వాద్యము అంటే వీణ మున్నగునవి. దీనినే వాయిదము (వాయిద్యము కాదు) అని కూడ అంటారు. వాద్యమును మనము వాయిస్తాము. అందువలన వాడుకలో వాయిద్యము అని వచ్చిందేమో? విధేయుడు – మోహన
వ్యాసాలు ధారావాహికలుగా ప్రచురించడానికి అభ్యంతరం లేనప్పుడు నవలలు కూడా ప్రచురిస్తే బావుంటుంది. ఎందుకో ఈ మాట వారికి నవలల మీద అంత ఆసక్తి కనిపించడం లేదు. నవల కూడా సాహిత్యంలో ఒక భాగమే కదా? వార పత్రికల పుణ్యమాని తెలుగు నవల ప్రస్తుతం వెనకబడి వుంది.
-బ్రహ్మానందం
[ఈ ఆలోచన మాకూ వచ్చిందండీ. కానీ, నవలాసమీక్ష ఎలా చేయాలి, ప్రచురణార్హత ఎలా నిర్ణయించాలి అనేవాటిపై చర్చిస్తున్నాము. నవల అంతా ముందే రాసి పంపడం రచయితలకు కుదరని పని కదా. సమీక్షావిధానాలపై ఒక నిర్ణయం తీసుకోగానే, నవలలు ప్రచురించడానికి మాకే అభ్యంతరమూ లేదు – సం.]
చర్చ రసవత్తరముగా ఉన్నది. కొలోన్ నిఘంటువులొ కేలిక అనే పదానికి ఇవ్వబడిన అర్థాలు – kelika mfn. sporting , sportive W. ; the tree Jonesia As3oka L ఆప్తే నిఘంటువులో అశోక వృక్షము అని మాత్రమే అర్థము ఉన్నది. కొలోన్ నిఘంటువు ప్రకారము కేలిక పుంలింగము, స్త్రీలింగములలో ఉపయోగించవచ్చును. తాల(ళ)మునుండి తాలి(ళి)క అనే పదము కూడ వచ్చింది అనుకొంటాను. బాలికా తాలి(ళి)కా అనే రాసక్రీడ పద్యము జ్ఞాపకానికి వచ్చింది నాకు.
విధేయుడు – మోహన
రోహిణీ ప్రసాదు గారి లాంటి పెద్దమనిషి నుండి వచ్చిన వ్యాఖ్య బాధ కలిగించింది.
ప్రసాదు గారూ, మీకు తెలుసున్న సంగీత విషయాలని మీరెలా పదిమందికీ చెప్పాలనుకున్నారో, తరచూ రాసే మిగతా వారూ అనుకోడంలో తప్పులేదనుకుంటాను. అంతేకానీ, ఎదుటి వారిని ఎకసెక్కం చేయడం భావ్యం కాదు.
మీ తరువాత సంగీతం గురించి ఈ మధ్య రాస్తున్నదీ నేనే. నన్ను దూషించడమే మీ లక్ష్యం అయితే కానివ్వండి. మీరు తప్ప సంగీత విషయాలు రాయకూడదంటే చెప్పండి. రాయడం మానేస్తాను. సంగీతం గురించి రాసిన ప్రతీవాళ్ళూ విద్వాంసులు కాలేరన్న జ్ఞానం నాకుంది. విద్వాన్లు అన్న బిరుదులు ఇంకెవరికయినా కేటాయించండి.
“నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!” అని రాసిన మీరే గతంలో రాసిన ఒక వ్యాసం మీ సమాధానానికే సమాధానం చూపిస్తుంది.
1. “ప్రాంతవనాంతరానఁ జివురాకులయాసవమూని” అన్నపాదములో “ఆసవమూని” అన్నది “ఆసవమాని” గా సరిదిద్దాలి. ఊని అంటే ధరించు, అదుము అని అర్థాలు. ఆను అంటే త్రాగు అని అర్థము (నాకు తెలినానంతవరకు).
వివరణ: “ఆసవమాని” అన్నదే సరియైనది. “ఆసవమూని” అన్నది వ్రాతదోషం.
స్పందన: కారణమేదైతేనేం తప్పు తప్పే. ఒప్పుకున్నారు సంతోషం (ప్రమాదో ధీమతామపి) లేకపోతే ఊను శబ్దమేసరైనదని తెలయనివారు భావించే ప్రమాదం తప్పింది.
2. “సాంయాత్రికోపమానం సరిగ్గా అతకలేదు. గగనంలో మేఘాలకీ అభ్దిలో సాంయాత్రికులకీ మధ్య సామ్యం బాగా కుదరలేదని నా అభిప్రాయం. ఆ పద్యనిర్మాణంలో లొసుగు కూడా అక్కడే ఉంది.
వివరణ: ఈ పద్యాన్ని సరిగ్గా అన్వయం చేసుకొనలేకపోవడంవల్ల జనించిన సంశయమిది. “గగనాబ్ధిలో న సాంయాత్రికులట్లు” – అంటే ఆకాశమనే సముద్రంలో చరించే మేఘాలు సముద్రంలో చరించే సముద్రవర్తకులలాగా ఉన్నాయని ఉపమానం. “సాంయాత్రికః పోతవణిక్” – అని అమరం. ఆకాశం సముద్రాన్ని పోలితే అందులో చరించే మేఘాలు ఆ సముద్రంలో ఓడలపై చరించే వర్తకుల లాగ ఉన్నాయని భావం. గగనాన్ని అబ్ధితో పోల్చడం సర్వసామాన్యం. “పోతవణిక్” అనే వివరణ ఇక్కడ ముఖ్యం. వర్తకులు లోనున్నా, పైకి కనపడేవి ఓడలే. అట్లాగే మేఘాలున్నాయని లక్షితార్థం.
స్పందన: సముద్రంలో సాంయాత్రికుల్లా గగనంలో మేఘాలు కదులుతున్నాయి అని ఉండాలి. అంతేగాని గగనాబ్ధిలోన సాంయాత్రికుల్లా మేఘాలు కదులుతున్నాయడంతో అలంకార నిర్వహణ దారితప్పింది. ఇది అటు ఉపమా కాకుండా, ఇటు రూపకం కాకుండా ఏదో ఆయ్యింది.
3. “లేఖకాపేటి” పద స్వరూపం, దానికీ చిత్రకారుడికీ సంబంధం ఏంటో అర్థం కాలేదు.
వివరణ: పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది. ఆలేఖ్యము = చిత్రము, ఆలేఖకుడు = చిత్రకారుడు, ఆలేఖనము = చిత్రరచనము,ఆలేఖకాపేటి = painter’s toolbox. కాని ఆలేఖకపదం పుల్లింగంలో అకారాంతం కావడంవల్ల, ఆలేఖికా అనే స్త్రీలింగరూపం ఆకారాంతం కావడంవల్ల పై సమాసాన్ని ఆలేఖికాపేటి అని మారుస్తే వ్యాకరణ సమ్మతంగా ఉంటుంది. అప్పుడు చిత్రకారిణి toolbox, or painter’s toolbox in general అని జాతివాచకంగా చెప్పుకోవచ్చు.
స్పందన: దీన్ని కిట్టింపు వాదమని అంటారు. ఆడా మగా కాని పదం వాడి, “పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది” అని రొక్కించడం దబాయింపు అవుతుంది. అంతేకాకుండా అప్రసిద్ధ పదం వాడి సరిగా అర్థం చేసుకోలేదని రుసరుసలాడితే ఎలా? వ్యాకరణ సమ్మతం అనే ముసుగులో ఒక పదం రాబట్టి అర్థం కిట్టించేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టుంది ధోరణి.
4. బ్రతిరచించు అనేది ప్రామాణిక శబ్ద ప్రయోగమేనా –
వివరణ: నిస్సందేహంగా. ప్రతిరచనము అంటే ఉన్న రూపానికి ప్రతిగా, అంటే దాని ప్రతిబింబంగా రచించడం. “ప్రతిసృష్టి” వంటి పదం. ప్రతి అనే అవ్యయానికి అనేకార్థా లున్నాయి. ఈ “ప్రతిరచన” “ప్రతిసృష్టి”, “ప్రతిబిమ్బం” వంటి పదాలలో ఇది సదృశార్థంలో, అంటే తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన, తత్తుల్యమైన మూర్తి అనే అర్థాలలో వర్తిస్తుంది. “పరిజ్ఞానే, పదప్రాప్తౌ, కాలహృత్యాం, నివారణే, వ్యళీకావిష్కృతౌ, తుష్టౌ, సేవాయాం, నిష్క్రమేపి చ, ప్రోత్సాహే చా వినాభావే, విఘ్నాఙ్గీ కారయోరపి, వ్యావర్తనే, వినిమయే, పునరావర్తనేపి చ, వైపరీత్యే, వినిద్రత్వే, అవేక్షాక్షేపయోరపి. సంక్షేప స్పర్ధ సాదృశ్యే, స్వీకారాభ్యవహారయోః, ఉత్తరస్తోకయత్నేషు” – అని “ప్రతి” అను అవ్యయం వివిధపదాలకు చేర్చినపుడు కలిగే అర్థపరిణామాలు చెప్పబడ్డవి.
స్పందన: తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన అనే అర్థంలో వాడానంటున్నారు. ఇది క్లిష్టాన్వయార్థ సంపాదనం. వివరణే ప్రత్యక్ష ప్రమాణం.
వివరణ: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ యిది. ఈ పద్యానికి ముందు గల పద్యంలోని
“కొన్ని మబ్బు లూయలరూపు గొనుచు నలర
మఱొక కొన్ని యూయల నూఁగు తరుణికరణి
నమరుచుం గననయ్యె నయ్యంబరాన.”
మేఘవిద్యోతితమైన తరుణీరూపాన్ని “అమరగఁ గేశపాశముగ” అనే ఈ పద్యం విస్తరించి, మేఘాలవల్ల ఆ స్త్రీరూప మెలా ఏర్పడిందో రమ్యంగా తెలుపుతుంది. దీని తరువాతి పద్యం
పై రెండు పద్యాలలోని భావాలను సంక్షేపిస్తుంది. ఈ మూడుపద్యాలను సక్రమంగా అన్వయించుకొనకపోవడమే పై ఆక్షేపణకు కారణమైంది.
స్పందన: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ కాదిది. కర్త, కర్మ, క్రియల సమన్వయాన్నిబట్టి అన్వయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అటువంటి సమన్వయం లేనే లేదు. క్లిష్టాన్వయ దూరాన్వయాలే దోషాలు. అన్వయరాహిత్యం గురించి ఇక చెప్పాలా! ఇక దబాయింపులేమైనా ఉన్నాయేమో చూడాలి.
6. “కాలాఖ్యబాలక కేళికాతాడిత” లో కేళిక వైకృత పదం. తెలియడం లేదు. ఈసమాసానికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి?
వివరణ: ఇది వైకృతపదం కాదు. శుద్ధమైన సంస్కృతపదం. కేళీ – కేళికా, అట్లే కాశీ – కాశికా, మల్లీ – మల్లికా, ఝిల్లీ – ఝిల్లికా, కాళీ – కాళికా . “కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి” – అని శ్రీనాథప్రయోగం. ఆకారాంతమైన కేళికాపదానికి (హ్రస్వ) అకారాంతమైన కేళిక వైకృతరూపం. అందుచేత ఈ ఆక్షేపణ నిరర్థకం. అన్వయం: కాలాఖ్య= కాలమనెడి, బాలక = బాలకునియొక్క, కేళికా= (బంతి) యాటవలన (యందు) , తాడిత= కొట్ట (తన్న)బడిన, కమనీయ = అందమైన, రోహిత = ఎఱ్ఱనైన, కందుకంబొ = బంతియో! అనగా, కాలమనెడు బాలకుడు బంతియాట ఆడుచు దిశాంతమునకు తన్నినట్టి ఎఱ్ఱని బంతివలె అస్తంగతుడగుచున్న సూర్యు డున్నా డని భావము. కొట్టి (తన్ని)నపుడు బంతి పైకెగిరి ఆ తర్వాత భూపతితమైనట్లు, అప్పు డాకాశంలో కొంత ఎత్తుగా నున్న రవి త్వరలో పశ్చిమాబ్ధియందు బడనున్నాడని ఇందులో ధ్వని.
స్పందన: ఇది ఒక అభినవ పాణినీయం. ఈ వాదన శబ్దస్వరూప విషయిక భ్రాంతి జన్యం. ఇచ్చిన ఉదాహరణాల్లో రెండు రకాల శబ్దాలున్నాయి. కొన్ని ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు, కొన్ని ఇకారాంత ఉభయలింగ శబ్దాలు. కాళీ – కాళికా వంటి శబ్దాలు “కాల”వంటి ప్రథమావిభక్త్యంతమైన అదంత శబ్దాలకు మత్వర్థంలో “ఇని”, “ఠన్” ప్రత్యయాలు వస్తాయి. (సూ. అత ఇనిఠనౌ). కాలః్ అస్య అస్తి కాల శబ్దం పైన “ఇని” ప్రత్యయము చేరి కాళీ (కాలీ) రూపం సిద్ధిస్తుంది. అదే “ఠన్” ప్రత్యయము చేరినప్పుడు “కాలిక” రూపం సిద్ధించి దానిమీద టాప్ వచ్చి కాలికా అవుతుంది. ఇక కేళి శబ్దము కిల శబ్దభవం (కిలంత్యనేనేతి కేళిః కిల క్రీడాయాం). ఇది ఇకారాంత పుల్లింగశబ్దం. దీనిమీద “ఙీప్” ప్రత్యయము వచ్చి కేళీ అనే స్త్రీలింగ శబ్దం ఏర్పడి ఉండవచ్చు (అక్తిన్నంతాలకి ఇ కారం దీర్ఘం వైకల్పికం). ఇక కాళికా శబ్దంలో కనిపించే అంత్య క కారం కేళికా శబ్దంలోని అంత్య క కారం ఒకే విధంగా నిష్పన్నమైనవిగావు. కేళికా లోని అంత్య క కారం స్వార్థమందు కా వర్ణం పరమైనప్పుడు నిష్పన్నం అయిన శబ్దం (కేళీ + కా). కేళీ సంబంధమైనది కేళిక. ఈ పదం విస్తృత వ్యవహారంలో లేదు. ఆంధ్ర శబ్ద రత్నాకరం దీన్ని వైకృత పదంగా పేర్కొని నాట్యం అనే అర్థాన్ని ఇచ్చింది. కొన్ని నిఘంటువులు sportive (కేళీ భావం) అనే అర్థాన్ని ఇచ్చాయి. ఏది ఏమైనా కేళిక పదానికి ఆట అనే అర్థం చెప్పడం కుదరదు. అంతే కాదు “కాలాఖ్యబాలక కేళికాతాడిత” అనే సమాసంలో యోగిత లోపించింది. కర్తృ క్రియా పదానుక్రమాన్ని పాటించి సమాసార్థాన్ని చెప్పాలి. ఇష్టానుసారం విభక్తుల్ని చేర్చి విగ్రహవాక్యాలు చెప్పేస్తే సరిపోదు.
భావనారాయణగారూ,
వాద్యాలు, వాయిద్యాలు అనేవాటికి మధ్య గల తేడాలను ఈమాటలో నిత్యమూ రాసే విద్వాన్లు చెప్పగలరేమో. నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!
ఓ నెలరాజా ఎక్కువగా శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. దీన్నే హిందుస్తానీలో ధానీ అటారు. అక్కడక్కడ భీంపలాస్ ఛాయలు కనబడటానికి కారణం రెండిటి ఆరోహణా ఒకటే కావడం. భీంపలాస్‌లో అవరోహణలో రి2, ద2 కూడా వస్తాయి. అది మాల్కౌఁస్ కాదు. శుద్ధధాన్యాసిని ‘గ్రహభేదం’ చేస్తే (పంచమాన్ని షడ్జమం అనుకుంటే) అలా అనిపిస్తుంది అంతే.
సడిసేయకో గాలి శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. (సినిమా పాటలన్నిటి గురించీ అలాగే రాయాలి. ఎదుకంటే రాగ స్వరూపం పూర్తిగా ప్రకటితం అవాలంటే గమకాలూ, వాదిసంవాది స్వరాలూ అన్నీ పలికించాలని పండితులంటారు).
ఇప్పుడే “జగదానందకారకా”తో కుస్తీ పడి ఇటు వచ్చాను. ఏ బాలమురళిగారో పాడితే సంగీతపు వరదలో పడి కొట్టుకుపోవటమే కానీ స్థిమితంగా పద పదార్థ వివేచన చేయలేదెప్పుడూ.
బ్రహ్మానందం గారూ, మీరు త్యాగరాజు గారి అర్థాలంకారాల మీద కూడా వ్యాసాలు రాస్తారా?
ఓ చిన్న సందేహం – “వర త్యాగరాజ నుత” అన్న “వర” శబ్దం త్యాగరాజుకి ఆపాదితం అవుతుందా? ఆయన చేత పొగడబడిన దేవుడికా?
రాగలహరి: ఆభేరి గురించి Rohiniprasad అభిప్రాయం:
04/18/2011 10:02 pm
బ్రహ్మానందంగారూ,
మీ గురించి నేనసలు ఆలోచించను కూడా లేదు. మీకెందుకు బాధ కలిగిందో నాకర్థం కాలేదు. నేను రాసినది సాహిత్య వ్యాసాలూ, వాటి గురించిన స్పందనల గురించే.
నాకేమీ ‘రహస్య’ ఎజెండా లేదు. సంగీతానికి సంబంధించినంతవరకూ ఆడియో లింకులు పనికొస్తాయని నా నమ్మకం. ప్రశ్నలకు జవాబులిచ్చేటప్పుడు అంత ‘సీన్’ ఉండదు కదా.
అసలు భావనారాయణగారి ప్రశ్న లక్ష్మన్న గారికి. నేను నాకు తోచినది రాశాను. అంతే. దయచేసి లేని ఉద్దేశాలు ఆపాదించవద్దు.
రాగలహరి: ఆభేరి గురించి మోహన అభిప్రాయం:
04/18/2011 7:34 pm
వాద్యము అంటే వీణ మున్నగునవి. దీనినే వాయిదము (వాయిద్యము కాదు) అని కూడ అంటారు. వాద్యమును మనము వాయిస్తాము. అందువలన వాడుకలో వాయిద్యము అని వచ్చిందేమో? విధేయుడు – మోహన
ఈమాట ప్రచురణలో చిన్న మార్పు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
04/18/2011 3:44 pm
వ్యాసాలు ధారావాహికలుగా ప్రచురించడానికి అభ్యంతరం లేనప్పుడు నవలలు కూడా ప్రచురిస్తే బావుంటుంది. ఎందుకో ఈ మాట వారికి నవలల మీద అంత ఆసక్తి కనిపించడం లేదు. నవల కూడా సాహిత్యంలో ఒక భాగమే కదా? వార పత్రికల పుణ్యమాని తెలుగు నవల ప్రస్తుతం వెనకబడి వుంది.
-బ్రహ్మానందం
[ఈ ఆలోచన మాకూ వచ్చిందండీ. కానీ, నవలాసమీక్ష ఎలా చేయాలి, ప్రచురణార్హత ఎలా నిర్ణయించాలి అనేవాటిపై చర్చిస్తున్నాము. నవల అంతా ముందే రాసి పంపడం రచయితలకు కుదరని పని కదా. సమీక్షావిధానాలపై ఒక నిర్ణయం తీసుకోగానే, నవలలు ప్రచురించడానికి మాకే అభ్యంతరమూ లేదు – సం.]
మేఘాంగన గురించి మోహన అభిప్రాయం:
04/18/2011 12:44 pm
చర్చ రసవత్తరముగా ఉన్నది. కొలోన్ నిఘంటువులొ కేలిక అనే పదానికి ఇవ్వబడిన అర్థాలు – kelika mfn. sporting , sportive W. ; the tree Jonesia As3oka L ఆప్తే నిఘంటువులో అశోక వృక్షము అని మాత్రమే అర్థము ఉన్నది. కొలోన్ నిఘంటువు ప్రకారము కేలిక పుంలింగము, స్త్రీలింగములలో ఉపయోగించవచ్చును. తాల(ళ)మునుండి తాలి(ళి)క అనే పదము కూడ వచ్చింది అనుకొంటాను. బాలికా తాలి(ళి)కా అనే రాసక్రీడ పద్యము జ్ఞాపకానికి వచ్చింది నాకు.
విధేయుడు – మోహన
రాగలహరి: ఆభేరి గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
04/18/2011 10:52 am
రోహిణీ ప్రసాదు గారి లాంటి పెద్దమనిషి నుండి వచ్చిన వ్యాఖ్య బాధ కలిగించింది.
ప్రసాదు గారూ, మీకు తెలుసున్న సంగీత విషయాలని మీరెలా పదిమందికీ చెప్పాలనుకున్నారో, తరచూ రాసే మిగతా వారూ అనుకోడంలో తప్పులేదనుకుంటాను. అంతేకానీ, ఎదుటి వారిని ఎకసెక్కం చేయడం భావ్యం కాదు.
మీ తరువాత సంగీతం గురించి ఈ మధ్య రాస్తున్నదీ నేనే. నన్ను దూషించడమే మీ లక్ష్యం అయితే కానివ్వండి. మీరు తప్ప సంగీత విషయాలు రాయకూడదంటే చెప్పండి. రాయడం మానేస్తాను. సంగీతం గురించి రాసిన ప్రతీవాళ్ళూ విద్వాంసులు కాలేరన్న జ్ఞానం నాకుంది. విద్వాన్లు అన్న బిరుదులు ఇంకెవరికయినా కేటాయించండి.
“నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!” అని రాసిన మీరే గతంలో రాసిన ఒక వ్యాసం మీ సమాధానానికే సమాధానం చూపిస్తుంది.
-బ్రహ్మానందం
ప్రేమ కవితలు గురించి SIVA అభిప్రాయం:
04/18/2011 4:57 am
చాల బాగుంది.
మేఘాంగన గురించి GSCS Siddhartha అభిప్రాయం:
04/17/2011 12:50 pm
చాలా బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అయింది
సీరియల్ గా స్పందిస్తా
1. “ప్రాంతవనాంతరానఁ జివురాకులయాసవమూని” అన్నపాదములో “ఆసవమూని” అన్నది “ఆసవమాని” గా సరిదిద్దాలి. ఊని అంటే ధరించు, అదుము అని అర్థాలు. ఆను అంటే త్రాగు అని అర్థము (నాకు తెలినానంతవరకు).
వివరణ: “ఆసవమాని” అన్నదే సరియైనది. “ఆసవమూని” అన్నది వ్రాతదోషం.
స్పందన: కారణమేదైతేనేం తప్పు తప్పే. ఒప్పుకున్నారు సంతోషం (ప్రమాదో ధీమతామపి) లేకపోతే ఊను శబ్దమేసరైనదని తెలయనివారు భావించే ప్రమాదం తప్పింది.
2. “సాంయాత్రికోపమానం సరిగ్గా అతకలేదు. గగనంలో మేఘాలకీ అభ్దిలో సాంయాత్రికులకీ మధ్య సామ్యం బాగా కుదరలేదని నా అభిప్రాయం. ఆ పద్యనిర్మాణంలో లొసుగు కూడా అక్కడే ఉంది.
వివరణ: ఈ పద్యాన్ని సరిగ్గా అన్వయం చేసుకొనలేకపోవడంవల్ల జనించిన సంశయమిది. “గగనాబ్ధిలో న సాంయాత్రికులట్లు” – అంటే ఆకాశమనే సముద్రంలో చరించే మేఘాలు సముద్రంలో చరించే సముద్రవర్తకులలాగా ఉన్నాయని ఉపమానం. “సాంయాత్రికః పోతవణిక్” – అని అమరం. ఆకాశం సముద్రాన్ని పోలితే అందులో చరించే మేఘాలు ఆ సముద్రంలో ఓడలపై చరించే వర్తకుల లాగ ఉన్నాయని భావం. గగనాన్ని అబ్ధితో పోల్చడం సర్వసామాన్యం. “పోతవణిక్” అనే వివరణ ఇక్కడ ముఖ్యం. వర్తకులు లోనున్నా, పైకి కనపడేవి ఓడలే. అట్లాగే మేఘాలున్నాయని లక్షితార్థం.
స్పందన: సముద్రంలో సాంయాత్రికుల్లా గగనంలో మేఘాలు కదులుతున్నాయి అని ఉండాలి. అంతేగాని గగనాబ్ధిలోన సాంయాత్రికుల్లా మేఘాలు కదులుతున్నాయడంతో అలంకార నిర్వహణ దారితప్పింది. ఇది అటు ఉపమా కాకుండా, ఇటు రూపకం కాకుండా ఏదో ఆయ్యింది.
3. “లేఖకాపేటి” పద స్వరూపం, దానికీ చిత్రకారుడికీ సంబంధం ఏంటో అర్థం కాలేదు.
వివరణ: పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది. ఆలేఖ్యము = చిత్రము, ఆలేఖకుడు = చిత్రకారుడు, ఆలేఖనము = చిత్రరచనము,ఆలేఖకాపేటి = painter’s toolbox. కాని ఆలేఖకపదం పుల్లింగంలో అకారాంతం కావడంవల్ల, ఆలేఖికా అనే స్త్రీలింగరూపం ఆకారాంతం కావడంవల్ల పై సమాసాన్ని ఆలేఖికాపేటి అని మారుస్తే వ్యాకరణ సమ్మతంగా ఉంటుంది. అప్పుడు చిత్రకారిణి toolbox, or painter’s toolbox in general అని జాతివాచకంగా చెప్పుకోవచ్చు.
స్పందన: దీన్ని కిట్టింపు వాదమని అంటారు. ఆడా మగా కాని పదం వాడి, “పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది” అని రొక్కించడం దబాయింపు అవుతుంది. అంతేకాకుండా అప్రసిద్ధ పదం వాడి సరిగా అర్థం చేసుకోలేదని రుసరుసలాడితే ఎలా? వ్యాకరణ సమ్మతం అనే ముసుగులో ఒక పదం రాబట్టి అర్థం కిట్టించేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టుంది ధోరణి.
4. బ్రతిరచించు అనేది ప్రామాణిక శబ్ద ప్రయోగమేనా –
వివరణ: నిస్సందేహంగా. ప్రతిరచనము అంటే ఉన్న రూపానికి ప్రతిగా, అంటే దాని ప్రతిబింబంగా రచించడం. “ప్రతిసృష్టి” వంటి పదం. ప్రతి అనే అవ్యయానికి అనేకార్థా లున్నాయి. ఈ “ప్రతిరచన” “ప్రతిసృష్టి”, “ప్రతిబిమ్బం” వంటి పదాలలో ఇది సదృశార్థంలో, అంటే తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన, తత్తుల్యమైన మూర్తి అనే అర్థాలలో వర్తిస్తుంది. “పరిజ్ఞానే, పదప్రాప్తౌ, కాలహృత్యాం, నివారణే, వ్యళీకావిష్కృతౌ, తుష్టౌ, సేవాయాం, నిష్క్రమేపి చ, ప్రోత్సాహే చా వినాభావే, విఘ్నాఙ్గీ కారయోరపి, వ్యావర్తనే, వినిమయే, పునరావర్తనేపి చ, వైపరీత్యే, వినిద్రత్వే, అవేక్షాక్షేపయోరపి. సంక్షేప స్పర్ధ సాదృశ్యే, స్వీకారాభ్యవహారయోః, ఉత్తరస్తోకయత్నేషు” – అని “ప్రతి” అను అవ్యయం వివిధపదాలకు చేర్చినపుడు కలిగే అర్థపరిణామాలు చెప్పబడ్డవి.
స్పందన: తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన అనే అర్థంలో వాడానంటున్నారు. ఇది క్లిష్టాన్వయార్థ సంపాదనం. వివరణే ప్రత్యక్ష ప్రమాణం.
5. క్రింది పద్యభావం అసమగ్రం (తరువాతి పద్యంతో అన్వయం క్లిష్టం)
అమరగఁ గేశపాశముగ శ్యామలనీరదఖండమొండు వ
క్త్రమువలె నొక్క శ్వేతజలదంబు రహింపఁగ గాత్రవల్లిపై
నమరిన పీతవర్ణకలితాంచలశోభితరోహితాంశుకో
పమమయి మిశ్రవర్ణయుతవారిద మొక్కటి తారసిల్లఁగన్.
వివరణ: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ యిది. ఈ పద్యానికి ముందు గల పద్యంలోని
“కొన్ని మబ్బు లూయలరూపు గొనుచు నలర
మఱొక కొన్ని యూయల నూఁగు తరుణికరణి
నమరుచుం గననయ్యె నయ్యంబరాన.”
మేఘవిద్యోతితమైన తరుణీరూపాన్ని “అమరగఁ గేశపాశముగ” అనే ఈ పద్యం విస్తరించి, మేఘాలవల్ల ఆ స్త్రీరూప మెలా ఏర్పడిందో రమ్యంగా తెలుపుతుంది. దీని తరువాతి పద్యం
పరమేష్ఠినిఁ బనిగొనకయె
పరమాద్భుతముగ సృజింపఁబడిన తదీయాం
బరవిలసితవరవర్ణినిఁ
బరికించుచు నక్కజంబు పర్విన మదితోన్.
పై రెండు పద్యాలలోని భావాలను సంక్షేపిస్తుంది. ఈ మూడుపద్యాలను సక్రమంగా అన్వయించుకొనకపోవడమే పై ఆక్షేపణకు కారణమైంది.
స్పందన: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ కాదిది. కర్త, కర్మ, క్రియల సమన్వయాన్నిబట్టి అన్వయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అటువంటి సమన్వయం లేనే లేదు. క్లిష్టాన్వయ దూరాన్వయాలే దోషాలు. అన్వయరాహిత్యం గురించి ఇక చెప్పాలా! ఇక దబాయింపులేమైనా ఉన్నాయేమో చూడాలి.
6. “కాలాఖ్యబాలక కేళికాతాడిత” లో కేళిక వైకృత పదం. తెలియడం లేదు. ఈసమాసానికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి?
వివరణ: ఇది వైకృతపదం కాదు. శుద్ధమైన సంస్కృతపదం. కేళీ – కేళికా, అట్లే కాశీ – కాశికా, మల్లీ – మల్లికా, ఝిల్లీ – ఝిల్లికా, కాళీ – కాళికా . “కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి” – అని శ్రీనాథప్రయోగం. ఆకారాంతమైన కేళికాపదానికి (హ్రస్వ) అకారాంతమైన కేళిక వైకృతరూపం. అందుచేత ఈ ఆక్షేపణ నిరర్థకం. అన్వయం: కాలాఖ్య= కాలమనెడి, బాలక = బాలకునియొక్క, కేళికా= (బంతి) యాటవలన (యందు) , తాడిత= కొట్ట (తన్న)బడిన, కమనీయ = అందమైన, రోహిత = ఎఱ్ఱనైన, కందుకంబొ = బంతియో! అనగా, కాలమనెడు బాలకుడు బంతియాట ఆడుచు దిశాంతమునకు తన్నినట్టి ఎఱ్ఱని బంతివలె అస్తంగతుడగుచున్న సూర్యు డున్నా డని భావము. కొట్టి (తన్ని)నపుడు బంతి పైకెగిరి ఆ తర్వాత భూపతితమైనట్లు, అప్పు డాకాశంలో కొంత ఎత్తుగా నున్న రవి త్వరలో పశ్చిమాబ్ధియందు బడనున్నాడని ఇందులో ధ్వని.
స్పందన: ఇది ఒక అభినవ పాణినీయం. ఈ వాదన శబ్దస్వరూప విషయిక భ్రాంతి జన్యం. ఇచ్చిన ఉదాహరణాల్లో రెండు రకాల శబ్దాలున్నాయి. కొన్ని ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు, కొన్ని ఇకారాంత ఉభయలింగ శబ్దాలు. కాళీ – కాళికా వంటి శబ్దాలు “కాల”వంటి ప్రథమావిభక్త్యంతమైన అదంత శబ్దాలకు మత్వర్థంలో “ఇని”, “ఠన్” ప్రత్యయాలు వస్తాయి. (సూ. అత ఇనిఠనౌ). కాలః్ అస్య అస్తి కాల శబ్దం పైన “ఇని” ప్రత్యయము చేరి కాళీ (కాలీ) రూపం సిద్ధిస్తుంది. అదే “ఠన్” ప్రత్యయము చేరినప్పుడు “కాలిక” రూపం సిద్ధించి దానిమీద టాప్ వచ్చి కాలికా అవుతుంది. ఇక కేళి శబ్దము కిల శబ్దభవం (కిలంత్యనేనేతి కేళిః కిల క్రీడాయాం). ఇది ఇకారాంత పుల్లింగశబ్దం. దీనిమీద “ఙీప్” ప్రత్యయము వచ్చి కేళీ అనే స్త్రీలింగ శబ్దం ఏర్పడి ఉండవచ్చు (అక్తిన్నంతాలకి ఇ కారం దీర్ఘం వైకల్పికం). ఇక కాళికా శబ్దంలో కనిపించే అంత్య క కారం కేళికా శబ్దంలోని అంత్య క కారం ఒకే విధంగా నిష్పన్నమైనవిగావు. కేళికా లోని అంత్య క కారం స్వార్థమందు కా వర్ణం పరమైనప్పుడు నిష్పన్నం అయిన శబ్దం (కేళీ + కా). కేళీ సంబంధమైనది కేళిక. ఈ పదం విస్తృత వ్యవహారంలో లేదు. ఆంధ్ర శబ్ద రత్నాకరం దీన్ని వైకృత పదంగా పేర్కొని నాట్యం అనే అర్థాన్ని ఇచ్చింది. కొన్ని నిఘంటువులు sportive (కేళీ భావం) అనే అర్థాన్ని ఇచ్చాయి. ఏది ఏమైనా కేళిక పదానికి ఆట అనే అర్థం చెప్పడం కుదరదు. అంతే కాదు “కాలాఖ్యబాలక కేళికాతాడిత” అనే సమాసంలో యోగిత లోపించింది. కర్తృ క్రియా పదానుక్రమాన్ని పాటించి సమాసార్థాన్ని చెప్పాలి. ఇష్టానుసారం విభక్తుల్ని చేర్చి విగ్రహవాక్యాలు చెప్పేస్తే సరిపోదు.
మిగతా విషయాలు ఒకటి రెండు రోజుల్లో…………………………….
రాగలహరి: ఆభేరి గురించి Rohiniprasad అభిప్రాయం:
04/17/2011 3:58 am
భావనారాయణగారూ,
వాద్యాలు, వాయిద్యాలు అనేవాటికి మధ్య గల తేడాలను ఈమాటలో నిత్యమూ రాసే విద్వాన్లు చెప్పగలరేమో. నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!
ఓ నెలరాజా ఎక్కువగా శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. దీన్నే హిందుస్తానీలో ధానీ అటారు. అక్కడక్కడ భీంపలాస్ ఛాయలు కనబడటానికి కారణం రెండిటి ఆరోహణా ఒకటే కావడం. భీంపలాస్‌లో అవరోహణలో రి2, ద2 కూడా వస్తాయి. అది మాల్కౌఁస్ కాదు. శుద్ధధాన్యాసిని ‘గ్రహభేదం’ చేస్తే (పంచమాన్ని షడ్జమం అనుకుంటే) అలా అనిపిస్తుంది అంతే.
సడిసేయకో గాలి శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. (సినిమా పాటలన్నిటి గురించీ అలాగే రాయాలి. ఎదుకంటే రాగ స్వరూపం పూర్తిగా ప్రకటితం అవాలంటే గమకాలూ, వాదిసంవాది స్వరాలూ అన్నీ పలికించాలని పండితులంటారు).
కాలం కాని కాలంలో పాట భీంపలాస్ ఆధారంగా చేసినదే.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
04/16/2011 1:10 pm
ఇప్పుడే “జగదానందకారకా”తో కుస్తీ పడి ఇటు వచ్చాను. ఏ బాలమురళిగారో పాడితే సంగీతపు వరదలో పడి కొట్టుకుపోవటమే కానీ స్థిమితంగా పద పదార్థ వివేచన చేయలేదెప్పుడూ.
బ్రహ్మానందం గారూ, మీరు త్యాగరాజు గారి అర్థాలంకారాల మీద కూడా వ్యాసాలు రాస్తారా?
ఓ చిన్న సందేహం – “వర త్యాగరాజ నుత” అన్న “వర” శబ్దం త్యాగరాజుకి ఆపాదితం అవుతుందా? ఆయన చేత పొగడబడిన దేవుడికా?
శ్రీనివాస్
కొండ నుంచి కడలి దాకా గురించి Narayana అభిప్రాయం:
04/16/2011 11:21 am
ఎర్రర్ రీడింగ్ ఫైల్ అని చెబుతున్నదండీ మళ్ళీ..
[మేమన్నీ చెక్ చేశాము. ఫైరి్‌ఫాక్స్, ఎక్స్‌ప్లోరర్ – ఈ రెంటిలోనూ మాకు ఆడియో పనిచేస్తున్నది. మీకింకా ఎర్రర్ వస్తున్నటయితే, మీ బ్రౌజర్ వివరాలతో మమ్మల్ని సంప్రదించండి – సం.]