రాత్రి అనే పల్లె పడుచు వెన్నెలనే మజ్జిగని చిలికి నప్పుడు చల్ల పైన తేలిన తునకలతో చేసిన వెన్నముద్దే ఆకాశం మధ్యలో వెలిగి పోతున్న చంద్రుడట. వెన్నముద్ద కాకుండా చుట్టుపక్కల చెల్లాచెదరై మిగిలిపోయిన తుంపరలే నక్షత్రాలట.
విజయసారథి జీడిగుంట
ఒర్లాండో, ఫ్లోరిడా
softwaree engineering
విశ్వనాథ, సిరివెన్నెల
సాహిత్యం, క్రికెట్
జీవిత విశేషాలు
విజయ సారధి జీడిగుంట , కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగం లో గత 31 సంవత్సరాలు గా అమెరికా లో ఉంటూ ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలకు తన సేవలందించి ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నారు. విశ్వనాథ సాహిత్యం, ఆయన రామాయణ కల్పవృక్ష పద్యాల మీద ఎన్నో ప్రసంగాలు, వ్యాసాలు రచించిన వీరు గతంలో తన యూట్యూబ్ ఛానల్లో రోజుకో తెలుగు పద్యం అనే శీర్షికతో తెలుగు సాహిత్య చరిత్ర పై 75 పైగా వీడియోలు చేయడమే కాకుండా.. బీ+ యూట్యూబ్ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి పద్యలహరి అనే కార్యక్రమం, టోరి లైవ్ లో ప్రతి ఆదివారం సిరివెన్నెల గీతా భాష్యం అనే శీర్షిక తో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి పాటల పై రేడియో టాక్ షో నిర్వహించారు. అమెరికా లో జరిగే వివిధ సాహిత్య సదస్సులలో ప్రత్యక్షం గాను, అంతర్జాలం లో జరుగుతున్న వివిధ జూమ్ సాహిత్య సంబరాల్లోను వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్న వీరు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఆంధ్రా ప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ నుంచి కంప్యూటర్ సైన్సెస్ లో పీజీ డిప్లోమా చేసారు. ఎప్పటికైనా సిరివెన్నెల సమగ్ర సాహిత్యం పై డాక్టరేట్ చెయ్యాలనే సంకల్పం తో ఈ మధ్యనే ఎమ్మే తెలుగు పట్టా పుచ్చుకున్నారు. \’ప్రాచీనాంధ్ర సాహిత్యం లో శ్రీ విఘ్నేశ్వర స్తుతి పద్యాలు\’ అనే శీర్షిక తో ఒక పుస్తకం రచించారు.