కథనం బాగుంది. కధలోని నేపథ్యం మన తెలుగునాడు కాదు కనుక అన్వయం కొంచెం కష్టంగానే ఉంది.
రవికిరణ్ గారి వాఖ్య కొంచెం పంజెంట్ గాఉంది. కానీ ఒక పరిశీలన ప్రతిఒక్కరూ తనచావు ప్రశాంతంగా శివశివా అనుకొంటూ పోవాలని కోరుకొనేవారే. ఆఖరుకు మంచంపట్టిన వారుకూడా.
కానీ వాస్తవానికి మరణ శయ్యపై ఉన్నవాని ఆలోచన అలా ఉంటుందా? మరికొంత కాలం బతకాలన్న ఆశ ఉండటం సార్వజనీనమేమో.
అలాగని చావును ఈ కథలో మూడో ముసలమ్మ ఎదుర్కొన్నట్టుగా వీరోచితంగా ఎదుర్కోవటం అనేది చాలా డ్రమాటిక్ గా అనిపిస్తోంది. ఇక్కడ అప్రస్తుతమైనా ఎప్పుడో చదివిన చిన్న కవిత
చిన్నప్పుడు తడబడుతూ రోడ్డు దాటుతున్న
ముసలివానిని చూసి దేముడా నాకు అట్లాంటి దుస్తితి
రాకుండానే తీసుకుపో అని కోరుకొన్నాను.
ఇప్పుడు అంత ముసలివాడినయ్యాక మరలా దేముడిని ప్రార్ధిస్తున్నాను
దేముడా నన్ను ఇప్పుడే తీసుకెళ్లకు ఈ రోడ్డు దాటనీ”
కవి పేరు గుర్తుకులేదు వాక్యాలు కూడా అవే కాకపోవచ్చు.
ప్రతిఒక్కరూ ప్రశాంతంగా శివ శివా అని వెళిపోవాలి అన్న కోరికమీద నిర్మించిన కథ ఇది. దీనిలోని పాత్రలూ, సంఘటనలూ, సంభాషణలూ ఆ సెంట్రల్ డోగ్మా ను అనుసరించి పేర్చుకొంటూ పోయినవే అని నాకనిపిస్తూంది. అంతకు మించి మరోలా ఉండటం వీలుకాదేమో!
మా ఇంట్లో ఓ పదిహేనేళ్ళ క్రితం తారాట్లాడిన పిల్లి ఎక్కడికెళ్ళిందబ్బా అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇదిగో – మీ అనుభవంలోకో, ఊహల్లోకో వచ్చి, ఈ కథలో ప్రత్యక్ష్యమయ్యింది.
బావుంది “అమ్మ ఉత్తరం” – ఉత్తరం చివరి అనునయ వాక్యాలు రాసేందుకేనా, ఇంత కథా రాసింది, మీరు? బావుంది.
ఈ కధ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. చదువుతున్నంత సేపూ రోమ్ లో మనమున్నామా అనిపించింది. Poetic గా అనిపించింది. ఇది చదవగానే “To rome with love” సినిమా గుర్తొచ్చింది.
ఈ పుస్తకాన్నీ, జనసాహితి ప్రచురించిన నా పుస్తకం జీవశాస్త్రవిజ్ఞానం- సమాజం అనే పుస్తకాన్నీ అయిదేసి డాలర్లకు అమ్మిపెట్టమని ప్రచురణకర్తలు నాకు కొన్ని కాపీలు పంపారు. నా ఈ మెయిల్: rohiniprasadk@yahoo.com
ఈ వ్యాసం వెనక ఒక చిన్న కథ ఉంది. 2001 సంవత్సరం జూన్ నెలలో ఈ వ్యాసకర్తలం (అప్పటి ఈమాట సంపాదకులం) ముగ్గురం ఒక ఆదివారం ఒకరి ఇంట్లో పొద్దున్నే కలుసుకుని ఈ వ్యాసాన్ని ఎలా రాస్తే బాగుంటుదనే చర్చ కోసం ఒక రెండు గంటలు నడక ప్రారంభిచాం! మా ముగ్గురికీ సినిమా పాటలంటే ఇష్టమే కాక, వాటిలోని కొన్ని అంశాల్లో పరిచయం కూడా ఉన్నాయి. ఈ రెండు గంటల నడక మా చర్చలని కొంచెం వేడెక్కించిన మాట వాస్తవం. ఇప్పటి దాకా ఎవరు చూడని దృష్టితో కొత్తగా సినిమా పాటల గురించి ఏమైనా చెప్పగలమా అన్నది మా చర్చల కేంద్రబిందువు. అంతే కాకుండా ముగ్గురు తెలుగు వాళ్ళు (అందునా ప్రవాస జీవులు) కలిసి చర్చించుకొని ఒక వ్యాసం రాస్తే ఎలా ఉంటుంది? అన్నది తేల్చుకోవాలన్న ఒక సరదా కూడా ఈ వ్యాసానికి ప్రేరకమే!
ఇప్పుడు ఈ వ్యాసం ముగ్గురు రచయితలు, అమెరికాలో మూడు రాష్ట్రాల్లో ఉంటున్నారు. మళ్ళీ ఇలాంటి రచన ఎప్పుడు సాధ్యమో తెలియదు. మరెవరన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుది.
ముగ్గురు ముసలమ్మలు గురించి బొల్లోజుబాబా అభిప్రాయం:
11/07/2009 2:57 pm
కథనం బాగుంది. కధలోని నేపథ్యం మన తెలుగునాడు కాదు కనుక అన్వయం కొంచెం కష్టంగానే ఉంది.
రవికిరణ్ గారి వాఖ్య కొంచెం పంజెంట్ గాఉంది. కానీ ఒక పరిశీలన ప్రతిఒక్కరూ తనచావు ప్రశాంతంగా శివశివా అనుకొంటూ పోవాలని కోరుకొనేవారే. ఆఖరుకు మంచంపట్టిన వారుకూడా.
కానీ వాస్తవానికి మరణ శయ్యపై ఉన్నవాని ఆలోచన అలా ఉంటుందా? మరికొంత కాలం బతకాలన్న ఆశ ఉండటం సార్వజనీనమేమో.
అలాగని చావును ఈ కథలో మూడో ముసలమ్మ ఎదుర్కొన్నట్టుగా వీరోచితంగా ఎదుర్కోవటం అనేది చాలా డ్రమాటిక్ గా అనిపిస్తోంది. ఇక్కడ అప్రస్తుతమైనా ఎప్పుడో చదివిన చిన్న కవిత
కవి పేరు గుర్తుకులేదు వాక్యాలు కూడా అవే కాకపోవచ్చు.
ప్రతిఒక్కరూ ప్రశాంతంగా శివ శివా అని వెళిపోవాలి అన్న కోరికమీద నిర్మించిన కథ ఇది. దీనిలోని పాత్రలూ, సంఘటనలూ, సంభాషణలూ ఆ సెంట్రల్ డోగ్మా ను అనుసరించి పేర్చుకొంటూ పోయినవే అని నాకనిపిస్తూంది. అంతకు మించి మరోలా ఉండటం వీలుకాదేమో!
బొల్లోజు బాబా
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని మధుకేళి వర్ణన గురించి Veerabhadram అభిప్రాయం:
11/07/2009 12:53 pm
పొదలి, గాత, నా, వీధి మినహయిస్తే ఈ పద్యములొ ఇంకా తెలుగు పదాలు ఉన్నాయా?
రెండు ఆకాశాలు గురించి pantula jogarao అభిప్రాయం:
11/06/2009 12:00 pm
మిత్రమా, నీ కథ చాలా బాగు౦ది. అభిన౦దనలు. చక్కని శైలి. ఒక మంచి కథ చదివానన్న స౦తోష౦ కలిగి౦ది.
అమ్మ ఉత్తరం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
11/06/2009 10:51 am
మా ఇంట్లో ఓ పదిహేనేళ్ళ క్రితం తారాట్లాడిన పిల్లి ఎక్కడికెళ్ళిందబ్బా అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇదిగో – మీ అనుభవంలోకో, ఊహల్లోకో వచ్చి, ఈ కథలో ప్రత్యక్ష్యమయ్యింది.
బావుంది “అమ్మ ఉత్తరం” – ఉత్తరం చివరి అనునయ వాక్యాలు రాసేందుకేనా, ఇంత కథా రాసింది, మీరు? బావుంది.
అమ్మ ఉత్తరం గురించి Harita అభిప్రాయం:
11/05/2009 5:19 am
అమ్మ ఉత్తరం అద్భుతంగా ఉంది. ఎంతో కదిలించేలా ఉంది. ఉత్తరాల విలువ తెలియని ఈ తరం చేత చదివించాల్సిన ఉత్తరం ఇది.
“ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
11/04/2009 8:55 pm
ఈ కధ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. చదువుతున్నంత సేపూ రోమ్ లో మనమున్నామా అనిపించింది. Poetic గా అనిపించింది. ఇది చదవగానే “To rome with love” సినిమా గుర్తొచ్చింది.
విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి Rohiniprasad అభిప్రాయం:
11/04/2009 6:28 pm
ఈ పుస్తకాన్నీ, జనసాహితి ప్రచురించిన నా పుస్తకం జీవశాస్త్రవిజ్ఞానం- సమాజం అనే పుస్తకాన్నీ అయిదేసి డాలర్లకు అమ్మిపెట్టమని ప్రచురణకర్తలు నాకు కొన్ని కాపీలు పంపారు. నా ఈ మెయిల్:
rohiniprasadk@yahoo.com
విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:
11/04/2009 5:53 pm
[రామకృష్ణరావు గారి ఈమెయిల్ అడ్రస్ సరిదిద్దాము. తెలియచేసినందుకు ధన్యవాదాలు. –సంపాదకులు]
చివరిలో ఇచ్చిన ఈమైలు ఐడీ తప్పులా ఉన్నది. మైల్ బవున్సు ఐనది. సరిదిద్దవలసినదిగా ప్రార్థన.
విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:
11/04/2009 5:51 pm
నమస్కారం. ఈ పుస్తకము అమెరికాలో దొరుకుతుందా? ఇక్కడ కొనాలంటే యెలా కొనాలి, ఎవరిని సంప్రదించవలెను?
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
11/04/2009 10:46 am
ఈ వ్యాసం వెనక ఒక చిన్న కథ ఉంది. 2001 సంవత్సరం జూన్ నెలలో ఈ వ్యాసకర్తలం (అప్పటి ఈమాట సంపాదకులం) ముగ్గురం ఒక ఆదివారం ఒకరి ఇంట్లో పొద్దున్నే కలుసుకుని ఈ వ్యాసాన్ని ఎలా రాస్తే బాగుంటుదనే చర్చ కోసం ఒక రెండు గంటలు నడక ప్రారంభిచాం! మా ముగ్గురికీ సినిమా పాటలంటే ఇష్టమే కాక, వాటిలోని కొన్ని అంశాల్లో పరిచయం కూడా ఉన్నాయి. ఈ రెండు గంటల నడక మా చర్చలని కొంచెం వేడెక్కించిన మాట వాస్తవం. ఇప్పటి దాకా ఎవరు చూడని దృష్టితో కొత్తగా సినిమా పాటల గురించి ఏమైనా చెప్పగలమా అన్నది మా చర్చల కేంద్రబిందువు. అంతే కాకుండా ముగ్గురు తెలుగు వాళ్ళు (అందునా ప్రవాస జీవులు) కలిసి చర్చించుకొని ఒక వ్యాసం రాస్తే ఎలా ఉంటుంది? అన్నది తేల్చుకోవాలన్న ఒక సరదా కూడా ఈ వ్యాసానికి ప్రేరకమే!
ఇప్పుడు ఈ వ్యాసం ముగ్గురు రచయితలు, అమెరికాలో మూడు రాష్ట్రాల్లో ఉంటున్నారు. మళ్ళీ ఇలాంటి రచన ఎప్పుడు సాధ్యమో తెలియదు. మరెవరన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుది.
విష్ణుభొట్ల లక్ష్మన్న