Ra.Vi.Sastri’s Alpajeevi, together with Buchibabu’s Chivaraku Migiledi (That Which Remains at the End), heralded modernism in Telugu fiction by lending it a new psychological depth. Prior to their publication Telugu novels tended to be patently romantic in orientation and thus hardly served the purpose of truth—psychological or social.
Category Archive: సంచికలు
శంకరుడు లఘు స్తోత్రములనుండి బృహద్గ్రంథముల వరకు సుమారు నాలుగు వందల రచనలను సృష్టించెను. నేను అందులోని కొన్ని ప్రార్థనా స్తోత్రములను ఆధారము చేసికొని ఈ వ్యాసమును వ్రాయుచున్నాను.
ఈ సుందరం మావయ్య ఓ విచిత్రమైన మనిషి! అవతల వాళ్ళని పొగిడి తన పనులుచేయించుకొనే దిట్ట అని కలిసిన మర్నాడే అర్థమైపోయింది. మాయింటికి భోజనానికి పిలిచాకా వాళ్ళింటికి బదులు భోజానానికి పిలిస్తే వెళ్ళినపుడు, మా అవిడ వండిన వంకాయ కూర అద్భుతం అనీ, అలాంటి కూర తన జన్మలో తినలేదంటూ అప్పటికప్పుడు మా అవిడ చేత వాళ్ళింట్లో పోపు పెట్టించిన ఘటికుడు సుందరం మావయ్య.
విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించబోతున్నారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల కాబోతోంది.
ఆలోచనల్లో ఒకరిగురించి ఒకరికి సందేహాలు.. ఇంతలోనే కరంటు పోయింది. ఫ్యాను కదలడం తగ్గిపోయేకొద్దీ నిశ్శబ్దం పెద్దదవుతోంది. ఇద్దరూ అసహనంగా కదిలారు. ఆమెకి అర్థమయింది, అతడు నిద్రపోలేదని, అతడికీ అర్థమయింది, ఆమె కూడా నిద్రపోలేదని..
కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట మే 2007 సంచిక విడుదల! ఈ సంచికలో ప్రత్యేక ఆకర్షణ, స్వర్గీయ సంపద్రాఘవాచార్యులు గారు శ్రీశ్రీ సాహిత్యాన్ని లోతుగా, […]
కవులు, కథకులూ, వ్యాస రచయితలూ, చాలా సున్నితమైన వాళ్ళు. విమర్శలు సునిశితంగాను, సూటిగాను,పెళుసుగా లేకుండానూ చెయ్యడం అవసరం. ఈమాట అభిప్రాయవేదికలో వ్యక్తిగత దూషణకి తావు లేదు. ఓక్కొక్క సారి, పొరపాటున దూకుడుగా అనాలోచితంగా రాసిన వాక్యాలు కత్తిరించకండా ప్రచురించడం జరిగింది. అందుకు నా క్షమాపణలు. ఇక ముందు కత్తిరించవలసిన పరిస్థితి రాకుండా సహకరించమని నా మనవి.
ఊపిరి అందడంల్యా. యమకల్లో నొప్పి. కాలు వూడి రాకంటే ఊపిరి బిగిసి సస్తాననిపిస్తాంది. బాగన్నా యిరక్కపాయనే. నాకు మొగదాడు కుట్టకపోతేనేమి, సెప్పినమాట యినపోతినా నేను!?
హయగ్రీవశాస్త్రి ఇప్పుడు అనాధశవం. హనుమంతుకి పురాణం శాస్తుర్లు గారు ఎప్పుడో పురాణంలో పిట్ట కథలా చెప్పింది గుర్తుకొచ్చింది. అనాధ ప్రేత సంస్కారాత్ కోటియజ్ఞ ఫలం లభేత్, అని.
సంపత్ గారి వ్యాసం 1952 భారతి మాస పత్రికలో వచ్చింది. అంతకుముందు శ్రీశ్రీ కవిత్వం పై వచ్చిన వ్యాసాలన్నీ, “అభినందన ధోరణిలో జరిగిన గుణ సంకీర్తనలే.” శ్రీశ్రీ కవిత్వాన్ని లోతుగా పరిశీలించి విమర్శించే ప్రయత్నం ఇంతకు (1952 కు) పూర్వం జరగలేదు. ఆ రకంగ చూస్తే, సంపత్ గారి వ్యాసం seminal work అని చెప్పచ్చు.
ఒంటరిగా, ప్రశాంతంగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా పల్లెటూరిలో ఉండేవారు తాతయ్య. ఆయన జీవితంలో ఒక్క cataract ఆపరేషన్ తప్పించి డాక్టర్లు, మందులు, హాస్పిటళ్ళు ఎరగరు. ఒకరోజు సాయంత్రం ఆవుపాలు పిండటానికి వెళ్ళిన తాతయ్య పదినిమిషాలలో లోపలికి వచ్చారు, ఎడమచేయి నొప్పి పుడుతున్నాదంటూ. పక్కింట్లో ఉన్న తన చిన్నకొడుక్కి కబురంపి, ఒక గంట తర్వాత కొన్ని దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే తాను ఊగిన ఉయ్యాలబల్లమీద పడుకుని “శివ శివా” అంటూ కన్నుమూశారు.
జీవన భ్రమణంలో కలిసిపొయిన మనం
ఇద్దరమా? ఒకళ్ళమా?
ఇటీవల, అదృశ్యమైపోయిన కొన్ని జాతుల పక్షులు, జంతువులు తిరిగి కనబడడంతో శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవలసినది ఒక అచ్చ తెనుగు పిట్ట: కలివి కోడి.
సంగీత సాహిత్యాలు రెండిటికీ సమ పాళ్ళలో ప్రాధాన్యత ఇస్తూ వరుసలు కూర్చి పాడితే లభించే మధురానుభూతి నిస్సందేహంగా అపరిమితమని నా వినీతాభిప్రాయమూ, మధురానుభవమూనూ.
శాస్త్రీయ సంగీతంలో జుగల్‌బందీ కచేరీలకి కొంత ప్రత్యేకత ఉంది. రెండు వేరువేరు శైలులనో, వాయిద్యాలనో ఉపయోగించి వాటి మధ్యనున్న సామాన్య లక్షణాలని ఈ కచేరీలు విశదం చేస్తాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క శైలిదీ విశిష్టత మనకు తెలుస్తూనే ఉంటుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్న పద్ధతిలో ఈ మిశ్రమ సంగీతాన్ని శ్రోతలు స్వాదించి, ఆనందించగలుగుతారు.
కల్మషం లేని కలుషితంగాని
సత్యమైనది స్వచ్ఛమైనది..
ఏ పోలికకూ అందనిది..
దొరుకుతుందని చేరవస్తుందని నాకై ఎదురు
చూస్తుంటుందని
ఆరి సీతారామయ్యగారి హైకూలు
నగరంలో నీడ
చెట్టును వెతుకుతోంది.
అగ్ని స్నానాల్లో
పల్లె మునకలు వేస్తోంది.
చెట్టుకి గమనం లేదని
జాలి పడకు
దాని ప్రయాణమెప్పుడూ
లోపలికే..
కథ లోని పాత్ర
బాలేదని
పాఠకుడి ఏడుపు!