పేకాటలో వాడు తురఫు ముక్క
సర్కస్ లో బఫూన్
రెండుని రాణిగాను,
తిమ్మిని బమ్మిగాను,
క్షణాల్లో మార్చగలడు
వికట చేష్టలతోటి,
కపట వాక్కులతోటి,
నవ్వించగలడు
ఏడిపించగలడు.
రాజధానిలో మాత్రం
వాడొక రాచపుండు
కరుడుకట్టిన దుండగీడు
బంటుని మంత్రిగాను,
పాలని నీళ్ళగాను
క్షణాల్లో మార్చగలడు.
వెగటు రాతలతోటి,
దురుసు మాటలతోటి,
బతుకులు మార్చగలడు
కాటికి చేర్చగలడు.
తురఫు ముక్కుందని
బరిలోకి దిగినవాళ్లంతా
ఒక్కక్కరే దివాళా తీస్తున్నారు
ఇల్లు కాలిపోయాక
ఆకులు పట్టుకుంటున్నారు
పేకాట్లోనూ, జీవితంలోను
నేను మాత్రం “నో ట్రంప్!”