పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16487

  1. బాలమురళీకృష్ణ సంగీతం గురించి Rao Pamganamamula అభిప్రాయం:

    11/13/2008 9:57 am

    సరిగ్గా నలభై సంవత్సరాల క్రిందట బాలమురళిగారి కచేరిని నేను దెహ్రాదూన్ లోవిన్నాను. అక్కడకు వచ్చేముందు ఆయన ఢిల్లీలో కూడా కచేరి చేశారు. అప్పుడు హిందూ పత్రికలో వచ్చిన తమిళ రసికుని విమర్శేమిటంటే బాలమురళి రెండవ స్థాయి వాద్యకారులను పెట్టుకొని తాను వెలిగిపోయే ప్రయత్నాలు చేశారని. ఆకారణంగానో మరెందువల్లనో గాని ఆయన దెహ్రాదూన్ చేరుకొనేసరికి వాయులీన సహకారుడు లేకుండాపోయాడు. స్థానిక ఆహ్వానసంఘంవారు అక్కడే హిమాలయన్ రేడియో ప్రోపగేషన్ సెంటరు లో పనిచేస్తున్న శ్రీ ఎ వి యస్ కృష్ణారావు గారిని యేర్పాటు చేశారు. కృష్ణారావుగారి వయొలిన్ వాదనను అంతకు ముందు ఆంధ్రాయూనివర్శిటీ రోజులనుంచీ విన్నవారెందరో సభలో వున్నారు. ఆనాటి చాలామంది శ్రోతలలో యేర్పడిన అభిప్రాయమేమిటంటే బాలమురళి గాత్రంకన్నా వాయులీన సహవాద్యమే ఒకమెట్టుపైనవుందని. ఒకటి రెండు సార్లు కృష్ణారావుగారిని పక్కకునెట్టే ప్రయత్నంచేసి సఫలంకాకపోగా చివరకు వారిని అభినందించక తప్పని పరిస్తితి యేర్పడ్డది. అమెరికాలో గత పుష్కరకాలంలో ఆయనను చాలా కచేరీల్లో చూశాను, విన్నాను. కాని ఆ నాటి ధోరణి కనపడలేదు. మరి అప్పటి ప్రవర్తనకు వర్ధమాన గాయకులకుండే భద్రతారాహిత్యమేనా కారణం? లేక తోటి కళాకారులపట్ల గౌరవంపెరిగిందా?

  2. జనరంజని: మహానటి సావిత్రి గురించి PraveenReddy అభిప్రాయం:

    11/13/2008 3:13 am

    శ్రీనివాస్ గారు మీకు చాలా థాంక్సు.

  3. రెండు తీరాలు గురించి kavya అభిప్రాయం:

    11/13/2008 12:51 am

    చాలా బాగుంది.

  4. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి krishna a అభిప్రాయం:

    11/12/2008 10:22 pm

    మేకలు తోలే పిల్లని అడగ వచ్చుకదా. మరి సమస్య ఏమిటి?

  5. రెండు తీరాలు గురించి krishna a అభిప్రాయం:

    11/12/2008 10:16 pm

    నాకయితే ఈ కవితలో అంత గొప్ప ఏమీ కనిపించ లేదు.
    ఒకటి మాత్రం కరెక్టు గా చెప్పగలను. ఈ సైటులో ఏమి అర్థం కాకపోయినా అన్నీ గొప్ప గా వున్నట్లు వ్రాస్తారు.

  6. రామా కనవేమిరా! గురించి రాఘవ అభిప్రాయం:

    11/12/2008 9:55 pm

    బాగుంది 🙂

  7. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Malathi Nidadavolu అభిప్రాయం:

    11/12/2008 3:33 pm

    I am grateful to Veluri garu for reading the book and the review.

    Vaidehi, thanks for your kind comments.

    Kodavalla Hanumantha Rao garu, thanks for your kind abhinandanalu. I explained my reasons for writing this book in English.

    Baabjeelu, Since you say you mean no offense to me personally, none is taken. Thanks for your expressing views. However, I would like to add that a sameeksha is intended only to introduce the book to the public.Maybe, meaningful discussion and critical reviews are possible after you read my book. (Maybe this is my way of getting a couple of books sold :))

    For the record, my book is not about feminism.

    Thanks.
    Malathi Nidadavolu

  8. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి seshagiri nookala అభిప్రాయం:

    11/12/2008 2:57 pm

    చాలా బాగా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తము చదివితే నాకు కళ్ళ వెంట నీరు వచ్చింది.

    -శేషు

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    11/12/2008 12:55 pm

    లక్ష్మన్న గారూ,

    మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషించాను.

    ఆన్నమయ్య కీర్తనల్లో సాహిత్యాన్ని ఎంతగానో పొగిడిన సాహితీవేత్తలు త్యాగరాజుకి అంత పెద్ద పీట వేయలేదు. కారణం సంగీత చట్రంలో సాహిత్యం బంధించే ప్రక్రియలో త్యాగరాజు చందస్సుని భంగపరిచాడన్న వాదముంది. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు 1968లో అన్నమయ్య పై రాసిన వ్యాస పరంపర్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అలాగే కొన్ని పదాల వాడుక కూడా వారికి అంతగా రుచించలేదు. అలా అని త్యాగరాజు కీర్తనల్లో అసలు సాహిత్యమే లేదని ఆయన అనలేదు. సంగీతమున్నంత తారాస్థాయిలో సాహిత్యం లేదని వారి అభిప్రాయం. అదీకాక సంగీతానికిచ్చిన ప్రాముఖ్యత త్యాగరాజు సాహిత్యానికివ్వలేదని వారి వాదన. ఇవన్నీ రాబోయే భాగాల్లో వస్తాయి.

    త్యాగరాజు కటిక దరిద్రమనుభవించకపోయినా, ఆయన ఉద్యోగం చేయకపోవడం వల్ల ఇల్లుగడవడం కాస్త కష్టమే అయ్యిందని రాసారు. రోజూ ఆయనింట్లో పాతిక పైగా విస్తళ్ళు లేచేవి. ఒకరా ఇద్దరా శిష్యులు, అడగడం్ మహాపాపమన్నట్లుగా సంగీతం నేర్పాడు. అదీ ఉచితంగా.

    పోతననీ త్యాగరాజునీ పోల్చలేం. ఇద్దరిదీ భక్తి వాహకమే అయినా ఎంచుకున్న దారులు వేరు. అనుసరించిన తీరు వేరు. పోతన భాగవతం ప్రభావం త్యాగరాజు మీద ఉంది. ఆయన రాసుకున్న భాగవత ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. నేను వెళ్ళినప్పుడు నౌకా చరిత్రానికి ఫొటో తీసే అనుమతిచ్చారు కానీ, ఆ భాగవత ప్రతికి ఎంత బ్రతిమాలినా ఇవ్వలేదు. వ్యాస సూచికలో ప్రస్తావించిన పుస్తకాల సంఖ్య కంటే ఎక్కువే దొరికినా కొన్ని ప్రతులు సంపాదించలేకపోయాను. అమెరికాలో ఉండడం ఓ పెద్ద అడ్డంకయ్యింది. ఈ వ్యాసం రాయడానికి కష్టపడ్డం వాస్తవమే! ఆ కష్టంలో ఆనందం దొరికింది.

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/12/2008 10:44 am

    సాయి బ్రహ్మానందం గొర్తి గారూ:

    మీ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో పుస్తకాలను తిరగేసి, చాలా మందిని సంప్రదిస్తే తప్ప ఇటువంటి మంచి వ్యాసం రాదు.

    త్యాగరాజుపై ప్రజాభిప్రాయం మీరు రాసిన దానికన్నా ఎందుకు భిన్నంగా వస్తూ ఉందో తెలియదు. త్యాగబ్రహ్మ కటిక పేదరికం అనుభవించాడని అందరిలాగే నేనూ అనుకొనేవాడిని. కాని, దానికి భిన్నంగా తగినంత ఆస్తిపరుడేనని మొన్న మొన్న తెలిసింది.

    త్యాగరాజు మీద నాకు చాలా ఎక్కువ గౌరవం. అయితే, నన్ను ఎప్పుడూ ఒక్క విషయం కలవరపెడుతుంది. సంగీతంలో అనుమానం లేకుండా అసామాన్య ప్రతిభ కలవాడైనా, సాహిత్యకారుడుగా ఈయన గొప్పతనం ఎంతవరకు పెద్దలు ఆమోదించారు? భక్తి రసం పోషణ ఈయన సాహిత్యం అంతా అతి చక్కగా తెలుస్తూనే ఉంటుంది. కానీ, సాహిత్యంలో భక్తి రసం పోతన తీసుకెళ్ళిన ఎత్తులు, మరెవరూ చేరలేరేమో!

    సాహిత్యంతో బాగా పరిచయమున్న విజ్ఞులు దీనికి సమాధానం చెప్పగలరేమో!

    అభినందనలతో,

    లక్ష్మన్న