రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

తప్పిపోయిన కవిత

రచన: బివివి ప్రసాద్
నవంబర్ 2026

ఇవాళ తొందరపనుల ఉదయాన
ఒక కవిత మృదువుగా, మెల్లగా నీ లోనికి వచ్చింది
తనని వేచి ఉండమని, చోటు చూపించి
నీ పనుల తొందరలో మునిగిపోయావు

కవిత నీ కోసం చాలాసేపు ఎదురుచూసింది,
నీ పనుల తొందర గమనించింది,
సున్నితమైన ఆ కవిత నొచ్చుకుంది,
ఇతను తొందరలో ఉన్నాడు
ఇప్పుడు పలకరించి, పొరపాటు చేశానా అని తలచింది
నిశ్శబ్దంగా, కూర్చున్నచోటునుండి మాయమైంది

పనుల తొందర ముగిశాక,
ఖాళీగా ఊపిరి విడిచే సమయాన
అతిథిలా వచ్చిన కవిత గుర్తుకు వచ్చింది
కంగారుపడి తనను కూర్చోమన్న చోటు వెదికావు

తను లేదు, మాయమైంది
ఉదయం నువు దర్శించని బంగారుకిరణంలా,
నువు తాకని చల్లని సెలయేటి నీటిలా,
వినేలోపు నిశ్శబ్దంలో కరిగిన కోయిల కూతలా,
అనుమతి లేక గర్భంలోంచి మరలిపోయిన బిడ్డలా

వెదికావు, జ్ఞాపకాలు వడబోశావు,
వాన తర్వాత గోడల మీది నీటి మరకల్లా
తను విడిచిపోయిన శబ్దాల మరకలేమన్నా దొరుకుతాయా అని తడిమావు
నీ చేతివ్రేళ్ళకి ఖాళీ మినహా ఏమీ తగల్లేదు

ఒక కవితనుండి నిన్ను నువు తప్పిపోయిన ఈరోజున
నీనుండి మరికాస్త తప్పిపోయావు
మరలా ఎన్ని యుగాలు, పాలపుంతలు గడవాలి
తానూ, నువ్వు కలవటానికి

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడి-నుడి 7 సమాధానాలు
  • టాస్
  • తానా 2011 ప్రసంగాలు: సాంప్రదాయ సాహిత్యం
  • తానా 2011 ప్రసంగాలు: సాహిత్య ప్రక్రియలు
  • తానా 2011 ప్రసంగాలు: కథ

ఇటువంటివే…

  1. కవిత ఒకటి కొత్తది
  2. ఒంటరి డేగనై, తప్పిపోయిన లేగనై — బైరాగి
  3. సగమే పూర్తయిన ఓ కవిత
  4. విశ్వ కవిత నెరుడా
  5. నేనూహించని కవిత

నవంబర్ 2026 సంచికలో ...

  • ఇలియాడ్: రణరంగం-IV
  • కంప్యూటర్ చిప్ కథ – 19: కూలిపోని హైడ్రోజన్ పరమాణువు – బోర్ క్వాంటం సిద్ధాంతం
  • చిన్న రిక్వెస్ట్
  • తప్పిపోయిన కవిత
  • నవంబరు 2026
  • నా కవిత్వం రంగు రంగుల పువ్వులు
  • నింగీ, నీరూ, నికోబార్-4
  • పుణ్యకూపం!
  • పెద్దనగారి ప్రశిష్యులు, కాదన్న కవయిత్రులు
  • పేజీల మధ్య
  • బ్రతుకు రచన
  • మంకుతిమ్మని మరో మిణుకు – 10 (91-100)
  • మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – V: అంబికా శతకము
  • మాయదారి మాబుగాడు
  • యూట్యూబ్ లో ఈమాట: నవంబర్ 2026
  • రెండు కృష్ణబిలాలు
  • సీతాంజనేయ సంభాషణం – VI
  • సురుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రెండు కృష్ణబిలాలు
మంకుతిమ్మని మరో మిణుకు – 10 (91-100)

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.