నవంబర్ 2017

అధివాస్తవికతావాదం 1950, 60 దశకాలకల్లా సాహిత్యాన్ని దాటి చిత్రకళానాటకరంగాలలో ప్రవేశించి ఒక గొప్ప సాంస్కృతిక ప్రభంజనంగా పరిణమించింది. ఆ అధివాస్తవికోద్యమానికి పారిస్ నగరం కేంద్రం కాగా అందులో చిత్రకారుడు స్టాన్లీ హేటర్ చిత్రశాల ఆట్లియే 17 కేంద్రబిందువు అయింది. బెకెట్, పికాసో, బ్లిన్, ఆఖ్‌త్వాఁ వంటి ఎందరో కళాకారుల సమక్షంలో, వారి చర్చల మధ్యలో పెరిగిన ఆగీ హేటర్ ఒక చక్కటి కవి, రచయిత, నటుడు, అనువాదకుడుగా ఎదగడంలో ఆ దశకాల ప్రభావం ఎంతో ఉంది. ఆనాటి పారిస్ నాటకరంగం, అబ్సర్డ్ థియేటర్ గురించి, ఆపైన ఆరియాన్ మెనుచ్‌కిన్, హోర్హే లోవెల్లి వంటివారితో పనిచేయడంలో తన అనుభవాలు, కళాకారుడిగా తన ఎదుగుదల గురించి రాసిన ఆత్మకథాత్మక వ్యాసం షోబిజ్ డేస్ – నాగరాజు పప్పు అనువాదం; భారతదేశానికి సంబంధించినంతవరకు భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం ఎలా కీలకమైనదో వివరిస్తూ, బెంగళూరు పెన్‌ సంస్థ నిర్వహించిన లేఖన-2017 కార్యక్రమంలో ప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ప్రసంగపాఠం – అవినేని భాస్కర్ సమర్పణ; తెలుగువారందరికీ సుపరిచితమైన యమాతారాజభానసలగం అనే నెమానిక్ ఎలా ఏర్పడి వుండచ్చో వివరిస్తున్న ఛందస్సులో గణితాంశములు వ్యాసం – జెజ్జాల కృష్ణ మోహన రావు; అంతుచిక్కని వింతదేవుడిపై కొనసాగుతున్న సురేశ్ కొలిచాల వ్యాసం; ఇంకా, కథలు, కవితలు, పద్యసాహిత్యం, తెరచాటువులు, గడి నుడి…


ఈసంచికలో:

  1. కథలు: బండలు – కృష్ణ వేణి; జ్ఞాపిక – చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతిరాజు; breakrooమోపాఖ్యానం-డబ్బింగ్ ఢమాల్ – పాలపర్తి ఇంద్రాణి; గురుత్వాకర్షణ సుంకం – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం); బబ్లూగాడి చెల్లి పాప – సురేశ్; ముగింపు – కన్నెగంటి చంద్ర
  2. కవితలు: లోకం – అవినేని భాస్కర్, భైరవభట్ల కామేశ్వరరావు (వైరముత్తు); పాతపద్యం – విన్నకోట రవిశంకర్; అదే మబ్బు – పాపినేని శివశంకర్; ఎదురుచూపు – విజయ్ కోగంటి.
  3. వ్యాసాలు: షోబిజ్ డేస్ – నాగరాజు పప్పు (ఆగీ హేటర్); కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం – అవినేని భాస్కర్; ఛందస్సులో గణితాంశములు – 3: యమాతారాజభానసలగం – జెజ్జాల కృష్ణ మోహన రావు; గణపతి: అంతు చిక్కని వింత దేవుడు – 3 – సురేశ్ కొలిచాల.
  4. శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: దూషణమే భూషణం – భైరవభట్ల కామేశ్వరరావు; తెరచాటు-వులు: 10. టక్కుటమార గజకర్ణ గోకర్ణ… – శ్రీనివాస్ కంచిభట్ల; Nails – పాలపర్తి ఇంద్రాణి (స్వగతం); గడి నుడి-13 – త్రివిక్రమ్; శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక-11.