జనవరి 2018

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈమాట ఒక కొత్తరూపు దిద్దుకుని మాసపత్రికగా మారి, కొత్తగా మరికొన్ని కొత్త పుంతలు తొక్కి ఈ సంచికతో ఏడాది. రచయితల సహకారం, పాఠకుల ప్రోత్సాహం– నాణ్యతతో ఏమాత్రమూ రాజీ పడకుండా ఈమాటను మాసపత్రికగా ఇక నడపగలమనే నమ్మకాన్ని మాకు ఇచ్చాయి. అందువల్ల ఇకనుంచీ కూడా ఈమాట మాసపత్రికగానే రాబోతున్నది. ఈ సాహితీప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన రచయితలకు, పాఠకులకు, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువకాని కృతజ్ఞతలు మరొక్కసారి.

డిటిఎల్‌సి వారి సాహిత్య విమర్శ వ్యాసపోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న మానస, జిజ్ఞాసల వ్యాసాలు– ఆ వ్యాస సంకలనం విడుదలయిన సందర్భంగా–ఈ సంచికలో ప్రచురిస్తున్నాం; గత ఏడాదిగా తెరచాటు-వులు వినిపించిన శ్రీనివాస్ కంచిభొట్లకు మా కృతజ్ఞతలు. ఈ సంచికతో ఆ ధారావాహిక ముగుస్తున్నది. ముందుముందు వారినుంచి మరిన్ని చలనచిత్రకథనాలను ఆశిద్దాం; ఈమాటలో గత ఆరునెలలుగా వచ్చిన పాఠకుల వ్యాఖ్యలపై టి. చంద్రశేఖర రెడ్డి ఆసక్తికరమైన విశ్లేషణ; కొత్త సంవత్సరం సందర్భంగా ఈమాట పాఠకులకోసం భైరవభట్ల కామేశ్వరరావు కూర్చిన ఒక స్పెషల్ గడి; కథలూ, కవితలూ, శీర్షికలూ…


ఈ సంచికలో:

  • కథలు: The national zoo – పాలపర్తి ఇంద్రాణి; సమయానికి – పూడూరి రాజిరెడ్డి (స్వగతం); గురువు/పాఠం – చంద్ర కన్నెగంటి; సింహం చెట్టు – శ్రీరమణ; రీప్లే – వి. మల్లికార్జున్.
  • కవితలు: ప్రహ్లాదుడు – పరిమి శ్రీరామనాథ్; ఘటన – దాసరాజు రామారావు; హళ్ళికి సున్నా – పాలపర్తి ఇంద్రాణి.
  • వ్యాసాలు: తెలుగు సాహిత్య విమర్శకు తూనికరాళ్ళు – జిజ్ఞాస; సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ – మానస చామర్తి; Ekphrasis గురించి మరి కొంత – టి. చంద్రశేఖర రెడ్డి; ఈమాటలో వ్యాఖ్యలపై ఒక పరిశీలన – టి. చంద్రశేఖర రెడ్డి; పరిచయం: ఓల్గా–సంతులిత – దాసరి అమరేంద్ర; పరిచయం: ఇంటివైపు-–అఫ్సర్ కవితల సంపుటి – వాడ్రేవు చినవీరభద్రుడు.
  • శీర్షికలు: కళావర్ రింగ్ (శబ్దతరంగాలు) – పరుచూరి శ్రీనివాస్; తెరచాటు-వులు:12. ఆండాళ్ళూ! నీకేమయినా అర్థమయిందా? – శ్రీనివాస్ కంచిభొట్ల; నాకు నచ్చిన పద్యం: ప్రాతఃకాల వ్యాకరణం – చీమలమర్రి బృందావనరావు.