కందుకూరి వీరేశలింగం పంతులు


సొంత ఊరు:
రాజమండ్రి
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919) సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చేశారు. ఆంధ్ర దేశంలో బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. సమాజసేవ కొరకు హితకారిణి అనే ధర్మసంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాలపాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా, ఐదేళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేసారు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు అనే గ్రంథాలతో సహా 130 కి పైగా గ్రంథాలు వ్రాసారు. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.


 

ఏమార్పులు చేసినను నియమములకు లోబడి యుండవలెను గాని విచ్చల విడిగా నుండరాదు. ఇట్టి మార్పులు భాషాభివృద్ధికి దోడ్పడవు.