దాన్ని తీసినప్పుడల్ల
పైనున్న దుమ్ము చెదిరిపోయి
మన చిన్నతనం
మాసిపోతుందేమోనని
నాకు ఒకటే రంది.

అసలు ఆయనే కాదు ఆయింట్లో ఎవరికీ నార్మల్ వాయిస్ వున్నట్టు లేదు. అందరివీ కాకలీ స్వనాలే! 90 డెసిబెల్స్‌కి పైమాటే!

(పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అనేక కవితలు, కథలు, అనువాదాలు రాశారు. ) కవిత కాలజల సమన్వితమైన […]

నేను ఎన్ని సంవత్సరాలు కస్టపడి ఈ కంపెనీకి పని చేశాను. ఈ స్థాయికి చేరుకున్నాను. మా వంటి వాళ్ళ వల్లే గదా కంపెనీ ఇంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఊరికి కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ తో కొంచెం కూడా సంబంధం లేని ఎవరో ఒకతను — వెధవ , వేరే ఊరి నుండి వచ్చి, ఈ ఊరిలో ఇన్నాళ్ళుగా పని చేసి పేరు తెచ్చుకున్న నన్ను ఉద్యోగం నుండి తీసి వేశాడు. ఎంత ధైర్యం!

(ఈ వ్యాసం కొద్దిరోజుల క్రితం “నీహార్‌ఆన్‌లైన్‌”లో అభిప్రాయవేదికలో ప్రచురితమైంది. ఐతే, ఈ వ్యాసంలో పరిశీలించిన కథలు ఇక్కడ “ఈమాట” లో ప్రచురించినందువల్లనూ, “నీహార్‌ఆన్‌లైన్‌”లో జరిగిన […]

కారణమేమిటో తెలియదు, కథలు రావడం కుంటుపడుతున్నది. తెలుగు diaspora అనుభవాలు మరొకరు చెప్పలేరు. ఇక్కడి తెలుగు వారే చెప్పగలరు. అది మన ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఒక కథ బాగా చెప్పగలరు అని నానుడి. ఆ కథ వారి స్వంత కథ, వారి స్వానుభవం.

” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా తెలుగుదేశంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత […]

అర్థాలతో పద్యాలు చెప్పీ చెప్పీ, లోకానికీ నిజానికీ మధ్య దూరం పెరిగిపోతోందన్న దశలో కొందరు కవులు ఆ భాషని బతికించడానికి ఇలాంటి పద్యాలు రాస్తారు. అంటే లోకంలో భాషని వాడడం మానేసి భాషలో మరో లోకాన్ని సృష్టిస్తారు. ఒకరకంగా ఈ పనే చేసారు పఠాభి.

పాఠకుల సూచన మేరకు అభిప్రాయాలన్నీ ఒకచోట చదవగలిగే వీలు కల్పిస్తున్నాము. ఎడమపక్క పైన ఉన్న “పాఠకుల అభిప్రాయాలు” మీద క్లిక్ చేస్తే, మే 2006 […]

ఈ సంచిక నుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని: ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా […]

ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు.

ఇన్ని అనువాదాలకు నోచుకున్న మూలాలు నాకయితే ఎక్కువగా తెలియవు. ఆ దృష్టితో చూస్తే రవీంద్రుల మూలగీతపు రవికిరణాలు ఇంద్రధనుస్సులోని కొన్ని కొన్ని వర్ణాల కలయికలలా ఆయా అనువాదాల్లో వ్యక్తమయ్యాయి.

ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.