రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నవంబర్ 2019

కేవలం తన ఆలోచనలను అక్షరబద్ధం చేసుకొని చూసుకోవడమే రచయిత లక్ష్యమైతే సాహిత్యం అనేదే ఉండదు. తన ఊహలు, అభిప్రాయాలు, ఆలోచనలు పదిమందికి తెలుపవలసి ఉన్నదనే స్పృహ సాహిత్యానికి, ప్రత్యేకించి ఆత్మకథాసాహిత్యానికి మూలబీజం. రచనకు కావలసిన ముడిసరుకులన్నీ జీవితంలోనే ఉంటాయి. కానీ అనుభవాన్ని రచనగా మార్చే పాటవం, ఆ చెప్పడంలో తనలోకి తాను నిజాయితీగా చూసుకునే చూపు రచనలను మనకు దగ్గర చేస్తాయి. అనుభవాలు వ్యక్తిగతమై, మనిషి లోతులు, బలహీనతలతో సహా అర్థమవుతున్న కొద్దీ, ఆ రచయిత మనిషిగా పాఠకుడికి ఆప్తుడవుతాడు. బహుశా ఇందుకే ఆత్మకథలు ఎప్పుడు ఎవరు రాసినా చెల్లుతూనే ఉన్నాయి. అవి శ్రీపాద అనుభవాలూ- జ్ఞాపకాలూ, దాశరథి జీవనయానం లాగా తమ తమ జీవితాల సాక్షిగా పాఠకులకు ఆనాటి చరిత్రను పరిచయం చేయవచ్చు. అబ్బూరి వరదకాలం లాగా, ఆచంట జానకిరామ్ సాగుతున్న యాత్ర లాగా, తమ జీవితాల్లోని ముఖ్య సంఘటనలను, ప్రముఖుల సాంగత్యాన్నీ మాత్రమే పొందుపరచవచ్చు. లేదూ, తమ మామూలు జీవితానుభవాలనే ముళ్ళపూడి శ్రీదేవిలా నెమరేసిన మెమరీస్‌ గానో, సోమరాజు సుశీలలా ఇల్లేరమ్మ కతలు గానో చెప్పి ఆకట్టుకోనూవచ్చు. ఒక ‘నేను’ తన జీవితంలోని బాధనైనా సంతోషాన్నైనా, తనకు తానుగా సాధించుకున్న విజయాలైనా పరాజయాలైనా, తన తలపొగరైనా, గర్వభంగమైనా, పంచుకోదగినదేనని నిస్సంకోచంగా నమ్మి ఉండకపోతే, ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో సింహభాగం వెలుగు చూసేది కాదు. నిరాధారమూ, అసమంజసమూ, అసందర్భమూ అయితే తప్ప, స్వోత్కర్ష, పరనింద కూడా సాహిత్యంలో చొరబడరానివేం కావు. అందుచేత, ఎవ్వరైనా ఏదైనా ఎలాగైనా చెప్పవచ్చు. కానీ, నిజం నిక్కచ్చిగా చెప్తున్నామన్న అపోహలో అకారణమైన అక్కసునీ, ఇతరుల పట్ల ద్వేషాన్నీ కథలుగా, ఆత్మకథలుగా రాయడం సరి కాదు. సాహిత్యానికున్న పరిధినీ విశాలమైన వేదికనూ స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించుకుంటే, ఇప్పటిప్పుడు అడ్డుకునేవారు లేకపోవచ్చు. అంతమాత్రాన, రాసినదంతా సాహిత్యమూ కాదు, సాహిత్య చరిత్ర అంతకన్నా కాబోదు. తాత్కాలికమైన ఉద్వేగాలూ స్నేహాలూ శత్రుత్వాలూ కాలంతో కరిగిపోయాక, నిజాయితీగా తమ కథలు వినిపించిన గొంతులే మిగిలి, ముందుతరాలకు తమ కాలపు సాహిత్య చరిత్రను నిష్పక్షపాతంగా చెప్తాయి.

ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం

రచన: మానస చామర్తి
ఈ ఈ నొక్కి చదవండి...

సాహిత్య వాతావరణంలో స్తబ్దత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అయితే, వచ్చే ప్రతి రచనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణ నిస్తుంది.

2

‘మంచి’ కథ

రచన: దాసరి అమరేంద్ర
ఈ ఈ నొక్కి చదవండి...

రంగు, భాష, సంస్కృతి, మతం, జాతి అన్న పొరలు దాటివెళితే మనిషికీ మనిషికీ మధ్య మరీ అంతంత దూరం లేదన్న వాస్తవం కనిపిస్తుంది. జర్మనీ అయినా అమెరికా అయినా; భారతదేశంలోని అనేకానేక రాష్ట్రాలు అయినా; కారణాలు వేరువేరు అయినా; భిన్న జాతులవాళ్ళూ భాషలవాళ్ళూ కలసిపోయి బతకడం అన్నది ఈ కాలపు అవసరం. నిజానికి అదో గొప్ప అవకాశం.

3

ఇంతింతైన ఇల్లేరమ్మ

రచన: సి. మృణాళిని
ఈ ఈ నొక్కి చదవండి...

సోమరాజు సుశీల పాఠకులకు తమ బాల్యాన్ని పునర్దర్శించుకునే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని ‘ఇల్లేరమ్మ కతలు’లో అందించారు. ఆ క్రమంలో అందులోని పాత్రలు ఉడుక్కున్నా, ‘అది నిజమే కదా. ఉడుక్కోవడం దేనికీ, నిన్ను కథలోకి ఎక్కించి అమరత్వం కల్పిస్తేనూ’ అని డబాయించారు. ముందే చెప్పినట్టు, ఆమెకు నిజం చెప్పడం ఓ సరదా.

2

నో-బుల్ బహుమతి

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

మార్కులూ, ఎంగిల్‌లూ,
మావోలూ, మిన్హాలూ
బ్రాహ్మణీయం భూస్వామ్యం
సమాజాల వాచాలం
విప్లవీకం వర్వరీయం
ఒకటేమిటి, అన్నీ అన్నీ
విన్నాన్‌ విన్నాన్‌ చదివాన్‌ చదివాన్‌!

3

మూడు ముక్కలు

రచన: పూడూరి రాజిరెడ్డి

ఒక పెద్ద భూకంపం, నా ఊహల్లో కూడా లేనంతటి పెద్ద భూకంపం వచ్చి, ఈ ప్రపంచం తలకిందులైపోతే ఇప్పుడున్నవన్నీ అర్థంలేనివైపోతాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఐఫోన్లు, సాఫ్ట్‌వేర్లు… అప్పుడు నాలుగ్గింజలు పండించుకోవడమే ప్రధానం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ దానికనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. స్కిల్స్‌ రీడిఫైన్‌ అవుతాయి. బలంగా తవ్వేవాడే అవసరం అవుతాడు. పంట పండించినవాడే మొనగాడు అవుతాడు.

0

నెలబానిస

రచన: శ్రీకాంత్ గడ్డిపాటి

ముఖమా? అరవిందమా?
అరబిందెనా?
పూర్తి బిందెనా?
ఎటో వెళ్ళిపోతోంది మనసూ…
ఎందుకిలా బ్రో?
బ్రో…చే…వారెవరురా బ్రో…

0

ఇల్లేరమ్మకు చలవపందిరి

రచన: శ్రీరమణ
ఈ ఈ నొక్కి చదవండి...

అంతా బానే ఉంది గానీ, ఇన్నాళ్ళూ చేతులు కట్టుకు కూచుని, ఒక్కసారి ఈ రచయిత్రి ఇలా తిరుగుబాటు చేయడం, ఓవర్టేక్ చేసి పెద్దపీట ఆక్రమించడం సీనియారిటీని ఓవర్‌లుక్ చెయ్యడం అవుతుందని సంకోచంగా ఉన్నా ఆమెకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. కనీసం కొన్నాళ్ళపాటు వీరు పీఠికల జోలికి రాకుండా ఉంటే చాలు. అదే నాలాంటి వాళ్ళకి పదివేలు.

1

నీడ

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి

నీ కోపం అంతా దినకరన్ మీద. దినకరన్ నిన్ను అవమానించాడు. పీరియడ్. అంతకు మించి ఆలోచించడం వేస్ట్! అవమానం అనే దావానలం ముందు సింపతీలూ, ఓదార్పులూ నీటిబొట్టులాంటివి. ఎంత వద్దనుకున్నా నీకు దినకరన్ రూపమే మనసులో మెదులుతోంది. అతన్ని తలచుకుంటేనే నీకు అసహ్యం. దినకరన్‌ని నువ్వు తిట్టుకోని క్షణం లేదు. అతను కొట్టిన దెబ్బ నువ్వు ఎప్పటికీ మరచిపోలేవు, చిన్నప్పుడు మీ మాస్టారు చేసిన అవమానంలా. కాని వద్దనుకున్నా పదే పదే గుర్తొస్తున్నాడు.

3

థాయ్‌లాండ్ యాత్రాగాథ – 4

రచన: దాసరి అమరేంద్ర
ఈ ఈ నొక్కి చదవండి...

రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతోన్న రోజులవి. పర్ల్ హార్బర్ మీద దాడి ద్వారా జపాన్ విజయవంతంగా ఆ యుద్ధంలో అడుగుపెట్టిన సందర్భమది. ఆగ్నేయాసియా దేశాలన్నీ జపానువారి అధీనంలో ఉన్న సమయమది. అండమాన్ నికోబార్ ద్వీపాలు కూడా ఆక్రమించబడిన సమయమది. భారతదేశం మొత్తాన్ని జయించాలన్న సంకల్పంతో జపాను ఉరకలు వేస్తోన్న వేళ అది.

3

మౌనగీతి

రచన: స్వర్ణలత గొట్టిముక్కల

ఆ కొండకొమ్మున నిలబడ్డ
దిగులు మేఘం
కురవబోయిన ప్రతిక్షణం

హత్తుకుని ఓదార్చలేని ప్రేమ
కన్నీరు తుడవలేని స్పర్శ
తనివితీరా మాట కాలేని మౌనం

0

ముఖం కడగని అందగత్తె

రచన: అవినేని భాస్కర్
మూలం: ఎ. ముత్తులింగం

ఆమె నాకేసి చూడటమూ, నేను రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూడటమూగా కాసేపు సాగింది. మరి కాసేపటికి వ్యాను దిగి వచ్చి నా కారు తలుపు తట్టింది. నేను కిటికీ అద్దం దించాను. సోప్స్‌లో వచ్చేలాంటి అందగత్తె ఆమె. అయితే మేకప్ అలవాటు లేని ముఖం; ముఖాన్ని సరిగ్గా కడుక్కుందో లేదో అనిపించేలా ఉంది. జుత్తంతా చెదిరిపోయుంది. మాసిన దుస్తులేమీ కాదు గానీ సాదా సీదాగానే ఉంది. తనకున్న సహజమైన అందాన్ని ఏమేం చేస్తే దాచేయొచ్చో అవన్నీ చేసి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినదానిలా ఉంది.

4

ఒక నవ్వునొప్పి

రచన: శ్రీనివాస్ బందా

ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత

చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన

0

గడినుడి – 37

రచన: సుభద్ర వేదుల
ఈ ఈ నొక్కి చదవండి...

క్రితం సంచికలోని గడినుడి-36కి మొదటి అయిదు రోజుల్లోనే పదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-36 సమాధానాలు, వివరణ.

0

కొత్త పుస్తకాలకు స్వాగతం!

రచన: ఈమాట సంపాదకులు

తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకోవడమే కాక, వాటిని అమ్ముకోవలసిన కష్టమూ రచయితల మీదే పడుతున్నది. పాఠకులు తమ పుస్తకాలను చదువుతారా, మెచ్చుతారా అన్నది తరువాతి మాట. అసలు తమ పుస్తకం అనేది ఉన్నది అని పాఠకులకు తెలియజెప్పడం మొదటి సమస్య. ఈ సమస్య కొంతైనా తీర్చడం కోసం, ఈమాటలో ఇకనుంచీ కొత్త పుస్తకాల పరిచయాలు మొదలుపెడుతున్నాం.

2

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 37

రచన: శ్రీశ్రీ
ఈ ఈ నొక్కి చదవండి...

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.