క‌ల‌గంటాను…

మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మ‌నోహ‌ర‌మైన మ‌రీచిక‌ల‌ను,
మ‌రులుగొలిపే మ‌ధుమాసాల‌ను.

మ‌ళ్ళీ మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మధురాధ‌ర మంద‌హాసాల‌ను,
మ‌త్తిల్ల‌జేసే మ‌ల‌యానిలాల‌ను.

క‌ల‌లు క‌డ‌తేర‌కుండానే,
క‌ర్క‌శ‌మైన లోకంలో మేలుకొంటాను.
మెల‌కువ‌ను వెలివేసిన ప్ర‌పంచంలో
నిద్ర మీద ఇంత మ‌త్తుమందు చ‌ల్లుతాను.
మ‌త్తు వీడ‌ని నిద్ర నిద్ర‌లో ఉండ‌గానే,
క‌ల‌ల చేతికి క‌ర‌వాలాలిస్తాను.
క‌త్తిరించాల్సిన కుత్తుక‌ల చిరునామాలు కూడా…