కాత్యాయనీ విద్మహే


సొంత ఊరు:
మైలవరం (అద్దంకి), ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం:
వరంగల్లు
వృత్తి:
తెలుగు ప్రొఫెసర్‌, కాకతీయ విశ్వవిద్యాలయం
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

అభ్యుదయ రచయిత్రి, కాత్యాయని విద్మహే 12 ఏళ్ల వయసునుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం, సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. 28 వ్యాసాలున్న ‘సాహిత్యాకాశంలో సగం’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గెలుచుకున్నది.


 

ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళకంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారనటానికి నిదర్శనం.

చెడును మరవటం, మంచిని తలవటం – ఒకరి విషయంలో; మంచి గుర్తించక పోవటం, చెడును వెతికి కెలకటం – మరొకరి విషయంలో; ఎందుకు జరుగుతున్నది? ఎలా జరుగుతున్నది? అన్నది ప్రశ్న. వీటిల్లో ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించి చెప్పే ప్రమాణాలు ఎవరు రూపొందించారు అన్న విచికిత్స లేకుండానే మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చే మనిషి గురించిన దిగులు కాళోజీది.