రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వూళ్ళో యిల్లు

రచన: హెచ్చార్కె
జులై 2017

కాగితాలు
బాగా పాతవి
వాటిలో యేదో వుంటుంది మోహపడదగ్గది
యెంత పాతవైతే అంత మోహం

అప్పుడు నువ్వు యేదో రాస్తూ వుంటావు
వారపాకు చూరులోంచి
వొక పిట్ట పిల్ల పిలుస్తుంది, వాళ్ళ అమ్మను కావొచ్చు
నిన్నే అనుకుంటావు నువ్వు
అప్పుడు దాని తెరచిన నోటి లోని యెరుపు
దాని వొంటి మీద
యెప్పటికో యీకలు తొడుక్కోనున్న
రెక్కల పల్చని నగ్నత్వం…
వాటి వెంట పడి వెళ్ళిపోయిన నీ
మనస్సు వెంట వెళ్తావు నువ్వు

యెప్పుడో మరి చాన్నాళ్ళకు
యెక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి
అరుగు మీద గూట్లో యేదో మెరిసినట్లై
యేంటా అని వెళ్ళి చూస్తావు
యేదో యెప్పుడో పగిలిన సీసా పెంకు
లేదా చిరిగిన తగరం ముక్క
సరేలే అని కన్ను తిప్పుకుంటుండగా
గూటిలో లోపల యేదో నలనల్లగా

కాగితం, బాగా పాతది
దానిలో నీ అక్షరాలు
నీకు తెలీదు
అక్షరాల్లో యింకా యీకలు రాని రెక్కల పిట్ట పిల్ల
అమ్మ కోసం యెదురుచూస్తున్న ఆకలి చూపులు
భలే వుందే అనుకుంటావు
యిన్నాళ్ళయినా నీ యిల్లు నీకు వున్నందుకు
నీ పదాలు నిన్ను మోహించి
నీ కోసం యెదురు చూస్తున్నందుకు

లోపలి ఆకాశం వొక్కసారిగా
విచ్చుకుంటుంది
యీకలు తొడిగీ తొడగని
రెక్కలతో నీలి నీలి గాలిలో
పిట్టలు గిరికీలు కొడతాయి

అప్పుడు పుడుతుంది
వొక్కసారిగా యింటి మీద గొప్ప గౌరవం
యిళ్ళు లేని వాళ్ళందరినీ నీ యింటికి
పిల్చుకోవాలని కూడా అనిపిస్తుంది

అన్నయ్యా! యిల్లు అమ్మొద్దు
వుండనీ, యెవరినేనా వుండనీ
వాళ్ళను అడిగి
అరుగు మీద గూళ్ళు చూసుకుందామని…
దేశ దేశాలు తిరిగినా
తిరిగి తిరిగి రావడానికి యిల్లు వుండనీ
అందులో యెవరినేనా వుండనీ

యే గూటిలో
యే అక్షరం నిద్ర పోతుంటుందో
యీకలు వచ్చీ రాని రెక్కలతో
కొన్ని ఆకాశాల్ని కలగంటూ…

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రెండు కవిత్వాలు
  • సరస్సు నవ్వు
  • బుడగ
  • ఒక్క క్షణం
  • నీటి ఊహ

ఇటువంటివే…

  1. నాయినమ్మ యిల్లు
  2. వైరుధ్యం
  3. గతచిత్రం
  4. ఈ రాత్రి
  5. కొంచెంగానైనా మనలా…

జులై 2017 సంచికలో ...

  • అబద్ధం
  • ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు
  • కళకాలమ్: 2. ఉద్యమిద్దామా, నిద్రపోదామా?
  • గడి నుడి – 9
  • గెలుపు
  • జులై 2017
  • తెరచాటు-వులు: 6. ఆస్సెం
  • నా
  • నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత
  • మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం
  • మాటలు
  • రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం
  • వూళ్ళో యిల్లు
  • శవం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 7
  • సార్థకనామ వృత్తములు – 1
  • సినారె: ఒక స్మరణ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం
సార్థకనామ వృత్తములు – 1

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.