లంగరు వేసిన నౌకలు సముద్రం మధ్యలో నిలుస్తాయి నిలిచిన నీరు పక్షిముక్కు తాకగానే వృత్తాలతో నవ్వుతుంది చొక్కాలు తగిలించే కొక్కేలు ఏకాంతాన్నే కోరతాయి మారు […]

ఎక్కడో వర్షాలు ఏటికి నీళ్ళొచ్చాయి. ఎండిపోయినా నిండుగా పారిన రోజులను మరచిపోదు ఏరు. కదిలిపోయిన నీరు ఎగుడుదిగుడు దిబ్బలను నిమిరి వెళ్ళింది.

భిక్షువు.. నీ ఇంటిముందు నిలబడి బిగ్గరగా యాచిస్తే.. పెళ్ళి ఊహల్లోనో అల్లిక పనిలోనో మునిగి వెళిపో.. వెళిపో అని అరవకు..కసరకు పాదాలకు పనిచెప్పి సోపానశ్రేణి […]

వంగిన కొమ్మల నల్లని నిశ్శబ్దం నీలికొండల ఎ్తౖతెన ఏకాంతం ఇసుమంత నవ్వని ఇసుక గడియారాన్ని విడిది మందిరంలో తడిమి చూస్తావు కదిలిపోయే రైలు గాఢమైన […]

పదాన్ని పట్టితెచ్చి.. పెడరెక్కలు విరిచికట్టి నల్లటి ముసుగు తొడిగి ఉరి తీసెయ్‌. మరణిస్తూ మరణిస్తూ గొంతు పెగల్చుకొని.. తన అర్థం చెప్పి జారుకొంటుంది. శవపేటిక […]

మంచుకప్పిన కొండశిఖరం ఎక్కలేనిక ఎదురుగాడ్పులు చెప్పిరాదుగ చేటుకాలం లోయదాగిన ఎముకలెన్నో! ఒక్క కిరణం నక్కి చూడదు ఉడుకు నెత్తురు పారుటెప్పుడు? కునుకు పట్టదు నడుమ […]

తలుపు తీసి చూడు కళ్ళల్లో తెల్లవారుతుంది ఇసుకనేల దాహం సముద్రమే తీరుస్తుంది తీగ కదిపి చూడు రాత్రి కన్నీరు రాలుతుంది పొగలు పోయే ఆకలి […]

తుఫాను లెన్నో చూసి శిథిలమై తీరాన్నిచేరి, ఏకాంతంలో సాగరపవనాలు నేర్పిన చదువు ఇసుక రేణువులకు విసుగులేని కెరటాలకు అవిశ్రాంతంగా బోధిస్తోంది ఈ సముద్రనౌక

తడిచేతుల సముద్రం తడిమి తలబాదుకొంటుంది శిలలపై.. బడితెలేని బడిపంతులు పొడవాటి ఒడ్డు అదిలిస్తోంది చదవలేని కెరటాలను పచార్లు చేసేవారిని విచారం లేని చలిగాలి వీచి,పరామర్శిస్తుంది. […]

నీ గదిలోకి ఎవరూ రారు టేబుల్‌సొరుగును తెరవరు ఆకుపచ్చని ఏకాంతాన్ని అనుభవించు. పొద్దుతిరుగుడు పూలు నిద్దురలో,కలలో సద్దు చేయవు. అరాచక ఆకాశాన్ని విరిగిన చంద్రుని […]

గదిలో ఫాన్‌తిరగదు బల్లి నాలుకపై జిగురు ఆరదు పాత రహదారుల మీదే కొత్త రహదారులు వేస్తారు మరణించిన మహామహులు నగరంలో విగ్రహాలై మొలుస్తారు చీమలు […]

ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? నివారించలేను, సవారి గుర్రముసకిలించె నురగతో!! ఏ వాలు కెరటమో;తెరచాప కదిలెను. చేవ్రాలు చేయలేను! ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? […]

ఒక్క రాత్రిలో పర్వతాలను కదిలించకు మహావృక్షాలను పెకలించకు నిశాగానం విను అరమూసిన కన్నులతో నడిరేయి నల్లని సంగీతాన్ని గ్రోలు నురగల అంతరంగం..అలల సద్దు మెరిసే […]