
“దేవీ మది దీపము నీవై”
ఈ దేవీ దీపం ఆనందం అయ్యేదెప్పుడు, ఆ ఆనందం అనురాగం అయ్యేదెప్పుడు, ఆ అనురాగం అంబరాన్ని తాకేదెప్పుడు?
కామేశ్వరరావు & కో: విషయాన్ని నేను పదే పదే నా అభిప్రాయాల లో రక రకాలుగా చేబుతూ వచ్చాను
అశ్మాచం (లోపల్లోపల) : పదే పదే చదివినా ఎక్కడా ఏ అభిప్రాయమూ రకరకాలుగా నాకు కనపడలేదు. కాస్త ఎవరైనా పాయింట్ల వారీగా వివరిస్తే బాగుంటుందేమో!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
అశ్మాచం
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తః తః అభిప్రాయం:
12/25/2015 11:31 pm
“”మోహనగారు చెపుతున్నది లయ గురించి, ……..అనిపిస్తోంది”. కామేశ్వర రావు.
కాదు. అర్థవంతంగా పాడుకోవటానికి వీలుగా సంస్క్ర్త త శ్లొకాల పాదాలు పదాలు విరగకుండా ముగుస్తాయి అన్న విషయాన్ని మోహన తన వ్యాసాలలో పదే పదే చెపుతున్నారు. ఈ అభిప్రాయానికి తోడుగా తెలుగు కవులు పాదాంత యతిని పాటించక పోవటాన్ని (కొంత తక్కువ చేసి) కూడా వారు ప్రస్తావిస్తున్నారు. పద్యం పాడుకోవటానికి కాదు, చదువుకోవటానికి అన్న విషయాన్ని నేను పదే పదే నా అభిప్రాయాలలో రక రకాలుగా చేబుతూ వచ్చాను. మోహన ఇక్కడ ఈ వ్యాసం మీద వచ్చిన అభిప్రాయాల పై ఇచ్చిన వివరణలో, “నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే” అని అన్నారు.
తః తః
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
12/25/2015 8:50 am
“సరిగమ గరి సరిగరి సరిగమ. 14 అక్షరములు”
మాత్రలు అని ఉండాలి. ఒక చిన్న పాట – 4-2-4-4 మాత్రలతో –
దేవీ మది – దీపము నీవై
రావా హృది – రంజిలు పూవై
జీవ మ్మది – చెలువపు మాయలు
భావా లవి – భవితకు ఛాయలు
కనులకు కల – కాన్కలు కావా
తనువున గల – తాపము నీవా
మనసున చిరు – మంత్రము నీవే
ప్రణయపు సుధ – పాత్రను నేనే
నా మది నది – నవ్వులు తరగలు
ఆమని యిది – యందపు నురగలు
ప్రేమల విరి – ప్రియమగు పెదవులు
కామపు సిరి – కౌగిలి ముదములు
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:
12/23/2015 5:42 pm
“అద్వైతం” గేయాన్ని చతురశ్రజాతి ధ్రువతాళం వేస్తూ పాడవచ్చంటారు, వ్యాస రచయిత.
కర్ణాటక సంగీతం పుస్తకం నుండి చతురశ్ర జాతి ధ్రువతాళం. ఒక ఉదాహరణ : సరిగమ గరి సరిగరి సరిగమ. 14 అక్షరములు. (Unless Telugu prosody has its’ own ‘Taala’ scheme.)
వ్యాసకర్త ( జె. కె. మోహనరావు) ఉద్దేశంలో , గేయాలలో మాటలు మధ్యలో తునగరాదు. ఏ పాదానికి ఆ పాదం అంతమవ్వాలి.
“ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” గేయపు సాహిత్యాన్ని – చతురశ్ర జాతి ధ్రువతాళంలో రాసి చూపండి.
Lyla.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:
12/22/2015 12:44 pm
కా.రా గారూ, కా.రా గారూ, కా.రా గారూ – 🙂 🙂 🙂
ఎద్దానికైనా తలాతోక లేని సమయమందు తల తగిలించవలెను. అటుల తగిలించిన ఎడల తోక సద్దుకొనును అనునది పాంచరాత్రసూక్తిముక్తావళిలో ముక్తి ప్రసాదించే యాభయ్యారో సూక్తి. ప్రథమంగా దానిననుసరించి మిమ్ములను “తల”చెగానే తోక కాసింత నెమ్మళించి దారిన పడునను సంగతి తెలిసీ, ద్వితీయముగా “కామేశ్వరరావు & కో” అను లయాత్మక, ప్రాసాత్మక, రైమాత్మక పిలుపు వలన “వేంకట్రామ & కో” , “వావిళ్ళ & కో” లాగున ఒక అథారిటేటివు స్టాంపు, ఇక్కడ ఇవియన్నీ చదువువారి మనమున ముద్ర పడునను సంగతి తెలిసీ, తృతీయముగా మీరు పండిత సమర్థులు కాన, గణితాగ్రేసరులు అను నా పాయింటుకాలంబనగా నిలబడుకొన్నారు కాన మంచి ప్రశ్నలను, పిచ్చి ప్రశ్నలను హంసవలె వేఱు చేసి సమాధానము చెప్పగల సమర్థులని తెలిసీ, చతుర్థంగా – పంచమంగా – షష్ఠంగా ఇంకా నానారకముల అర్థంగా మీ పేరు ఆ స్థానమునందు పెట్టితిని.
నా అంచనా వమ్ము చెయ్యక, చక్కని సమాధానములు చెప్పి బండిని గాడియందు పెట్టినారు. ఇక నల్లేరు ఎక్కవలెను. వారి చక్కని ప్రశ్నలకు మీ చిక్కని సమాధానములు వన్నె తెచ్చినవి. అయ్యవి లైలాగారికి నచ్చిననూ, నచ్చకున్ననూ ఇక ఫరవాలేదు. మీరు కలకాలం తలగా వర్థిల్లవలెనన్న కోరిక మెండుగా నిండుచుండగా, మీకు చీకాకు కలిగించినందులకు క్షమాపణలు తెలియచేసుకొనుచున్నాను.
అయినా ఈ సంగతులన్నీ మీరు తొందరపడక మొదటి కమెంటునందు చెప్పి కంట్రోలు తప్పిన మీ “కో”ను కంట్రోలు చేసి ఉండిన బాగుండేది. ఏదైతేనేమి రంభము సద్దుమణిగే దాఖలాలు కనపడినవి. సంతోషము అవధులు మించినది, ఇప్పటికి, ఇంతకాలానికి. మీకు నా ధన్యవాదములు.
____________________________________________
మో.రా గారు
కా.రా గారి సముఖానికి రాసిన నా సమాధానము చదువుడి. మీకు కూడా క్షమాపణలు, ధన్యవాదాలు తెలియచేసుకునుచున్నాను. వ్యాసమును అపహసించాలన్న కోరిక ఉన్న ఎడల ఆ దుమ్ము వేరుగానుండును. అది మీరు అర్థము చేసుకొనవలె. నభూతో నవర్తమాన నభవిష్యతిలా ఇంత చక్కని విషయ పరిజ్ఞానము కలిగిన మీరు మరింత చక్కగా ఈసారి రాయబోయే వ్యాసములో ఇక్కడ జరిగిన వేళాకోలరహిత (సహిత కాదండి, రహిత – రహిత) పాయింటులందు దృష్టి ఉంచి రాయగలరని ఆశించుచుంటిని. స్వంత పేరుతో పని ఏమున్నదండి. అది నేనే, ఇది నేనే, అశ్మాచాన్నీ నేనే, అన్నీ నేనే. అయిననూ ఈవరకు మీకు ఉప్పు అందిపోయి ఉండవలె. అందని ఎడల అందించువారూ తక్కువ లేరు. మీరు సరైన మీట నొక్కటమే తరువాయి! మరొక్కసారి ధన్యవాదాలతో.
అశ్మాచం
నాకు నచ్చిన పద్యం: చక్రవర్తి కావ్యం చేసిన సామాన్యుల జీవనం గురించి pavan santhosh అభిప్రాయం:
12/22/2015 7:50 am
కళ్ళకి కట్టేలా రాశారు.. కృష్ణరాయలూ, కామేశ్వరరావు గారూను.