కాశీనాధుని రాధ
జీవిత విశేషాలు
కాశీనాధుని రాధ అమెరికాలో తెలుగు సంస్కృతి, సాహిత్యాల పరిరక్షణకు, సామాజిక సేవకు ప్రముఖంగా కృషి చేస్తున్నారు. http://www.kdbvillage.org, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ATA) వంటి సంస్థలలో కీలక పాత్ర పోషించడంతో పాటు, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.ఇండియాలో ఉండగా కాలేజిలో తెలుగు పాఠాలు చెప్పారు. సంప్రదాయ సాహిత్యం అంటే ఆసక్తి, అభిమానమున్న రాధగారికి అప్పుడప్పుడు చదివిన వాటి గురించి వ్రాయడం అలవాటు. కొందరు మిత్రులతో కలిసి 2009 నుంచి ‘సాహిత్యభారతి’ అన్న పేరుతో న్యూజెర్సీలో సాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.