నాల్గవ కాలిఫోర్నియా సాహితీ సదస్సు

తెలుగు సాహిత్యంపై మక్కువతో సరదాగా మొదలెట్టిన సాహితీ సదస్సు ప్రతీయేటా తప్పకుండా చేద్దామన్న స్థాయికొచ్చింది.

మార్చి నెల 14వ తేదీ,2009, శనివారం కాలిఫోర్నియాలో మిల్పిటస్ నగరంలో ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ఈ సాహితీ సదస్సు జరుగుతుంది. ఉదయం 11 గంటలకి మొదలయ్యి సాయంత్రం 5 గంటలవరకూ వుంటుంది. తెలుగు వారందరికీ మా అందరి తరపునా ప్రత్యేక ఆహ్వానం.

ఈ సభకు ముఖ్య అతిధులుగా ఆచార్య వెల్చేరు నారాయణరావు గారూ, ఈమాట సంపాదకులు వేలూరి వేంకటేశ్వరరావు గారూ విచ్చేస్తున్నారు. ఈ సదస్సులో తెలుగు కథా పరిణామం, ఇంటర్నెట్ మాధ్యమం-లో తెలుగు భాష, సాహిత్యమూ వంటి చర్చలూ, ప్రముఖుల ప్రసంగాలూ, స్వీయ పద్య, కవితా, కథా పఠనాలూ ఉంటాయి.

ఈ సదస్సులో పాల్గొన దలచిన వారు ఈ క్రింది వారిని సంప్రదించంవచ్చును.
కిరణ్ ప్రభ (rao_pathur(at)yahoo.com)
సాయి బ్రహ్మానందం గొర్తి (gorthib(at)yahoo.com)
మృత్యుంజయుడు తాటిపామల (mj_thatipamala(at)yahoo.com)
శివ చరణ్ గుండ (shiva_gunda(ay)yahoo.com)
కుమార్ కలగర (kumar.kalagara(at)gmail.com)

క్రితం ఏడాది ఈ సదస్సుని విజయవంతం చేసిన సాహితీ ప్రియులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ఏడూ మీరు అంతే ఉత్సాహంతో పాలుపంచుకుంటారనీ ఆశిస్తున్నాము.