బాలానందం

న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుల గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను. ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులైన వారిద్దరు, ఆంధ్ర బాలానంద సంఘం పేరుతో 1939-40 నుండి 1955-56 ప్రాంతం వరకు మద్రాసు, ఆ తరువాత హైదరాబాదు నుంచి తెలుగులో బాలల సాహిత్యానికి చేసిన కృషి అందరికీ తెలిసినదే. ముఖ్యంగా వాళ్లిద్దరు చేసిన రేడియో కార్యక్రమాలు చాలామందిని ప్రభావితం చేశాయి. ధ్వని ప్రధానమైన రేడియోని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ పిల్లలకు కార్యక్రమాలు రూపొందించటంలో వారు చూపిన ప్రతిభ గొప్పది. వారు రాసి కొంత వరకు బాణీలు కట్టిన కొన్ని పాటలు హెచ్.ఎం.వి సంస్థ ద్వారా రికార్డులుగా వెలువడ్డాయి.

ఈ సంచికలో ‘బాలానందం’ బృంద గేయాలుగా వచ్చిన కొన్ని రికార్డులను విందాం. వీటిలో కొన్ని పాటలు బాలానంద సంఘం వజ్రోత్సవాల సందర్భంలో విడుదల చేసిన ఒక సి.డి లో ఉన్నాయి కానీ ఇక్కడ మెరుగైన క్వాలిటీలో వినిపించడానికి ప్రయత్నిస్తాను.

అసలు పాటలను వినే ముందుగా రేడియో కార్యక్రమం ప్రారంభంలో వినిపించే ‘పిలుపు.’

 1. రారండోయ్ రారండోయ్!

 2. ఆ తరువాత వినబోయేవి రెండు సినిమా పాటలు. 1954లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు అక్కయ్య, అన్నయ్యల సహకారంతో, బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కిష్టయ్య, అన్న మూడు లఘు చిత్రాలను (బాలానందం అనే పేరుతో) నిర్మించారు.

  సినిమా సంగీత దర్శకుడిగా పెండ్యాల పేరున్నా కొన్ని బాణీలు అప్పటికే బాలానంద సంఘం ద్వారా వాడుకలో వున్నవి.

 3. కొనండి బాబూ – పళ్ళండోయ్ పళ్ళు

 4. వీరులు – ధీరులు

 5. ఇప్పుడు కొన్ని బాగా ప్రచారం పొందిన రికార్డులు:

 6. పిల్లలకే స్వరాజ్యం

 7. ఎక్కాల్రాని మొద్దబ్బాయి

 8. మొద్దబ్బాయి2 – గణగణ బడిగంటలు
 9. చిట్టిబావ – పొట్టి మరదలు

 10. బుజబుజరేకుల

 11. బొమ్మల పెళ్ళి

 12. పొట్టిబావ-చిట్టి మరదలు, బుజబుజరేకులు-బొమ్మలపెళ్లి, రికార్డులకు సంగీత పర్యవేక్షణ, వాద్య గోష్టి నిర్వహణ చేసింది మరొక ప్రముఖ సినీ సంగీత దర్శకుడైన మాస్టర్ వేణు.

  చివరిగా రెండు పిల్లల కథలు. ఇవి రేడియోలో ప్రసారమైనవి, రికార్డులపై రాలేదు.

 13. ఈగమ్మ
 14. కుందేలు – తాబేలు

మరికొన్ని పాటలు, కథలు రాబోయే సంచికల్లో విందాం.