రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

చూపుల చెరసాల

రచన: శ్రీను పైండ్ల
నవంబర్ 2025

ఆ కళ్ళు
అవే కళ్ళు

చీకటిని చీల్చుకుంటూ చొరబడే కాంతిరేఖల్లా
నిశ్శబ్దం పొరల కింద దాక్కున్న శబ్దాల్లా
నా ఏకాంతపు లోతుల్లోకి చొచ్చుకొచ్చేస్తాయి.

నా అచేతనపు అగాధాల్లో
వెలుగు నీడల దోబూచులాటలో
నా అస్తిత్వపు ఆనవాళ్ళను
వెతుకుతూనే ఉంటాయి.

నా ఊపిరి వారికో సడిలేని సంగీతం.
లయ తప్పిన ప్రతీ శ్వాసకూ
ఆ చూపుల అదృశ్య వేదికపై
ఓ కొత్త తీర్పు ఆవిష్కారమవుతుంది.
నా నుదుటి చెమట చుక్కలు
వాటి తీక్షణ వేడికి ఆవిరైపోతాయి.
నాలో ప్రతీ కదలిక లోతునీ
అవి కొలుస్తూనే ఉంటాయి.

అనురాగం
నా పెదాలపై తేనె చుక్కై నిలవగానే
వాళ్ళ దృష్టి కత్తుల వంతెనై అడ్డు తగుల్తుంది.
నా అస్తిత్వాన్ని ముక్కలు చేసి
వారి ప్రపంచంలో అతికించుకుంటుంది.
వాళ్ళు గీసిన గీతలే నా పరిధి.
ఆ వీక్షణ వలయంలో చిక్కుకున్న నేను
విడిపించుకోలేని ఓ రంగురంగుల పతంగినైనాను.

నా కన్నీటి ప్రవాహాన్ని నిర్లిప్తతలోకి ఇంకించుకుని
నా వేదన బరువును మోస్తున్నట్టు నటిస్తాయా నేత్రాలు.
ఇనుప సంకెళ్ళు కాదు, ఆ నయనాల పహారాలోనే
నా బతుకు బందీగా మారింది.
ఆ కిరణాలు చెక్కిన మట్టి ప్రతిమనే నేను.
ఆ అద్దంలో కదలాడే బొమ్మను నేను.

ఈ ప్రక్షేపణ చెరసాల నుంచి తప్పించుకుంటే
ఏమైపోతాను?
ఏమీ కాకుండా మిగిలిపోతానా?
అక్కడికీ వస్తాయా ఆ కళ్ళు?
వచ్చి, శూన్యానికీ సరికొత్త రూపమిస్తాయా?
అసలు నేను అంటే వారు చూసే తీరేనా?
ఆ నిర్వచనమేనా?

ఆ కళ్ళు
అవే కళ్ళు
అదిగో … ఇప్పుడు నన్ను తాకుతున్నాయే?
అది నీ చూపే!

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • స్వేచ్ఛాభారం
  • జీవాజీవ భావం
  • చూపుల చెరసాల
  • ఒకానొక నిద్రించేచోటు!

ఇటువంటివే…

  1. చెప్పేదెవరు?
  2. లోలోపలగా…
  3. మా ఇంటికి దారి
  4. తోటలో
  5. నిశ్శబ్దం లో నీ నవ్వులు

నవంబర్ 2025 సంచికలో ...

  • అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 4
  • అలంకార శాస్త్రానికి ఆంధ్రుల వరివస్య
  • అస్తిత్వవాద సాహిత్యం: 4అ. లూయిజీ పిరాండెలో
  • ఎనిమిది దివ్వెలు
  • ఎన్నటికీ మూగవోని కవితాగానం
  • ఏకాంత ద్వీపం
  • కంప్యూటర్ చిప్ కథ – 7: ఓర్‌స్టెడ్, ఆంపేర్‌ల విద్యుదయస్కాంత శక్తి
  • కథల గారడీ తెలిసిన ముని సురేష్ పిళ్లె
  • కాలాతీత కవితా కాసారం
  • కృష్ణగీతాంజలి పాటలు
  • కృష్ణశాస్త్రి తపస్య
  • కృష్ణశాస్త్రి బాధ — ప్రపంచపు బాధ
  • చూపుల చెరసాల
  • తండ్రి
  • దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు స్వీయ గానం
  • దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు
  • దేవులపల్లి కృష్ణశాస్త్రి రేడియో ప్రసంగం
  • దేవులపల్లి శర్మిష్ఠ నాటకంలోని పాటలు
  • ధరణీరుహ — సమీక్షా వ్యాసం
  • నవంబర్ 2025
  • నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం
  • నేటి కాలపు కవిత్వం — స్వాతంత్ర్యం
  • పుట్టినరోజు
  • భైరప్ప హిందుత్వవాదం
  • యూట్యూబ్‍లో ఈమాట: అక్టోబర్ 2025
  • లోయ అంచుల్లో…
  • వేణుకుంజం నాటకంలోని పాటలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

తండ్రి
పుట్టినరోజు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.