గంగిశెట్టి లక్ష్మీనారాయణ


సొంత ఊరు:
పరకల్లు, అనంతపురం జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ (1947 – 2025) ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకులు, పరిశోధకులు, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన, సాహిత్య విమర్శలో సమగ్ర అధ్యయనానికి కృషి చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య కృషి: విమర్శకుడిగా, కవిగా, అనువాదకుడిగా సుపరిచితులు. సాహిత్య విమర్శను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేశారు.


 

ఇది మహాభారతాన్ని మరోసారి తమ మాటల్లో, ఆధునిక వచన రూపంలో, చెప్పడం కాదు. మహాభారతంలోని ఎన్నో సమస్యలకు హేతుబద్ధంగా సమాధానాలను వెదికి, సృజనాత్మకంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ప్రయత్నం ఇది. మహాభారతంలోని పౌరాణిక కల్పన (మిథ్)ను వాస్తవాన్ని విడదీసి, ఆనాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందు పునర్నిర్మించిన విద్వత్ ప్రయత్నం ఇది.