పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు చేయించాలని […]
Category Archive: పద్య సాహిత్యం
శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రుడ స్తోకాటోప బలప్రతాప పురరక్షో దక్ష సంశిక్షణుం డా కాశోజ్వ్జల కేశపాశుడు త్రిశూలాంకుండు రుద్రుండు తా వీకం జింతలపాటి నీలనృపతిన్ […]
శ్రీరహితగేహ! చంద్రీ వారవధూ మదనసదన వర్ధిత సుఖరో గారూఢిత మృదుదేహ! వ నీరంగ విహారసాంద్ర! నీలనరేంద్రా! ఆకర్ణింపుము తావకీన కథావిధానంబు యథార్థంబుగా దొల్లి శ్రీశివబ్రాహ్మణ […]
శ్రీరతిసతీ మనోహర చారుతర గృహాయమాన శష్పావృత వి స్తారభగాన్విత చంద్రీ నీరంధ్రాశేవ్యలోల నీలనృపాలా ఆకర్ణింపుము తావకీన కథావిధానంబు యథార్థంబుగా శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండైన వీరభద్ర భట్టారకేంద్రునకు […]
గబ్బిల మేమని చెప్పెనొ
గుబ్బలి యల్లుండు కన్నుగోనల నశ్రుల్
గుబ్బటిల లేచి నల్లని
మబ్బులలో తక్షణంబ మాయం బయ్యెన్
స్వేచ్ఛాగానం దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి పీతడెక్కల చంద్రుణ్ణి చేతులెత్తే సముద్రం […]
అకస్మాత్తుగా
ఒక రోజు
మృత్యు వృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా
మొలిచింది.
ఉత్తర మేఘః(ద్వితీయ సర్గః) 1 విద్యుత్వన్తం లలితవనితాః సేంద్రచాపం సచిత్రాః సంగీతాయ ప్రహతమురజాః స్నిగ్ధగమ్భీరఘోషమ్ అన్తస్తోయం మణిమయభువ స్తుఙ్గ మభ్రం లిహాగ్రాః ప్రాసాదాస్వ్తాం తులయితు […]
జారధర్మాసనము మును తనకూతు దీముగ జూపి రోపట్టు పరదేశివిటునిచే బణము గినిసి ననుపు పల్లవుని సన్నకుసన్న రప్పించి యతని శయ్యకు దాని ననిపి పుచ్చి […]
మధుమావతి యిల్లు సింహళద్వీపమున గాని సృష్టిలోన బద్మినీజాతి లేదను పలుకు కల్ల తెరవ మధుమావతీదేవి దేవకన్య పద్మినీజాతి దోర్గంటి పట్టణమున మలయజగంధియైన మధుమావతి యూర్పుల […]
శ్రీకాకుళపు తిర్నాళ్ళు దవనపున్నమ కాకుళాధ్యక్షుడైన తెలుగురాయడు దేవతాధీశ్వరుండు భువనహితముగ నుత్సవం బవధరింప నందు బోయితి మీ పోయినట్టి యేడు కారవేల్ల మతల్లికా కల్పవల్లి కడుపు […]
నగరావలోకనము అదె భైరవస్థాన మటమీద నల్లదె చమడేశ్వరీ మహాశక్తి నగరు వీరభద్రేశ్వరాగార మంటపమదె యదె బౌద్ధదేవు విహారభూమి అదె ముద్దరా ల్ముసానమ్మ నివాసంబు నల్లదె […]
ఈరీర్చుట సారెకు సారె కేమిటికి జంపెదు గోరట యెర్రలైన వా లారు నఖాంకురంబుల వయస్య కచంబున బాటపాట యీ రీరిచి సీత్కృతుల్ చెవుల కింపొనరింప […]
కర్ణాటి కటిభారంబును చన్నుదోయి భరమున్ గల్పించె నా బ్రహ్మ పి న్నటి కౌదీగకు మున్న యిప్డు విమలార్ణఃపూర్ణమై యున్న యీ ఘటిభారం బొక డెక్కుడయ్యె […]
నేపథ్యమున గతిరసికుండ షట్చరణ గానకళాకమనీయ యో మరు వ్రత వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం చితి వటవీప్రదేశమున జెట్టులు సేమలు నేమి గల్గినన్ బతిచెడి […]
కృత్యవతరణిక గణన కెక్కిన దశరూపకముల యందు వివిధ రసభావ భావన వీధి లెస్స ఏ కవీంద్రుడు రచియించె నీ ప్రబంధ మనుచు మీ రానతిచ్చెద […]
పూర్వ మేఘః(ప్రధమ సర్గః) 1 కశ్చి త్కాన్తా విరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః శాపే నాస్తంగమితమహిమా వర్షభోగ్యేణ భర్తుః యక్ష శ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం […]
వినుకొండ వల్లభరాయడు 14వ శతాబ్దం చివర్లో, అంటే శ్రీనాథుడి కాలంలోనో కొన్నేళ్ళ తరవాతనో వున్నవాడు. అతని తండ్రి తిప్పయమంత్రి హరిహరరాయల కోశాగార సంరక్షకుడు. ఈ […]
నవయుగకవి చక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా రచనల్లో అగ్రగణ్యం “గబ్బిలం”. ఆయన కవిత్వంలో కనిపించే ముఖ్యగుణాలు భావనాపటిమ, సామాజికస్పృహ, మానవతాదృక్పథం ఇందులో విస్తృతంగా దర్శనమిస్తాయి. తేలిక భాషలో లోతైన భావాల్ని చెప్పే ఈ కావ్యం అందరికీ అందుబాటులో ఉండటమే కాక అవశ్యపఠనీయం కూడ.
(తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం (శ్రీనాథుడి శృంగారనైషథం విషయంలో తప్ప) ఐతే పెద్దన […]