రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

హోమ్ సిక్

రచన: బండారి రాజ్ కుమార్
సెప్టెంబర్ 2017

నేనిప్పుడు ఇల్లు వాకిలి వదిలిపెట్టి
ఊరును మనుషుల్ను ఇడ్శిపెట్టి
దూరంగ బతుకుతెరువు ఎతుక్కుంట
ఈడ్సుకుంట ఈడ్సుకుంట ఒచ్చిన వలసపిట్టను

నావాండ్లను కల్వటానికి నాదాను
ఎందుకనిపిత్తాందో అర్థం కాదు
కన్నోల్ల కళ్ళలోకి సూత్తానికి నెనరు లేదు
కలల్లోనే సాలీడు గూడును అల్లుకుంట
ఎవలకు కనిపించకుంట వెళ్ళి ఒక్కపాలి అమ్మ నాయినను ముద్దాడి వత్త

ఏ నడి జాము రాతిర్లనో పీడకలకు
ఉలిక్కిపడి జడుసుకున్నప్పుడు
పక్క తడుముకుంట
ఎవలు కనిపించరు
నా కలల వాకిట్ల ముగ్గుబెట్టి
దినాం రంగులద్దిపోయే అమ్మ
పరిగేరటం ఆపి ఉరుక్కుంటావచ్చి
గుడ్లల్ల నీళ్ళు తీసుకున్నట్టే అనిపిత్తది
వీపు నిమిరి దగ్గరకు దీస్కుని ధైర్నం జెప్పే
నాయిన కళ్ళముందు మెదిలినట్టే ఉంటది
సోపతి గాళ్ళందరు మతిల కొచ్చి సొదబెట్టినట్టే ఉంటది
నెమలీక కందిలి పట్టుకొచ్చి మనసంతా కలెదిరిగి సోదాజేసినట్టే ఉంటది

గుంజాయితి పడుతున్న మనసుకు దెబ్బ తాకినట్టయి
నెత్తురు బొట్ట బొట్ట కారుతనే ఉంటది
పేగుపాశం ఒక పక్క పీకుతనే ఉంటది
తెగిన బొడ్డుపేగు కన్నోల్లని గుర్తు పట్టనీయదు
ఎవలకు ఎవలం ఏమీ కానీ ఒంటరి గువ్వలం
ఎంతటి మనాదికైనా దుక్కమొకటే గవాయి

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • Replica
  • పాయిరం
  • వొట్టిశాపల బతుకు
  • కూడికకు రొండుపక్కల
  • దందెడ

ఇటువంటివే…

  1. ప్రేమ
  2. రెండు తీరాలు
  3. తనలో తాను
  4. ఒక్క మలుపు!
  5. గోకర్ణ గీతి

సెప్టెంబర్ 2017 సంచికలో ...

  • Breakrooమోపాఖ్యానము
  • ఒకనాటి యువ కథ: సరిహద్దు
  • ఒక్క మలుపు!
  • గడి నుడి – 11
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1
  • గుర్రాల మావయ్య
  • గోకర్ణ గీతి
  • తెరచాటు-వులు: 8. కప్పు, లిప్పు – సిప్పా? స్లిప్పా?
  • నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు
  • బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక
  • బ్రేక‌ప్
  • భూమి చాలని మనిషి
  • యుద్ధం
  • రైలు అమ్మాయి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 9
  • సెప్టెంబర్ 2017
  • స్త్రీల పాటలలో షట్పదులు
  • హోమ్ సిక్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఒకనాటి యువ కథ: సరిహద్దు
భూమి చాలని మనిషి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.