చీకట్లు చీల్చుకుంటూ
ప్రేమ వెలుగు
అలసిసొలసిన కలని
కూడికూతై తట్టి లేపితే
బద్ధకం ఒళ్ళువిరుచుకుంటూ
తోసింది ఈలోకంలోకి
కాలం తప్పని నీ రాకను
గుర్తు చేస్తూ …
రాత్రంతా కురిసిన మంచుతో
తలారా స్నానం చేసి
పచ్చదనం సింగారించుకొని
చిగురాకుల పరదాలు తొలగిస్తూ
పక్షుల స్వాగతాలతో
పరవశిస్తున్న
ఈ ఎదురుచూపు తహతహ
ప్రియా !
రంగు మారింది
కారుమబ్బులు అంటి
తెల్లదనం నల్లముసుగేసింది
వెలవెలపోయింది కాంతి !
కాలుష్యపువాన కురిసిందా?
కల్తీ కాలసర్పమై వచ్చిందా?
నీ నిశ్శబ్దపు ఉరుములు
భరించలేను
వెచ్చటి కిరణానివై
ఓదార్పు వీపు తట్టి
అక్కున చేర్చుకో
ప్రియా !!