జువ్వాడి గౌతమరావు
జీవిత విశేషాలు
జువ్వాడి గౌతమరావు (1929 – 2012) భాషాభిమాని, సాహితీకారుడు. పీవీ నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీ మిత్రులతో వీరికి చాలా సాన్నిహిత్యం ఉండేది. కరీంనగర్ సాహిత్య చైతన్యకేంద్రంగా భాసిల్లడంలో గౌతమరావు పాత్ర ఘనమైనది. వరంగల్‌లో కాళోజీ, ఆదిలాబాదులో సామల సదాశివ మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతమరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చాడు.