రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

లిఖిత: నా చీకటి

రచన: శ్రీకాంత్
మార్చి 2016

తల నిండుగా చీకటి – శిరోజాల మీద నుంచి
చినుకుల వలే
ఒళ్ళంతా రాలే
చిక్కటి చీకటి-

తల ఎత్తి చూస్తే
ఏ కనులలోనూ కాంతి కనిపించని
చీకటి-

నిన్ను నువ్వే హత్తుకుని
భయంతో
ముడుచుకుని పడుకునే చీకటి

లేని బాహువుల
బావురుమనే చీకటి
నీ అంత ఎత్తూ
పొడవూ ఉండే
చీకటి

నీ వాసన వేసే చీకటి
నీ ఒంటరితనపు
మేలి ముసుగు కప్పుకుని
నీ ముందు
కూర్చున్న చీకటి
చిన్న చీకటి

కడుపంతా తరుక్కుపోయే చీకటి
సమాధి వంటి చీకటి

ఒక మనిషి లేని చీకటి

ఒక చేయి లేని చీకటి

కళ్ళు పోయి తడుముకునే చీకటి

చిక్కటి
చిన్నటి
కంపించే చీకటి –
కరగని చీకటి
మూలిగలోకి చొచ్చుకుపోయి రోదించే చీకటి

దయ లేని
దాహం తీర్చని చీకటి
మరచి పోనివ్వని చీకటి
మరపు రానివ్వని చీకటి

మరి ఇంతకూ

నువ్వు ఎక్కడ?

(28-12-2013)

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Chakradhar Sai April 19, 2016 10:11 pm

    చాల బాగుందండి కవిత

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మూడు కవితలు
  • నిన్ను ఎవరైనా పలకరిస్తే
  • Madre: రెండు వాచకాలు
  • మూడు కవితలు
  • లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం

ఇటువంటివే…

  1. లిఖిత: ఒక మధ్యాహ్నం
  2. లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  3. లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  4. చీకటి పరచుకున్న ఆకాశంలో….
  5. చీకటి కలలు

మార్చి 2016 సంచికలో ...

  • ఉద్యోగపర్వము – రాయబారాలు
  • ఏం జీవితం!
  • కోటిగాని కతలు: శ్రీశైలంలో సన్యాసి
  • తత్వం…
  • నాకు నచ్చిన పద్యం: ఒక ఉన్మాది మనస్సినీవాలి
  • పద్యంలో ఉప్పెన
  • మరి వేరే ఎవరు?
  • మార్చ్ 2016
  • రాగలహరి: శివరంజని
  • లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం
  • లిఖిత: ఒక మధ్యాహ్నం
  • లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  • లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  • లిఖిత: నా చీకటి
  • వల్లూరి జగన్నాథరావు
  • వాసకసజ్జిక, విరహోత్కంఠిత
  • విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు
  • సత్సంగం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
తత్వం…

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.