రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మార్చి 2004

“ఈమాట” పాఠకలోకానికి పునః పునః స్వాగతం!

ఉత్సాహంగా రచనల్ని పంపుతున్న రచయితలు, రచయిత్రులకు ఆహ్వానం. ఇప్పటివరకు పంపని వారికి మరోసారి మళ్ళీ!

“ఈమాట”కు పంపిన ప్రతి రచనను కనీసం ఇద్దరు, సాధారణంగా ముగ్గురు లోతుగా పరిశీలించి వారి అభిప్రాయాల్ని తెలియజేస్తే, వాటిని అనుసరించి సంపాదకులం ప్రచురణార్హతని నిర్ణయిస్తాం. ప్రచురించలేకపోయిన రచనల గురించి సూచనలు, సలహాలు ఇవ్వటం పరిపాటి. అలా జరిగిన రచనల రచయితలు ఇంకా దీక్షగా ప్రయత్నించి బాగా రాసి పంపుతారని, వారు ఇంకా ఇంకా రాస్తూనే వుండాలని దీని ఆంతర్యం. కొరగాని రచనల్ని ప్రచురిస్తే దానివల్ల అన్ని పక్షాల వారికీ నష్టమేనని మనకు దినదినం కనిపించే సత్యమే!

నేను కొద్ది నెలల క్రితం ఒక కోర్టు కేసు గురించిన కథ రాసి ఇక్కడ ప్రచురించాను. ఆ ముద్దాయిల్లో ఒకరి కేసు విచారణ జరగటం, జ్యూరీ ఏకగ్రీవంగా దోషిగా నిర్ణయించటం జరిగాయి. మిగిలిన వారి కేసులు ఇంకా రావలసి వుంది. (ఆ ముద్దాయి “ఈమాట” పాఠకుడు కాదనుకుంటాను, ఒక వింత డిఫెన్స్‌ ను వాడి ఒక్క జ్యూరర్‌ కి కూడ నచ్చజెప్పలేకపోయాడు అది వేరే విషయం). ఈ సందర్భంలో మా పాఠకులకు ఒక విషయం చెప్పాలని వుంది ఇండియా నుంచి వచ్చిన కొత్తలో ఇక్కడి వారు చవటలని, వీళ్ళకు ఏమీ తెలియదని, మనమే మేధావులమని చాలా మంది అనుకుంటారు. దానివల్ల మన తెలివి ముందు వీళ్ళు ఎందుకు చాలరని, అంచేత వాళ్ళ కళ్ళుగప్పటం మనకి నల్లేరు మీద బండి లాటిదని భావిస్తారు. పైగా ఇక్కడి సమాజంతో పరిచయం చాలా తక్కువ కనుక, మనలో మనమే గుడుగుడుకుంచాలాడుకుంటూ ఇదే అమెరికా అని భ్రమిస్తూ చట్టవ్యతిరేక చర్యల్లో పాల్గొనటానికి సందేహించకపోవటం కనిపిస్తుంటుంది. దొరకనంత కాలం ఇలాటి ప్రవర్తన దివ్యంగానే వుంటుంది, దానివల్ల చాలా లాభం కూడ కలగొచ్చు. కాని ఒక విషయం గ్రహించటం వల్ల ఎన్నో బాధలు తప్పుతాయి అదేమిటంటే, ఒకసారి ఏదో చట్ట వ్యతిరేక చర్యతో దొరికితే ఆ తీగతో పాటు డొంకంతా లాగి తీవ్రమైన శిక్షలకు గురిచేసే అవకాశం. ఇక్కడ చట్టం చాలా శక్తివంతమైంది. దాన్తో పోరాటం ఎంతో కష్టం. ఇది గుర్తిస్తే విపరీత పరిణామాల్ని చేజేతులా తెచ్చుకోకుండా ప్రయత్నించొచ్చు.

ఇక ఈ సంచిక విషయానికి వస్తే మళ్ళీ కొన్ని ఆడియోలను అందించిన పరుచూరి శ్రీనివాస్‌ గారికి కృతజ్ఞతలు. ఈసారి కూడ మాచవరం మాధవ్‌ గారు వాటిని డిజిటైజ్‌ చేసి ఇచ్చారు. అద్భుత హిందూస్తానీ గాయకుడు ఉస్తాద్‌ బడేగులాం అలీ ఖాన్‌ గురించి చక్కటి వ్యాసంతో పాటు విలువైన ఛాయాచిత్రాలు కూడ పంపిన కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు.

అలాగే, రచనలు అందించిన వారందరికీ అభినందనలు.

కనకప్రసాద్‌ గత నెలరోజులుగా విదేశాల్లో వున్నందువల్ల “ఇసక” మూడో భాగం వచ్చే సంచికలో వస్తుంది.

శబ్ద తరంగాలు

రచన: సంపాదకులు

పాలగుమ్మి పద్మరాజు భమిడిపాటి జగన్నాథరావుల సాహిత్య సంభాషణం, బాలాంత్రపు వెంకటరావు తో ముఖాముఖీ ,
స్థానం నరసింహారావు పాటలు, పద్యాలు

0

కష్టార్జితం

రచన: జె. యు. బి. వి. ప్రసాద్

పదహారేళ్ళ మా పిల్లాడు ఒక కేథలిక్‌ హైస్కూల్లో పదకొండవ తరగతి చదువుతున్నాడు. వాడి చిన్నప్పటి నించీ వాడిని పెంచడంలో ఎక్కడ తప్పులు చేస్తానో అని నన్ను నేను చెక్‌ చేసుకుంటూనే వస్తున్నాను. నాకిష్టం లేకపోయినా అమెరికన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లో చేరనిచ్చాను. వాడికోసమని అర్థం కాకపోయినా వాడి ప్రతీ మాచ్‌కీ వెళ్ళాను. నెగ్గినప్పుడల్లా వాడితో పాటూ నేనూ సంతోషించాను. ఓడినప్పుడల్లా వాడితో పాటూ నేనూ విచారిమ్చాను. ఐదవ తరగతి నించీ వాడిని ప్రైవేటు స్కూళ్ళో చేర్పించాను ఖర్చు ఎక్కువైనా. వాడికి కావలసినవన్నీ కొంటూనే వున్నాను. వాడికి స్నేహితుడిలా కూడా ప్రవర్తించేవాడిని. ఫ్రీగా ఆర్య్గూ చేయనిచ్చేవాడిని. బేంక్‌ బేలన్సులూ, నా జీతం అన్నీ తెలుసు వాడికి. చిన్నపిల్లాడిలా ట్రీట్‌ చెయ్యకుండా అన్ని విషయాలూ చెప్తూవుండేవాడిని. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడిని ఏం కొనుక్కోడానికన్నా. నాకిష్టం అయిన కర్నాటక సంగీతం క్లాసులు మానేసి, వాడి కిష్టమయిన కరాటే క్లాసులకి వెళతానంటే అలాగే ఒప్పుకున్నాను. పక్కా శాఖాహారినయినప్పటికీ, స్కూళ్ళో మాంసం తినడం నేర్చుకుని ఆ రుచుల కోసం అడుగుతూ వుంటే, వాడి కోసమ్‌ నేర్చుకుని ఇంట్లో మాంసం వండేవాడిని.

2

మారని మనసు

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి

ఇండియా ప్రయాణం అంటే నాకు మహా ఇష్టం. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పుడల్లా, ఓ నెల్లాళ్ళు ఆనందంగా గడిపేస్తాను. నిన్ననే మా […]

0

ఇంకో చోటికి…

రచన: అఫ్సర్

వెనక్కి రాదు దూరాల సొరంగంలోకి జారిపోయాక, రైలు. కాసేపే ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ ఎదురుచూపులూ తలపోతలూ చివరి ఎడబాటు దాకా. వస్తున్నప్పుడు ఎంత […]

0

శివరాత్రి

రచన: విన్నకోట రవిశంకర్

తడి తడి గుడి జారుడు మెట్ల పాదగయ కోడి కూయకముందే కొలువు తీరిన కుక్కుటేశ్వరుడు. అరుగు మీద అమ్మ నోము (వాయనాల్లో వర్ణ భేదం) […]

0

తొలి వలపు

రచన: మూలా సుబ్రహ్మణ్యం

నువ్వొచ్చే దాకా ఆకాశంలో విహరించేవాడిని నువ్వొచ్చి భూమ్మీదకు తీసుకొచ్చావు ఆకాశం లో మేఘం లా విహరించే నేను చల్లని నీ చూపు తాకి వర్షమై […]

1

తేనెటీగలు

రచన: రమణ శొంఠి

జీన్‌ కొడుకు ఫ్రాంకీ అరుస్తూ లేచాడు. ఈ మధ్యన ఈ అరుపులు ఎక్కువయ్యాయి   వారానికి రెండు, మూడు సార్లు, రాత్రి మూడింటికీ, ఐదింటికీ కూడా. […]

0

ఎడ్యుకేటెడ్‌

రచన: విప్లవ్

బలిచ్చేందుకు తీసుకెళ్తున్న పశువు చివరిసారిగా తాగడానికి నీళ్ళిస్తే, ఆ ఇచ్చే మనిషిని ఎంతో నమ్మేసి, తన మీద ప్రేమతోటే ఇదంతా అని  నమ్మినట్టు శ్రీను […]

0

మీకు మీరే

రచన: ఆరి సీతారామయ్య

నాలుగు వేడి వేడి ఇడ్లీలు ఆరగించి, ఇంటి ముందు వరండాలో సుఖంగా మడతకుర్చీలో చేరాడు ధర్మారావు. దాదాపు తొమ్మిదిన్నర అవుతుంది. ఇంటిముందూ, వీధిలో అంతా […]

1

దారి బత్యం

రచన: వై. ముకుంద రామారావు

ఎంత పెద్ద నోటున్నా
చిల్లరగా మార్చలేని
చిన్నబోయినతనమో

0

అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్‌

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్‌ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్‌ నోట్లో కోయిల పాడుతున్నట్టు చూపారు. హిందుస్తానీ సంగీతాభిమానులకు చిరపరిచితుడైన […]

3

పండిన మొగలిరేకుల ఏకాంత ప్రవాహం: “సముద్రం”

రచన: కుప్పిలి పద్మ

యీ “సముద్రం”లో అన్వేషణ వుంది. గుర్తు పట్టే చూపుంది. చుట్టూ పరిగెత్తమనే పరిస్థితులున్నా తమలోకి తాము చూసుకొనే మనుష్యులు మనకి స్నేహితులవుతారీ “సముద్రం”లో.

2

భూషణ్‌ “సముద్రం”

రచన: ఆరి సీతారామయ్య

భూషణ్‌ కథల్లో ముఖ్యమైన వస్తువు స్త్రీపురుష సంబంధం. ఒక యువకుడు ఉంటాడు. మిత భాషి. తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమెకు ఇష్టం; నిన్నుప్రేమిస్తున్నాను అని చెప్పనవసరం లేకుండానే ఆమె తనను అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటాడు. కాని అలా జరగదు. ఆమె దూరం అవుతుంది. అతని ప్రయత్నం లేకుండానే మరోస్త్రీకి దగ్గిరవుతాడు; లేక మొదటి స్త్రీ తిరిగి అతనికి దగ్గిరవుతుంది. ఇంతకంటే లోతుగా ఈ సంబంధాన్ని పరిశీలించటం ఈ కథల్లో కనిపించదు.

0

బాల్యంలోకి….

రచన: వినీల్‌ కుమార్‌ గట్టు

(తమ్మినేని యదుకుల భూషణ్‌ కవితాసంకలనం “చెల్లెలి గీతాలు” పై సమీక్ష) ఈ కవితలు చదివే ముందు ఒకసారి, వర్తమానాన్ని వదిలి బాల్యంలోకి తిరిగి పయనించేందుకు […]

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.