సూర్యకుమారిగారు 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాదు వచ్చినప్పుడు ఆకాశవాణివారి కేంద్రంలో ఈ ఆది శంకరుని రచనగా భావించబడే “నిర్వాణ షట్కం” (లేక నిర్వాణ శతకం) రికార్డింగు చేయబడింది. ఈ షట్కాన్ని సూర్యకుమారిగారే స్వరపరచుకున్నారు. ఇంగ్లాండులో ఆవిడ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోను పాడేవారు.
టంగుటూరి సూర్యకుమారి
జీవిత విశేషాలు
టంగుటూరి సూర్యకుమారి (1925 – 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఆంధ్ర రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. పన్నెండు, పదమూడేళ్ళ ప్రాయంలోనే రైతుబిడ్డ సినిమాలో నటించి, ఆపై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లో మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది. ఈమె పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులవంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించింది. 1960 దశకంలో లండను వెళ్ళి అక్కడ ‘ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థను స్థాపించింది. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని ఈమె. 1984లో ఈమెకు శ్రీ రాజాలక్ష్మీ పురస్కారం లభించింది.