రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

రెండు కవితలు: ఆగిన పాట

రచన: పాలపర్తి ఇంద్రాణి
మే 2016

1.

​విరగ గాచి
​కనులు మూసి
​వేచి ఉంటాను

పసిమి వన్నెల
కవిత గువ్వ
వచ్చి వాలి

గొంతు ఎత్తి
ఉండి ఉండి
పాట పాడితే
పులకలెత్తి
పూలు రాల్చాను

పాట మాని
ఊరికే అది
కొమ్మకొమ్మకి
దూకుతోంటే
కులాసాగా
పొడుస్తోంటే

పాట ఆగితే
నిద్ర లేచే
తలపోతలు
నాగుబాములు

పొంచి పొంచి
పాకి వచ్చి
ఒక్క పట్టున
మింగబోతే

పాము చెవుల
చిట్టి గువ్వ
వదిలి నన్ను
ఎగిరిపోతో

ఎన్నడూ ఇక
తిరిగి రానని
కేక వేసింది.

2.

మందారచెట్టు మీద
మబ్బుల పరుపు
వెలుగు రేకల
చీకటి దుప్పటీ
పక్కన
చిన్ని కంఠం
కూకూ పాట

వింటూ
వత్తిగిలితే
రెక్కలు సాచి
కూత పెడుతూ
తరుముకు
వచ్చేస్తో
గండభేరుండ పక్షి

ఉలిక్కి పడ్డాను
పడ్డాను
మంచం మీంచి

కిటికీ బయట
పాట మాని
రెక్కల్లో
తల దా​చి ​
చిట్టి పిట్ట

మా ఇంటి
పైన్నించి
ఎప్పటి​లాగే ​
​​గర్జిస్తూ
లంఘిస్తో
లోహ విహంగం.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • పిల్లల కోసం
  • Indian groceries
  • వేసవి
  • కాళీ పదములు
  • ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం

ఇటువంటివే…

  1. రెండు కార్ల్ శాన్డ్‌బర్గ్ కవితలు
  2. సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు
  3. రెండు కవితలు
  4. రెండు కవితలు
  5. ఒక పాట – రెండు బాణీలు

మే 2016 సంచికలో ...

  • Honey Bee
  • అమర కోశం
  • ఆశనిరాశలు
  • ఇది చాలు నాకు
  • కాపరి భార్య
  • ఖండిత, కలహాంతరిత
  • చిరంజీవి
  • ఛందస్సులో గణితాంశములు – 2
  • జీర్ణమఙ్గే సుభాషితమ్
  • తేలిక తెలుగు
  • నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం
  • నిశ్శబ్ద సమూహం
  • పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1
  • మే 2016
  • రెండు కవితలు: ఆగిన పాట
  • శ్రీనాథుని భీమేశ్వర పురాణము: స్థానీయత, కొన్ని అపూర్వాంశాలు
  • సత్య దర్శనం
  • సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇది చాలు నాకు
చిరంజీవి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.