రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.

సౌందర్యమే సౌఖ్యము ;
సౌఖ్యమే -జీవిత సాఫల్యమని
ఎంచు కీట్స్ మధుర కాంక్షా నవతా
యువతా కవితా కల్పనా జగతి లోనే
నన్నుంచుమా! ప్రియతమా!

తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.

మహీధర రామ్మోహనరావుగారు (వారి శతజయంతి కూడా ఈ సంవత్సరమే) కొడవటిగంటి కుటుంబరావు పంచకళ్యాణి నవల గురించి చర్చించిన ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం.

గతశతాబ్దపు సాహిత్యకారుల్లో ప్రముఖుడిగా పేరెన్నిక గన్న కొడవటిగంటి కుటుంబరావు గారి (అక్టోబర్ 28, 1909 – ఆగస్ట్ 17, 1980) శతజయంతిని పురస్కరించుకొని ఈ ఈమాటను కొ.కు స్మారక ప్రత్యేక సంచికగా మీకు సమర్పిస్తున్నాం. కొడవటిగంటి రాసిన ఉత్తరాలు, విమర్శకుల వ్యాసాలు, పాలగుమ్మి రేడియో చర్చ, అలాగే రోహిణీప్రసాద్, లక్ష్మన్న, హనుమంతరావుల కొత్త వ్యాసాలు ఈ సంచిక ప్రత్యేకం. ఇంకా…

సెప్టెంబరు 2009 సంచికలో మీకోసం –
శ్రీమతి డీ. కే. పట్టమ్మాళ్ స్మృత్యర్థం గొర్తి బ్రహ్మానందం వ్యాసం కంచి పట్టు కచేరీ; ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది – వేమూరి వెంకటేశ్వర రావు వ్యాసం; శాశ్వత్, వింధ్యవాసిని కన్నడ మూలం నుంచి అనువాదం చేసిన కథ కెంధూళి; పాబ్లో నెరూడా కవితకు తెనుగు సేత ఈ రాత్రి నేను రాయగలను – బొల్లోజు బాబా కవిత.

నా కళ్ళలో తెలీలేదా? ప్రేమ పాటలన్నీ పనిగట్టుకుని హై వాల్యూమ్ లో పెట్టినప్పుడు వికాస్ మాత్రం కంప్యూటర్లోకి దూరి ఉంటే ఎలా తెలుస్తుంది? నేను తనకేదో చెప్పాలని ఆరాటంగా వస్తే, తను చాట్ విండోలో జోక్ కి నవ్వుకుంటూ నా మాట వినిపించుకోనప్పుడు ఎలా తెలుస్తుంది?

గుర్రం జాషువా సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు […]

బహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు.

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్నకి సమాధానం, గణితంలో ప్రవేశం ఉన్నవాళ్ళకి కూడా ఇంగ్లీషులో చెప్పటమే చాల కష్టం. గణితంలో ప్రవేశం లేని వారికి ఇంగ్లీషులో చెప్పబూనుకోవటం కష్టతరం. గణితంలో ప్రవేశం లేని వారికి తెలుగులో చెప్పటానికి ప్రయత్నించటం కష్టతమం.

స్వర్గ తుల్యమైన సుఖాలు వదులుకుని కట్టుబట్టల్తో సన్యసించాలంటే ఎంతటి మనోధైర్యం కావాలి? తథాగతుడైనాక ఒక్కసారి కూడా ‘నా మాట నమ్ము’ అని అనలేదని వింది.

వేపచెట్టుకింద తన కైనెటిక్ హోండాను నిలిపి దానికి ఆనుకుని నిలబడి, మేము చేస్తున్న ఆచారాలన్ని చూస్తోందో యువతి. “ఎవరామె?” అని అడిగాను. “ఆమే!…” గుసగుసగా చెప్పింది అక్క.