చిన్నప్పుడోసారి ఇంట్లో నన్నొదిలి నాలుగురోజులు ఎటోపోయి తర్వాత ఇంటికొచ్చారు అమ్మా నాన్నా. నేను ఆడుకొంటూ పట్టించుకోలేదు, కానీ కాసేపటికి అనుమానమొచ్చి లోపలికెళ్ళి చూశాను. అమ్మ వళ్ళో ఓ పాప పడుకొని ఉంది. ఎవరోలే పాపం అని నా మానాన నేను ఆడుకొంటూ కొంచెం సేపయ్యాక మళ్ళీ చూస్తే అదింకా ఆ ఫోజు లోనే ఉంది.
Category Archive: కథలు
ఇంతలో హడావిడిగా సుబ్బారావు అచ్చటికి వచ్చెను. నావైపుకి అభిముఖుడై వచ్చుచూ ఏమాలోచించుచున్నారని అడిగెను. భళారే విచిత్రం పాటను గూర్చి ఆలోచించుచుంటినని, అటులనా, ఎంతైనా నా ముందు తరము వారు కదా! అని వెటకారముగ బలికి నవ్వెను. వంకాయవంటి కూరయు వంకజముఖి సీత వంటి భార్యామణియు అన్న నానుడి తెలుసునా అనగా తనకు సంస్కృతము రాదనెను.
“మేడమ్, మీ తీయని స్వరంలో రిపోర్ట్ అన్న మాట రావచ్చా? ఈ శాఖ మొదలైనప్పట్నుండి నేను బిల్లులన్నీ సరిగ్గానే చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దేశభక్తి, భూభక్తి, భూగురుత్వాకర్షణభక్తి మెండుగానే ఉన్నాయి. గురుత్వాకర్షణ గురించి ఒక కవితైనా చదవకుండా ఏ రోజూ నేను నిద్రపోయినవాడిని కాను. మేడమ్, ఎలాగైనా నేను ఈ బిల్లు చెల్లించేస్తాను.”
డాక్టర్‌తో నీ సంభాషణ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తావు. ప్రిస్క్రిప్షన్ కోసం హేండ్‌బేగ్ అంతా తిరగతోడుతావు. చివరకు దొరుకుతుంది. అందులో పైన నీ పేరు, వయసు రాసుంటుంది. ఒక పక్కగా నీ ఎత్తు, బరువు, బిపి వగైరా వివరాలు. పేజీ మధ్యలో నువ్వు చెప్పిన లక్షణాలు అన్నీ వుంటాయి. డాక్టర్‌కు కాఫెటేరియాలో నువ్వు విన్నవి కూడా చెప్పావు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా విన్నది గుర్తొస్తుంది నీకు.
‘సావిత్రి మంచిదనుకున్నాను. దొంగముండన్న మాట! తాతనాన్న చెప్పులు దొబ్బుకొచ్చేసింది. అందుకేనేమో… నేను రాగానే భయపడి చస్తంది! దాచెయ్యమనేమో అమ్మా అమ్మా అని చీరుకుంటోంది. నాదగ్గరా నీ దొంగేషాలు… హన్నా! ఎవరూ చూడకుండా ఈ చెప్పులు ఇంట్లో వేసుకుని తిప్పుకుంటూ తిరుగుదామనా? పాపం తాతనాన్న చెప్పుల్లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో… ఎన్ని ముల్లు గుచ్చూ పోయాయో ఏంటో!
కొనండి. కొనండి. బొమ్మలు. కిచెన్ వేర్. సైకిళ్ళు. దుప్పట్లు. రగ్గులు. బొగ్గులు. డీల్స్! డీల్స్! భలే మంచి చౌక బేరము. ఆలసించిన ఆశాభంగము. మోడల్స్ ఓసారి ఉంచినవి ఇంకోసారి ఉంచరండీ ఇక్కడ. తర్వాత కొనుక్కుందాం అంటే మళ్ళా దొరకవండీ. మాయావిడ ఇదే పని మీదుంటాది. ఎక్కడెక్కడ ఏం డీల్స్ ఉన్నాయా అని. షీ ఈస్ వెరీ ఇంటెల్లిజెంట్ యూ నో?
డాక్టర్ వీళ్ళు లోపలికి నడిచి రావడాన్ని శ్రద్ధగా గమనించాడు. అతని వృత్తిలో పేషంట్ల నడకనీ బాడీ లాంగ్వేజ్‌నీ గమనించడం అతి కీలకమైన విషయం. కొన్ని సార్లు వచ్చినవాళ్ళ సమస్య ఏంటన్నది కూడా అందులోనే అర్థం అయిపోతుంటుంది. భర్తకి నలబైయేళ్ళుంటాయి. భార్య నాలుగేళ్ళు చిన్నదైయుండచ్చు అనిపించింది. వాళ్ళు వేసుకున్న ఓవర్‌కోట్ తియ్యలేదు. వాటిమీద మంచు ఇంకా పూర్తిగా కరిగిపోలేదు.
ఒకానొక కాలంలో ఒక వీరుడు ధీరుడు శూరుడు ఉండేవాడు. అతని కత్తికి ఎదురు లేదు, బాణానికి తిరుగు లేదు, అతను గెలవని యుద్ధం లేదు. రాజు మెచ్చి ఆదరించి పదవులు ఇచ్చాడు. పురజనులు అతని పరాక్రమాన్ని వేనోళ్ళ పొగిడేవారు. అతన్ని పెళ్ళాడాలని ఎంతమంది యువతులో కలలు కనేవారు. కానీ అతను ఆమెని చూడగానే మోహంలో పడిపోయాడు. పెళ్ళి చేసుకుని ప్రేమలో మునిగిపోయారు.
“రాగమ్మ అసాధ్యురాలు. పత్తి వొలవడానికి చేలోకి దిగితే, ఎక్కేప్పుడు మల్లె చెండంత పత్తి కొప్పులో పెట్టుకుని గట్టెక్కేది. మేస్త్రీ కదా, అందరికీ నేర్పింది. పత్తి వొలుపులు అయ్యేసరికి రాగమ్మ క్వింటాల్ పత్తి తూకం వేసేది…” మావయ్య మాటకి అడ్డంపడి, ‘చిన్న బిడ్డలకి యివన్నీ దేనికిలే సామీ…’ అంటూ గుర్రాల పొట్లం అందించింది రాగమ్మ. మావయ్య యిచ్చిన నోట్లని కళ్ళకద్దుకుని తీసుకుంది.
“నేను ఇక్కడికి వచ్చింది నీతో చర్చలు చేయడానికి కాదు. మా టీమ్‌లో వెంకట్ ఉన్నాడు నీకు తెలుసు కదా, మన కులమే… చూడ్డానికి బాగుంటాడు.(అదోలాంటి నవ్వు. ఆ నవ్వు గురించి నాకు తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు.) ఇప్పుడు కెనడాలో జాబ్ వచ్చింది. వెళ్ళేముందు నా అభిప్రాయం అడిగాడు. కాదని చెప్పేందుకు కారణం ఏదీ కనిపించలేదు. వచ్చే ఆదివారం వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్‌తో మాట్లాడేందుకు వస్తున్నారు. నీ అభిప్రాయం ఏంటి?”
ఆ మాటలలో తెలుగు వానికి అస్థిమూలగతమై ఒనరెడు సినిమాల పిచ్చి అతగానికీ గలదని, చిరంజీవి నట కుటుంబమన్న ఒళ్ళు మరచునని తెలిసికొని నవ్వితిని. చిరంజీవి సినిమా పాటలన్న ప్రాణమని, ఆ పాటలు చెవుల బడినంతనే అశక్తుడై ఆనందము ఆపుకొనలేక బ్రేక్‌నృత్యము కూడా చేయబూనునని తెలిసి అమేజ్మెంటు నొందితిని.
ఆత్మహత్య గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వాడికి సోమాలీ గుర్తొస్తాడు. ఇటలీలో మిలానో స్టేషన్‌లో వాడిని ఆకలితో చనిపోనివ్వకుండా కాపాడినది సోమాలీనే. సోమాలీ అన్ని దేశాలూ తిరిగాడు కాబట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆత్మహత్య శ్రేష్టమైనదన్నట్టుగా కొంత పరిశోధన చేసిపెట్టుకున్నాడు. బెల్జియంలో డ్రగ్స్; ఇటలీలో తుపాకీతో కాల్చుకోవడం; ప్యారిస్ అంటే ఇంకేముంటుందీ? ఈఫిల్ టవర్ ఎక్కిదూకడమే!
మేం వుంటున్న యింటి యజమానురాలు శాకాహారి కాదు. అయినా శర్మకు అభ్యంతరం కలిగేలా ఏనాడూ ప్రవర్తించకపోవటాన మేం మరో చోటికి పోవల్సిన అవసరం కలగలేదు. ఆవిడకి బంగారపు బొమ్మలాంటి కూతురు వుండేది. రోహిణి ఆ అమ్మాయి పేరు. అప్పటికే వివాహితుడు కావటం మూలానా, పైగా పరస్త్రీని చూడకూడదనే నియమం కలవాడు కావటం మూలానా శర్మ ఆ అమ్మాయి సంగతే పట్టించుకునేవాడు కాదు. నాకు మాత్రం ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నరాలు జివ్వుమనేవి.
హరికి ఎందుకో కంగారుగా ఉంది. ముఖం నిండా చెమటలు పడుతున్నాయి. ఏదో చెడ్డవార్త వినాల్సి వస్తుందనే భావం లోలోపల గుబగుబలాడుతోంది. అతని గుండెల్లో పదేపదే భయంలాంటి కంగారు లాంటి భావం. “తీతువు అరుపులాగా నా గుండెల్లో ఈ శబ్దం ఏమిటి? ఏ ఉపద్రవం రానుందో?” అని దిగులుపడ్డాడు.
ఆ పూట గాయాలు ముందు పోసుకుని కూచున్నాడు తాత. మనవడికి ఒక్కోటీ చూపెడుతూ. చిన్నప్పుడు గడప తగిలి బోర్లా పడి తగిలించుకున్నదీ. వెంటపడి కరిచిన కుక్క పంటి గాట్లూ. గోడ దూకీ, చెట్టు మీదనుంచీ పడిందీ. ఏదో పోటీ పడీ. ఓడీ. ఎవరితోనో గొడవ పడీ. కొన్ని దురాశ పడీ. నవ్వుతూ మనవడికి వర్ణించి చెబుతున్నాడు. గర్వంగా సాధించిన పతకాలు చూపినట్టూ. సిగ్గుపడుతూ రహస్యాలు చెప్పుకుంటున్నట్టూ.
అనుభూతి, అనుభవం – పాత్రకి ఏది కలిగిందని రాసినా, ఆ కథ ముగిసేదే కదా. పాఠకుడైనా అంతే. ఆ మాత్రం దానికి ఎందుకనీ ఇంతలా నానా హైరానా పడిపోవడం. ఎందుకిన్ని మలుపులు. మరుక్షణం ఉంటుందో లేదో తెలియని బ్రతుక్కి సందేశాలు, ధర్మాలు, మంచి, చెడు, నీతి… అవినీతి… గొప్ప… చెత్త… తొక్క… తోలు… వీటిని కొనసాగించాలా? అన్నిటినీ కట్టగట్టి ఒకేసారి…
ప్రయాణాలంటే వింతలూ విశేషాలే కాదు.
ప్రకృతీ పరవశమూ మాత్రమే కాదు.
మనుషులు… మనుషులు… మనలాంటి మనుషులు!!
నిజానికి ఒకో మనిషీ ఒకో నడిచే మహాగ్రంథం…
మనం చదివే అలవాటూ బతికే అలవాటూ పోగొట్టుకోనట్టయితే!
ఫోటోలో మనో నల్లని కళ్ళు నవ్వుతూ మెరుస్తున్నాయి. మెరుస్తూ కవ్విస్తున్నాయి. ఎర్రని పెదాల్లో కెంపుల కాంతులు తళతళలాడుతూ ‘నేను నీ దాన్ని కాను’ అని వెక్కిరిస్తున్నట్లున్నాయి. ఆ అందమైన ముఖంలో ఏదో ఆత్మవిశ్వాసం, తృప్తి. అదే ఆకర్షణ తనకి. కాని ఇన్నాళ్ళు ‘వద్దు వద్దని’ కాలయాపన చేశాడు. ఇంట్లో తండ్రి చండశాసనుడు. మనో కులం తెలిస్తే మండిపడతాడని భయం. ఎప్పుడూ భయమే! పిరికితనానికి ఏదో సాకు. చదువు అవ్వాలి.
పుతిలీబావిడీ నుంచి జంటలు జంటలుగా సీతాకోక చిలుకల్లాగ వస్తున్నారు సుల్తాన్ బజార్లోకి అందరూ… సుల్తాన్ బజార్లో సుల్తానూ ఫకీరూ ఒకటే. ఏమీ పని లేకపోయినా ఏదో పని ఉన్నట్లు అటూయిటూ తిరుగుతారు. కాస్త కాళ్ళు నొప్పి పుట్టగానే జంక్షన్‌లో ఆగుతారు. ఆ ఇరానీ కేఫ్‌లో ఒక కప్పు టీ తాగుతారు. మళ్ళా తిరగడం మొదలెడతారు. ఇదో వరస.
ఆపరేషన్ అయిన నాలుగోనాడు ఇంకా హాస్పిటల్లో ఉండగానే మరోసారి గుండెల్లో నెప్పి వచ్చింది సుబ్బారావుకి. ఈ సారి రక్తంలో కట్టిన గడ్డ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పల్మోనరీ ఎంబోలిజమ్ వచ్చిందని కొత్త పేరు చెప్పేడు డాక్టరు; తాను సర్జరీ చేసినప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల రక్తం గడ్డ కట్టిందనీ ఆ గడ్డ మెల్లిగా ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించిందనే తప్పు నొక్కిపెట్టి. ఏదైతేనేం, ఇంక మహా అయితే రెండు రోజులు బతకొచ్చు. ఈ లోపుల స్పృహలోకొచ్చి మాట్లాడితే గొప్పే.